మీరు విశ్వాసముగలవారైయున్నారో లేదో పరీక్షించుకొనుడి
రెండవ కొరింథీయుల నుండి ఉన్నతాంశములు
అపొస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న క్రైస్తవులనుగూర్చి శ్రద్ధకలిగియున్నాడు. వారికి తన మొదటిపత్రికద్వారా యివ్వబడిన ఉపదేశమును వారెట్లు దృష్టిస్తారు? తన మొదటి పత్రిక కొరింథీయులను పశ్చాత్తాపమునొందునట్లు దుఃఖమును కలుగజేసినదను మంచి సమాచారముతో తీతు తనయొద్దకు వచ్చినప్పుడు ఆయన మాసిదోనియాలో ఉన్నాడు. అది పౌలును ఎంతగా సంతోషపరచినది!—2 కొరింథీయులు 7:8-13.
పౌలు దాదాపు సా.శ. 55వ సం. మధ్యభాగమున మాసిదోనియా నుండి కొరింథీయులకు వ్రాసిన రెండవపత్రికను వ్రాశాడు. తన పత్రికలో సంఘమును పవిత్రముగా ఉంచుటకు, యూదయలో అవసరతలోనున్న విశ్వాసులకు చందానిచ్చుటకు తగుకోరికను పెంచుటకు తీసుకొనిన చర్యలను చర్చించి తన అపొస్తలత్వమును సమర్థించుకొనుచున్నాడు. పౌలు చెప్పిన ఎన్నోవిషయాలు మనము “విశ్వాసముగలవారమైయున్నామో, లేదో పరీక్షించి చూచుకొనుటకు” మనకు సహాయముచేయును. (13:5) కాబట్టి, ఈ పత్రికనుండి వేటిని మనము తీసికొనగలము?
ఆదరణను అనుగ్రహించు దేవునికి పరిచర్యచేయుము
మనశ్రమలన్నిటిలో దేవుడు మనలను ఆదరించులాగున మనము ఇతరులను ఆదరించి, వారికొరకు ప్రార్థనచేయవలెను. (1:1–2:11) పౌలు మరియు ఆయన సహవాసులు విపరీతమైన ఒత్తిడులయందున్నను దేవుడు వారిని తప్పించెను. అయినను, కొరింథీయులు వారినిమిత్తమై తమ ప్రార్థనలద్వారా వారికి సహాయము చేయగలిగిరి, అలాగే మనమును నిజమైన విశ్వాసమును చేపట్టిన యితరులకొరకు ప్రార్థించవలెను. అయితే, 1 కొరింథీయులు 5వ అధ్యాయములో ప్రస్తావించబడిన దుర్నీతిగల మనుష్యుని విషయమేమి? అతను నిశ్చయంగా వెలివేయబడ్డాడు, కాని పశ్చాత్తాపపడ్డాడు. కొరింథీయులు అతనియెడల క్షమాపణను చూపించి, ప్రేమతో తమ మధ్యకు చేర్చుకున్నప్పుడు నిశ్చయంగా అతడెంతటి ఆదరణను పొందియుండవచ్చును!
పౌలు మాటలు క్రైస్తవపరిచర్యయెడల మనమెప్పును వృద్ధిచేసి నిజమైన విశ్వాసముయెడల మనస్థానమును బలపరచగలవు. (2:12–6:10) ఎందుకు, నూతననిబంధనకు పరిచారకులైనవారు దేవునితోకూడా “విజయోత్సవముతో ఊరేగించబడు” ఆధిక్యతను పొందియున్నారు. పౌలు మరియు ఆయన తోటిపరిచారకులు వారికి చూపబడిన కనికరమునుబట్టి ఐశ్వర్యవంతమైన పరిచర్యను కలిగియున్నారు. వారివలెనె ప్రస్తుత దిన అభిషక్తులును సమాధానపరచు పరిచర్యను కలిగియున్నారు. అయినను, యెహోవాసాక్షులందరు, తమపరిచర్యద్వారా ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేయుదురు.
పరిశుద్ధతను సంపూర్తిచేసి ఔదార్యము కలిగియుండుడి
యెహోవాయందలి భయముతో క్రైస్తవ పరిచారకులు పరిశుద్ధతను సంపూర్తిచేయవలెనని పౌలు మనకు చూపుచున్నాడు. (6:11–7:16) మనము విశ్వాసమందు స్థిరముగా నిలబడవలెనంటే అవిశ్వాసులతో విజ్జొడుగా ఉండుటను మనము తొలగించుకొని శరీరసంబంధమైన మరియు ఆత్మీయసంబంధమైన కల్మషమునుండి శుభ్రపరచుకొనవలసియున్నాము. కొరింథీయులు దుర్నీతిగల తప్పిదస్తుని వెలివేయుటద్వారా శుభ్రపరచు చర్యను తీసుకొనిరి. తన మొదటిపత్రిక రక్షణనిమిత్తమై వారు పశ్చాత్తాపమునొందునట్లు వారిని దుఃఖపరచినందుకు పౌలు ఆనందించెను.
దేవునికి భయపడు పరిచారకులు తమ ఔదార్యమునకు తగిన ప్రతిఫలము పొందుదురని కూడా మనము నేర్చుకొనుచున్నాము. (8:1–9:15) అవసరతలో నున్న “పరిశుద్ధుల”కు, చందా ఇచ్చు విషయములో మాసిదోనియనుల మంచి ఉదాహరణను పౌలు చూపించెను. వారు తమశక్తికి మించి ఔదార్యముచూపిరి, మరియు కొరింథీయులును అలాంటి ఔదార్యమును చూపుటను చూడవలెనని పౌలు ఆశించెను. వారు యిచ్చునదేగాని—లేక మనము యిచ్చునదేగాని హృదయములోనుండి రావలెను. ఎందుకనగా “ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును” మరియు ప్రతివిధమైన ఔదార్యమును చూపువారిని దేవుడు దీవించును.
పౌలు— శ్రద్ధవహించు అపొస్తలుడు
యెహోవా సేవలో పరిచారకులుగా మనము దేనిని నెరవేర్చినను మనయందుకాక ఆయనయందు అతిశయించుదము. (10:1–12:13) ఎంతచేసినను, కేవలము ఆత్మీయ ఆయుధములద్వారానే “దేవునిచేత బలమొందినవారమై” అబద్ధతర్కములను పడద్రోయగలము. కొరింథీయుల మధ్య అతిశయించు “దొంగ అపొస్తలులు” క్రీస్తుపరిచారకునిగా సహనమందు పౌలు కలిగియున్న చరిత్రకు ఏమాత్రము సాటికారు. అయినను ఆయన అధికముగా హెచ్చించిపోకుండు నిమిత్తము “ఆయన శరీరమందున్న ముల్లును” దేవుడు తీసివేయలేదు. బహుశా ఇది ఆయనయొక్క కండ్లమసక, లేక ఆ దొంగ అపొస్తలులైయుండవచ్చును. క్రీస్తుశక్తి తనపై గుడారమువలె నిలిచియుండు నిమిత్తము పౌలు తన బలహీనతయందే అతిశయించుచున్నాడు. విశ్వాసమందు స్థిరముగా నిలిచినవాడై ఆయన దొంగ అపొస్తలులకు ఎంతమాత్రము తక్కువవానిగా యుండలేదు. ఆయన వారిమధ్య “సూచక క్రియలను, అద్భుతములను, మహాత్కార్యములను చేయుటవలన అపొస్తలునియొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో వారిమధ్యను కనపరచినవాటిని కొరింథీయులు చూశారు.
పరిచారకునిగా మరియు అపొస్తలునిగా పౌలు తోటివిశ్వాసులయొక్క ఆత్మీయ శ్రద్ధలను తన హృదయమందు కలిగియుండెను. అలాగే మనమును కలిగియుండవలెను. (12:14-13:14) ఆయన ‘వారి ఆత్మలకొరకు బహుసంతోషముగా తన్నుతాను పూర్తిగా వ్యయపరచుకొను’ వాడైయుండెను. అయితే పౌలు కొరింథుకు వచ్చినప్పుడు తమ శరీరకార్యముల నిమిత్తమై మారుమనస్సు పొందని వారిని కనుగొనునేమోయని భయపడెను. కాబట్టి విశ్వాసముగలవారైయున్నారో లేదో యని పరీక్షించుకొంటూయుండుడని వారికి సలహాయిస్తు, ‘వారు మేలైనదే చేయునట్లు వారికొరకు ఆయన ప్రార్థించెను’. ముగింపులో సంతోషించుడి, దిద్దబడినవారైయుండుడి, ఆదరణకలిగియుండుడి, ఏకమనస్సుగలవారైయుండుడి, సమాధానముగా యుండుడి అని పురికొల్పెను. మనకును అది ఎంతమంచి ఉపదేశము!
పరీక్షించుకొనుచుండుడి!
ఆవిధముగా పౌలు కొరింథీయులకు వ్రాసిన రెండవపత్రిక మనలను అనేక విధములుగా మనము విశ్వాసమందున్నామో లేదో అని పరీక్షించుకొనుటకు సలహానిచ్చుచున్నది. మన సమస్త ఉపద్రవములందును దేవుడు మనలను ఆదరించురీతిగా మనము ఇతరులను ఆదరించుటకు ఆయన మాటలు మనలను నడపవలెను. క్రైస్తవపరిచర్యనుగూర్చి అపొస్తలుడు చెప్పినది యెహోవాయందు భయమును కలిగియుండుటతోపాటు మన పరిశుద్ధతను సంపూర్ణముచేయుచు ఆ పరిచర్యను నమ్మకముగా మనము నెరవేర్చుటకు పురికొల్పవలెను.
పౌలు ఉపదేశమును అన్వయించుకొనుట ఎక్కువ ఔదార్యముగలవారిగా మరియు సహాయకరముగా ఉండునట్లు చేయును. అయినను, ఆయన మాటలు మనలను మనయందుకాక, యెహోవాయందు అతిశయించునట్లు నడిపించవలెను. అవి మనతోటి విశ్వాసులయెడల మనము కలిగియున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధను పెంచవలెను. నిశ్చయముగా ఇవి మరియు రెండవ కొరింథీయులలోని ఇతర అంశములు మనము విశ్వాసము గలవారమైయున్నామో లేదో యని పరీక్షించి చూచుకొనుటకు మనకు సహాయము చేయగలవు. (w90 9⁄15)
[30వ పేజీలోని బాక్సు/చిత్రం]
యెహోవా మహిమను ప్రతిబింబించుడి: శాసనములుగల పలకలను తీసికొని మోషే సీనాయికొండ దిగుచుండగా, దేవుడు ఆయనతో మాట్లాడినందున ఆయన ముఖము ప్రకాశించెను. (నిర్గమకాండము 34:29, 30) పౌలు దీనిని ప్రస్తావించుచు ఇలా అనెను: “మనమందరమును, ముసుకులేని ముఖముతో యెహోవాయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, యెహోవాయగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము.” (2 కొరింథీయులు 3:7-18 NW) పురాతనకాలపు చేతి అద్దములు కంచు లేక ఇత్తడి మొదలగు లోహములతో తయారుచేయబడి చాలా బాగా ప్రతిబింబించేరీతిలో నునుపు చేయబడేవి. అలాంటి అద్దములవలె యేసుక్రీస్తుద్వారా తమలో ప్రకాశించబడిన దేవుని మహిమను ప్రతిబింబిస్తు, క్రమక్రమముగా యెహోవా మహిమను ప్రతిబింబించు కుమారునిచే వెల్లడిచేయబడిన పోలికకు మార్చబడుదురు.’ (2 కొరింథీయులు 4:6; ఎఫెసీయులు 5:1) పరిశుద్ధాత్మ మరియు లేఖనములద్వారా, తనస్వంత లక్షణములను ప్రతిబింబించు “నూతనస్వభావమును” దేవుడు వారిలో పుట్టించును. (ఎఫెసీయులు 4:24; కొలొస్సయులు 3:10) మననిరీక్షణ పరలోకసంబంధమైనదైన లేక భూసంబంధమైనదైన ఆ స్వభావమును ప్రదర్శిస్తు మన పరిచర్యలో దేవుని మహిమను ప్రతిబింబించు ఆధిక్యతను కాపాడుకొందము.
[31వ పేజీలోని బాక్సు/చిత్రం]
“నీతి ఆయుధములు”: దేవుని పరిచారకులుగా పౌలు మరియు ఆయన సహవాసులు తమ్మును తాము మెప్పించుకొను విధమేమనగా “వారు కుడియెడమల నీతి ఆయుధములను కలిగియుండుట.” (2 కొరింథీయులు 6:3-7) కుడిచేయి ఖడ్గము వాడుటకును, యెడమది డాలును పట్టుకొనుటకును ఉపయోగించబడినది. అన్నివిధములుగా బాధించబడినను పౌలు మరియు ఆయన తోటిపనివారలు ఆత్మీయ యుద్ధమును చేయుటకు ఆయుధములు ధరించియుండిరి. ఆ యుద్ధము కొరింథీ సంఘము క్రీస్తుయందుగలభక్తినుండి ప్రక్కకు లాగబడకుండునట్లు అబద్ధబోధకులకును, మరియు “దొంగ అపొస్తలులకును” వ్యతిరేకముగా చేయబడినది. పాపసంబంధమైన శరీరమునకు సంబంధించిన ఆయుధములగు—యుక్తి, మోసము, పన్నాగము లాంటివాటిని వాడుటకు పౌలు యిష్టపడలేదు. (2 కొరింథీయులు 10:8-10; 11:3, 12-14; 12:11, 16) బదులుగా, ఉపయోగించబడిన ఆయుధములు, నీతి మరియు న్యాయసంబంధమైనవి. అనగా ముట్టడులన్నిటిని ఎదిరించి సత్యారాధనను వ్యాపింపజేయునవి. అదేసంకల్పము నిమిత్తమై యెహోవాసాక్షులు ఇప్పుడు “నీతి ఆయుధములు” ఉపయోగింతురు.