కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 2/15 పేజీలు 8-15
  • “నీ రాకడకు సూచనలేవి?”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నీ రాకడకు సూచనలేవి?”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • అపొస్తలులు తెలుసుకొన గోరారు
  • “అటుతర్వాత” అంతము
  • ప్రవచించినట్లుగా, యింకా ఎక్కువ జరగాల్సి ఉంది
  • దేనికి నడిపిస్తుంది?
  • “ఇవి ఎప్పుడు జరుగును? . . . మాతో చెప్పుము”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • “ఇవి జరుగవలసియున్నవి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • అపొస్తలులు యేసును ఒక సూచన అడిగారు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • దేవుడు చర్య తీసుకున్నప్పుడు మీరు తప్పించబడతారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 2/15 పేజీలు 8-15

“నీ రాకడకు సూచనలేవి?”

“ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము.”—మత్తయి 24:3.

1, 2. ప్రజలు భవిష్యత్తుపై ఆసక్తి కల్గివున్నారని ఏది చూపుతోంది?

అనేకమంది ప్రజలు భవిష్యత్తును గూర్చి శ్రద్ధకలిగి ఉన్నారు. మీకూ ఉందా? ఫ్యూచర్‌ షాక్‌ అనే తన పుస్తకంలో ప్రొఫెసర్‌ ఆల్విన్‌ టోఫ్లర్‌, “భవిష్యత్తును గూర్చి అధ్యయనం చేయడానికి అకస్మాత్తుగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయని” వ్రాశాడు. ‘కేవలం భవిష్యత్తును గూర్చి తలంచే మేధావివర్గ సంస్థల పుట్టుకను; భవిష్యత్‌ చింతగల పత్రికలు ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, అమెరికాల్లో అవతరించడాన్ని; విశ్వవిద్యాలయాల్లో జ్యోతిశ్శాస్త్ర విద్యా విభాగాలు విస్తరించడాన్ని మనం చూశామని’ ఆయన అన్నాడు. అయితే, టోఫ్లర్‌ చివరకు, “నిజానికి ఎవరూ భవిష్యత్తును గూర్చి సంపూర్ణంగా ‘తెలిసికోలేరు’” అని తేల్చిచెప్పాడు.

2 సైన్స్‌ ఆఫ్‌ థింగ్స్‌ టు కమ్‌ అనే పుస్తకమిలా అంటోంది: “హస్తసాముద్రికం, స్ఫటిక గోళంద్వారా చూడ్డం, జ్యోతిశ్శాస్త్రం, కార్డుముక్కల్ని తీసి చదవడం వంటివి భవిష్యత్తును గూర్చి మనకు రవ్వంత చెప్పడానికి ఎంతోకొంత చిక్కైన ప్రక్రియలు మాత్రమే.” అటువంటి మానవ పద్ధతుల వైపు తిరిగే బదులు, మనం రూఢియైన మూలమగు యెహోవా దేవునివైపు చూడ్డం ఎంతైనా శ్రేష్ఠము.

3. భవిష్యత్తును గూర్చిన జ్ఞానం కొరకు దేవుని వైపు చూడడం ఎందుకు సమంజసం?

3 సత్యదేవుడు యిలా అన్నాడు: “నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును; నేను యోచించినట్లు స్థిరపడును.” (యెషయా 14:24, 27; 42:9) అవును, తరచు మానవ వాగ్దూతలను ఉపయోగిస్తూ, జరుగబోయే సంగతులను గూర్చి ఆయన మానవులను హెచ్చరించగల్గాడు. వీరిలో ఒక ప్రవక్త యిలా వ్రాశాడు: “తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.”—ఆమోసు 3:7, 8; 2 పేతురు 1:20, 21.

4, 5. (ఎ) భవిష్యత్తు విషయమై యేసు ఎందుకు సహాయకారిగా ఉన్నాడు? (బి) ఆయన అపొస్తలులందరూ కలిసి ఆయనను ఏమని ప్రశ్నించారు?

4 దేవుని ప్రవక్తల్లో యేసుక్రీస్తు ప్రధానుడు. (హెబ్రీయులు 1:1, 2) కాబట్టి ప్రస్తుతం మనచుట్టూ జరుగుతున్న సంగతులను గూర్చి యేసు ప్రవచించిన కీలకమైన ప్రవచనాలపై దృష్టిని కేంద్రీకరిద్దాం. ప్రస్తుత దుష్టవిధానాన్ని అంతమొందించి దానిస్థానే దేవుడొక నూతన లోకాన్ని నెలకొల్పబోయే విషయాలను గూర్చి అది మనకు లోతైన అవగాహననిస్తుంది.

5 యేసు తానొక ప్రవక్తయని నిరూపించుకున్నాడు. (మార్కు 6:4; లూకా 13:33; 24:19; యోహాను 4:19; 6:14; 9:17) కాబట్టి, అపొస్తలులు ఆయనతో పాటు ఒలీవ కొండపై కూర్చొని యెరూషలేమువైపు చూస్తున్నప్పుడు, భవిష్యత్తును గూర్చి యిలా ఎందుకు ప్రశ్నించారో మనం అర్థం చేసుకోగలం: “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుము.”—మత్తయి 24:3; మార్కు 13:4.

6. మత్తయి 24, మార్కు 13, లూకా 21 అధ్యాయాల నడుమ ఏ సంబంధం ఉంది; ఏ ప్రశ్నలు మనకు ఎక్కువ ఆసక్తిని కల్గిస్తాయి?

6 మీరు వారి ప్రశ్నను, యేసు యిచ్చిన జవాబును మత్తయి 24, మార్కు 13, లూకా 21 అధ్యాయాల్లో కనుగొంటారు.a అనేక విషయాల్లో ఆ వృత్తాంతాలు ఒకదానిపై మరొకటి ఆధారపడి పూర్తి వివరాలిస్తున్నాయి, అంతేగాని అవి ఒకటే కావు. ఉదాహరణకు, కేవలం లూకా మాత్రమే ‘ఒకదాని తర్వాత మరోప్రాంతంలో తెగుళ్లు సంభవిస్తాయని’ వ్రాశాడు. (లూకా 21:10, 11, మత్తయి 24:7; మార్కు 13:8) సహేతుకంగా మనం యిలా ప్రశ్నించుకోవచ్చు, తన బోధ వినువారి జీవితకాలంలో సంభవించే సంఘటనల్నే యేసు ప్రవచించాడా, లేక మనకాలం, యింకా రాబోయే కాలాన్ని కూడా ఆయన యిమిడ్చాడా?

అపొస్తలులు తెలుసుకొన గోరారు

7. అపొస్తలులు ప్రత్యేకంగా దేనిని గూర్చి అడుగుతారు, అయితే యేసు జవాబు ఏ కాలంవరకు కొనసాగుతుంది?

7 యేసు తన మరణానికి కొద్దిరోజుల క్రితం, యూదా రాజధానియైన యెరూషలేమును దేవుడు తృణీకరించాడని, ఆ పట్టణము, దాని మహాద్భుతమైన దేవాలయం నాశనమౌతాయని ప్రవచించాడు. అందుకే ఆయన అపొస్తలులలో కొందరు ‘యేసు ప్రత్యక్షతకునూ’ ‘యుగసమాప్తికీని సూచన’ తెల్పమని అడిగారు. (మత్తయి 23:37–24:3) నిజమే, వారు ముఖ్యంగా యూదామత విధానాన్ని గూర్చి, యెరూషలేమును గూర్చి మాత్రమే ఆలోచించారు, ఎందుకంటే వారు భవిష్యత్‌ కార్యవిధానాన్ని అర్థం చేసుకోలేదు. అయితే యేసు వాటిని గూర్చి జవాబిస్తూ సా.శ. 70 వరకు, అంతేకాక ఆ సమయంలో రోమన్లు యెరూషలేమును నాశనం చేయబోవు విషయాన్నే గాక భవిష్యత్తుపై కూడా దృష్టిని కేంద్రీకరించాడు.—లూకా 19:11; అపొస్తలుల కార్యములు 1:6, 7.

8. యేసు ప్రవచించిన కొన్ని సంఘటనలేవి?

8 మీరు ఈ మూడు సువార్తల్లోని వృత్తాంతాలను చదివినప్పుడు, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యము లేవడం, కరవులు, భూకంపాలు, భయానక దృశ్యాలు, ఆకాశమండలపు సూచనలు కలుగుతాయని యేసు మాట్లాడడం గమనిస్తారు. యేసు ఆ సూచనను చెప్పిన (సా.శ. 33) కాలానికి యెరూషలేము నాశనం చేయబడిన (సా.శ. 66-70) కాలానికి మధ్యనున్న సంవత్సరాల్లో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. యేసు వర్తమానాన్ని ప్రకటిస్తున్న క్రైస్తవులను యూదులు హింసిస్తారు.

9. యేసు ప్రవచనం సా.శ.పూ. మొదటి శతాబ్దంలో ఏ నెరవేర్పును కల్గివుంది?

9 చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసీఫస్‌ రూఢిగా చెప్పినట్లు సూచనలోని ఈ విషయాలు వాస్తవంగా నెరవేరాయి. రోమన్లు ముట్టడిచేయక ముందు, అబద్ధ మెస్సీయలు తిరుగుబాటును పురికొల్పారని ఆయన వ్రాశాడు. యూదయలోను, ఆయా ప్రాంతాల్లోను భయంకరమైన భూకంపాలు సంభవించాయి. రోమా సామ్రాజ్యమందలి వివిధ ప్రాంతాల్లో యుద్ధాలు చెలరేగాయి. గొప్ప కరవులు సంభవించాయా? అవును నిశ్చయంగా సంభవించాయి. (అపొస్తలుల కార్యములు 11:27-30 పోల్చండి.) మరి రాజ్య ప్రచారపని విషయమేమిటి? దాదాపు సా.శ. 60 లేక 61లో కొలొస్సయులకు పుస్తకం వ్రాయబడినప్పుడు, దేవుని రాజ్య “సువార్తవలన కలుగు నిరీక్షణ” ఆఫ్రికా, ఆసియా, ఐరోపాల్లో విస్తారంగా ప్రకటింపబడింది.b—కొలొస్సయులు 1:23.

“అటుతర్వాత” అంతము

10. మనం గ్రీకు పదమైన టొటెను ఎందుకు పరిశీలించాలి, మరి దాని ప్రాముఖ్యతేమిటి?

10 యేసు తన ప్రవచనాల్లోని కొన్ని భాగాలందు, సంఘటనలు ఒకదాని తర్వాత మరొకటి జరుగుతాయని చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “ఈ రాజ్య సువార్త . . . ప్రకటింపబడును; అటుతర్వాత, అంతము వచ్చును.” తరచు ఆంగ్లభాషా బైబిళ్లు “దెన్‌” అనే పదాన్ని సామాన్యంగా “అందువలన” లేదా “అయితే” అనే భావంలో ఉపయోగిస్తాయి. (మార్కు 4:15, 17; 13:23) అయితే, మత్తయి 24:14లోని “దెన్‌” అనే మాట గ్రీకు క్రియావాచకమైన టొటెపై ఆధారపడింది.c ఈ టొటె అనే పదం “తగిన కాలంలో ఆ వెంటనే జరిగే పనిని” లేదా “ఆ పిమ్మట జరిగే సంఘటనను సూచించటానికి” వాడబడిన “కాలాన్ని తెల్పే క్రియావిశేషణమని” గ్రీకు భాషా నిపుణులు వివరిస్తున్నారు. కాబట్టి, మొదట రాజ్యసువార్త ప్రకటించబడి, ఆ తర్వాత (లేదా ‘దాని తర్వాత’ లేదా ‘ఆ పిమ్మట’) “అంతము” వస్తుందని యేసు ప్రవచించాడు. అది దేని అంతము?

11. యెరూషలేము నాశనానికి నేరుగా సంబంధంగల సంఘటనలపై యేసు ఎలా దృష్టిని కేంద్రీకరించాడు?

11 యూదా మతవిధానాంతానికి నడిపించే సంఘటనల్లో యేసు ప్రవచనంలోని ఒక నెరవేర్పును మనం చూడవచ్చు. యుద్ధాలు, భూకంపాలు, కరవులు, యేసు ప్రవచించిన యితర సంగతులు దాదాపు మూడు దశాబ్దాల కాలంలో నెరవేరాయి. అయితే మత్తయి 24:15, మార్కు 13:14, లూకా 21:20 వచనాల తర్వాత వ్రాయబడినదానిలో నాశనం యిక యింటి ముంగిటకు వచ్చేసిందని ఆ సమూల నాశనానికి నేరుగా సంబంధించిన సంఘటనల్ని గూర్చి చదువుతాము.—పట్టికలోని చుక్కల గీతను గమనించండి.

12. మత్తయి 24:15 నెరవేర్పులో రోమా సైన్యాలు ఎలా యిమిడి ఉన్నాయి?

12 యూదుల తిరుగుబాటుకు ప్రత్యుత్తరంగా సెస్టియస్‌ గాలస్‌ నాయకత్వంలోని రోమన్లు సా.శ. 66లో యూదులు పరిశుద్ధ పట్టణమని పరిగణించే యెరూషలేమును చుట్టుముట్టారు. (మత్తయి 5:35) యూదులు ఎదురుదాడి జరిపినప్పటికి, రోమన్లు బలవంతంగా ఆ పట్టణంలోనికి చొచ్చుకొనిపోయారు. ఈ విధంగా వారు, మత్తయి 24:15, మార్కు 13:14లో యేసు ప్రవచించినట్లు, “పరిశుద్ధ స్థలమందు నిలుచుట” కారంభించారు. అప్పుడొక ఆశ్చర్యకర సంఘటన జరిగింది. రోమన్లు ఆ పట్టణాన్ని చుట్టుముట్టినప్పటికి, అకస్మాత్తుగా వారు వెనుదిరిగిపోయారు. క్రైస్తవులు యేసు ప్రవచన నెరవేర్పును వెంటనే గుర్తెరిగారు, కాబట్టి అది వారు యూదయ నుండి యొర్దాను ఆవలివైపునగల పెరియా కొండలకు పారిపోడానికి అవకాశమిచ్చింది. వారలా చేశారని చరిత్ర కూడా చెబుతోంది.

13. పారిపొమ్మని యేసు యిచ్చిన హెచ్చరికను క్రైస్తవులు ఎందుకు అనుసరించగల్గారు?

13 రోమన్లు యెరూషలేము నుండి వెనక్కి వెళ్లిపోయారు, గనుక ఎవరైన ఎందుకు పారిపోవాలి? ఎందుకంటే ‘యెరూషలేము నాశనం సమీపమైంది’ అని అనడానికి అక్కడ సంభవించినది రుజువని యేసు పలికిన మాటలు స్పష్టం చేశాయి. (లూకా 21:20) అవును, నాశనము. ‘లోకారంభమునుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎన్నడునూ కలుగబోదని’ యేసు ముందే ప్రవచించాడు. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 70లో సైన్యాధిపతియైన టైటస్‌ నాయకత్వంలోని రోమా సైన్యాల చేతుల్లో యెరూషలేము నిజంగా “మహాశ్రమ” అనుభవించింది. (మత్తయి 24:21; మార్కు 13:19) కాని, అప్పటివరకు గాని అంతకుముందుగాని సంభవించిన శ్రమలకన్నా యిది గొప్పదని యేసు ఎందుకు వర్ణించాడు?

14. అంతకు ముందుగానీ దాని తర్వాత గాని సంభవింపనిది సా.శ. 70 నందు జరిగిన “మహాశ్రమ” అని మనం ఎలా చెప్పవచ్చు?

14 సా.శ.పూ. 607లో బబులోనీయులు యెరూషలేమును బొత్తిగా పాడుచేశారు, ఆలాగే మన ప్రస్తుత శతాబ్దంలో కూడా భయంకర యుద్ధాల్ని ఆ పట్టణం చవిచూసింది. అయినా సా.శ. 70లో జరిగింది మాత్రం ఎన్నడూ ఎరుగని మహాశ్రమే. రమారమి ఐదు నెలలు సాగిన ఆ యుద్ధదాడిలో టైటస్‌ నాయకత్వంలోని రోమా సైన్యం యూదులను ఓడించి, వారిలో యించుమించు 11,00,000 మందిని హతమార్చి, దాదాపు 1,00,000 మందిని బానిసలుగా తీసుకువెళ్లారు. ఆ పిమ్మట రోమన్లు యెరూషలేమును నిర్మానుష్యం చేశారు. కాబట్టి, దేవాలయమే కేంద్రంగావున్న యూదుల ఆరాధనా విధానాన్ని ఆ వినాశనం అంతమొందించింది. (హెబ్రీయులు 1:2) అవును సా.శ. 70 నాటి సంఘటనలను ‘లోకారంభము నుండి యిప్పటివరకు [ఆ పట్టణం, రాజ్యం, విధానంపై] కలుగ లేదు ఇక ఎప్పుడును కలుగబోని శ్రమగా’ సరిగానే పరిగణించవచ్చును.—మత్తయి 24:21.d

ప్రవచించినట్లుగా, యింకా ఎక్కువ జరగాల్సి ఉంది

15. (ఎ) యెరూషలేముపైకి వచ్చిన శ్రమ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయని యేసు ప్రవచించాడు? (బి) మత్తయి 24:23-28 దృష్ట్యా, యేసు ప్రవచన నెరవేర్పును గూర్చి మనం ఏ నిర్థారణకు రావచ్చు?

15 అయితే, యేసు తన ప్రవచనాన్ని కేవలం మొదటి శతాబ్దానికి మాత్రమే పరిమితం చేయలేదు. మత్తయి 24:23, మార్కు 13:21లో వాడిన టొటె లేదా “అటు తరువాత” అనే మాట సూచించినట్లుగా, ఆ తర్వాత మరెంతో జరుగుతుందని బైబిలు చూపిస్తోంది. సా.శ. 70 తర్వాతి కాలంలో ఏం జరుగుతుంది? యూదా మత విధానానికి సంభవించిన ఆ శ్రమ తర్వాత మరియెక్కువ మంది అబద్ధ క్రీస్తులు, ప్రవక్తలు అవతరిస్తారు. (మార్కు 13:6ను 13:21-23తో పోల్చండి.) క్రీస్తు “ప్రత్యక్షత” కొరకు ఎదురుచూస్తున్న, చురుకైన ఆత్మీయ దృష్టిగల ప్రజలను మోసగించలేకపోయినా, సా.శ. 70 నుండి శతాబ్దాలుగా యిటువంటి వ్యక్తులనేకులు బయల్దేరారని చరిత్ర ధృవీకరిస్తోంది. (మత్తయి 24:27, 28) ఏమైనప్పటికిని, కేవలం ప్రాథమిక నెరవేర్పు మాత్రమే కల్గివున్న సా.శ. 70లోని మహాశ్రమ తర్వాత జరిగిన సంఘటనలు, యేసు ఆ మొదటి శతాబ్దపు శ్రమకంటే మున్ముందు జరుగబోతున్న వాటిని దృష్టించాడని సూచిస్తున్నాయి.

16. యేసు యొక్క ప్రవచనానికి లూకా 21:24 ఏ విషయాన్ని చేరుస్తుంది, దీనికి ఏ ప్రాముఖ్యత ఉంది?

16 మనం మత్తయి 24:15-28, మార్కు 13:14-23ను లూకా 21:20-24తో పోల్చినట్లయిన, యేసు ప్రవచనం యెరూషలేము నాశనం తర్వాత యింకా ముందుకు వెళ్లిందనే రెండవ సూచనను కనుగొంటాము. లూకా మాత్రమే తెగుళ్లను గూర్చి ప్రస్తావించాడన్నది జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా, ఈ ప్రవచన భాగాన్ని యేసు మాటలతో ఆయన యిలా ముగించాడు: “అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనములచేత [“అన్యరాజుల కాలం” కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌] త్రొక్కబడును.”e (లూకా 21:24) బబులోనీయులు యూదుల చివరి రాజును సా.శ.పూ. 607లో తొలగించారు, కాగా అప్పటినుండి దేవుని రాజ్యానికి ప్రాతినిధ్యంగా ఉన్న యెరూషలేము త్రొక్కబడింది. (2 రాజులు 25:1-26; 1 దినవృత్తాంతములు 29:23 యెహెజ్కేలు 21:25-27) మరలా దేవుడు రాజ్యం నెలకొల్పే సమయం వచ్చేంతవరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని లూకా 21:24లో యేసు సూచించాడు.

17. యేసు ప్రవచనం భవిష్యత్తులో చాలా దూరం వెళుతుందనే ఏ మూడవ సూచన మనకుంది?

17 యేసు భవిష్యత్తును సూచిస్తున్నాడనడానికి మూడవ గుర్తు కూడా ఉంది: లేఖనాల ప్రకారం, మెస్సీయ చనిపోయి పునరుత్థానుడు కావాలి, అప్పుడు ఆయన లోబరచుకొనుటకు తండ్రి తన్ను పంపించు పర్యంతము దేవుని కుడిపార్శ్వాన ఆయన కూర్చోవాలి. (కీర్తన 110:1, 2) తన తండ్రి కుడిపార్శ్వాన కూర్చుంటానని యేసు తనకు తానుగా చెప్పాడు. (మార్కు 14:62) అంతేకాదు, పునరుత్థానుడైన యేసు యెహోవా కుడిపార్శ్వాన ఆసీనుడై తాను రాజు కాగల సమయం కొరకు వేచియున్నాడని, ఆ తర్వాత ఆయన దేవుని తీర్పరిగా పనిచేస్తాడని అపొస్తలుడైన పౌలు ధృవీకరించి చెప్పాడు.—రోమీయులు 8:34; కొలొస్సయులు 3:1; హెబ్రీయులు 10:12, 13.

18, 19. సువార్తల్లోని సమాంతర ప్రవచనాల నెరవేర్పును గూర్చి ప్రకటన 6:2-8లో ఏ విషయం ఉంది?

18 యుగసమాప్తిని గూర్చి యేసు చెప్పిన ప్రవచనం మొదటి శతాబ్దం తర్వాత కూడ అన్వయిస్తుందనడానికి గల నాల్గవది, చివరిదైన రుజువు కొరకు మనం ప్రకటన 6వ అధ్యాయంవైపు దృష్టిని మళ్లిద్దాం. యెరూషలేము నాశనమైన దశాబ్దాల తర్వాత రాస్తూ, అపొస్తలుడైన యోహాను స్వారీచేస్తున్న గుర్రపు రౌతులను గూర్చిన ఆకట్టుకునే దృశ్యాన్ని వర్ణించాడు. “ప్రభువు దినాన్ని” గూర్చిన ఈ ప్రవచనార్థక దృశ్యం—ఆయన ప్రత్యక్షత కాలం—మన 20వ శతాబ్దాన్ని అధిక యుద్ధాలు, (4వ వచనం) విస్తారమైన కరవులు (5, 6 వచనాలు), ‘మరణకరమగు తెగుళ్లు’ (8వ వచనం) ఉండే కాలమని సూచిస్తోంది. స్పష్టంగా, యిది సువార్తల్లో యేసు ప్రవచించిన సంగతులకు సమాంతరంగా ఉండి, యేసు చెప్పిన ప్రవచనం ‘ప్రభువు దినమందు’ మరిగొప్పగా నెరవేరుతుందని నిరూపిస్తోంది.—ప్రకటన 1:10.

19 విషయ పరిజ్ఞానంగల ప్రజలు మత్తయి 24:7-14 మరియు ప్రకటన 6:2-8 నందు ప్రవచింపబడిన సంయుక్త సూచన, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పటి నుండి మన కాలంలో కనబడుతూనే ఉన్నాయని అంగీకరిస్తున్నారు. క్రూరమైన యుద్ధాలు, వినాశకర భూకంపాలు, విలయతాండవం చేస్తున్న కరవులు, భయంకర రోగాలు నిరూపిస్తున్నట్లుగా యేసు చెప్పిన ప్రవచనం ఈ కాలమందే నెరవేరుతోందని యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటించారు. వాటిలో చివరి విషయంపై యు.ఎస్‌. న్యూస్‌ & వరల్డ్‌ రిపోర్ట్‌ (జూలై 27, 1992) యిలా చెప్పింది: “లక్షలాది మంది మరణానికి కారణమౌతున్న ఎయిడ్స్‌ తెగులు . . . త్వరలో చరిత్రలోనే అత్యంత విపత్కరమైన వినాశకరమైన తెగులు కాగలదు. పధ్నాల్గవ శతాబ్దంలో ప్లేగువ్యాధి ప్రబలి 2 కోట్ల 50 లక్షల మంది ప్రాణాల్ని బలిగొంది. అయితే ఎయిడ్స్‌కు కారణమైన HIV వైరస్‌ సోకిన నేటి 1 కోటి 20 లక్షలమంది ఎయిడ్స్‌ రోగులు, 2000 సంవత్సరం నాటికి 3 కోట్లనుండి 11 కోట్లమంది అవుతారు. చికిత్స లేనందువల్ల, వారంతా నిశ్చయంగా మరణిస్తారు.”

20. మత్తయి 24:4-22 యొక్క ప్రాథమిక నెరవేర్పు ఎలా జరుగుతుంది, అయితే ఏ యితర నెరవేర్పు స్పష్టమౌతుంది?

20 కాబట్టి, అపొస్తలులు అడిగిన ప్రశ్నకు యేసు యిచ్చిన జవాబును గూర్చి మనమే నిర్ణయానికి రావాలి? ఆయన ప్రవచనం యెరూషలేము నాశనమూ దానికి నడిపిన సంఘటనల్నీ, సా.శ. 70 తర్వాత జరిగిన కొన్ని సంగతుల్ని కచ్చితంగా ముందే తెలియజేసింది. అయితే ఆయన పలికిన అనేక మాటలు ఎంతోకాలం తర్వాత మరిగొప్ప నెరవేర్పును కలిగియుండి, ప్రస్తుత దుష్టవిధానాన్ని అంతమొందించే మహాశ్రమలతో ముగుస్తాయి. మరో మాటలో చెప్పాలంటే, మత్తయి 24:4-22 ఆలాగే మార్కు, లూకాల్లో వ్రాయబడిన సమాంతర వృత్తాంతాల్లో యేసు పలికిన ప్రవచన వాక్యాలు సా.శ. 33 నుండి సా.శ. 70లో సంభవించిన శ్రమ వరకు నెరవేరాయి. అయితే అవే వచనాలు యెరూషలేము నాశనం తర్వాత చాలా కాలానికి మహాశ్రమలతో సహా రెండవది, మరిగొప్పదైన నెరవేర్పును కలిగివుంటాయి. ఈ గొప్ప నెరవేర్పు మనకాలంలో జరుగుతుంది; దాన్ని మనం మన దైనందిన జీవితాల్లో చూడగలము.f

దేనికి నడిపిస్తుంది?

21, 22. మరికొన్ని సంఘటనలు జరగాలనే ప్రవచనార్థక సూచనను మనం ఎక్కడ కనుగొనగలం?

21 ‘అన్యజనముల కాలములు సంపూర్ణమగు’ ఆ దీర్ఘకాలంలో మోసపూరిత సూచనలు జరిగించు అబద్ధ ప్రవక్తలు ఉంటారనే ప్రస్తావనతో యేసు తన ప్రవచనాన్ని ముగించలేదు. (లూకా 21:24; మత్తయి 24:23-26; మార్కు 13:21-23) భూవ్యాప్తంగా గమనించదగు, గగుర్పాటు కల్గించు యితర సంగతులను కూడా ఆయన తెల్పాడు. మనుష్యకుమారుడు మహాశక్తితోను, మహిమతోను రావడంతో సంబంధం కల్గివుంటాయి. యేసు యింకా చెప్పిన ప్రవచనానికి మార్కు 13:24-27 అద్దం పడుతోంది:

22 “ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగుచేయించును.”

23. సా.శ. మొదటి శతాబ్దం గతించి యింతకాలం తర్వాత మత్తయి 24:29-31 నెరవేర్పుకొరకు మనం ఎందుకు ఎదురు చూడగలం?

23 సా.శ. 70లో యూదా మతవిధానం నాశనంచేయబడి అంతమైనప్పుడు మనుష్యకుమారుడగు, పునరుత్థానుడైన యేసుక్రీస్తు అలా మహా ప్రభావంతో రాలేదు. నిశ్చయంగా, మత్తయి 24:30 చెప్పినట్లుగా, భూమ్మీది సకల గోత్రములవారు ఆయనను గుర్తించలేదు, లేక అప్పుడు పరలోకపు దూతలు యావత్‌ భూమినుండి అభిషక్త క్రైస్తవులను సమకూర్చనూ లేదు. కాబట్టి, యేసు పలికిన ఈ అదనపు మహత్తర ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? ప్రస్తుతం మనచుట్టూ జరుగుతున్న సంఘటనలందు అది నెరవేరుతోందా, అలాకాకుండ సమీప భవిష్యత్తులో మనమపేక్షించగల సంగతులందు అది మనకు దైవిక పరిజ్ఞానం కలుగజేస్తుందా? మనం ఈ విషయాల్ని తప్పక తెలుసుకోవాలని కోరుకుంటాము. ఎందుకంటే, యేసు ఉద్బోధను లూకా యిలా రాశాడు: “ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నది.”—లూకా 21:28.

[అధస్సూచీలు]

a ఈ అధ్యాయాల్లోని భాగాలు 14, 15 పేజీల్లో ఉన్న పట్టికలో కనబడతాయి; చుక్కల గీతలు సమాంతర భాగాలను సూచిస్తున్నాయి.

b ఈ సంఘటనలను గూర్చి చారిత్రాత్మక రుజువుకొరకు, ది వాచ్‌టవర్‌ జనవరి 15, 1970 పత్రికలోని 43-5 పేజీలు చూడండి.

c మత్తయి నందు టొటె 80 కంటే ఎక్కువ సార్లు, (24వ అధ్యాయంలో 9 సార్లు) లూకాలో 15 సార్లు కనిపిస్తుంది. మార్కు టొటెను ఆరుసార్లే ఉపయోగించాడు, అయితే వీటిలో నాలుగు “సూచనల”తో జోడించి వాడాడు.

d ఆంగ్ల రచయిత మాథ్యూ హెన్రీ యిలా వ్యాఖ్యానించాడు: “కల్దీయులు యెరూషలేమును నాశనం చేయడం మహా భయంకరంగా ఉండెను, అయితే యిది దానిని మించిపోయింది. ఇది ప్రపంచమందలి యూదులందరూ సంహరించబడతారనే . . . భయాన్ని కల్గించింది.”

e అనేకులు లూకా వ్రాసిన వృత్తాంతంలో లూకా 21:24 తర్వాత మరో విషయంపై అవధానమివ్వడాన్ని గమనిస్తారు. డా. లియాన్‌ మారిస్‌ యిలా అన్నారు: “యేసు అన్యరాజుల కాలాన్ని గూర్చి మాట్లాడసాగాడు. . . . అనేక విధ్వాంసుల ప్రకారం, మనుష్యకుమారుని రాకడవైపుకు అవధానం మారుతుంది.” ప్రొఫెసర్‌ ఆర్‌. జిన్స్‌ యిలా రాశాడు: “మనుష్యకుమారుని రాకడ—(మత్తయి 24:29-31; మార్కు 13:24-27). ‘అన్యరాజులకాలం’ యొక్క ప్రస్తావన యీ అంశానికి ఉపోద్ఘాతాన్ని అందిస్తుంది; యిప్పుడు [లూకా] దృష్టి యెరూషలేము వినాశనానికి ఎంతో ముందు భవిష్యత్తుకు కొనిపోబడింది.”

f ప్రొఫెసర్‌ వాల్ట్‌ర్‌ ఎల్‌. లీఫీల్డ్‌ యిలా రాస్తున్నాడు: “యేసు ప్రవచనాలు రెండు దశలను కల్గి ఉన్నాయని ఊహించడానికి సులభంగానే ఉంది: (1) సా.శ. 70లో ఆలయాన్ని గూర్చిన సంఘటన (2) ప్రవచనాత్మకంగా వర్ణించబడిన భవిషత్‌ సంఘటనలు.” ఆర్‌. డ్యుమెల్లో ప్రచురించిన కామెంటరి యిలా అంటోంది: “ప్రభువు ఒకటి కాదు రెండు సంఘటనలను గూర్చి చెబుతున్నాడనీ, మరి మొదటిది రెండవదానికి సారూప్యం కల్గివుందని తెలుసుకోవడం ఈ ప్రసంగంలోని కష్టతరమైన వాటిని కనుమరుగు చేస్తుంది. . . . [లూకా] 21:24, ‘అన్య రాజుల కాలాన్ని’ గూర్చి మాట్లాడేటప్పుడు ప్రత్యేకంగా . . . యెరూషలేము నాశనానికి, లోకాంతానికి మధ్య అనిర్ణీత కాలపరిమాణాన్ని ఉంచుతుంది.”

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

◻ మత్తయి 24:3 నందున్న ప్రశ్నకు యేసు యిచ్చిన జవాబు సా.శ. 70 వరకు కొనసాగే ఎలాంటి నెరవేర్పును కల్గివుంది?

◻ టొటె అనే పదం వాడుక, యేసు ప్రవచనాన్ని సంపూర్తిగా అర్థం చేసుకోడానికి ఎలా సహాయపడుతుంది?

◻ అంతకు ముందెన్నడూ సంభవించని “మహాశ్రమ” మొదటి శతాబ్దమందు ఏ భావంలో కలిగింది?

◻ యేసు ప్రవచనాల్లో మనలను యిమిడ్చే ఏ ప్రత్యేకమైన రెండు విషయాలను లూకా పేర్కొన్నాడు?

◻ మత్తయి 24:4-22 నందున్న ప్రవచనపు రెండవ నెరవేర్పునూ, మరి గొప్ప నెరవేర్పునూ ఏది సూచిస్తుంది?

[14, 15వ పేజీలోని చిత్రం]

మత్తయి 24

4“యేసు వారితో ఇట్లనెను—‘ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. 5అనేకులు నా పేరట వచ్చి—“నేనే క్రీస్తునని” చెప్పి పలువురిని మోసపరచెదరు. 6మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నది గాని అంతము వెంటనే రాదు.

7“‘జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. 8అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును. ఇవన్నియు వేదనలకు ప్రారంభము.

9“‘అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. 10(అప్పుడు NW) అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. 11 అనేకులనైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసరపరచెదరు; 12అక్రమము విస్తరించుటచేత అనేకులు ప్రేమ చల్లారును. 13అంతమువరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. 14మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటు తరువాత అంతము వచ్చును.

-----------------------------------------------------------

15“‘కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే—చదువువాడు గ్రహించుగాక—16(అప్పుడు NW) యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. 17మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; 18పొలములో ఉండువాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. 19అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. 20అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. 21లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు. 22ఆ దినములు తక్కువ చేయబడక పోయినయెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచబడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును.

-----------------------------------------------------------

23“‘ఆ (అప్పుడు NW) కాలమందు ఎవడైనను—ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. 24అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. 25ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. 26కాబట్టి ఎవరైనను—ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడి—ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి 27మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. 28పీనుగు ఎక్కడ ఉన్నదే అక్కడ గద్దలు పోగవును.

-----------------------------------------------------------

-----------------------------------------------------------

29“‘ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. 30అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమి మీదనున్న సకల గోత్రములవారు రొమ్ముకొట్టుకొందురు. 31మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు.’”

మార్కు 13

5“యేసు వారితో ఇట్లు చెప్పసాగెను—‘ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి. 6అనేకులు నా పేరట వచ్చి—“నేనే ఆయననని” చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. 7మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు వినునప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.

8“‘జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము.

9“‘మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడెదరు. 10సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. 11వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు—ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; 12సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు; 13నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.

-----------------------------------------------------------

14“‘మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు—చదువువాడు గ్రహించుగాక—(అప్పుడు NW) యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; 15మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసుకొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు; 16పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు. 17అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ. 18అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. 19అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు. 20ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించుకొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.

-----------------------------------------------------------

21“‘కాగా (అప్పుడు NW)—ఇదిగో క్రీస్తు ఇక్కడనున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి. 22ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచకక్రియలను మహత్కార్యములను అగపరచెదరు. 23మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పియున్నాను.

-----------------------------------------------------------

-----------------------------------------------------------

24“‘ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములను రాలును, 25ఆకాశమందలి శక్తుల కదలింపబడను. 26అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. 27అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును.’”

లూకా 21

8“ఆయన—‘మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి—“నేనే ఆయన”ననియు, “కాలము సమీపించె”ననియు చెప్పుదురు; మీరు వారి వెంబడి పోకుడి 9మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి; ఇవి మొదట జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను.

10“మరియు (అప్పుడు NW) ఆయన వారితో ఇట్లనెనను—‘జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును; 11అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరువులును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాతములను గొప్ప సూచనలును పుట్టును.

12“‘ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతులయొద్దకును తీసికొనిపోయి, సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. 13ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. 14కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. 15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 16తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; 17నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు. 18గాని మీ తలవెండ్రుకలలో ఒక్కటైనను నశింపదు. 19మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

-----------------------------------------------------------

20“‘యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. 21అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు. 22లేఖనములలో వ్రాయబడినవన్నియు నెరవేరుటకై అవి ప్రతిదండనన దినములు. 23ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును. 24వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడినవారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు;

-----------------------------------------------------------

అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును.

-----------------------------------------------------------

-----------------------------------------------------------

25“‘మరియు సూర్య చంద్ర నక్షత్రములో సూచనలును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. 26ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. 27అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. 28ఇవి జరుగ నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీంచుచున్నదనెను.’”

[10వ పేజీలోని చిత్రం]

సా.శ. 70లో సంభవించిన మహాశ్రమ యెరూషలేము, యూదా జనాంగము అంత వరకూ అనుభవించిన వాటిలోకెల్లా అతి భీకరమైంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి