కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w90 10/1 పేజీలు 29-31
  • దేవుని వాక్యము సత్యత్వమునకు రుజువులు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని వాక్యము సత్యత్వమునకు రుజువులు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ఇలాంటి మరితర సమాచారం
  • చెస్టర్‌ బీటీ సంపదల పరిశీలన
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా బైబిలు నిలిచింది
    కావలికోట: బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
w90 10/1 పేజీలు 29-31

దేవుని వాక్యము సత్యత్వమునకు రుజువులు

యుగములనుండి బైబిలు ఏ మార్పులు లేకుండా అందించబడినది.—సత్యమా లేక అసత్యమా?

బైబిలు వ్రాతప్రతులలోని వేలకొలది తేడాలు అది దేవునివాక్యమనుటను బలహీనపరచుచున్నది.—సత్యమా లేక అసత్యమా?

ఆ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకు ముందు, గతసంవత్సరము ఐర్లాండ్‌లోని దుబ్లిన్‌లో చెస్టర్‌ బెట్టీ లైబ్రరీ నందు జరిగిన “ది వర్డ్‌ ఆఫ్‌ గాడ్‌” (దేవుని వాక్యము) అను ప్రదర్శనశాలలో అందించబడిన కొంత సమాచారమును పరిశీలించుము.

కాలముగడిచే కొలది చినిగిపోయి, ముక్కలుగా ఉండిన పాపిరస్‌ పేజీలు వృధా అయిపోతున్నవి. అయినను లైబ్రరీలోని చేతివ్రాతప్రతులన్నిటిలో చెస్టర్‌బెట్టి పాపిరీలు అత్యంత శ్రేష్ఠమైనవి. వాటిని 1930లో ఐగుప్తు సమాధుల స్థలమునుండి త్వవ్వితీశారు. దానినిగూర్చి సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యన్‌ యిలాచెప్పాడు. “[అది] సైనాయ్‌టికస్‌ కోడెక్సుతో సరిపోల్చగల ఒకే ఒక పరిశోధన.”

చేతితో వ్రాయబడిన ఈ పాపిరస్‌ పేజీలు, పుస్తకరూపములోనున్నవి, మన సామాన్యశకము రెండు, మూడు, మరియు నాలుగవ శతాబ్దములందు నకలు చేయబడినవి. గ్రంథాలయ అధికారియైన విల్‌ఫ్రిడ్‌ లాక్‌వుడ్‌ చెప్పునదేమనగా వీటిలో “కొన్ని చాలావరకు అసలైన తొలివ్రాతప్రతుల తర్వాత వందసంవత్సరములలోపే కాపీ చేయబడినవి” అని చెప్పియున్నాడు. (ఇటాలిక్కులు మావి) ఒక కోడెక్‌నందు (పుస్తకము) నాలుగుసువార్తలు, అపొస్తలులకార్యములు ఉన్నవి. ఇంకొక దానియందు హెబ్రీయులకు వ్రాసిన పత్రికతో సహా, పౌలు వ్రాసిన చాలాపత్రికలను కలిగియున్నది.

చేతివ్రాత ప్రతులను కాపీచేయుట కష్టము మరియు అలసటతో కూడిన పని. తప్పులు వచ్చే అవకాశముకూడా ఉన్నది. నకలు చేయువారు ఎంత జాగ్రత్తగా ఉన్నను ఒక అక్షరమును తప్పుగా చదువుట, వరుసలను పోగొట్టుట చాలా సులభంగా జరుగుతుంది. కొన్నిసార్లు నకలు వ్రాయు వ్యక్తి ఖచ్ఛితమైన పదములకన్నా దాని సారాంశము లేదా భావముపై ఎక్కువ శ్రద్ధ కలిగియుండవచ్చును. కాపీలను మరలా కాపీచేయుచుండగా తప్పులురావటం కొనసాగుతూనే ఉంది. ఈ పుస్తకములకు సంబంధించిన విద్వాంసులు ఒకేరకమైన భేదములను కల్గియున్న వ్రాతప్రతులను కుటుంబములుగా సమకూర్చారు. నేడు ఉనికియందున్న గ్రీకు బైబిలు నమ్మదగిన ప్రతులలో అత్యంతపురాతనమైన ఈ చెస్టర్‌బెట్టి పాపిరీలు విద్వాంసులకు అనుకొనని రీతిగా విషయములపై ఒక క్రొత్త అభిప్రాయమును కలుగజేసినవి. ఎందుకనగా స్థిరపరచబడియున్న ఏ కుటుంబములకు అవి సరిపడలేదు.

యేసుకాలమునాటికి ముందు, ప్రత్యేకముగా యెరూషలేము నాశనమునకు తరువాత (607 సా.శ.పూ.) యూదులు చెదరిపోవుటతో పరిశుద్ధమైన హెబ్రీలేఖన చేతివ్రాతప్రతులు వ్రాయబడినవి. దాదాపు 100 సా.శ. నిష్టావంతులైన యూదులచే అంగీకరింపబడిన అట్టి ప్రతులను యూదా అధికారులు హెబ్రీ పుస్తకపు నిజత్వమును స్థిరపరచుటకు ఉపయోగించిరి.

పుస్తకము ఉన్నదున్నట్లు నకలు చేయబడునట్లు చూచులాగున వారుకొన్ని ఖండితమైన నియమములను ఏర్పాటుచేసిరి. వారు ఎటువంటి వస్తువులను వాడవలసినది, అక్షరములకు, పదములకు, వరుసలకు మరియు కాలమ్స్‌ మధ్య ఉండవలసిన దూరము మరియు పరిమాణమును నిర్దిష్టముగా సూచించిరి. “ఒక పదమైన లేక అక్షరమైన చివరకు ఒక యోద్‌ [హెబ్రీ అక్షరమాలలో అతి చిన్న అక్షరము] నైనను తమ జ్ఞాపకమునుండి వ్రాయకూడదు,” అనిచెప్పిరి. ఆవిధముగా నకలు వ్రాయువారు బైబిల్‌లోని మొదటి ఐదు పుస్తకములు మరియు ఎస్తేరు పుస్తకమును కలిగియున్న టోరాను (బోధించుట) తయారుచేసిరి. అట్టి హెబ్రీ పుస్తకపు చేతివ్రాతప్రతులు “ముగ్ధులను చేయునంతటి ఏకత్వమును కలిగియున్నవని” ప్రదర్శనశాల కేటలాగు చెప్పినది.

హెబ్రీ మరియు గ్రీకు చేతివ్రాత ప్రతులలోనికి చొరబడినతప్పులు ఎంత గంభీరమైనవి? “దానికి ఎక్కువ అవధాన మివ్వవలెను, అన్యమత సాహిత్యములతో పోల్చిన బైబిలు వ్రాతపతులందుగల తారతమ్యములు పట్టించుకోతగినవే కాదు. . .లేఖికుల వలన వచ్చిన దోషఫలితముగా క్రైస్తవ సిద్ధాంతములోని ఏ అంశము ప్రభావితము చెందలేదని” మిస్టర్‌. లాక్‌వుడ్‌ చెప్పారు.—ఇటాలిక్స్‌ మావి.

యేసు కాలమునాటికి ముందు మరియు తరువాత బైబిలు పుస్తకములు ఇతర భాషలలోనికి తర్జుమాచేయబడినవి. ఈ పుస్తకములో అతి పురాతనమైనదొకటేమనగా ది సమరిటన్‌ పెంటట్యూక్‌. అస్సీరియా రాజు పదిగోత్రముల ఇశ్రాయేలీయులను చెరగా తీసుకొనిపోయిన తరువాత (సా.శ.పూ. 740) ఈ ప్రాంతమును ఆక్రమించుకొన్న ప్రజలు ఈ సమరయులు. వీరు యూదా ఆరాధనలోని కొన్ని విధానములను చేపట్టి బైబిలు మొదటి ఐదు పుస్తకములైన పెంటట్యూక్‌ను అంగీకరింతురు. ఈ ఐదు పుస్తకములతో కూడిన సమరయ పుస్తకము పురాతన హెబ్రీలిపి రూపములో వ్రాయబడి హెబ్రీ పుస్తకమునకు 6,000 వ్యత్యాసాలను కలిగియున్నది. “ఇవన్ని” ప్రదర్శనశాల కేటలాగు చెప్పినట్లు “పురాతన వ్యాకరణమును, ఉచ్ఛారణ రూపములను భద్రపరచినవనుటలో తప్ప వేరే దేనియందును పట్టించుకొనదగినవి కావు.”

సా.శ.పూ. మూడవ శతాబ్దమందు ఐగుప్తులోని అలెక్సాండ్రియనందలి యూదా విద్వాంసులు గ్రీకు సెప్టుజెంట్‌ను ఉత్పత్తిచేసిరి. దీనిని ప్రపంచమంతటనున్న గ్రీకు భాష మాట్లాడు యూదులు ఉపయోగించిరి. కొంతకాలమైన తరువాత యూదులు దానిని ఉపయోగించటం మానుకొన్నను తొలిక్రైస్తవ సంఘము దానిని ఉపయోగించెను. క్రైస్తవవ్రాతగాళ్లు హెబ్రీ పరిశుద్ధలేఖనములనుండి ఎత్తిచూపినపుడు వారు సెప్టుజెంట్‌నే వాడిరి. హెబ్రీలేఖనముల చెస్టర్‌ బెట్టి పాపిరిలో దానియేలు గ్రంథములోని 13 పేజీలు సెప్టుజెంట్‌ లోనివే.

ఆ తరువాతి బైబిలు భాషాంతరములు లాటిన్‌, కాప్టిక్‌, సిరియా, అర్మేనియా, మొదలగు భాషలలో ఉత్పత్తిచేయబడెను. ప్రదర్శనశాలలో ఇందుకు ఉదాహరణగా ఆరు లేక ఏడవ శతాబ్దపు వెల్లం కోడెక్స్‌యొక్క కాప్టిక్‌ప్రతిలోని కొంతభాగాన్ని ప్రదర్శనశాలయందు ఉంచారు. ఇటువంటి ప్రతులు విద్వాంసులకు మరియు గ్రంథ విమర్శకులకు ఎలా సహాయపడును? అటువంటి ప్రతులన్ని తర్జుమాదారులు ఉపయోగించిన గ్రీకు వ్రాతప్రతులను ఉన్నదున్నట్టుగా చాలా అక్షరార్థంగా చేసిన తర్జుమాలైయున్నవి. “కనుక తర్జుమాదారుడు ఉపయోగించిన గ్రీకు పుస్తకము మంచిదైనట్లయిన” అసలు తొలుత ఉపయోగించిన గ్రీకు మూల పదములను కనుగొనుటలో ఎంతో సహాయకరముగా నుండును,” అని మిస్టర్‌. లాక్‌వుడ్‌ వివరించాడు.

లైబ్రరీలో ఉంచబడిన సాటిలేని, అమూల్యమైన ప్రదర్శనలో ఒకటేమనగా టాషియన్‌చే వ్రాయబడిన డయాటెసరోన్‌పై సిరియా వ్రాతగాడైన ఎఫ్రాయిము యొక్క వ్యాఖ్యానము. దాదాపు సా.శ. 170వ సంవత్సరమున నాలుగు సువార్తలలోని సారాంశభాగములను ఎత్తిచూపుచు యేసు జీవితము ఆయన పరిచర్యనుగూర్చిన అనుగుణ్యమైన వృత్తాంతమును వ్రాశాడు (డయాటెసరోన్‌ అనగా “నాలుగింటి నుండి” అని అర్థము). ప్రస్తుతము ఏ కాపీలు కూడా మిగిలియుండలేదు గనుక సువార్తలలో అటువంటి అనుగుణ్యత సాధ్యమా అని విమర్శకులు వాదించిరి. ఈ నాలుగు సువార్తలు రెండవశతాబ్దపు మధ్యభాగము వరకు వ్రాయబడలేదని వాదించిరి.

గత వందసంవత్సరములలో ఏమైనను డయటెసరోన్‌ యొక్క అర్మేనియన్‌ అరబిక్‌ తర్జుమాలు కనుగొనడంతో ఉన్నత విమర్శకులు తమ భావాలను త్రిప్పివేసుకొనవలసినట్లు చేసినవి. 1956లో సర్‌ చెస్టర్‌ బెట్టి, టాషియన్‌ మూలవ్రాతలయొక్క దీర్ఘవాక్యాలను ఎత్తివ్రాసియున్న, ఐదవ/ఆరవ శతాబ్దములోని ఈ వ్యాఖ్యానమును పొందాడు. “నిశ్చయముగా అది నాలుగు సువార్తలు ఆకాలమందు పంచబడుటలేదను తలంపును కొట్టివేసినదని” మిస్టర్‌. లాక్‌ వుడ్‌ చెప్పాడు.

“ది వర్డ్‌ ఆఫ్‌గాడ్‌” ప్రదర్శనశాల బైబిలు విద్వాంసులకు, గ్రంథ విమర్శకులకు కావలసినంత విస్తారమైన సమాచారమున్నదని గుర్తుచేయుచున్నది. కాబట్టి పైన లేవదీయబడిన ప్రశ్నలకు సమాధానమిచ్చుచు అదేసమయములో కనుగొనబడిన బైబిలు వ్రాతప్రతుల గుర్తింపునుగూర్చి ఈ బైబిలు విద్వాంసులలో ఒకరైన సర్‌ ఫ్రెడరిక్‌ కెన్యన్‌ను వివరించనిద్దాము:

“యుగములనుండి బైబిలు ఏవిధమైన మార్పులుచేర్పులు లేకుండా మనకు లభించదను భావముతో ఏకీభవించుటకు కొంతమందికి కష్టముగానుండవచ్చు. . .అయితే చివరకు పరిశోధనలు, పఠనములన్నిటి సాధారణ ఫలితం లేఖనముల సత్యత్వమును బలపరచుట, ఖచ్ఛితమైన యథార్థతతో, నిజమైన దేవుని వాక్యమును మనచేతులలో కలిగియున్నామనుటకు పునఃనిశ్చయత నిచ్చుచున్నది.” (ది స్టోరీ ఆఫ్‌ ది బైబిల్‌, పేజి 113)—కీర్తన 119:105; 1 పేతురు 1:25. (w89 2/1)

[29వ పేజీలోని చిత్రం]

మూడవ-శతాబ్దపు పాపిరస్‌—2 కొరింథీయులు 4:13–5:4

[క్రెడిట్‌ లైను]

Reproduced by permission of the Chester Beatty Library

[30వ పేజీలోని చిత్రం]

ఎస్తేరు గ్రంథపు 18వ-శతాబ్దపు చర్మపు మరియు వెల్లం చుట్టలు

[క్రెడిట్‌ లైను]

Reproduced by permission of the Chester Beatty Library

[31వ పేజీలోని చిత్రం]

ఆరు లేక ఏడవ-శతాబ్దపు వెల్లం కోడెక్స్‌—యోహాను 1:1-9, కాప్టిక్‌ ప్రతి

[క్రెడిట్‌ లైను]

Reproduced by permission of the Chester Beatty Library

[31వ పేజీలోని చిత్రం]

Fifth- or sixth-century vellum codex—commentary by Ephraem that includes extracts from Tatian’s Diatessaron, in Syriac

[క్రెడిట్‌ లైను]

Reproduced by permission of the Chester Beatty Library

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి