కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w94 7/1 పేజీలు 29-31
  • “నేను విశ్వాసాన్ని కాపాడుకొంటిని”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నేను విశ్వాసాన్ని కాపాడుకొంటిని”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆమె స్వంత మాటలు వైద్యులను కదిలించాయి
  • ఆత్మీయ గమ్యాలు
  • ఒక సురక్షితమైన భవిష్యత్తు
  • మీరు ప్రేమిస్తున్నారని వాళ్లకు చెప్పండి
    అనుభవాలు
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
w94 7/1 పేజీలు 29-31

“నేను విశ్వాసాన్ని కాపాడుకొంటిని”

బ్రూనెల్లా ఇన్‌కాడెటె స్నేహితులు చెప్పినది

“శనివారం చాలా నెమ్మదిగా గడిచిన, ఒంటరితనం అనుభవించిన దినం. నేను నిరాశా భావంతో గదిలో ఒంటరిగా ఉన్నాను. కారిడార్‌ వెంబడి నడవాలనుకున్నాను. అంతా బాగానే గడుస్తున్నది, హఠాత్తుగా, ఎవరో నా మొఖంపైనే తలుపు వేసారు, నేనెంత కష్టపడి ప్రయత్నించినా బయటికి వెళ్లడానికి మార్గంలేదు.”

పదిహేను సంవత్సరాల బ్రూనెల్లా ఇన్‌కాడెటె హృదయం అంతులేని నిరుత్సాహంతో బరువెక్కిపోయింది. ఆమె చిన్న జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన దినం గడిచిపోతున్నది. దానికి మునుపటి సంవత్సరంలో, యెహోవా మరియు బైబిలు యెడల పెరుగుతున్న ఆమె ప్రేమ, తన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోడానికి ఆమెను నడిపింది. కెనడా నందలి మాన్ట్‌రియల్‌లో 1990 జూలై నెలలో జరిగిన యెహోవాసాక్షుల “స్వచ్ఛమైన భాష” జిల్లా సమావేశంలో ఆమె బాప్తిస్మం తీసుకోవలసి ఉంది. కాని, బ్రూనెల్లా త్వరలోనే తన తర్వాతి జీవితమంతా మిగిలి ఉండే విశ్వాస పరీక్షను ఎదుర్కొనవలసి వచ్చింది.

నీటి బాప్తిస్మం ద్వారా తన సమర్పణను సూచించడానికి రెండు రోజులు ముందు, తనకు లుకేమియా ఉందని బ్రూనెల్లా తెలుసుకుంది. స్థానిక పిల్లల వైద్యశాలలోని వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించాలనుకున్నారు, కాబట్టి బ్రూనెల్లా ఆసుపత్రిలోనే ఉండిపోయింది.

ఆమె స్వంత మాటలు వైద్యులను కదిలించాయి

యెహోవా దేవుని దృష్టిలో రక్తం పరిశుద్ధమైనదని బ్రూనెల్లాకు తెలుసు. (లేవీయకాండము 17:11) ఆమె తలిదండ్రులైన ఎడ్‌మన్‌డో మరియు నికొలెట్టా, తమ కుమార్తె వైద్యంలో రక్త మార్పిడులు వాడకూడదని ఒప్పందం చేసుకున్నారు. ఆమె తండ్రి ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “ఆమె మైనరైనప్పటికీ, తన నుండి కూడా వైద్యులు వినాలని ఆమె కోరింది. ‘రక్తమును విసర్జించుడి’ అనే బైబిలు ఆజ్ఞను ఉల్లంఘించే వైద్యం తనకు వద్దని ఆమె స్థిరంగా చెప్పింది.”—అపొస్తలుల కార్యములు 15:20.

జూలై 10, 1990న ముగ్గురు వైద్యులు, ఒక సంఘసేవకురాలు బ్రూనెల్లా తలిదండ్రులను, యెహోవాసాక్షుల స్థానిక సంఘ పరిచారకుల నిద్దరిని కలిశారు. బ్రూనెల్లాకు అక్యూట్‌ లింఫోబాస్టిక్‌ లుకేమియా ఉందని పరీక్షలు ధృవీకరించాయి. రోగాన్ని ఎదుర్కొనే తమ పథకాన్ని వైద్యులు వివరించారు. వైద్యం చేయడం చాలా కష్టమని వారు యుక్తిగా వివరించారు. సంఘ పెద్దలలో ఒకరు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నారు: “బ్రూనెల్లా ప్రవర్తన, దేవునికి విధేయత చూపించాలనే ఆమె నిర్ణయం వైద్యులను, సంఘసేవకురాలిని కదిలించాయి. ఆమె తలిదండ్రుల ప్రేమనుబట్టి, క్రైస్తవ సంఘంలోని స్నేహితుల మద్దతునుబట్టి వారు ముగ్ధులయ్యారు. వారి స్థానాన్ని మేము అర్థం చేసుకుని, గౌరవించిన విధానాన్ని కూడా వారు మెచ్చుకున్నారు.”

వైద్యులు రక్త మార్పిడి చేయకుండానే చికిత్స చేయాలని నిశ్చయించుకున్నారు. బ్రూనెల్లా కేమో థెరపీ పొందుతుంది, కాని అది సాధారణమైన చికిత్స కంటే కష్టమైంది కాదు. వైద్యం ద్వారా రక్త కణాలకు జరిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. నికొలెట్టా ఇలా వివరిస్తున్నది: “వైద్యులు బ్రూనెల్లా శారీరక, మానసిక, ఆత్మీయ అవసరతలను దృష్టిలోకి తీసుకున్నారు. బాల్యంలో వచ్చే లుకేమియాకు రక్తం ఉపయోగించకుండా చికిత్స చేయడంలో అనుభవమున్న నిపుణున్ని కలుసుకొమ్మని మేము వారిని కోరినప్పుడు, వారు అంగీకరించారు.” బ్రూనెల్లాకు ఆసుపత్రి సిబ్బందికి మధ్య మంచి ప్రేమపూర్వక సంబంధం ఏర్పడింది.

ఆత్మీయ గమ్యాలు

తొలి చికిత్స కొంతవరకు మంచి ఫలితాలను కలిగించినప్పటికీ, బ్రూనెల్లాకు విషమ పరీక్ష అప్పుడే ప్రారంభం కానున్నది. నవంబరు 1990 నాటికి ఆమె వ్యాధి తీవ్రతరమైంది కాబట్టి ఆలస్యం చేయకుండా ఆమె బాప్తిస్మం తీసుకుంది. గడచిన కొన్ని నెలలను గుర్తుచేసుకుంటూ బ్రూనెల్లా ఇలా అంగీకరించింది: “అది ఏమాత్రం సులభమైంది కాదు. ఎంతో శక్తి కావాలి, అనుకూలంగా ఆలోచించ వలసిన అవసరం ఉంటుంది. . . . నా విశ్వాసం పరీక్షించబడింది, కాని నేను స్థిరంగా నిలబడ్డాను, ఇప్పటికీ నేను క్రమ పయినీరు [పూర్తికాల సేవకుడు] గమ్యాన్ని గురించే ఆలోచిస్తున్నాను.”

బ్రూనెల్లాకు 1991 తొలిభాగంలో వ్యాధి మరలా తిరగబెట్టింది. ఆమె కెమోథెరపీ పొందుతున్నప్పుడు దాదాపు మరణించినట్లు అయ్యింది, కాని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా, ఆనందించేలా ఆమె కోలుకుంది. ఆగస్టు నాటికి ఆమె సహాయ పయినీరుగా బహిరంగ పరిచర్యలో ఒక నెల గడపగలిగేలా స్వస్థత పొందింది. మళ్లీ ఆమె అనారోగ్యం ఎక్కువైంది, 1991 నవంబరు నాటికి ఆమె శరీరం అనేక భాగాల్లో క్యాన్సరుకు గురయ్యింది. మరో ఆసుపత్రిలో, మరో వైద్యుల బృందం ఆమెకు రేడియేషన్‌ థెరపీ ద్వారా చికిత్స చేయడం ప్రారంభించారు.

అలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా, బ్రూనెల్లా ధైర్యంగా ఉండి, తనకొరకు ఆత్మీయ గమ్యాలను ఏర్పరచుకుంది. మొదటిసారి ఆమె లుకేమియా గురించి తెలుసుకున్నప్పుడు, తను కేవలం ఆరు నెలలు మాత్రమే జీవిస్తుందని ఆమెకు చెప్పబడింది. ఇప్పుడు, దాదాపు ఒక సంవత్సరంన్నర తర్వాత, బ్రూనెల్లా ఇంకా భవిష్యత్తు గురించి పథకాలు వేస్తూనే ఉంది. ఒక సంఘ పెద్ద ఇలా చెబుతున్నారు: “తన గమ్యాల కొరకు పాటుపడడంలో ఆమె ఏమాత్రం సమయం వ్యర్థం చేయలేదు. పరదైసును గూర్చి దేవుడు చేసిన వాగ్దానమందు బ్రూనెల్లాకున్న విశ్వాసం ఆమె కష్టమంతటిలో ఆమెకు ధైర్యాన్నిచ్చింది. వయస్సులో చిన్నదైనప్పటికీ ఆమె క్రైస్తవ పరిపక్వతకు ఎదిగింది. ఆమె ప్రవర్తన, దృక్పథం సంఘాన్ని పురికొల్పి, ఆసుపత్రి సిబ్బందితో సహా ఆమెను ఎరిగివున్నవారి హృదయాల్ని చూరగొన్నది.” ఆమె తల్లి ఇలా గుర్తుచేసుకుంటుంది: “ఆమె ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు. ఎలా ఉందని ఆమెను ఎవరైనా అడిగితే, ‘బాగున్నాను’ లేక ‘కష్టంగా ఏమీ లేదు, మీరెలా ఉన్నారు’ అని అడిగేది.”

ఒక సురక్షితమైన భవిష్యత్తు

జూలై 1992లో జరిగిన యెహోవాసాక్షుల “వెలుగు ప్రకాశకులు” జిల్లా సమావేశానికి హాజరు కావాలని బ్రూనెల్లా పథకం వేసుకుంది. అయితే, సమావేశ సమయానికి బ్రూనెల్లా మళ్లీ ఆసుపత్రి పాలయ్యింది, ఆమె జీవితం క్షీణించిపోతుంది. అయినప్పటికీ, యెహోవా దృష్టిలో సరైన దాన్ని చేయుట అనే డ్రామాను చూడాలని ఆమె ఒక చక్రాల కుర్చీలో సమావేశానికి వచ్చింది.

తన జీవితంలోని కొన్ని దినాల కొరకు ఆమె తన కుటుంబం వద్ద ఉండడానికి, ఇంటికి తిరిగి వచ్చింది. నికొలెట్టా ఇలా చెబుతున్నది: “చివరి సమయంలో ఆమె తనకంటే కూడా ఇతరుల యెడల ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉండేది. ‘పరదైసులో మనం కలిసి ఉంటాము’ అని చెబుతూ ఆమె వారిని బైబిలు పఠించమని ప్రోత్సహించేది.”

భూమిపై పరదైసులో జీవించడానికి పునరుత్థానం చేయబడతాననే గట్టి నిరీక్షణ కలిగివుండి, 1992 జూలై 27న బ్రూనెల్లా మరణించింది. ఆమె తన గమ్యాలను చేరుకోడానికి కేవలం ప్రారంభించింది, కాని తన సమర్పిత పనిని పునరుత్థానం తర్వాత కొనసాగించడానికి పథకం వేసుకుంది. ఆమె మరణించడానికి కేవలం కొద్ది దినాల ముందు, బ్రూనెల్లా ఈ క్రింది ఉత్తరం వ్రాసింది, ఆమె జ్ఞాపకార్థ కూటమి సమయంలో అది చదువబడింది.

“ప్రియమైన స్నేహితులారా:

“మీరు వచ్చినందుకు కృతజ్ఞతలు. మీ సాన్నిధ్యం మా కుటుంబీకులకు ఎంతో విలువైనది.

“నాకు సన్నిహితంగా ఉన్న ప్రజల కొరకు—మనం ఎంతో అనుభవించాము. మనం ఎన్నో బాధ కలిగించిన సమయాలను గడిపాము, కాని కొన్ని తమాషా సమయాలు కూడా ఉన్నాయి. అది కష్టమైన, దీర్ఘ పోరాటమైయుండెను, కాని నేను విఫలమయ్యానని భావించడం లేదు. లేఖనాల్లో చెప్పబడినట్లుగా, ‘నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడ ముట్టించితిని, విశ్వాసాన్ని కాపాడుకొంటిని.’—1 తిమోతి 4:7.

“నేను ఎంతో నేర్చుకున్నాను కూడా, నేను ఎంతో ఎదిగాను, నా స్నేహితులు, నా చుట్టూ ఉన్నవారు మార్పును చూశారు. నాకు తమ మద్దతునిచ్చిన వారందరికి నేను కృతజ్ఞతలు తెలియ జేయాలనుకుంటున్నాను.

“యోహాను 5:28, 29 చెబుతున్నట్లుగా, నూతన లోకాన్ని, యెహోవాను విశ్వసించే మీకందరికీ, పునరుత్థానం ఉంటుందని తెలుసు. కాబట్టి సత్యంలో దృఢంగా ఉండండి, అప్పుడు మనం మళ్లీ ఒకరినొకరం చూసుకోవచ్చు.

“నేనేమనుభవించానో తెలిసిన ప్రజలందరికి కృతజ్ఞతలు తెలియ జేయాలను కుంటున్నాను. నేను మీలో ప్రతి ఒక్కరికి నా అపారమైన ప్రేమను తెలియజేస్తున్నాను. నేను మిమ్మల్నందరిని ప్రేమిస్తున్నాను.”

తన యౌవనంగాని లేక తన అనారోగ్యంగాని, దేవునికి తన సమర్పణను వాయిదా వేయడానికి బ్రూనెల్లా అనుమతించలేదు. జీవపు పరుగులో పాల్గొనకుండా తమను అడ్డగించగల దేనినైనా ప్రక్కన పెట్టాలని యౌవనులను, అలాగే వృద్ధులను ఒకే రీతిలో ఆమె విశ్వాసం మరియు దృఢసంకల్పాల మాదిరి ప్రోత్సహిస్తుంది.—హెబ్రీయులు 12:1.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి