కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w95 7/1 పేజీలు 14-19
  • “దేవుని ఇశ్రాయేలు” మరియు “గొప్ప సమూహము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “దేవుని ఇశ్రాయేలు” మరియు “గొప్ప సమూహము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “గొప్ప సమూహము”
  • ఒక మాదిరియైన “యాజక రూపమైన రాజ్యము”
  • ఇశ్రాయేలులో పరదేశులు
  • ఆత్మీయ జనాంగం
  • ఒక పరలోక నెరవేర్పు
  • పునఃస్థాపించబడిన “దేశము”లో కలిసి జీవించేవారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • పరలోక పౌరసత్వంగల క్రైస్తవ సాక్షులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • మానవులందరికీ ప్రయోజనం చేకూర్చే రాజులైన యాజక సమూహం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • స్వదేశివైనను లేక పరదేశివైనను, దేవుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
w95 7/1 పేజీలు 14-19

“దేవుని ఇశ్రాయేలు” మరియు “గొప్ప సమూహము”

“నేను చూడగా, ఇదిగో, . . . యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను.”—ప్రకటన 7:9.

1-3. (ఎ) అభిషక్త క్రైస్తవులకు ఏ అద్భుతమైన పరలోక ఉత్తరాపేక్షలు ఉన్నాయి? (బి) మొదటి-శతాబ్దపు సంఘాన్ని నాశనంచేయడానికి సాతాను ఎలా ప్రయత్నించాడు? (సి) అభిషక్త క్రైస్తవ సంఘాన్ని కలుషితం చేయాలన్న సాతాను ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిరూపించే ఏ సంఘటన 1919లో జరిగింది?

సా.శ. 33లో “దేవుని ఇశ్రాయేలు” స్థాపించబడటం, యెహోవా సంకల్పాలను సంపూర్ణం చేయడంలో ఒక ముఖ్యమైన అంఖమై ఉంది. (గలతీయులు 6:16) దాని అభిషక్త సభ్యులకు, అమర్త్య ఆత్మీయ ప్రాణులుగా ఉంటూ, దేవుని పరలోక రాజ్యంలో క్రీస్తుతోపాటు పరిపాలించే నిరీక్షణ ఉంది. (1 కొరింథీయులు 15:50, 53, 54) ఆ స్థానంలో, యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడంలో మరియు గొప్ప విరోధియైన అపవాదియగు సాతాను తలను చితుక త్రొక్కడంలో వారు ప్రధాన పాత్రను కలిగి ఉంటారు. (ఆదికాండము 3:15; రోమీయులు 16:20) ఈ నూతన సంఘాన్ని హింసించడం ద్వారా మరియు దాన్ని కలుషితం చేయడానికి ప్రయత్నించడం ద్వారా సాతాను దాన్ని నాశనం చేయడానికి తనకు సాధ్యమైనదంతా చేశాడంటే అందులో ఆశ్చర్యం లేదు!—2 తిమోతి 2:18; యూదా 4; ప్రకటన 2:10.

2 అపొస్తలులు జీవించి ఉన్నప్పుడు సాతాను విజయం పొందలేకపోయాడు. అయితే, వారి మరణం తర్వాత, మతభ్రష్టత్వం అదుపు లేకుండా విస్తరించింది. తుదకు, మానవ దృష్టికి, నేడు క్రైస్తవమత సామ్రాజ్యమని పిలువబడుతున్న భ్రష్టమత బూటకాన్ని సాతాను వెలికి తెచ్చినప్పుడు, యేసు స్థాపించిన స్వచ్ఛమైన క్రైస్తవ సంఘం కలుషితమైనట్లు కనబడుతోంది. (2 థెస్సలొనీకయులు 2:3-8) అయినప్పటికీ, నిజమైన క్రైస్తవత్వం నిలిచింది.—మత్తయి 28:20.

3 నిజ క్రైస్తవులు “గురుగులు” లేక అబద్ధ క్రైస్తవులతోపాటు కొంత సమయం వరకు కలిసి పెరుగుతారని గోదుమలు, గురుగులను గురించిన తన ఉపమానంలో యేసు ముందుగానే చెప్పాడు; మరి ఇది జరిగింది. అయితే అంత్య దినాల్లో, “రాజ్య [అథఃస్సూచి: కుమారులు]” స్పష్టమైన రీతిలో “గురుగులకు” భిన్నంగా ఉంటారని కూడా ఆయన చెప్పాడు. (మత్తయి 13:36-43) ఇది కూడా నిజమని నిరూపించబడింది. నిజమైన అభిషక్త క్రైస్తవులు 1919లో బబులోను బంధకంనుండి బయటకు వచ్చారు. వారు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా” దైవికంగా గుర్తించబడ్డారు, వారు రాజ్యసువార్తను ప్రకటించడానికి ధైర్యంగా ముందుకు సాగారు. (మత్తయి 24:14, 45-47; ప్రకటన 18:4) దాదాపు వారందరూ అన్యులే; అయితే అబ్రాహాము వంటి విశ్వాసాన్ని వారు కల్గివున్నారు గనుక, వాస్తవానికి వారు ‘అబ్రాహాము కుమారులై’ యున్నారు. వారు “దేవుని ఇశ్రాయేలు” యొక్క సభ్యులై యున్నారు.—గలతీయులు 3:7, 26-29.

“గొప్ప సమూహము”

4. ప్రాముఖ్యంగా 1930వ పడిలో క్రైస్తవుల ఏ గుంపు గుర్తింపదగినదైంది?

4 ప్రథమంగా, ఈ అభిషక్త క్రైస్తవుల ప్రకటన పనికి ప్రతిస్పందించిన వారు కూడా పరలోక నిరీక్షణగల 1,44,000 మందిలో శేషముగా, ఆత్మీయ ఇశ్రాయేలీయులు అయ్యారు. (ప్రకటన 12:17) అయితే, ప్రాముఖ్యంగా 1930వ పడిలో మరొక గుంపు గమనార్హులయ్యారు. గొర్రెల దొడ్లను గురించిన ఉపమానంలోని “వేరే గొర్రెలుగా” వారు గుర్తించబడ్డారు. (యోహాను 10:16) వారు పరదైసు భూమిపై నిత్యం జీవించగల నిరీక్షణ ఉన్న క్రీస్తు శిష్యులు. సూచనార్థకంగా చెప్పాలంటే వారు అభిషక్త క్రైస్తవుల ఆత్మీయ సంతానం. (యెషయా 59:21; 66:22; 1 కొరింథీయులు 4:15, 16 పోల్చండి.) వారు అభిషక్త క్రైస్తవ సంఘాన్ని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిగా గుర్తించారు, మరి వారి అభిషక్త సహోదరులవలె వారికి యెహోవా పట్ల ప్రగాఢ ప్రేమ, యేసు బలియందు విశ్వాసం, దేవుని స్తుతించేందుకు ఉత్సాహం మరియు నీతి నిమిత్తం హింసను అనుభవించాలన్న సుముఖత వారికి ఉన్నాయి.

5. వేరే గొర్రెల స్థానం ఎలా క్రమేణ బాగా అర్థమైంది?

5 మొదట్లో ఈ వేరే గొర్రెల స్థానం సరిగ్గా అర్థం చేసుకోబడలేదు, సమయం గడుస్తున్న కొలది విషయాలు స్పష్టంగా అర్థమవ్వడం ప్రారంభమయ్యాయి. మరి 1932లో వేరే గొర్రెలను ప్రకటన పనిలో భాగం వహించేందుకు పురికొల్పడానికి అభిషక్త క్రైస్తవులు ప్రోత్సహించబడ్డారు—అయితే ఈ పని వేరే గొర్రెల్లో చాలామంది అప్పటికే చేస్తున్నారు. వేరే గొర్రెలు, 1934లో నీటి బాప్తిస్మం తీసుకోవాలని ప్రోత్సహించబడ్డారు. వారు 1935లో ప్రకటన 7వ అధ్యాయంలోని “గొప్ప సమూహము”గా గుర్తింపబడ్డారు. యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి ప్రేక్షకులుగా హాజరుకావాలని వారు 1938లో ఆహ్వానింపబడ్డారు. మరి 1950లో వారిలోని పరిపక్వత చెందిన పురుషులు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను” ఉండే “అధికారులలో” చేరి ఉన్నారని గ్రహించడం జరిగింది. (కీర్తన 45:16; యెషయా 32:1, 2) మరి 1953లో దేవుని భూ సంస్థ—అప్పటికి దానిలో ఎక్కువ భాగం వారైన వేరే గొర్రెలు—నూతన లోకంలో ఉనికియందుండే భూసంస్థ యొక్క కేంద్రబిందువు అన్న విషయాన్ని గ్రహించడం జరిగింది. యేసు విమోచనా బలి ఆధారంగా వేరే గొర్రెలు అర్మగిద్దోనును తప్పించుకునే నిరీక్షణతో దేవుని స్నేహితులుగా నీతిమంతులుగా ప్రకటించబడ్డారని 1985లో అర్థం చేసుకోవడం జరిగింది.

