కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 5/15 పేజీలు 21-23
  • మీరు ఓర్పును ప్రదర్శించగలరా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఓర్పును ప్రదర్శించగలరా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన అసహన ఆధునిక లోకం
  • యెహోవా మీ ఓర్పును బలపరుస్తాడు
  • తమనుగూర్చి యితరులను గూర్చి సరైన దృక్పథం
  • ఓర్పు గొప్ప ఫలితాలను అందిస్తుంది
  • ఓర్పు చూపిస్తూ ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • యెహోవా, యేసు చూపించే దీర్ఘశాంతం నుండి నేర్చుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • యెహోవా ఓర్పును అనుకరించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ఓర్పు—ఆశతో సహించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 5/15 పేజీలు 21-23

మీరు ఓర్పును ప్రదర్శించగలరా?

యెహోవా అబ్రాముతో యిలా చెప్పాడు: “నీవు లేచి నీ దేశమునుండి . . . నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము. నిన్ను గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.” (ఆదికాండము 12:1, 2) అప్పుడు అబ్రాము 75 ఏళ్ల వాడు, ఆయన విధేయుడై, తన శేష జీవితమంతా యెహోవా కొరకు నిరీక్షించాడు.

చివరికి, ఓర్పుగల అబ్రాహాముకు (అబ్రాము) దేవుడు ఈ వాగ్దానాన్ని చేశాడు: “నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును.” అపొస్తలుడైన పౌలు యింకా యిలా చెప్పాడు: “అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.”—హెబ్రీయులు 6:13-15.

ఓర్పు అంటే ఏమిటి? “ఒకదాని కొరకు నెమ్మదిగా వేచి ఉండడం” లేక ఒత్తిడి లేక కోపోద్రేక సమయంలో తాళుకోగల” సామర్థ్యం అని నిఘంటువులు దాన్ని నిర్వచిస్తున్నాయి. కాబట్టి మీరు ఒకరి కొరకు గానీ, ఒక దానికొరకు గానీ వేచి ఉండాల్సివచ్చినప్పుడు, లేక మీకు కోపం వచ్చినప్పుడో లేక ఒత్తిడికి గురైనప్పుడో మీ ఓర్పు పరీక్షకు గురౌతుంది. అలాంటి పరిస్థితుల్లో ఓర్పుగల వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు; ఓర్పులేనివాడు తొందరపడి చిరాకుపడతాడు.

మన అసహన ఆధునిక లోకం

ప్రత్యేకంగా అనేక పట్టణ ప్రాంతాల్లో, ఓర్పుపై కాకుండా వేగంపై ప్రాముఖ్యత ఉంచబడుతోంది. క్రిక్కరిసి ఉన్న పట్టణాల్లో జీవించే లక్షలమంది ప్రజలకు, ఉదయం అలారమ్‌ మ్రోగినప్పుడు రోజు మొదలౌతుంది. అది, ఎక్కడికైనా వెళ్లడానికో, ఎవరినైనా కలవడానికో, లేక దేన్నైనా సాధించడానికో తీసుకునే సత్వర చర్యలను ప్రారంభిస్తుంది. అనేకులు ఒత్తిడినొందుతూ ఓపిక లేకుండా ఉన్నారనడంలో ఆశ్చర్యమేమైనా ఉందా?

ఇతరుల అపరిపూర్ణతను ఎదుర్కొన్నప్పుడు మీరు చిరాకుపడతారా? “సమయం పాటించపోవడం నాకు బొత్తిగా నచ్చదు,” అంటున్నాడు అల్బర్ట్‌. ఆలస్యంగా వచ్చేవారి కొరకు వేచియుండడం, ప్రత్యేకంగా ఆ వేళమించిపోతే చేయలేని పనిని చేయాల్సివుంటే, అప్పుడు అది భారంగా ఉంటుందని అనేకులు అంగీకరిస్తారు. ఆ 18వ శతాబ్దపు బ్రిటీషు రాజకీయవేత్తయైన న్యూకాసల్‌ ప్రభువును గూర్చి యిలా చెప్పడం జరిగింది: ‘ఆయన అలవాటుగా ఆలస్యంగా వస్తాడు.’ ఒకవేళ మీరు అలాంటి మనిషిని ప్రతిరోజూ ఎదుర్కోవల్సి ఉంటే, మీరు ఓర్పుకల్గి ఉంటారా?

ఓ వాహనాన్ని నడిపించేటప్పుడు, మీరు త్వరగా కోపగించుకుని, వేచియుండడానికి అయిష్టపడతారా, లేక అతి వేగంగా ప్రయాణించడానికి శోధించబడతారా? అలాంటి సందర్భాల్లో, అసహనం తరచూ వినాశనాన్ని తెస్తుంది. మునుపటి పశ్చిమ జర్మనీలో 1989 నందు 4,00,000 రహదారి ప్రమాదాలు, గాయాలూ మరణాలకు దారితీశాయి. వీటిల్లో, మూడింటిలో ఒకటి ముందున్న వాహనానికి మరీ దగ్గరగా నడపడం వల్లనో లేక మరీ వేగంగా నడపడం వల్లనో సంభవించింది. అయితే, అసహనంగా ఉండడం 1,37,000 వ్యక్తుల గాయాలకు, మరణానికి కనీసం కొంతమేరకు కారణమైంది. అసహనానికి ఎంతటి ఘోరమైన ఫలితం!

“ఎవరైనా మాటిమాటికి నాకు అంతరాయం కల్గించినా, లేక వూరికే ప్రగల్భాలు పలికినా, ఓర్పు కల్గియుండడం నాకు చాలా కష్టమనిపిస్తుంది” అని అన్‌ ఫిర్యాదు చేసింది. “పెద్దల యెడల గౌరవం లేని యౌవనులు” తన ఓపికను సవాలు చేస్తుంటారని కార్ల్‌ హెర్మన్‌ ఒప్పుకుంటున్నాడు.

ఇవి, మరితర పరిస్థితులు మిమ్మల్ని ఓర్పు లేనివారిగా చేస్తాయి. మరి మీరెలా ఓర్పును పెంపొందించుకోగలరు?

యెహోవా మీ ఓర్పును బలపరుస్తాడు

ఓర్పు అనిశ్చయతను లేక బలహీనతను సూచిస్తుందని అనేకమంది ప్రజలు తలుస్తారు. అయితే, యెహోవాకు మాత్రం అది బలాన్ని సూచిస్తుంది. ఆయన “యెవడును నశింపవలెనని కోరుచు, . . . (ఆయన) దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 పేతురు 3:9) అయితే, మీ స్వంత ఓర్పును బలపర్చడానికి, యెహోవాను హత్తుకుని ఉండండి, మీ పూర్ణ హృదయముతో ఆయనపై ఆధారపడండి. ఓర్పుగల ప్రవర్తనను అభివృద్ధి చేసుకోడానికి, దేవునితో మీ సంబంధాన్ని బలపర్చుకోవడమే ఏకైక ప్రాముఖ్య మార్గము.

అంతేకాకుండా, భూమి, మానవజాతి కొరకు యెహోవా సంకల్పాలు ఏమిటని తెలుసుకోవడం ప్రాముఖ్యం. “దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై యున్నాడో, పునాదులుగల ఆ పట్టణముకొరకు అబ్రాహాము ఎదురుచూచుచున్నాడు.” (హెబ్రీయులు 11:10) అదే రీతిగా, దైవిక వాగ్దానాలను గూర్చి స్పష్టమైన దృష్టిని కల్గివుండడం, అలాగే యెహోవాపై ఆధారపడడంలో సంతృప్తి చెందడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఓర్పు అంటే, సందేహాన్ని సూచించడం ఎన్నటికీ కాదుగానీ, ప్రజలకు నిజమైన ఆరాధనకు జయప్రదంగా నడిపించేదని మీరు అప్పుడు గుర్తిస్తారు. కాబట్టి, “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.”—2 పేతురు 3:15.

మీ వ్యక్తిగత పరిస్థితులే మీ ఓర్పును తట్టుకోలేనంతగా పరీక్షించినట్లయితే మరి దాని మాటేమిటి? అవిశ్వాసులు మీపైన ఉపద్రవపూరితమైన ఒత్తిడిని మోపుతున్నారా? దీర్ఘకాలంగా అస్వస్థతను మీరు అనుభవిస్తున్నారా? అలాగైతే, శిష్యుడైన యాకోబు రాసినవాటిని గ్రహించండి. ఓర్పును ప్రదర్శించడంలో ప్రవక్తలు కనపర్చిన మాదిరిని ప్రస్తావించిన తర్వాత, తీవ్రమైన ఒత్తడి సమయంలో నెమ్మదిగా ఉండడంలోని రహస్యాన్ని ఆయన బయల్పర్చాడు. యాకోబు యిలా అన్నాడు: “మీలో ఎవనికైనను శ్రమ సంభవించెనా? అతడు ప్రార్థనచేయవలెను.”—యాకోబు 5:10, 13.

ప్రార్థనలో మీ ఓర్పును బలపర్చమనీ పరీక్షల్లో మిమ్మును మీరు అధీనంలో ఉంచుకోడానికి సహాయపడమని దేవున్ని యథార్థంగా కోరండి. తరచూ యెహోవా తట్టుతిరగండి, అప్పుడు మీ శాంతానికి ప్రత్యేకంగా అపాయకరమైన యితరుల అలవాట్లను లేక సందర్భాలను మీరు గుర్తించడానికి ఆయన మీకు సహాయపడతాడు. శ్రమను కల్గించగల పరిస్థితులను గూర్చి ముందుగానే ప్రార్థించడం, ఆ సమయంలో మీరు నెమ్మదిగా ఉండడానికి సహాయపడుతుంది.

తమనుగూర్చి యితరులను గూర్చి సరైన దృక్పథం

ఓ శాంతివంతమైన మనో వైఖరిని కల్గివుండడానికి, మిమ్మల్ని అలాగే యితరులను సరైన విధంగా మీరు దృష్టించాలి. ఇది బైబిలు పఠించడం వల్లనే సాధ్యపడుతుంది, కారణం అందరూ అపరిపూర్ణతను సంతరించుకున్నారనీ, కాబట్టి దోషాలు ఉంటాయని అది కనపరుస్తుంది. అంతేకాకుండా, బైబిలు జ్ఞానం మీరు ప్రేమలో పెంపారడానికి సహాయపడుతుంది. ఇతరుల యెడల ఓర్పును కనపర్చడానికి ఈ లక్షణం తప్పనిసరి.—యోహాను 13:34, 35; రోమీయులు 5:12; ఫిలిప్పీయులు 1:9.

మీకు కోపం వచ్చినప్పుడు, ప్రేమ, క్షమించాలనే ఆతురత మిమ్మల్ని శాంతపరుస్తుంది. మిమ్మల్ని విసిగించే అలవాట్లు ఎవరికైనా ఉన్నట్లయితే, మీరు అయిష్టపడేది ఆ వ్యక్తిని కాదు గానీ ఆ అలవాటునేనని ప్రేమ మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎన్నిసార్లు మీ స్వంత బలహీనతలు దేవుని ఓర్పును పరీక్షించాయో, యితరులకు ఎంతగా చిరాకు కలిగించాయో ఆలోచించండి.

మిమ్మల్ని మీరు సరిగ్గా దృష్టించుకోవడం మీరు ఓర్పుతో వేచియుండడానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు యెహోవా సేవలో ఆధిక్యతలను పొందడానికి ప్రయత్నిస్తూ నిరాశచెందారా? ఇసుక గడియారంలోని చివరి యిసు రేణువులా మీ ఓర్పు సన్నగిల్లుతున్నట్లు మీకు అనిపిస్తోందా? అలాగైనట్లయితే, అసహనానికి గర్వం మూల కారణమని జ్ఞాపకముంచుకోండి. “అహంకారము గలవానికంటే శాంతము గలవాడు మేలు,” అన్నాడు సొలొమోను. (ప్రసంగి 7:8) అవును, ఓర్పును పెంపొందించుకోడంలో గర్వం ఓ ముఖ్యమైన ప్రతిబంధకం. నెమ్మదిగా ఉండడం సాత్వికులైన వ్యక్తులకు సులభం అనేది నిజం కాదంటారా? కనుక, సాత్వికాన్ని పెంపొందించుకోండి, అప్పుడు మీరు ఆలస్యాన్ని మనశ్శాంతితో అంగీకరించగలరు.—సామెతలు 15:33.

ఓర్పు గొప్ప ఫలితాలను అందిస్తుంది

అబ్రాహాము ప్రాముఖ్యంగా తన విశ్వాసానికి పేరుగాంచాడు. (రోమీయులు 4:11) అయితే, ఓర్పు అతని విశ్వాసాన్ని నిలువనిచ్చింది. యెహోవాపైన ఆధారపడడం వల్ల అతనికి ఏ ఫలితం దక్కింది?

అబ్రాహాము యెహోవా నమ్మకానికి ఎక్కువగా పాత్రుడయ్యాడు. అబ్రాహాము నామము గొప్పచేయబడింది, మరి ఆయన వారసులు ఓ గొప్ప జనాంగమయ్యారు. భూమిలోని అన్ని జనాంగాలూ ఆయన సంతానం ద్వారా ఆశీర్వదించబడగలరు. అబ్రాహాము దేవుని కొరకు వాగ్దూతగా, ఒక విధమైన సృష్టికర్తగా కూడా సేవ చేశాడు. అబ్రాహాము విశ్వాసమూ ఓర్పుకూ యింతకంటే గొప్ప బహుమానం మరొకటి ఉండగలదా?

యెహోవా, శ్రమలను ఓర్పుతో సహించినవారి యెడల “ఎంతో జాలియు కనికరమునూ గలవాడు.” (యాకోబు 5:10, 11) అలాంటి వ్యక్తులు దేవుని చితాన్ని చేస్తారు గనుక వారు స్వచ్ఛమైన మనస్సాక్షిని అనుభవిస్తారు. మరి మీ విషయంలోనైతే, మీరు యెహోవాపై ఆధారపడి, శ్రమలను ఓర్పుతో సహించినట్లయితే, మీ ఓర్పు యెహోవా అంగీకారాన్ని, ఆశీర్వాదాన్ని పొందడానికి సహాయపడుతుంది.

దేవుని ప్రజల జీవితంలోని ప్రతి విషయంలోనూ ఓర్పు చాలా చక్కగా పనిచేస్తుంది. క్రిస్టియన్‌ మరియు ఆగ్నేస్‌ అనే యిద్దరు యెహోవా సేవకులు వారు వివాహం నిశ్చయం చేసుకునేటప్పుడు దీన్ని కనుగొన్నారు. అగ్నేస్‌ను వారు సరిగ్గా అర్థం చేసుకోడానికిగాను క్రిస్టియన్‌ తలిదండ్రులపైని గౌరవంవల్ల వారు తమ వివాహాన్ని వాయిదా వేశారు. ఈ పని ఏ ప్రభావాన్ని కల్గించింది?

“మా ఓర్పు మా తలిదండ్రులకు ఎంత అవసరమన్నది నేను ఆ తర్వాత గుర్తించాను,” అని క్రిస్టియన్‌ వివరించాడు. “మేము ఓర్పుతో వేచియుండడం నాకు, నా భార్యకు మధ్యగల సంబంధాన్ని ఏమాత్రం తెగనరకలేదు. అయితే నా తలిదండ్రులతో మా సంబంధానికి అది తొలి పునాది రాయయ్యింది.” అవును, ఓర్పు అనేక గొప్ప లాభాలను తెస్తుంది.

ఓర్పు శాంతిని వృద్ధి చేస్తుంది. ప్రతి చిన్న తప్పునూ మీరు కొండంత చేయరని మీ కుటుంబీకులు, స్నేహితులు ఎంతో కృతజ్ఞులై ఉంటారు. ఇతరులు పొరపాటు చేసినప్పుడు మీ నెమ్మది, అర్థం చేసుకోగల సామర్థ్యం అవమానకర దృశ్యాలను నివారిస్తుంది. ఓ చైనా సామెత యిలా చెబుతోంది: “క్షణికోద్రేక సమయంలో చూపిన ఓర్పు నూరు దినాల బాధను నివారిస్తుంది.”

ఓర్పు మీ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది, తద్వారా మీ యితర మంచి లక్షణాలను కాపాడుకోడానికి సహాయం చేస్తుంది. అది మీ విశ్వాసం అధికకాలం ఉండేలా చేస్తుంది. మీ శాంతి దీర్ఘకాలం ఉండేలా చేస్తుంది, మీ ప్రేమను నిశ్చలం చేస్తుంది. కనికరం, మంచితనం, సాత్వికాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఓర్పు మీరు సంతోషంగా ఉండడానికి సహాయపడుతుంది. ఓర్పును ప్రదర్శించడం దీర్ఘశాంతాన్ని, ఆత్మ నిగ్రహాన్ని పెంపొందించుకోడానికి అగత్యమైన బలాన్ని కూడగట్టుకోడానికి సహాయపడుతుంది.

యెహోవా వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఓర్పుతో వేచియుండండి, అప్పుడు మీకు ఓ అద్భుతమైన భవిష్యత్తు నిశ్చయంగా దక్కుతుంది. అబ్రాహాములా “విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించు”కుంటారని ఆశిస్తున్నాము.—హెబ్రీయులు 6:12.

[23వ పేజీలోని చిత్రం]

అబ్రాహామువలె, మీరు యెహోవాతో సన్నిహిత సంబంధం కల్గియుండడం ఓర్పును కనపర్చడానికి సహాయపడుతుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి