అపాయకరమైన మనకాలానికి సహాయకరమైన బోధ
“అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. అయితే దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు.”—2 తిమోతి 3:1, 13.
1, 2. మనం ఏ బోధలను అనుసరిస్తున్నామో అన్న విషయంలో ఎందుకు ఆసక్తిని కల్గివుండాలి?
మీకు సహాయం దొరుకుతోందా లేక మీకు హాని కలుగుతోందా? మీ సమస్యలు పరిష్కరించబడుతున్నాయా లేక మరింత విషమిస్తున్నాయా? దేనివల్ల విషమిస్తున్నాయి? బోధల వల్లనే. అవును, మంచికేగాని చెడుకేగానీ బోధలు మీ జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేయగలవు.
2 ఈ విషయాన్ని ముగ్గురు ప్రొఫెసర్లు యిటీవల పరిశోధించి తాము కనుగొన్నవాటిని జర్నల్ ఫర్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ రెలిజియన్‌లో ప్రచురించారు. నిజమే, వారు మిమ్మల్నిగానీ మీ కుటుంబాన్నిగానీ వ్యక్తిగతంగా పరిశీలించి ఉండకపోవచ్చు. అయినా, వారు కనుగొన్నది, బోధలకూ ఓ వ్యక్తి మన అపాయకర కాలాన్ని ఎదుర్కోవడంలో పొందిన జయాపజయాలకూ మధ్య సంబంధం ఉందని చూపుతోంది. మా తదుపరి శీర్షికలో వారు కనుగొన్న విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావిస్తాము.
3, 4. మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నామనడానికి కొన్ని రుజువులేవి?
3 అయితే, మొదట ఈ ప్రశ్నను పరిశీలించండి: మనం అపాయకరమైన కాలంలో జీవిస్తున్నామని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నట్లయితే, తప్పకుండా యివి “అపాయకరమైన కాలము”లేనని రుజువులు నిరూపిస్తున్నట్లుగా మీరు చూస్తారు. (2 తిమోతి 3:1-5) ప్రజలు ప్రభావితం చెందే విధాలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు, ప్రస్తుతం విభిన్న ముఠా రాజకీయ అధీనం కొరకు పోటీపడుతున్న నేపధ్యంలో విభాగించబడిన అనేక దేశాలు బహుశా మీకు తెలిసే ఉండవచ్చు. మరో ప్రాంతంలో, మతపరమైన లేక జాతిపరమైన విభేదాలవలన హత్యలు జరుగుతున్నాయి. హాని కలిగేది సైనికులకు మాత్రమే కాదు. లెక్కకుమించిన మహిళలూ అమ్మాయిలు క్రూరంగా హింసించబడ్డం లేదా ఆహారం, వెచ్చదనం, ఆశ్రయం లేని వృద్ధులను గూర్చి ఆలోచించండి. లెక్కలేనంత మంది ప్రజలు ఎంతో బాధననుభవిస్తున్నారు, తద్వారా శరణార్థులు వారికి సంబంధించిన బాధల సంఖ్య పెరగడానికి కారణమౌతోంది.
4 ఆర్థిక సమస్యలతో కూడా మన కాలం గుర్తించబడడంతో. మూతబడ్డ కర్మాగారాలు, నిరుద్యోగం, కోల్పోయిన ఉద్యోగ ప్రయోజనాలూ పెన్షన్లు, ద్రవ్యోల్భణం, కొదువైన లేదా కొద్దిపాటి ఆహారానికి కారణమైంది. ఈ సమస్యల జాబితాకు మీరు మరికొన్ని చేర్చగలరా? బహుశా చేర్చగలరు. భూవ్యాప్తంగా మరికొన్ని లక్షల మంది ప్రజలు ఆహార కొరత, వ్యాధులవల్ల బాధపడుతున్నారు. తూర్పు ఆఫ్రికాలో కృశించిపోతున్న స్త్రీపురుషుల, పిల్లల దారుణమైన ఫోటోలను బహుశ మీరు చూసి ఉండవచ్చు. అలాగే ఆసియాలోని లక్షలాది మంది బాధపడుతున్నారు.
5, 6. మన అపాయకర కాలాల్లో కలవరపర్చే వాటిలో వ్యాధి కూడా ఒకటని ఎందుకు చెప్పవచ్చు?
5 నేడు పెరిగిపోతున్న భయోత్పాత వ్యాధులను గూర్చి మనమందరమూ విన్నాం. జనవరి 25, 1993లో ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక యిలా పేర్కొంది: “లైంగిక మిశ్రత్వం, వేషధారణ, అస్తవ్యస్త నివారణల నడుమ వర్థిల్లుతున్న లాటిన్ అమెరికాలోని ఎయిడ్స్ మహమ్మారి, అమెరికాలోని తీవ్రతను అధిగమించబోతోంది. . . . దీని అధిక పెరుగుదలకు కారణం మహిళల్లో . . . ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువౌతున్నందువల్లనే.” అక్టోబరు 1992లో యు.ఎస్.న్యూస్ ఆండ్ వరల్డ్ రిపోర్ట్ యిలా చెప్పింది: “ముందు జరిగినవాటిలోకెల్లా విజయవంతమైన ఓ ప్రజా ఆరోగ్యకార్యక్రమాన్ని మెచ్చుకుంటూ యిది ‘అంటువ్యాధులకు యిక వీడ్కోలు’ పలికే సమయం అని అమెరికాకు చెందిన ఓ సర్జన్ జనరల్ కేవలం రెండు దశకాల ముందు ప్రకటించాడు.” నేటి మాటేమిటి? “ఒకనాడు జయించబడ్డాయి అని తలంచిన వ్యాధులున్న వారితో యిప్పుడు ఆసుపత్రులు నిండివున్నాయి. . . . సూక్ష్మజీవులు మునుపెన్నడూ లేనంత తెలివైన జన్యువ్యూహాలు ఉద్భవింపజేస్తున్నాయి, అవి క్రొత్త ఆంటీబయటిక్‌లకంటే వేగంగా సూక్ష్మజీవులు పెరిగేలా చేస్తున్నాయి. . . . ‘అంటువ్యాధి గల ఓ క్రొత్త యుగంలోనికి మనం ప్రవేశించబోతున్నాము.’”
6 ఓ ఉదాహరణగా జనవరి 11, 1993, న్యూస్‌వీక్‌లో యిలా నివేదించింది: “మలేరియా పరాన్నజీవులు ప్రస్తుతం ప్రతి సంవత్సరం 27 కోట్ల మంది ప్రజలకు సోకి, షుమారు 20 లక్షల మంది ప్రజలను హతమారుస్తూ . . . కనీసం 10 కోట్ల మందిని తీవ్ర అస్వస్థతలకు గురిచేసిందని అంచనా వేయబడింది. . . . అదే సమయంలో, ఒకప్పుడు నయం చేయగల్గిన మందులకు కూడా ఈ వ్యాధి మరింతగా తట్టుకుంటోంది. . . . అతి తొందర్లోనే కొన్ని రోగలక్షణాలకు చికిత్సే లేకుండాపోతుంది.” మిమ్మల్ని వణికిస్తుంది.
7. కష్టతరమైన కాలాలకు అనేకులు ఎలా ప్రతిస్పందిస్తున్నారు?
7 ఈ అపాయకర కాలాల్లో, అనేకులు తమ సమస్యలకు పరిష్కారాన్ని వెదుకుతున్నట్లు మీరు గమనించి ఉండవచ్చు. ఒత్తిడిని లేదా క్రొత్త వ్యాధులను ఎదుర్కోవడం కొరకు ఎన్నో పుస్తకాలను తిరగేసే వారిని గూర్చి ఆలోచించండి. మరి కొందరు, విఫలమౌతున్న వివాహం, పిల్లలపై శ్రద్ధ, సురాపానం లేక మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమస్యలు లేదా వారి ఉద్యోగ కోరికలకూ యింట్లో తాము అనుభవించే ఒత్తిళ్లకూ మధ్య సమతూకం ఎలా ఏర్పర్చుకోవాలనే వాటిపై సలహాకొరకు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. అవును, వారికి నిజంగానే సహాయం కావాలి! మీరు వ్యక్తిగత సమస్యతో పెనుగులాడుతున్నారా లేక యుద్ధం, కరువు, విపత్తులవల్ల కలిగిన శ్రమల్లో కొన్నింటిని అనుభవిస్తున్నారా? ఒక తీవ్రమైన సమస్యకు పరిష్కారం లభించనట్లు, కన్పించినా ‘మనం ఈ దుస్థితికి ఎందుకు చేరుకున్నాం?’ అని మీరు ప్రశ్నించడానికి కారణం ఉంది.
8. వివేకానికి, నడిపింపుకు మనం బైబిలు తట్టు ఎందుకు తిరగాలి?
8 ప్రస్తుతం, మనం జీవితంతో విజయవంతంగా వ్యవహరించి, భవిష్యత్తులో సంతృప్తిని కనుగొనే ముందు ఈ అపాయకర కాలాన్ని ఎందుకు ఎదుర్కొంటున్నాం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సూటిగా చెప్పాలంటే, మనలో ప్రతి ఒక్కరం బైబిలును పరిశీలించడానికి అది ఓ కారణాన్ని అందిస్తుంది. మనం ఎందుకు బైబిలునే సూచిస్తున్నాం? ఎందుకంటే కేవలం అది మాత్రమే మన దురవస్థకు గల కారణాన్ని, అలాగే మనం ఎటు పోతున్నాం ఎక్కడున్నాం అన్న విషయాన్ని చూపే సరైన ప్రవచనాలనూ ముందుగా రాసిన చరిత్రను కల్గివుంది.
చరిత్రనుండి ఓ పాఠం
9, 10. మత్తయి 24వ అధ్యాయంలోని యేసు ప్రవచనం మొదటి శతాబ్దంలో ఎలా నెరవేరింది?
9 ఫిబ్రవరి 15, 1994 కావలికోట మత్తయి 24వ అధ్యాయంలో యేసు చెప్పిన స్పష్టమైన ప్రవచనాల పునఃసమీక్షను అందించింది. మీరు మీ బైబిలును ఆ అధ్యాయానికి తెరిస్తే, 3వ వచనంలో యేసు అపొస్తలులు ఆయన భవిష్యత్ ప్రత్యక్షతకు, ఈ యుగ సమాప్తికి సూచనలేమిటని అడగడాన్ని మీరు చూడగలరు. తర్వాత, 5 నుండి 14 వచనాల్లో, అబద్ధ క్రీస్తులు యుద్ధాలు ఆహారకొరతలు, క్రైస్తవులను హింసించడం, అక్రమం, దేవుని రాజ్యాన్ని గూర్చిన విస్తృత ప్రకటనను గూర్చి యేసు ప్రవచించాడు.
10 ఆ విషయాలన్నీ యూదా విధానాంత సమయంలో జరిగాయని చరిత్ర రుజువు చేస్తోంది. ఒకవేళ మీరప్పుడు జీవించి ఉంటే, అవి కష్టతరమైన రోజులైవుండేవి కావా? అయితే, ఆ కాలంలో విషయాలు అంతం వైపుకు పయనిస్తున్నాయి, అంటే యెరూషలేముపైన యూదా విధానంపైన క్రితమెన్నడూ లేనటువంటి శ్రమ ప్రారంభం కాబోతోంది. పదిహేనవ వచనమందు, సా.శ. 66లో రోమా సైన్యాలు యెరూషలేమును ముట్టడించిన తర్వాత జరిగిన వాటిని గూర్చి మనం చదువుతాం. యేసు 21వ వచనంలో ప్రస్తావించిన సంఘటనలు, అంటే సా.శ. 70లో యెరూషలేము నాశనం, అలాగే దానికి సంభవించాల్సిన అపూర్వమైన శ్రమ ముగింపుకొచ్చాయి. అయినప్పటికి, చరిత్ర అంతటితో అంతం కాలేదనీ లేదా అది అంతమౌతుందని యేసు చెప్పలేదనీ మీకు తెలుసు. సా.శ. 70లో జరిగిన శ్రమ తర్వాత యితర సంఘటనలు సంభవిస్తాయని ఆయన 23, నుండి 28 వచనాల్లో చూపించాడు.
11. మత్తయి 24వ అధ్యాయ మందలి సంగతుల మొదటి శతాబ్దంలోని నెరవేర్పు మన కాలానికి ఏ విధంగా వర్తిస్తుంది?
11 గతంలోని ఆ విషయాలను, ‘అయితే దానికంత ప్రాముఖ్యతను ఎందుకివ్వాలి’ అని కొందరు ఈనాడు కొట్టివేయాలని ఉద్దేశిస్తారు. అలా చేయడం పొరపాటు. అప్పట్లో నెరవేరిన ఆ ప్రవచనం ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకు? యూదా విధానాంత కాలంలో సంభవించిన యుద్ధాలు, కరువులు, భూకంపాలు, వ్యాధులు, హింస, యివన్నీ “అన్యరాజుల కాలములు” 1914లో తర్వాత మరింత గొప్ప నెరవేర్పును సూచించాలి. (లూకా 21:24) నేడు జీవించేవారిలో, ఈ ఆధునిక నెరవేర్పు ప్రారంభాన్ని అంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని కళ్లారా చూసిన సాక్షులనేకులున్నారు. అయితే మీరు 1914 తర్వాత జన్మించినప్పటికీ, యేసు ప్రవచనం నెరవేరడాన్ని చూశారు. ఈ 20వ శతాబ్ద సంఘటనలు, ప్రస్తుత మనం విధానాంతంలో జీవిస్తున్నామని ఆశ్చర్యకరంగా రుజువు చేస్తున్నాయి.
12. యేసు తెల్పిన ప్రకారం మనం యింకా ఏమి చూడ్డానికి అపేక్షించవచ్చు?
12 అంటే మత్తయి 24:29 లో పేర్కొన్న “శ్రమ” మన ముందుందని దాని భావం. దానిలో ఊహింపనలవికాని అంతరిక్ష సంభ్రమాశ్చర్య సంఘటన యిమిడి ఉంది. నాశనం సమీపంలో ఉందని చూపే సూచనను అప్పటి ప్రజలు చూస్తారని 30వ వచనం చూపుతోంది. లూకా 21:25-28 నందలి సమాంతర దృష్టాంతం ప్రకారం, ఆ భవిష్యత్ కాలంలో ‘భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుతారు.’ అంతేకాకుండా క్రైస్తవులు తమ విడుదల సమీపంగా ఉందని తెలుసుకొని తమ తలలెత్తుకుంటారని కూడా లూకా వృత్తాంతం చెబుతోంది.
13. ఏ రెండు ముఖ్యాంశాలకు మనం అవధానమివ్వాల్సివుంది?
13 ‘సరే దాన్ని నేను ఒప్పుకుంటున్నాను గానీ, మన అపాయకర పరిస్థితులను నేను ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదే వివాదాంశమని నేను అనుకున్నాను’ అని మీరనవచ్చు. సరిగ్గా చెప్పారు. ముఖ్యమైన సమస్యలను మనం గుర్తించి వాటిని మనం ఎలా నివారించగలమన్నదే మన మొదటి అంశం. నేడు మనం శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించడానికి లేఖనాధారమైన బోధ మనకు ఎలా సహాయం చేయగలదన్న దానికి సంబంధించిన రెండవ అంశం. ఈ నేపధ్యంలో, మీ బైబిలును 2 తిమోతి 3వ అధ్యాయానికి తెరిచి, కష్టతరమైన కాలాలను ఎదుర్కోడానికి అపొస్తలుడైన పౌలు మాటలు మీకు ఎలా ఉపయోగపడగలవన్నది చూడండి.
మన కాలాన్ని గూర్చిన ప్రవచనం
14. రెండవ తిమోతి 3:1-5ను పరిశీలించడం మనకు ప్రయోజనకరమని నమ్మడానికి కారణం ఎందుకు ఉంది?
14 యథార్థ క్రైస్తవుడైన తిమోతి మరింత విజయవంతమైన, సంతోషదాయకమైన జీవితాన్ని జీవించడానికి సహాయపడిన ఎంతో చక్కని సలహాను రాయడానికి దేవుడు పౌలును ప్రేరేపించాడు. పౌలు రాసినదానిలో కొంత భాగం మన దినాలకు ముఖ్య అన్వయింపును కల్గివుంది. అవి మీకు బాగా తెలుసని మీరు భావించినా, 2 తిమోతి 3:1-5 లో ఉన్న ప్రవచనార్థక మాటలను ప్రస్తుతం గమనించండి: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తలిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞతలేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.”
15. ప్రస్తుతం మనకు 2 తిమోతి 3:1 ఎందుకు ప్రత్యేక ఆసక్తిని కల్గివుంది?
15 అక్కడ ప్రస్తావించినవాటిలో 19 విషయాలున్నాయని దయచేసి గమనించండి. మనం వీటిని పరిశీలించి, వాటినుండి ప్రయోజనం పొందే స్థితికి వచ్చే ముందు ఓ క్షణం ఆగి ఆ ప్రవచనం మొత్తాన్ని ఓ మారు అర్థం చేసుకుందాం. మొదటి వచనాన్ని చూడండి. పౌలు యిలా ప్రవచించాడు: “అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును.” ఏమిటా “అంత్యదినాలు?” పురాతన పొంపైకు వచ్చిన అంత్యదినాలు లేక ఓ రాజు లేక ఓ రాజవంశానికి వచ్చిన అంత్యదినాలు వంటి ఎన్నో అంత్యదినాలు వచ్చి వెళ్లాయి. బైబిలు కూడా యూదా విధానాంత దినాల వంటి అంత్యదినాలను ప్రస్తావిస్తోంది. (అపొస్తలుల కార్యములు 2:16, 17) అయినప్పటికీ, పౌలు ప్రస్తావించిన “అంత్యదినములు” మన కాలాన్ని సూచిస్తున్నాయని అర్థం చేసుకోడానికి యేసు ఆధారాన్నిచ్చాడు.
16. గోధుమలు గురుగుల ఉపమానం మన కాలంలోని ఏ పరిస్థితిని ముందుగా చెప్పింది?
16 యేసు దాన్ని గోధుమలూ గురుగుల ఉపమానంతో చూపాడు. ఇవి ఓ పొలంలో విత్తబడి మొలకెత్తడానికి విడువబడ్డాయి. గోధుమలూ గురుగులూ ప్రజలను, అంటే నిజక్రైస్తవులనూ అబద్ధ క్రైస్తవులనూ సూచిస్తాయని ఆయన అన్నాడు. ఈ ఉపమానాన్ని మేము ప్రస్తావించడానికి కారణం, ఈ విధానాంతానికి ముందు దీర్ఘకాలం గడుస్తుందని అది స్థిరపరుస్తుంది. ఆ అంతానికి చేరుకున్నప్పుడు, ఏదొకటి వర్థిల్లుతూ ఉంటుంది. ఏమిటది? మత భ్రష్టత్వం, లేక నిజ క్రైస్తవత్వం నుండి ప్రక్కకు మరలడం ఫలితంగా దుష్టత్వపు కోత మహా విస్తారమౌతుంది. ఇది దుష్టవిధానాంతంలో జరుగుతుందని యితర బైబిలు ప్రవచనాలు రూఢిపరుస్తున్నాయి. అయితే యిక్కడే, అంటే ఈ దుష్టవిధానాంతంలోనే మనం ఉన్నాం.—మత్తయి 13:24-30, 36-43.
17. విధానాంతాన్ని గూర్చి 2 తిమోతి 3:1-5 ఏ సమాంతర సమాచారాన్ని మనకు అందజేస్తోంది?
17 దాని ప్రాముఖ్యతను మీరు గమనించారా? ఈ విధానాంతంలో లేక అంత్యదినాల్లో, క్రైస్తవుల చుట్టూ సంభవించే ఫలితాలు చాలా చెడుగా మారతాయని 2 తిమోతి 3:1-5 మనకో సమాంతర సూచనను యిస్తోంది. తాను ప్రస్తావించిన 19 విషయాలే అంత్యదినాలను గుర్తించడానికి ముఖ్యమైన మార్గం అని పౌలు చెప్పలేదు. బదులుగా, అంత్యదినాల్లో మనం దేనితో పోరాడాలో అనే విషయాన్ని గూర్చి హెచ్చరిస్తున్నాడు. మొదటి వచనం “అపాయకరమైన కాలములను” గూర్చి మాట్లాడుతోంది. ఇది గ్రీకు నుండి వచ్చిన పదం, “నిర్ణీత కాలాలు భయానకంగా ఉంటాయి” దాని అక్షరార్థ భావం. (కింగ్‌డమ్ ఇంటర్లీనర్) “భయానకం” అనే పదం, నేడు మనం ఎదుర్కొంటున్నవాటిని సరిగ్గా వివరిస్తున్నట్లుందని మీరు ఒప్పుకుంటారా? ఈ ప్రేరేపిత భాగం మన కాలాన్ని గూర్చిన దైవిక జ్ఞానాన్ని అందిస్తోంది.
18. పౌలు ప్రవచనార్థక మాటలను మనం పరిశీలించేటప్పుడు దేనిపై మన దృష్టిని సారించాలి?
18 మన కాలం ఎంత అపాయకరంగా లేక భయానకంగా ఉందన్న విషాదభరితమైన ఉదాహరణలను గుర్తించడానికి ఈ ప్రవచనంపైగల ఆసక్తి మనలను అనుమతించాలి. మనం చర్చించుకునే రెండు ముఖ్యమైన విషయాలను జ్ఞాపకం చేసుకుందాం: (1) మన కాలాన్ని అపాయకరం చేసే సమస్యలను గుర్తించి, వాటిని ఎలా నివారించాలో చూడ్డం; (2) నిజంగా ఆచరణ యోగ్యమైనవి మరియు ఓ శ్రేష్ఠమైన జీవితాన్ని జీవించడానికి మనకు సహాయపడే బోధలను అనుసరించడం. కాబట్టి మన కాలాన్ని అపాయకరం చేసే సమస్యలను నొక్కి చెప్పడానికి బదులు, ఈ అపాయకర కాలంలో మనకూ మన కుటుంబాలకు సహాయపడగల బోధపై మన అవధానాన్ని నిలుపుదాము.
గొప్ప ప్రయోజనాలను పొందండి
19. మనుష్యులు స్వార్థప్రియులనడానికి ఏ రుజువును మీరు చూశారు?
19 అంత్యదినాల్లో, “మనుష్యులు స్వార్థప్రియులు”గా ఉంటారని చెబుతూ పౌలు తన ప్రవచనా పట్టికను ప్రారంభించాడు. (2 తిమోతి 3:2) ఆయన భావమేమిటి? చరిత్రంతటిలో కూడా అహంకారులూ స్వార్థపరులైన స్త్రీపురుషులున్నారని మీరనడం సరియే. అయినా, నేడు ఈ లోపం అసహజంగా సర్వసాధారణం అయిపోయిందనడంలో ఏ సందేహమూ లేదు. కొందరిలో అది మరీ విపరీతంగా ఉంది. రాజకీయ వ్యాపార రంగంలోనైతే అది దాదాపు ఓ అలవాటైపోయింది. స్త్రీపురుషులు దేన్నైనా పణంగా పెట్టి అధికారాన్ని, పేరును సంపాదిస్తారు. సాధారణంగా అది యితరులకు ఏమైనాగానీ అలాంటి స్వార్థపరులు తాము యితరులకు ఎలా హాని కల్గిస్తున్నామన్న విషయాన్ని పట్టించుకోరు. వారు యితరులపై చట్టపర చర్యలు తీసుకోడానికి లేదా మోసం చేయడానికి వెనుకాడరు. అనేకులు దీన్ని “స్వార్థపూరిత తరం” అని ఎందుకంటారో మీరు గ్రహించగలరు. క్రమశిక్షణలేని వారూ గర్విష్టులూ పెచ్చుపెరుగుతున్నారు.
20. స్వార్థపర స్వభావానికి బైబిలు సలహా ఎలా భిన్నంగా ఉంది?
20 “స్వార్థప్రియు”లైన ప్రజలతో మనం వ్యవహరించేటప్పుడు కలిగిన అనుభవాలను వేరొకరు మనకు జ్ఞాపకం చేయనవసరంలేదు. అయినప్పటికి, ఈ సమస్యను నిక్కచ్చిగా గుర్తించడం వల్ల బైబిలు మనకు సహాయంచేస్తోందనేది వాస్తవం, కారణం, మనం ఈ ఉరిని ఎలా తప్పించుకోవాలో అది మనకు బోధిస్తోంది. అది యిలా అంటోంది: “కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.” “తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనకుడి.” ఈ అద్భుతమైన సలహా ఫిలిప్పీయులు 2:3, 4, రోమీయులు 12:3 వచనాల్లో సరిగా వ్రాయబడింది.
21, 22. (ఎ) ఈనాడు అలాంటి సలహా మనకు సహాయకరంగా ఉంటుందని ఏ విస్తృత రుజువు నిరూపిస్తోంది? (బి) సామాన్య వ్యక్తులపై దేవుని సలహా ఎలాంటి ప్రభావాన్ని కల్గివుంటుంది?
21 ‘అది బాగానే ఉంది గానీ, అది ఆచరణయోగ్యమైంది కాదు’ అని కొందరు వ్యతిరేకించవచ్చు. ఔను, యిది ఆచరణయోగ్యమైందే. నేటి సామాన్య మానవుడికి అది ఉపయుక్తం కాగలదు, అవుతుంది కూడా. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ వారి ప్రకాశకులు 1990లో ది సోసియల్ డైమెన్‌షన్స్ ఆఫ్ సెక్టేర్యనిజమ్ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఎనిమిదో అధ్యాయం, “కాథోలిక్కు దేశంలో యెహోవాసాక్షులు,” అనే శీర్షికను కల్గి, అది బెల్జియమ్‌లో జరిపిన ఓ అధ్యయనాన్ని వివరించింది. అక్కడ యిలా ఉంది: “‘సత్యం’ యెడల గల ఆకర్షణే కాకుండా, ఓ సాక్షి అవ్వాలనే సరైన ఆకర్షణతో దానికి ప్రతిస్పందించినవారు ఒకదానికంటే ఎక్కువ లక్షణాలను కొన్నిసార్లు ప్రస్తావించారు. . . . ఆప్యాయత, స్నేహ భావం, ప్రేమ, ఐక్యతలనేవి తరచూ ప్రస్తావించబడ్డాయి, అయితే సాక్షులు, ‘బైబిలు సూత్రాలను అమలుపర్చడంలో’ నిజాయితీ, వ్యక్తిగతమైన మర్యాద అనే లక్షణాలను కూడా కల్గి ఉన్నారు.”
22 మనం ఈ పరిశీలనను, ఓ పెద్ద తీసిన చిత్రంతో పోల్చవచ్చు; ఒకవేళ మీరు జూమ్ లేక టెలిఫోటో లెన్సును ఉపయోగించివుంటే దగ్గర చిత్రాన్ని, అంటే అనేక నిజజీవిత అనుభవాలను మీరు చూడగల్గేవారు. ఒకప్పుడు అహంకారంగా, అధికారం చెలాయించేవారిగా, లేక పూర్తి స్వార్థపరులుగా ఉన్నవారు యిప్పుడు యింకాస్త సాత్వికులై, మంచి భర్తలుగాను తండ్రులుగాను తమ జీవిత భాగస్వాములకూ పిల్లలకూ యితరులకు, ముందుకన్నా ఎక్కువ మృదువైన అనురాగాన్నీ, దయను చూపిస్తున్నవారు కూడా వారిలో ఉన్నారు. అంతేకాకుండా, ఒకనాడు అధికారం చెలాయించే లేక కర్కోషకులుగా ఉండే స్త్రీలు ఈనాడు, నిజక్రైస్తవత్వానికి నడిపే దారి ఏదో నేర్చుకోడానికి యితరులకు సహాయపడుతున్నవారు కూడా వీరిలోవున్నారు. అలాంటి ఉదాహరణలు కోకొల్లలున్నాయి. ఇప్పుడు మీరు దయచేసి సూటిగా చెప్పండి. అందరికంటే ముఖ్యంగా తమనే ఎక్కువగా ప్రేమించుకొనే స్త్రీపురుషుల మధ్యలో జీవించడం కంటే యిలాంటి వారితో జీవించడం శ్రేష్ఠంగా ఉంటుందని మీరనుకోరా? అది మన అపాయకరమైన కాలాన్ని ఎదుర్కోవడాన్ని సులభతరం చేయదా? అయితే అలాంటి బైబిలు బోధను అనుసరించడం మిమ్మల్ని మరింత సంతోషవంతులుగా చేయదా?
23. రెండవ తిమోతి 3:2-5కు మనం యింకా అవధానమివ్వడం ఎందుకు యోగ్యమైంది?
23 పౌలు 2 తిమోతి 3:2-5లో పేర్కొన్నవాటిలో కేవలం మొదటిదాన్నే మనం పరిశీలించాం. మిగిలినవాటి విషయమేమిటి? మీరు వాటిని జాగ్రత్తగా పరిశీలించడం, మన కాలంలోని ముఖ్యమైన సమస్యలను మీరు గుర్తించి, మీకూ మీరు ప్రేమించేవారికి అధిక ఆనందాన్ని తెచ్చే మార్గం ఏదో తెలుసుకోడానికి మీకు సహాయపడగలదా? తదుపరి శీర్షిక ఈ ప్రశ్నలకు జవాబునిస్తూ, గొప్ప ఆశీర్వాదాలను మీరు పొందడానికి సహాయపడుతుంది.
జ్ఞాపకం చేసుకోదగిన విషయాలు
◻ మనం అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నామనడానికి కొన్ని రుజువులేవి?
◻ మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామనే నిశ్చయతను మనమెందుకు కల్గివుండవచ్చు?
◻ ఏ రెండు ముఖ్యాంశాలను 2 తిమోతి 3:1-5 నుండి మనం పొందవచ్చు?
◻ అనేకులు స్వార్థప్రియులైన ఈ కాలంలో, యెహోవా ప్రజలకు బైబిలు బోధలు ఎలా సహాయపడ్డాయి?
[8వ పేజీలోని చిత్రసౌజన్యం]
Photo top left: Andy Hernandez/Sipa Press; photo bottom right: Jose Nicolas/Sipa Press