6. అభిషక్తులు, వేరే గొర్రెల సాపేక్షిక స్థానాలు నేడు ఏవి, ఇవి ఏ ప్రశ్నలకు నడుపుతాయి?

6 ఇప్పటికి, “అంత్యదినముల” ఈ చివరి భాగంలో, 1,44,000 మందిలో అత్యధికులు మరణించి వారి పరలోక బహుమానాన్ని అందుకున్నారు. (2 తిమోతి 3:1; ప్రకటన 6:9-11; 14:13) భూ నిరీక్షణగల క్రైస్తవులే సువార్త ప్రకటించే పనిలో ఇప్పుడు ఎక్కువ శాతం చేస్తున్నారు, మరి ఈ విషయంలో యేసు అభిషక్త సహోదరులకు మద్దతు ఇవ్వగలగడం తమ ఆధిక్యతగా వారు భావిస్తున్నారు. (మత్తయి 25:40) అయితే, ఈ అంత్య దినాలన్నిటిలో ఆత్మీయ ఆహారం అందించిన నమ్మకమైన వాడునూ బుద్ధిమంతుడునైన దాసుడే ఈ అభిషేకించబడిన వారు. అభిషేకించబడిన వారందరూ తమ పరలోక బహుమానాన్ని అందుకున్న తర్వాత వేరే గొర్రెల పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు వేరే గొర్రెల కొరకు ఏ ఏర్పాట్లు చేయబడతాయి? ప్రాచీన ఇశ్రాయేలును క్లుప్తంగా పరిశీలించడం ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు మనకు సహాయం చేస్తుంది.

ఒక మాదిరియైన “యాజక రూపమైన రాజ్యము”

7, 8. ధర్మశాస్త్ర నిబంధన క్రింద ప్రాచీన ఇశ్రాయేలు ఎంత మేరకు ఒక యాజక రూపమైన రాజ్యంగాను, పరిశుద్ధమైన జనాంగంగాను ఉన్నారు?

7 యెహోవా ఇశ్రాయేలీయులను తన ప్రత్యేక జనాంగంగా ఎంచుకున్నప్పుడు, ఇలా చెబుతూ ఆయన వారితో ఒక నిబంధన చేశాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన [జనాంగము NW] జనముగాను ఉందురు.” (నిర్గమకాండము 19:5, 6) ధర్మశాస్త్ర నిబంధన ఆధారంగా ఇశ్రాయేలీయులు యెహోవా యొక్క ప్రత్యేక ప్రజలు. అయితే యాజక రూపమైన రాజ్యము మరియు పరిశుద్ధమైన జనాంగము ఇమిడివున్న వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది?

8 ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉన్నప్పుడు యెహోవా సర్వాధిపత్యాన్ని గుర్తెరిగి ఆయనను వారి రాజుగా అంగీకరించారు. (యెషయా 33:22) అలా, వారు ఒక రాజ్యమయ్యారు. అయితే, తర్వాత బయల్పర్చబడినట్లు, “ఒక రాజ్యమును” గురించిన వాగ్దానం అంతకంటే ఎక్కువ భావాన్ని కలిగి ఉంటుంది. అంతే కాకుండా, వారు యెహోవా ధర్మశాస్త్రానికి లోబడినప్పుడు వారు తమ చుట్టూ ఉన్న జనాంగాలనుండి వేరుగా పరిశుభ్రమైన వారిగా ఉన్నారు. వారు ప్రతిష్ఠిత జనాంగంగా ఉండేవారు. (ద్వితీయోపదేశకాండము 7:5, 6) వారు యాజక రూపమైన రాజ్యం కూడా అయ్యున్నారా? మరి ఇశ్రాయేలులో లేవి గోత్రం ఆలయ సేవ కొరకు ప్రత్యేకించబడింది, ఆ గోత్రంలో లేవీయుల యాజకత్వం ఉండేది. మోషే ధర్మశాస్త్రం ప్రారంభించబడినప్పుడు, లేవీయులు కాని ప్రతి కుటుంబంలోని తొలిచూలుకు ప్రతిగా లేవీయుల మగవారు తీసుకోబడ్డారు.a (నిర్గమకాండము 22:29; సంఖ్యాకాండము 3:11-16, 40-51) అలా, ఇశ్రాయేలీయులలోని ప్రతి కుటుంబం ఆలయ సేవలో ప్రాతినిధ్యం వహించాయని చెప్పవచ్చు. ఇలా ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆ జనాంగం యాజకత్వానికి అతి దగ్గర అయ్యింది. అయినప్పటికీ, వారు అన్యుల ఎదుట యెహోవాకు ప్రాతినిధ్యం వహించారు. సత్య దేవున్ని ఆరాధించాలని ఇష్టపడిన ఏ పరదేశియైనా ఇశ్రాయేలీయుల సహవాసంలో అలా చేయవచ్చు.—2 దినవృత్తాంతములు 6:32, 33; యెషయా 60:10.

9. ‘తనకు యాజకునిగా సేవించకుండా’ ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని యెహోవా నిరాకరించడానికి ఏది కారణమైంది?

9 సొలొమోను మరణం తర్వాత, దేవుని ప్రజలు రాజైన యరొబాము క్రింద ఉత్తర ఇశ్రాయేలు రాజ్యం మరియు రాజైన రెహబాము క్రింద దక్షిణ యూదా రాజ్యంగా చీలిపోయారు. సత్యారాధనకు కేంద్రమైన ఆలయం యూదా ప్రాంతంలో ఉండేది గనుక, తన స్వదేశంలోనే రాజైన యరొబాము దూడల ప్రతిమలను పెట్టడం ద్వారా చట్టవిరుద్ధమైన ఆరాధనా విధానాన్ని స్థాపించాడు. అంతేకాక, “అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి, లేవీయులు కాని సాధారణమైనవారిలో కొందరిని యాజకులుగా నియమించెను.” (1 రాజులు 12:31) రాజైన ఆహాబు తన విదేశీ భార్యయైన యెజెబెలు దేశంలో బయలు ఆరాధనను స్థాపించడానికి అనుమతించినప్పుడు ఉత్తర రాజ్యం అబద్ధ ఆరాధనలో బహులోతుగా కూరుకుపోయింది. తుదకు, తిరుగుబాటు చేసిన రాజ్యంపై యెహోవా తీర్పును ప్రకటించాడు. హోషేయ ద్వారా ఆయన ఇలా చెప్పాడు: “నా జనులు జ్ఞానములేనివారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండ నేను నిన్ను విసర్జింతును.” (హోషేయ 4:6) ఆ వెంటనే, అష్షూరీయులు ఉత్తర ఇశ్రాయేలు రాజ్యాన్ని నిర్మూలం చేశారు.

10. యూదా దక్షిణ రాజ్యం నమ్మకంగా ఉన్నప్పుడు జనాంగాల ఎదుట యెహోవాకు ఎలా ప్రాతినిధ్యం వహించింది?

10 దక్షిణ రాజ్యమైన యూదా సంగతేమిటి? హిజ్కియా దినాల్లో, యెషయా ద్వారా యెహోవా వారికిలా చెప్పాడు: “మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. . . . నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు.” (యెషయా 43:10, 21; 44:21) నమ్మకంగా ఉన్నప్పుడు దక్షిణరాజ్యం అన్యులకు యెహోవా మహిమను ప్రకటించడానికి మరి యథార్థహృదయులు ఆయన ఆలయంలో ఆయనను ఆరాధించడానికి, చట్టబద్ధమైన యాజకత్వం ద్వారా ఉపచారం చేయించుకోడానికి వారిని ఆకర్షించేందుకు సహాయపడింది.

ఇశ్రాయేలులో పరదేశులు

11, 12. ఇశ్రాయేలీయుల సహవాసంలో యెహోవాను సేవించడానికి వచ్చిన కొంతమంది పరదేశుల పేర్లను చెప్పండి.

11 ఈ జాతీయ సాక్ష్యానికి ప్రతిస్పందించిన పరదేశుల విషయానికొస్తే, మిద్యానీయురాలైన సిప్పోరాను భార్యగా కల్గిన మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో వారి కొరకు ఏర్పాటు ఉంది. ఇశ్రాయేలీయులు కాని “అనేకులైన అన్యజనుల సమూహము” ఇశ్రాయేలీయులతోపాటు ఐగుప్తును వదలి వచ్చారు, మరి ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు వారక్కడ ఉన్నారు. (నిర్గమకాండము 2:16-22; 12:38; సంఖ్యాకాండము 11:4) రాహాబు, ఆమె కుటుంబం యెరికో నుండి రక్షింపబడ్డారు తర్వాత వారు యూదా సమాజంలోకి అంగీకరించబడ్డారు. (యెహోషువ 6:23-25) దాని తర్వాత వెంటనే, గిబియోనీయులు ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం చేసుకున్నారు, గుడారానికి సంబంధించి వారికి పనులు కూడా నియమించబడ్డాయి.—యెహోషువ 9:3-27; మరియు 1 రాజులు 8:41-43; ఎస్తేరు 8:17 కూడా చూడండి.

12 తుదకు, పరదేశులు ఉన్నత స్థానాల్లో సేవ చేశారు. అమ్మోనీయుడైన జెలెకు వలె బత్షెబ భర్తయైన హిత్తీయుడగు ఊరియా కూడా దావీదు యొక్క ‘పరాక్రమశాలులలో’ ఉన్నారు. (1 దినవృత్తాంతములు 11:26, 39, 41; 2 సమూయేలు 11:3, 4) ఎబెద్మెలెకు అనే కూషీయుడు అంతఃపురంలో సేవ చేశాడు, మరి రాజు సమక్షానికి వెళ్లగలిగే స్థానంలో ఉన్నాడు. (యిర్మీయా 38:7-9) బబులోను చెరనుండి ఇశ్రాయేలు తిరిగి వచ్చినప్పుడు, యాజకులకు సహాయం చేయడంలో ఇశ్రాయేలీయులు కానివారైన నెతీనీయులకు అధిక బాధ్యతలు ఇవ్వబడ్డాయి. (ఎజ్రా 7:24) ఈ నమ్మకస్థులైన పరదేశులు, లేక పరవాసులు నేటి గొప్ప సమూహానికి ముంగుర్తుగా దృష్టింపబడుతున్నారు గనుక, వారి స్థానంపట్ల ఈనాడు మనకు ఆసక్తి ఉంటుంది.

13, 14. (ఎ) ఇశ్రాయేలులో యూదమత ప్రవిష్టుల ఆధిక్యతలు మరియు బాధ్యతలు ఏవి? (బి) నమ్మకస్థులైన యూదమత ప్రవిష్టులను ఇశ్రాయేలీయులు ఎలా దృష్టించాలి?

13 అలాంటి వారు మతప్రవిష్టులు, ఇశ్రాయేలీయులతోపాటు తమను తాము అన్య జనులనుండి వేరుపర్చుకున్న, మోషే ధర్మశాస్త్రం క్రింద ఉన్న యెహోవా యొక్క సమర్పిత ఆరాధికులు. (లేవీయకాండము 24:22) వారు ఇశ్రాయేలీయుల వలెనే బలులు అర్పించారు, అబద్ధ ఆరాధన నుండి దూరంగా ఉన్నారు మరియు రక్తాన్ని విసర్జించారు. (లేవీయకాండము 17:10-14; 20:2) వారు సొలొమోను ఆలయ నిర్మాణంలో సహాయం చేశారు, రాజైన ఆసా మరియు రాజైన హిజ్కియాల ఆధ్వర్యంలో సత్యారాధనను పునఃస్థాపించడంలో పాలుపంచుకున్నారు. (1 దినవృత్తాంతములు 22:2; 2 దినవృత్తాంతములు 15:8-14; 30:25) సా.శ. 33 పెంతెకొస్తునాడు పేతురు రాజ్యపు మొదటి తాళపు చెవిని ఉపయోగించినప్పుడు, “యూదులు, [యూదులు-కాని] యూదమత ప్రవిష్టులు” ఆయన మాటలను విన్నారు. ఆ దినాన బాప్తిస్మం తీసుకున్న మూడు వేలమందిలో కొంతమంది యూదమత ప్రవిష్టులు అయి ఉండవచ్చు. (అపొస్తలుల కార్యములు 2:10, 41) ఆ వెంటనే, కొర్నేలీ మరియు ఆయన కుటుంబం కొరకు పేతురు రాజ్యపు చివరి తాళపు చెవిని ఉపయోగించక ముందే, ఒక ఐతియోపీయుడైన యూదమత ప్రవిష్టుడు ఫిలిప్పు చేత బాప్తిస్మం తీసుకున్నాడు. (మత్తయి 16:19; అపొస్తలుల కార్యములు 8:26-40; 10:30-48) యూదమత ప్రవిష్టులు అన్యులుగా దృష్టించబడలేదన్నది స్పష్టం.

14 అయినప్పటికీ, దేశంలోని యూదమత ప్రవిష్టుల స్థానం అక్కడే జన్మించిన ఇశ్రాయేలీయుల స్థానంవంటిది కాదు. యూదమత ప్రవిష్టులు యాజకులుగా సేవచేయలేదు, మరి వారి జ్యేష్ఠులకు లేవీయుల యాజకత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వబడలేదు.b మరి యూదమత ప్రవిష్టులకు ఇశ్రాయేలులో భూమి స్వాస్థ్యం లేదు. అయినప్పటికీ, నమ్మకమైన యూదమత ప్రవిష్టులపట్ల దయగలిగి ఉండాలని మరి వారిని తమ సహోదరులవలె పరిగణించాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది.—లేవీయకాండము 19:33, 34.

ఆత్మీయ జనాంగం

15. సహజ ఇశ్రాయేలీయులు మెస్సీయను అంగీకరించడానికి నిరాకరించినప్పుడు ఏమి ప్రతిఫలించింది?

15 ఇశ్రాయేలును తమ చుట్టూ ఉన్న జనాంగాల నుండి పరిశుభ్రంగా, వేరుగా ఉంచడానికి ధర్మశాస్త్రం రూపొందించబడింది. అయితే అది మరొక సంకల్పాన్ని నెరవేర్చింది. అపొస్తలుడైన పౌలు “మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకు డాయెను” అని వ్రాశాడు. (గలతీయులు 3:24) దుఃఖకరంగా, అనేకమంది ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం ద్వారా క్రీస్తు వద్దకు నడుపబడటంలో విఫలులయ్యారు. (మత్తయి 23:15; యోహాను 1:11) కాబట్టి యెహోవా దేవుడు ఆ జనాంగాన్ని తృణీకరించాడు, మరి “దేవుని ఇశ్రాయేలు” జన్మించేలా చేశాడు. అంతేకాక, ఈ నూతన ఇశ్రాయేలు యొక్క పౌరులుగా పూర్ణరీతిలో అవ్వగల ఆహ్వానాన్ని కూడా అందించాడు. (గలతీయులు 3:28; 6:16) ఈ నూతన జనాంగంపైనే, రాజులైన యాజకసమూహాన్ని గురించిన నిర్గమకాండము 19:5, 6 నందలి యెహోవా వాగ్దానం అద్భుతమైన, చివరి నెరవేర్పు ఉంటుంది. ఎలా?

16, 17. భూమిపైనున్న అభిషక్త క్రైస్తవులు ఏ భావంలో “రాజులు” మరియు “యాజకసమూహమై” ఉన్నారు?

16 పేతురు తన కాలంనాటి అభిషక్త క్రైస్తవులకు, “మీరు . . . ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధ [జనాంగము NW] జనమును, దేవుని సొత్తయిన ప్రజలునైయున్నారు” అని వ్రాసినప్పుడు ఆయన నిర్గమకాండము 19:6ను ఉదాహరించాడు. (1 పేతురు 2:9) దీని భావమేమిటి? అభిషక్త క్రైస్తవులు భూమిపై ఉన్నప్పుడు రాజులైయున్నారా? లేదు, వారి రాజరికం ఇంకా భవిష్యత్తులో ఉంటుంది. (1 కొరింథీయులు 4:8) అయిననూ, వారు భవిష్యత్తులో రాజులుగా ఉండే ఆధిక్యత కొరకు ఎన్నుకోబడ్డారు గనుక వారు ‘రాజులే.’ గొప్ప సర్వాధిపతియైన యెహోవా దేవునిచేత నియమించబడిన రాజైన యేసు ఆధిపత్యంలో వారు ఇప్పుడు కూడా ఒక జనాంగమై ఉన్నారు. “[యెహోవా] మనలను అంధకారసంబంధమైన అధికారములోనుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారునియొక్క రాజ్యనివాసులనుగా చేసెను,” అని పౌలు వ్రాశాడు.—కొలొస్సయులు 1:13.

17 భూమిపైనున్న అభిషక్త క్రైస్తవులు ఒక యాజకసమూహమా? కొంతమేరకు, అవును అని చెప్పవచ్చు. ఒక సంఘంగా, వారు నిర్వివాదమైన యాజక సేవలను అందిస్తున్నారు. “పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరు . . . ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు” అని వ్రాసినప్పుడు పేతురు దీన్ని వివరించాడు. (1 పేతురు 2:5; 1 కొరింథీయులు 3:16) నేడు, ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడానికి గల మార్గమైన “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడే” అభిషక్త క్రైస్తవుల శేషము యొక్క భాగము. (మత్తయి 24:45-47) ప్రాచీన ఇశ్రాయేలులో జరిగినట్లే, యెహోవాను ఆరాధించాలనుకునే వారెవరైనా ఈ అభిషక్త క్రైస్తవుల సహవాసంలోనే ఆయనను ఆరాధించాలి.

18. ఒక యాజకసమూహంగా, భూమిపైనున్న అభిషక్త క్రైస్తవ సంఘానికి ఏ ప్రాథమిక బాధ్యత ఉంది?

18 అంతేకాక, యెహోవా గొప్పతనాన్ని గురించి జనాంగాలలో సాక్ష్యమిచ్చే ఆధిక్యతగల వారిగా అభిషక్త క్రైస్తవులు ఇశ్రాయేలు స్థానాన్ని ఆక్రమించారు. అభిషక్త క్రైస్తవులను రాజులైన యాజకసమూహము అని పేతురు పిలిచినప్పుడు, అతని మనస్సులో ప్రకటన పని ఉందని పూర్వపర సందర్భం చూపిస్తుంది. వాస్తవానికి, “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, . . . రాజులైన యాజకసమూహమునై యున్నారని” అతను చెప్పినప్పుడు, నిర్గమకాండము 19:6 నందలి యెహోవా వాగ్దానాన్ని మరియు యెషయా 43:21లో ఇశ్రాయేలీయులకు ఆయన చెప్పిన మాటలను అతను ఒకే ఉదహరణలో కలిపి చూపాడు. (1 పేతురు 2:9) దీనికి సామరస్యంగా, యెహోవా గొప్పకార్యాలను తెలియజేయడం ఆలయ బలులవంటివని పౌలు చెప్పాడు. అతనిలా వ్రాశాడు: “కాబట్టి [యేసు] ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.”—హెబ్రీయులు 13:15.

ఒక పరలోక నెరవేర్పు

19. ఇశ్రాయేలీయులు యాజక రూపమైన రాజ్యమై ఉంటారన్న వాగ్దానం యొక్క చివరి, గొప్ప ముగింపు ఏమిటి?

19 అయితే, నిర్గమకాండము 19:5, 6 చివరకు దీనికంటే ఎక్కువ మహిమాన్వితమైన నెరవేర్పును కలిగి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో, “నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని” పునరుత్థానమైన యేసును పరలోక జీవులు స్తుతిస్తుండగా వారు ఈ లేఖనాన్ని అన్వయించడం అపొస్తలుడైన యోహాను వింటాడు. (ప్రకటన 5:9, 10) దాని తుది భావంలో, ఈ రాజులైన యాజకసమూహమే దేవుని పరలోక రాజ్యము, ఈ పరిపాలక అధికారం కొరకే ప్రార్థించమని యేసు మనకు బోధించాడు. (లూకా 11:2) అంతం వరకూ నమ్మకంగా సహించి ఉండే 1,44,000 మంది అభిషక్త క్రైస్తవులకు ఈ రాజ్య ఏర్పాటులో భాగం ఉంటుంది. (ప్రకటన 20:4, 6) మోషే ద్వారా పూర్వమెన్నడో చేయబడిన వాగ్దానం యొక్క ఎంతటి అద్భుతమైన నెరవేర్పు!

20. ఏ ప్రశ్నకు ఇంకా సమాధానం రావాలి?

20 అభిషక్తులందరూ వారి అద్భుతమైన వారసత్వాన్ని అందుకున్నప్పుడు, గొప్ప సమూహంతో మరియు వారి భవిష్యత్తుతో దీనికంతటికీ ఏమి సంబంధం ఉంటుంది? ఈ పరంపర యొక్క చివరి శీర్షికలో ఇది స్పష్టమవుతుంది.

[అధస్సూచీలు]

a ఇశ్రాయేలు యాజకత్వం ప్రారంభించబడినప్పుడు, ఇశ్రాయేలులోని లేవీయులు కాని గోత్రంలోని జ్యేష్ఠులను మరియు లేవీ గోత్రంలోని పురుషులను లెక్కించడం జరిగింది. లేవీయులలోని పురుషులకంటే 273 మంది జ్యేష్ఠులు ఎక్కువమంది ఉన్నారు. మరి ఎక్కువ మంది ఉన్నందుకు 273 మందిలోని ప్రతి ఒక్కరికి ఐదు షేకేల్‌లను (తులములను) విమోచన క్రయధనంగా చెల్లించాలని యెహోవా ఆజ్ఞాపించాడు.

b సా.శ.పూ. 1513లో ధర్మశాస్త్రం స్థాపించబడినప్పుడు ఇశ్రాయేలీయులు కాని అనేకులైన అన్యజనుల సమూహము అక్కడ ఉంది, అయితే ఇశ్రాయేలీయుల జ్యేష్ఠులకు ప్రతిగా లేవీయులు తీసుకోబడినప్పుడు, వారి జ్యేష్ఠులు పరిగణించబడలేదు. (8వ పేరా చూడండి.) వ్యతిరేక భావంలో చెప్పాలంటే, ఈ ఇశ్రాయేలీయులు కాని వారి జ్యేష్ఠులకు ప్రతిగా లేవీయులు తీసుకొనబడలేదు.

మీరు వివరించగలరా?

◻ వేరే గొర్రెల స్థానాన్ని క్రమేణ ఎలా బాగా అర్థం చేసుకోవడం జరిగింది?

◻ తనకు యాజకునిగా సేవించకుండా ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని యెహోవా ఎందుకు త్రోసి పుచ్చాడు?

◻ నమ్మకంగా ఉన్నప్పుడు, జనాంగాల ఎదుట యూదా స్థానం ఎలా ఉంది?

◻ ఇశ్రాయేలులో, నమ్మకస్థులైన యూదమత ప్రవిష్టుల స్థానం ఎలా ఉంది?

◻ అభిషక్త సంఘం యాజక రూపమైన రాజ్యంగా ఎలా సేవ చేస్తుంది?

[16వ పేజీలోని చిత్రం]

రాజులైన యాజకసమూహంగా, అభిషక్త క్రైస్తవులు భూమిపై యెహోవా మహిమను చాటుతారు

[18వ పేజీలోని చిత్రం]

నిర్గమకాండము 19:6 యొక్క చివరి నెరవేర్పు రాజ్యమే

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి