కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w91 5/1 పేజీలు 10-15
  • మీరు చేరుకొనగల్గుచున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు చేరుకొనగల్గుచున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పెద్దలకు వచ్చే ఆపదలు
  • సేవచేయాలను కోరిక దేవుడిచ్చినది
  • యెహోవా చిత్తమును బట్టి సంతోషంగా సేవచేయుము
  • భవిష్యత్తుకొరకు ఎదురు చూడుము
  • సహోదరులారా, ఆత్మనుబట్టి విత్తుతూ సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • బాధ్యతలు చేపట్టేందుకు సహోదరులకు శిక్షణ ఇవ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • “శ్రేష్ఠమైన పని” కోసం మీరు ముందుకు వస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • సేవచేయుటకు మీరు అర్హత కల్గియున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
w91 5/1 పేజీలు 10-15

మీరు చేరుకొనగల్గుచున్నారా?

“ఎవడైన అధ్యక్ష పదవిని ఆశించినయెడల అట్టివాడు దెడ్డపనిని అపేక్షించుచున్నాడు.”—1 తిమోతి 3:1.

1. ఏ ఆశయాన్ని నెరవేర్చుట యెహోవాసాక్షుల మధ్య అత్యంత ప్రాముఖ్యతను కల్గియున్నది?

దైవిక విధానములో చేపట్టి, కొనసాగింపజేయునట్టి సరియైన ఆశయాలను యెహోవాసాక్షులు కల్గియున్నారు. ఇది ఆశ్చర్యముకాదు, ఎందుకంటె వారి దేవుడు గొప్ప ఆశయాలను కల్గియుండి, తన సంకల్పములను ఎల్లవేళల నెరవేర్చువాడైయున్నాడు. (యెషయా 55:8-11) మంచి ఆశయాలు లేకుండా, తమకు తప్ప మరి ఎవరికైనా ఏ కొద్దిపాటి ప్రయోజనమో కల్గించుచూ జీవితమును అనాలోచనగా గడుపు ప్రజలవలె యెహోవాసాక్షులు ఉండకూడదు. రాజ్యవర్తమానమును ప్రకటించి, దేవుని వాక్యమందుగల జీవమిచ్చు జ్ఞానాన్ని యితరులతో పంచుకొనవలెననే గొప్ప ఆశయాన్ని నెరవేర్చుటయే యెహోవాసాక్షులకు అత్యంత ప్రాధాన్యమైనది.—కీర్తన 119:105; మార్కు 13:10; యోహాను 17:3.

2. క్రైస్తవ పురుషులకున్న ఏ ఆశయము పౌలుచే 1 తిమోతి 3:1 నందు తెల్పబడింది?

2 యెహోవా సంస్థలో మరి యితర గొప్ప ఆశయాలు కూడ ఉన్నవి. వాటిలో ఒకదానిని గూర్చి తెల్పుచు అపొస్తలుడైన పౌలు యిలా వ్రాసెను: “ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల, అట్టివాడు దెడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది.” అట్టి వ్యక్తి యితరుల మేలు నిమిత్తము ఏదో కొంతచేయాలని కోరును. సుఖాన్ని లేదా ఘనతను కోరే జీవితమును కాదుగాని “శ్రేష్టమైన పనిని” అతడు కోరుచున్నాడు. మరొక తర్జుమా యిట్లనుచున్నది: “నాయకత్వముపై తన మనస్సు నిలిపిన వాడు మెచ్చుకోదగిన ఆశయాన్ని కల్గియున్నాడనుట నిజమే.”—1 తిమోతి 3:1 ఫిలిప్స్‌.

పెద్దలకు వచ్చే ఆపదలు

3, 4. అధ్యక్షుడగుటకు ఆశించుచున్న వ్యక్తి తన హృదయాన్ని ఎందుకు కాపాడుకొనవలెను?

3 క్రైస్తవ అధ్యక్షడగుటకు తన మనస్సు నిలిపినవాడు ఏ విధంగా “మెచ్చుకోదగిన ఆశయాన్ని” కల్గియున్నాడు? ఒక ప్రత్యేకమైన కార్యాన్ని సాధించుటకు కల్గియుండే తీవ్రమైన కోరికే ఆశయము. నిజమే, ఆశయాలలో శ్రేష్టమైనవి మరియు తుచ్ఛమైనవి కూడ ఉన్నవి. అయితే, ఇతరులకు సేవచేయాలని కోరుచు వినయముతో అధ్యక్షపదవిని ఆశించుచున్న యెడల, మంచి దృక్పథముతో అతని సేవలు చేయబడుచున్నవి గనుక అతనికి ఆత్మీయ దీవెనలు కల్గును. అయితే అతడు తన హృదయాన్ని కాపాడుకొనవలెను.—సామెతలు 4:23.

4 అత్యాశపరులైన కొందరు ఘనతను కోరుదురు. సాటి మానవులను ఏలాలని మరికొందరు కోరుదురు. ఖ్యాతి, లేదా అధికారము కొరకైన దురాశ, బాగుగా ఉన్న వృక్షాన్ని సహితము నిలువునా నాశనముచేయగల కుళ్లిన వేరు వంటిది. అట్టి చెడు దృక్పథముతో కూడిన ఆశయములో ఒక క్రైస్తవుడు కూడ మునిగిపోవచ్చును. (సామెతలు 16:18) అపొస్తలుడైన యోహాను యిట్లనెను, “నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న [అంతటిపై ప్రముఖుడైయుండగోరుచున్న ఫిలిప్స్‌] దియొత్రెఫె మమ్మును అంగీకరించుటలేదు వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంకపరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినపుడు వాడుచేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును. (3 యోహాను 9,10) దియొత్రెఫె ఆశయము క్రైస్తవ లక్షణము కాదు. అహంకారము, యితరులపై పెత్తనం చెలాయించాలనే ఆశయాలకు యేసు నిజ అనుచరులమధ్య స్థానములేదు.—సామెతలు 21:4.

5. అధ్యక్షులు ఎట్టి దృక్పథముతో తమ కర్తవ్యములను నిర్వహిస్తారు?

5 మంచి దృక్పథముతో తన కర్తవ్యములను నిర్వహించు క్రైస్తవ అధ్యక్షుడు స్వార్థ కోర్కెలను వెంటాడడు. క్రైస్తవ పర్యవేక్షణ అనే ఈ శ్రేష్టమైనపని దేవుడిచ్చిన ఆధిక్యతయని ఎంచి దేవునిమందను “బలిమిచేతకాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతోకాక సిద్ధమనస్సుతో కాయుచు, ప్రభువులైనట్టుండక మందకు మాదిరియైయుండును.” (1 పేతురు 5:2, 3) అవును, గర్వము పెరగకుండ, అధికారమును దుర్వినియోగము చేయకుండ అధ్యక్షులు కాపాడుకొనవలెను.

6. ఒకపెద్ద దేవుని ప్రజలపై ఎందుకు ప్రభుత్వము చేయకూడదు?

6 అతడు వారితోటి పనివాడేగాని “వారి విశ్వాసము మీద ప్రభువు” కాదు గనుక యితర క్రైస్తవులపై ఒక పెద్ద ప్రభువైనట్టుండకూడదు. (2 కొరింథీయులు 1:24) కొంతమంది అపొస్తలులు ప్రముఖతను కోరినప్పుడు యేసు యిట్లనెను: “అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును. మీలో ఆలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడైయుండగోరునో వాడు మీ పరిచారకుడైయుండవలెను. మీలో ఎవడు ముఖ్యుడైయుండగోరునో వాడు మీ దాసుడైయుండవలెను. ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదుగాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెను.” (మత్తయి 20:20-28) పెద్ద, ముఖ్యకాపరి కాదుగాని కేవలం ఒకని క్రింద పనిచేయు కాపరి. ఒకవేళ అతడు మందపై అధికారము చెలాయిస్తే అతడు గర్వమును ప్రదర్శిస్తున్నవాడగును. ముఖ్యంగా తన గర్వ ఆశయాలను కొనసాగించుటలో తోడ్పడుటకు యితరులను అతడు మోసగించినయెడల ప్రమాదము. సామెత యిలా చెప్పుచున్నది: “గర్వహృదయులందరు యెహోవాకు హేయులు. నిశ్చయముగా శిక్షనెందుదురు.—సామెతలు 16:5.

7, 8. (ఎ) క్రైస్తవ పెద్దలు వినయ మనస్కులై యుండుట ఎందుకు అవసరము? (బి) వినయుడైన ఒక పెద్ద మాదిరిని తెల్పుము.

7 అందుచేత క్రైస్తవ పెద్దలు ‘దేవుని బలిష్టమైన చేతిక్రింద దీనమనస్కులై యుండాలి’. ఆత్మీయ విషయాలలో వాడబడుచున్నందున గర్వము రావచ్చును. అయితే దైవచిత్తాన్ని నెరవేర్చుటకు కేవలము వినయమనస్కులే సరియైన హృదయము, మనస్సును కల్గియుందురు. “దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.” (1 పేతురు 5:5, 6) అవును, దీన మనస్సుగలవారిని యెహోవా ఆశీర్వదించును. అట్టివారిలోనుండి అర్హతగల పురుషులు క్రైస్తవ పెద్దలుగా సేవచేయుటకు నియమించబడుదురు.

8 దైవభక్తిగల వ్యక్తులు చేసిన వినయమైన సేవా వృత్తాంతములలో ఆధునికకాల యెహోవాసాక్షుల చరిత్ర నిండియున్నది. దృష్టాంతమునకు ఒకనాడు యాత్రికుడు లేక ప్రయాణ కాపరియైయుండి చాలాకాలము బేతేలు పనివానిగా ఉండిన డబ్ల్యు. జె. థోర్న్‌ అను సాత్వికుని పరిశీలించుము. అతనినిగూర్చి ఒక క్రైస్తవుడు యిట్లనెను: “నేటివరకు నాకు సహాయముచేసిన బ్రదర్‌ థోర్న్‌ మాటలను నేను ఎన్నటికి మరచిపోలేను. ఆయన అనిన దానిని తెల్పుచున్నాను, ‘నన్నుగూర్చి నేను గొప్పగా తలంచుట ప్రారంభించినప్పుడు నాతో నేను మాట్లాడుకొనుటకు నన్ను నేను ఒక మూలకు తీసుకొని వెళ్లి యిలా అంటాను: “అల్పమైన ఓ మట్టి మరకా, గర్వించుటకు నీకేమున్నది?”’” పెద్దలు మరి ఇతరులు ప్రదర్శించుటకు ఎంతటి మెచ్చుకోదగిన లక్షణము! జ్ఞాపకముంచుకోండి, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును, ఘనతయు జీవమును దానివలన కలుగును.”—సామెతలు 22:4.

సేవచేయాలను కోరిక దేవుడిచ్చినది

9. అధ్యక్షునిగా సేవచేయాలనే కోరిక దేవుడను గ్రహించినదని ఎందుకు చెప్పవచ్చును?

9 అధ్యక్షుడిగా సేవచేయాలనే కోరిక దేవుడిచ్చినదా? అవును, తనకు పవిత్రసేవను చెల్లించుటకు కావలసిన పురికొల్పును, ధైర్యమును, శక్తిని యెహోవా ఆత్మ దయచేయును. ఉదాహరణకు, హింసించబడుచున్న యేసు అనుచరులు తాము ధైర్యముతో ప్రకటించులాగున చేయుమని ప్రార్థించగా ఏమి సంభవించింది? “వారు కూడియున్నచోటు కంపించెను, అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.” (అపొ.కార్యములు 4:27-31) పరిశుద్ధాత్మ అట్టి ఫలితాలను తెచ్చెను గనుక, ఒకవ్యక్తిని అధ్యక్షపదవికి చేరునట్లు చేయగలదు.

10. (ఎ) ఒక క్రైస్తవుడు చేరుకొనలేక పోవుటకు గల కారణమేమిటి? (బి) సేవా ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తే ఏ నిశ్చయతను కల్గియుండగలము?

10 పరిణితిచెందిన ఒక క్రైస్తవుడు చేరుకొనకుండ ఎందు కుండకూడదు? అతడు ఆత్మీయవ్యక్తియే, గాని తాను తగడని భావించుచుండవచ్చును. (1 కొరింథీయులు 2:14, 15) నిజమే, మనహద్దులను ఎరిగియుండి మనలనుగూర్చి దీనమైన దృక్పథాన్ని కల్గియుండాలి. (మీకా 6:8) ఒక ప్రత్యేకమైన బాధ్యతకు మనమే అత్యంత అర్హతగలవారమని అహంకారముతో తలంచేకన్నా, “వినయముగలవారియొద్ద జ్ఞానమున్నదని” మనము జ్ఞాపకముంచుకొనవలెను. (సామెతలు 11:2) అయితే ఒక సేవా ఆధిక్యతను దేవుడు మనకు దయచేసినయెడల, దానిని కొనసాగించగల సామర్థ్యమునుకూడ ఆయన అందించునని కూడ మనమెరిగియుండాలి. పౌలు యిట్లనుచున్నాడు: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను”—ఫిలిప్పీయులు 4:13.

11. సలహానిచ్చుటకు తగినంతజ్ఞానము తనకు లేదని తలంచుటమూలంగా చేరుకొనలేక పోవుచున్న క్రైస్తవుడు ఏమిచేయవచ్చును?

11 సలహా యిచ్చుటకు తగినంత జ్ఞానము తనకు లేదని భావించి ఒక క్రైస్తవుడు చేరుకొనకపోవచ్చును. అయితే, దేవుని వాక్యమును మరింత శ్రద్ధతో పఠించిన విద్యార్థిగా జ్ఞానమును సంపాదించవచ్చునేమో, నిశ్చయముగా అతడు జ్ఞానముకొరకు ప్రార్థించవలెను. యాకోబు యిలా వ్రాసెను: “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్నయెడల అతడు దేవుని అడుగవలెను. అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు (యెహోవా) వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు.” (యాకోబు 1:5-8) ప్రార్థనకు ప్రత్యుత్తరముగా దేవుడు, సొలొమోనుకు తీర్పుతీర్చునపుడు మేలుకీడులను వివేచించగల “బుద్ధివివేకములు గల హృదయమును” యిచ్చెను. (1 రాజులు 3:9-14) సొలొమోను విషయము ప్రత్యేకమైనది. కాని సంఘ బాధ్యత అప్పగింపబడిన పురుషులు శ్రద్ధతోకూడిన పఠనము దేవుని సహాయముతో యితరులకు నీతిమార్గములలో సలహానివ్వగలరు. “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటినుండి వచ్చును.”—సామెతలు 2:6.

12. చింతమూలంగా ఒక వ్యక్తి చేరుకొనలేకపోతే, అతనికి ఏమి తోడ్పడగలదు?

12 వ్యాకులత కూడ ఒకనిని చేరుకొనకుండా ఆటంకపర్చును. ఒక పెద్దగా అట్టి బరువైన బాధ్యతను తాను చేపట్టలేనని అతడు తలంచుచుండవచ్చును. పౌలు కూడా ఒప్పుకున్నాడు: “సంఘములన్నిటిని గూర్చిన చింతయుకలదు, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది.” (2 కొరింథీయులు 11:28) అయితే, వ్యాకులత సంభవించినప్పుడు ఏమి చేయవలెనో అపొస్తలునికి తెలియును, ఆయన యిలా వ్రాసాడు: “దేనిని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకు మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) అవును, చింతను తగ్గించుటకు ప్రార్థన దేవునియందు నమ్మకము తోడ్పడును.

13. చేరుకొనగల్గుటలో వ్యాకులత వున్నవాడు ఏ విధంగా ప్రార్థించాలి?

13 ఏదైన చింత కొనసాగుచున్నందున చేరుకొనుటలో వ్యాకులత ఉంటే దావీదు చేసినట్లు ప్రార్థించవచ్చును: “దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలిసికొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలిసికొనుము. నీ కాయాసకరమైనమార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము.” (కీర్తన 139:23, 24) మన “కలవరము” లేక “వ్యాకులమైన” ఆలోచనలు ఎట్టివైనను, మనము ఆత్మీయాభివృద్ధిపొందునట్లు వాటిని తాళుటకు దేవుడు మనకు సహాయముచేయును (ది న్యూ ఇంటర్నేషనల్‌ వర్షన్‌ చూడుము) మరొక కీర్తనలో అది చక్కగా వర్ణించబడింది: “నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీగొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.”—కీర్తన 94:18, 19.

యెహోవా చిత్తమును బట్టి సంతోషంగా సేవచేయుము

14. చేరుకొనకుండా ఉండు వ్యక్తి దేవుని పరిశుద్ధాత్మ కొరకు ఎందుకు ప్రార్థించాలి?

14 చింత, అసంతృప్తి భావాలు లేదా చేరుకోవాలను అట్టి అభిప్రాయము లోపించినందువల్ల ఒక క్రైస్తవుడు అధ్యక్ష పదవికి చేరుకొనుటలో విఫలుడైతే, యేసు చెప్పెను: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవుల నియ్య నెరిగియుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్దాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును!” (లూకా 11:12, 13) ఆత్మఫలములో సమాధానము, ఆశానిగ్రహము ఉన్నవి గనుక, చింత లేక అసంతృప్తి భావాలను తాళుకొనుటకు ఈ ఆత్మ మనకు సహాయము చేయగలదు.—గలతీయులు 5:22, 23.

15. సేవా ఆధిక్యతలకు చేరుకొను అభిప్రాయము లేని వారికి ఎటువంటి ప్రార్థనలు సహాయపడగలవు?

15 చేరుకోవాలను అట్టి అభిప్రాయము లేక పోవడమునుగూర్చి ఏమిటి? బాప్తిస్మము తీసుకొనిన క్రైస్తవులముగా, తనకు ప్రీతికరమైన దానినిచేయుటకు నడుపుమని దేవునికి మనము ప్రార్థించాలి. దావీదు అర్థించాడు: “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము . . .నన్ను నీ సత్యము ననుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము.” (కీర్తన 25:4,5 ) అట్టి ప్రార్థనలు చెడు మార్గములను అనుసరించకుండ మనకు సహాయముచేయును, చేరుకోవాలనే అభిప్రాయము లేక పోతే ఆవిధంగానే ప్రార్థించవచ్చును. సేవా ఆధిక్యతలు యివ్వ జూపినప్పుడు నిస్సందేహముగా అంగీకరిస్తాము. ఏ విధంగానైనను దేవుని సేవకులు ఆయన ఆత్మను ఎదిరించరు.—ఎఫెసీయులు 4:30.

16. సంఘ బాధ్యతలకు చేరుకొనుటకు ఏ దృక్పథము దృఢ నిశ్చయతనిచ్చును?

16 “క్రీస్తు మనస్సును కలిగియుండి” దైవచిత్తమును చేయుటలో మనము ఆనందముననుభవించగలము. (1 కొరింథీయులు 2:16) కీర్తనల గ్రంథకర్త దృక్పథాన్నే యేసు కల్గియుండెను. అతడిట్లన్నాడు: “నా దేవా నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది.” (కీర్తన 40:8) క్రీస్తు యిలా అనెను: “నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను.” అది మరణ కొయ్యపై మరణించేంతవరకు కొనసాగింది. (హెబ్రీయులు 10:9, 10) యెహోవా సేవలో సాధ్యమగు ప్రతిదానిని చేయాలనే కోరిక సంఘ బాధ్యతలకు చేరుకోవాలనే దృఢనిశ్చయతను కల్గించును.

భవిష్యత్తుకొరకు ఎదురు చూడుము

17. (ఎ) ఒకనాడు చేసినట్లు యిప్పుడు సంపూర్ణంగా సేవ చేయలేక పోవుచున్నవారు ఎందుకు నిరుత్సాహపడకూడదు? (బి) అన్నింటికన్నా గొప్ప ఆధిక్యత ఏమిటి?

17 ఆరోగ్యసమస్యలు లేక మరి యితర కారణములను బట్టి ప్రాముఖ్యమైన సంఘ బాధ్యతలను ఒకప్పుడు నిర్వహించిన వారు ప్రస్తుతము అట్టి ఆధిక్యతలందు లేరు. వీరు నిరుత్సాహపడకూడదు. ఒకనాడు సంపూర్ణ సేవచేసిన కొంతమంది నమ్మకమైన పురుషులు నేడు ఆవిధంగా చేయక పోయినను, యథార్థతను కాపాడుకొను వారిగా నిలిచియున్నారని మనకు తెలియును. (కీర్తన 25:21) నిజమే, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వినయస్తులైన పెద్దలు, పెద్దల కూటమిలో నిలిచియుండుట మూలంగా తన అనుభవాన్ని అందుబాటులో ఉంచి కొనసాగవచ్చును. వయస్సు లేక శరీరబలహీనతలనుబట్టి వికలాంగులైనప్పటికిని వారు తొలగి పోనవసరములేదు. ఈ లోపుగా యెహోవాసాక్షియైన ప్రతి ఒక్కరు ‘దేవుని రాజ్య ప్రభావమునుగూర్చి మాట్లాడుచు’ ఆయన పరిశుద్ధనామము ఉన్నతంగా అన్నింటికన్నా మిన్నయైన ఈ ఆధిక్యతను పెంపొదించుకొనవలెను.—కీర్తన 145:10-13.

18. (ఎ) ఒకపెద్దగాని, పరిచారకుడుగాని తొలగించబడితే ఏమి అవసరము? (బి) తొలగించబడిన ఒక పెద్ద ఎటువంటి శ్రేష్టమైన స్వభావమును ప్రదర్శించెను?

18 నీవు ఒకప్పుడు పెద్ద లేక పరిచారకుడవైయుండి యిప్పుడా స్థాయిలో సేవ చేయకయుండినయెడల, దేవుడు యింకా నిన్ను లక్ష్య పెట్టుచున్నాడని, భవిష్యత్తులో నీవు ఎదురుచూడని ఆధిక్యతలను నీకు దయచేయునని నిశ్చయతను కల్గియుండుము. (1 పేతురు 5:6, 7) కొన్ని సర్దుబాట్లు చేసికొనవలసియుంటే, పొరపాటును ఒప్పుకొని, దాని విషయములో దేవుని సహాయముచేత కృషిచేయుటకు సంసిద్ధంగా నుండుము. పెద్దగా ఉండకుండా తొలగించబడిన కొందరు క్రైస్తవ వ్యతిరేక స్వభావమును పెంపొందించుకొన్నారు, కొందరు నిష్క్రియలోనికి పోయారు లేదా సత్యమునుండి తొలగిపోయారు. కాని మంచి స్వభావమును కనపర్చిన వారివలెనుండుట ఎంత జ్ఞానయుక్తము! ఉదాహరణకు, మధ్య అమెరికాలో అనేక సంవత్సరములు సేవచేసిన పెద్ద తొలగించబడినప్పుడు, యిలా అన్నాడు: “చాలాకాలంగా నేను కాపాడుకొంటూ వచ్చిన ఆధిక్యతలను తిరిగిపొందుటకు కృషిచేస్తాను.” కొద్దికాలానికే ఈ సహోదరునికి మరలా పెద్దగా సేవచేసే ఆధిక్యత యివ్వబడింది.

19. పెద్దగా లేక పరిచారకునిగా ఉండకుండా తొలగించబడిన సహోదరునికి ఎట్టి తగిన సలహా యివ్వబడింది?

19 పెద్దగా లేక పరిచారకునిగా గాని నీవు తొలగించబడినట్లయితే, దీన స్వభావమును కల్గియుండుము. భవిష్యత్తు ఆధిక్యతలకు నిన్ను అనర్హునిగా చేయు కోపోద్రేక స్వభావమును విడనాడుము. దైవిక ఆత్మ గౌరవమును పొందును. నిరుత్సాహపడుటకంటె నీ పరిచర్యను లేక నీగృహమును యెహోవా ఎలా ఆశీర్వదించుచున్నాడో చూచుకొనుము. నీ కుటుంబమును ఆత్మీయంగా వృద్ధిచేయుము. రోగులను సందర్శించుము, బలహీనులను ప్రోత్సహించుము. అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవాసాక్షులలో ఒకనిగా దేవుని స్తుతించుట మరియు సువార్తను ప్రకటించుట అనే నీ ఆధిక్యతను వృద్ధిచేసుకొనుము.—కీర్తన 145:1, 2; యెషయా 43:10-12.

20. మునుపు అధ్యక్షుడుగా లేదా పరిచారకునిగా ఉండిన వానికి పెద్దల కూటమి ఏ విధంగా సహాయము చేయవచ్చును?

20 అంతకుముందు అధ్యక్షునిగా లేక పరిచారకునిగా ఉన్న వ్యక్తిని అతడు అట్టి ఆధిక్యతను స్వచ్ఛందముగా విడనాడినను, అతనిని తొలగిస్తే ఆవేదన కల్గించునని పెద్దల కూటమి గుర్తించవలెను. అతడు బహిష్కరించబడకపోతే, ఆ సహోదరుడు కృంగి పోవుటను పెద్దలు గమనిస్తే ప్రేమగల ఆత్మీయ సహాయమును అందించవలసియున్నారు. (1 థెస్సలొనీకయులు 5:14) అతడు సంఘమునకు అవసరమేనని అతడు గుర్తించేటట్లు వారతనికి సహాయముచేయాలి. సలహా అవసరమైయున్నను వినయము కృతజ్ఞుడైన వ్యక్తి మరలా సంఘములో అదనపు సేవా ఆధిక్యతలను పొందకముందు ఎంతోకాలము వేచియుండవలసిన పనిలేదు.

21. సేవా ఆధిక్యతల కొరకు ఎవరు వేచియుండిరి, నేడు వాటికొరకు వేచియున్నవారికి ఏ సలహా యివ్వబడింది?

21 నీవు చేరుకొనగల్గుచున్నట్లయితే, మరి యితర సేవాధిక్యతలను పొందునిమిత్తము కొంతకాలము నీవు వేచియుండాలి. సహనాన్ని కోల్పోవద్దు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యమునుండి విడిపించినప్పుడు దేవుడు తనను వాడుకొనుటకు ముందు మోషే 40 సంవత్సరములు వేచియుండెను. (అపొస్తలులకార్యములు 7:23-36) మోషే తరువాత నాయకునిగా నియమించబడక ముందు యెహోషువా అతని పరిచారకునిగా ఎంతోకాలము సేవ చేసెను. (నిర్గమకాండము 33:11; సంఖ్యాకాండము 27:15-23) ఇశ్రాయేలు సింహాసనముపై కూర్చుండకముందు దావీదు కొంతకాలము వేచియుండెను. (2 సమూయేలు 2:7; 5:3) పేతురు, మార్కు అనబడు యోహాను శుద్ధిచేయబడే కాలాన్ని అనుభవించారు. (మత్తయి 26:69-75; యోహాను 21:15-19; అపొస్తలులకార్యములు 13:13; 15:36-41; కొలస్సయులు 4:10) అందుచేత నీకిప్పుడు సంఘబాధ్యతలు లేక పోతే మరింత అనుభవము సంపాదించునట్లు యెహోవా నిన్ను అనుమతిస్తున్నాడేమో. ఏమైనప్పటికిని నీవు చేరుకొనగల్గుటకు దేవుని సహాయమును అర్థించుము, ఆయన నిన్ను అదనపు సేవా ఆధిక్యతలతో ఆశీర్వదించును. ఈ లోగా, సంఘ బాధ్యతకు అర్హుడవగునట్లు గట్టి కృషిచేయుము, దావీదు వంటి స్వభావమును కనుపర్చుము, ఆయనిట్లన్నాడు: “నానోరు యెహోవాను స్తోత్రముచేయును. శరీరులందరు ఆయన పరిశుద్ధనామమును నిత్యము సన్నుతించుదురుగాక.”—కీర్తన 145:21 (w90 9/1)

నీ వెలా సమాధానమిస్తావు?

◻ క్రైస్తవ పెద్దలు ఏ ఆపదలనుండి కాపాడుకొనవలెను?

◻ చింత లేదా తగను అనే భావాలనుబట్టి చేరుకొనలేక పోవుచున్నవారికి ఏమి సహాయము చేయగలదు?

◻ సంఘబాధ్యతకు తన్నుతాను లభ్యపరచుకొనుటకు ఒకవ్యక్తిని ఏది పురికొల్పగలదు?

◻ గతములో పెద్దలు పరిచారకులుగా ఉన్నవారు భవిష్యత్తుకొరకు ఏ దృక్పథముతో ఎదురుచూడవచ్చును?

[11వ పేజీలోని చిత్రాలు]

వినయముగల పెద్దగా డబ్ల్యు. జె. థోర్న్‌ శ్రేష్టమైన మాదిరిని చూపెను

[13వ పేజీలోని చిత్రాలు]

యేసువలె, యెహోవా సేవలో సాధ్యమైన ప్రతి పనిని చేయుటకు నీవు యిష్టపడుచున్నావా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి