వాగ్థాన దేశమునుండి దృశ్యములు
ఋతువులనుండి నీవు నేర్చుకొందువా?
యెహోవా ఒకసారి ఇలా చెప్పెను: ‘భూమి నిలిచియున్నంతవరకు వెదకాలమును, కోతకాలమును, శీతోష్ణములును ఉండక మానవు.” (ఆదికాండము 8:22) ఆవిధముగా ఆయన వ్యవసాయ ఋతువులను గూర్చి నొక్కితెల్పెను.
కాలములనుగూర్చి, వ్యవసాయముతో వాటికిగల సంబంధమునుగూర్చి మీకేమి తెలియును? నగరములలో జీవిస్తున్నను, లేక వ్యవసాయము చేయకున్నను ఇశ్రాయేలీయుల కాలములు, వారి వ్యవసాయక పనులను గూర్చి మీరు తెలుసుకొనవలెను. ఎందుకు? ఎందుకనగా మీరు వీటిని ఎక్కువగా తెలుసుకొనుటనుబట్టి దేవునివాక్యమును బాగా అర్థము చేసుకొందురు.
వ్యవసాయ దారులు పొలమును దున్ని విత్తనములు చల్లి, కోతకోసిన తరువాత పంటను కళ్లములో త్రొక్కింతురు. అయితే బైబిలుచెప్పు దానిని బహు స్పష్టముగా అర్థముచేసికొనుటకు వాటిని గురించి ఎక్కువగా అనగా అవి ఎప్పుడు జరుగునో కూడా తెలిసికొనవలెను. ఉదాహరణకు పురాతన యూదయలో ఉన్నతమైన సమభూమిపై మనము చూచు దున్నుటను తీసుకొనుము.a ఏనెలలో ఈ బొమ్మ తీసుకొనబడిందని మీరనుకొంటారు? మీ ప్రాంతములో దున్నటము జరుగుదానినిబట్టి యయితే మీరు తప్పుగా నడిపించబడగలరు. ఉత్తరార్థగోళములో దున్నునట్టి కాలమే దక్షిణార్థగోళములో దున్నునట్టి కాలముకాదు. అది రేఖాంశములనుబట్టి వర్షాకాల ప్రకారము విభిన్నముగా ఉండును.
బైబిలు సంఘటనలను మీరెట్లు దృష్టిస్తారనుదానిపై ఇది ప్రభావము కలిగియుండును. ఏలియా తన తరువాతి వారసుని నియమించుటను మీరు చదువవచ్చును: “ఏలియా అచ్చటనుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనపడెను. అతడు తన ముందరనున్న పండ్రెండు అరకల యెడ్లచేత దుక్కి దున్నించుచు పండ్రెండవ అరక తాను తోలుచుండెను.” (1 రాజులు 19:19) అది ఏ నెలలో జరిగి ఉంటుందని మీరనుకొంటారు? భూమి ఎలా కనిపించి ఉంటుంది? యోహాను 4:35 నందు యేసు ఇలా చెప్పెను: “ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను.” ఆయన ఒక కాలమును ఖచ్చితముగా చెప్పునప్పుడు, అది ఎప్పుడో మీరు అర్థము చేసికొనగలరా?
ఇక్కడ యివ్వబడిన పటము వాగ్థాన దేశములో కాలములు, వ్యవసాయక పనులను గూర్చిన ఒక మంచి దృశ్యమును అందించును. వెలుపల నున్న వృత్తము పరిశుద్ధ యూదా కేలండరు నెలలను చూపించును.b వీటిని మననెలలతో పోల్చినట్లయిన అవి మనవాటిపైన ఆవరించి కలియుచున్నట్లు మనము గుర్తించెదము. నీసాను (లేక ఆబీబు) మార్చి చివరకు మరియు ఏప్రిల్ మొదటిపైకి వస్తున్నది. మధ్యవైపునకు గల తరువాతి భాగము పంటలు ఎప్పుడు పరిపక్వానికి వస్తాయో చూపుతున్నది. అవి వ్యవసాయసంబంధమైన కొన్ని పనులు అనగా కోతకోయుట, కల్లముత్రొక్కించుట మొదలగునవి ఎప్పుడు జరుగునో సూచించును. పటములోని మధ్యభాగము సంవత్సరములోని వాతావరణ మార్పులను పోల్చుకొనుటకు సహాయపడును.
బైబిలు వృత్తాంతముల గ్రహింపును మెప్పుకోలును ఎక్కువ చేసికొనుటకు, పైన చెప్పబడిన రెండు సంఘటనలాంటివాటిని గ్రహించుటకు ఈ పటమును ఉపయోగించుము.
ఎలీషా ప్రవక్తగా పిలువబడినప్పుడు పెద్దఎత్తున దున్నకపు పనిలో భాగము వహించుచుండెను. బహుశా అది తీష్రిలో (సెప్టెంబరు-అక్టోబరు) అనగా వేసవియొక్క ఉద్రిక్తమైన వేడి గతించిన తరువాత జరిగియుంటుంది. తొలకరి వర్షాలు భూమిని మెత్తగాచేసి దున్నుటకు వీలుకలిగించును. తదుపరి విత్తనములు చల్లెదరు.
యోహాను 4:35 లోని మాటలను యేసు ఎప్పుడు చెప్పెను? ఇంక కోత కాలము నాలుగు నెలలున్నది. యవల కోతకాలము దాదాపు పస్కా సమయము నీసానులో (మార్చి-ఏప్రిల్) ప్రారంభమైనదని గుర్తించుకొనుము. నాలుగు నెలలను వెనుకకు లెక్కించుము. అది మిమ్ములను కిస్లేవు మాసమునకు తెస్తుంది (నవంబరు-డిశంబరు). బలమైన వర్షాలు, చల్లని వాతావరణముతో వర్షాలు వృద్ధియవుతాయి. కాబట్టి “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నా” ననినప్పుడు యేసు భావము నిజముగా సూచనార్థమైన కోతయైయుండెను.
ఈ క్రింద మీవ్యక్తిగత పఠనముకొరకు లేక మీకుటుంబముతో ఆనందదాయకమైన పఠనములో ఉపయోగించుటకు ఇతర ప్రశ్నలున్నవి:
▪ యెరికో చుట్టుప్రక్కల జనుపపంట కోతకాలము అదారు మాసములో జరుగును; కాబట్టి యెహోషువ 2:6 మరియు 3:15 నందలి వివరములు బైబిలుయొక్క ఖచ్చితమును ఎట్లు స్థిరపరచుచున్నవి?—యెహోషువ 4:19; 5:11.
▪ ధాన్యము కోసిన తరువాత నూర్పులు జరుగును, కాబట్టి లేవీయకాండము 26:5 లోని వాగ్థానము వారి సమృద్ధినెట్లు వివరించుచున్నది?
▪ దేవునిప్రజల మధ్యనుండి రక్తాపరాధము తీసివేయబడుటకు వధించబడునట్లు అనుమతించబడిన తన ఇద్దరు కుమారులనుగూర్చి రిస్పాయొక్క విస్తారమైన కాపుదలను 2 సమూయేలు 21:10 ఎట్లు సూచించుచున్నది?
▪ 1 సమూయేలు 12:17లో చెప్పబడిన ఉరుములు మరియు వర్షము దైవిక జవాబుగా ఎందుకు పరిగణించబడినవి?—సామెతలు 26:1.
▪ బోయజు తనను చూచుట కేవలము తాత్కాలికమైన చర్యయే కాదనుటకు రూతు ఏ కారణమును కలిగియున్నది?—రూతు 1:22; 2:23.
బైబిలును చదువుకొనునప్పుడు ఈ పటమును అందుబాటులో ఎందుకు ఉంచుకొనకూడదు? (w90 9⁄1)
కిస్లేవు
25 ప్రతిష్ఠిత పండుగ
నీసాను
14 పస్కా
15-21 పులియని రొట్టెలు
16 ప్రథమ ఫలముల అర్పణ
ఇయ్యార్
14 చివరి పస్కా
అదారు
14, 15 పూరీము
సీవాను
6 వారముల పండుగ (పెంతెకొస్తు)
తీష్రి
1 శృంగధ్వని
10 ప్రాయశ్చిత్తార్థ దినము
15-21 పర్ణశాల పండుగ
22 పరిశుద్ధసంఘముగా కూడుట
[అధస్సూచీలు]
a 1990 యెహోవాసాక్షుల కేలండరును కూడా చూడుము.
b 19 సంవత్సరముల కాలములో ఏడుమారులు ఒక అదనపు లేక మధ్యలో చేర్చబడిన అధికమాసము (వెదారు) కలుపబడినది.
[19వ పేజీలోని చిత్రాలు]
(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్ కోసం ప్రచురణ చూడండి)
నీసాను (అబీబు)
మార్చి—ఏప్రిల్
యవలు
ఇయ్యార్ (జీవ్)
ఏప్రిల్—మే
గోధుమలు
సీవాను
మే—జూన్
తొలి అంజూరములు
తమ్మూజు
జూన్—జూలై
మొదటి ద్రాక్షలు
అబ్
జూలై—ఆగస్టు
వేసవి పండ్లు
ఎలూలు
ఆగస్టు—సెప్టెంబరు
ఖర్జూరములు, ద్రాక్షలు, అంజూరములు
తీష్రి (ఏతనీము)
సెప్టెంబరు—అక్టోబరు
దున్నుట
హెష్‌వాన్ (బూలు)
అక్టోబరు—నవంబరు
ఒలీవలు
కిస్లేవు
నవంబరు—డిశంబరు
చలికాలపు మందలు
టెబేతు
డిశంబరు—జనవరి
పచ్చిక పెరుగుట
శెబాటు
జనవరి—ఫిబ్రవరి
బాదము చిగురించుట
అదారు
ఫిబ్రవరి—మార్చి
దబ్బపండ్లు
వెదారు
మార్చి
[18వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
Garo Nalbandian
Pictorial Archive (Near Eastern History) Est.