కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 3/15 పేజీలు 21-23
  • యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కరుణ మరియు యెహోవా న్యాయము
  • యెహోవా న్యాన్ని పోలి నడుచుకొనుడి
  • నీతి ఫలించునట్లు విత్తనములు విత్తుడి
  • యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • జనాంగములన్నింటికి త్వరలోనే న్యాయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 3/15 పేజీలు 21-23

యెహోవా—నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు

సారజివోలోని ఒక యౌవనస్థురాలు, తన నగరంలోని పిల్లలు ఎందుకు అన్ని బాధలను సహించాల్సివస్తుందని తనను తాను ప్రశ్నించుకుంటుంది. “మేమేం చేయలేదు. మేం నిర్దోషులం” అని ఆమె అంటుంది. వ్యాకులంచెందిన అర్జెంటీనా తల్లులు, తమ కుమారులు అదృశ్యమవ్వడానికి నిరసనగా బ్యూనోస్‌ ఐర్స్‌లోని ఒక బహిరంగ కూడలిని దాదాపు 15 సంవత్సరాలపాటు సందర్శించారు. ఇమ్మానుయేల్‌ అనే ఒక ఆఫ్రికా దేశస్థుని తల్లి ముగ్గురు సహోదరీలు జాతి హింసలు చెలరేగిన సమయంలో దారుణంగా హత్యగావించబడ్డారు, ఆయన దృఢంగా ఇలా చెప్పాడు: “ప్రతి ఒక్కరూ తన న్యాయయుక్తమైన ప్రతిఫలం పొందాలి . . . మాకు న్యాయం కావాలి.”

న్యాయం యెహోవా దేవుని ప్రధాన లక్షణాలలో ఒకటి. “ఆయన చర్యలన్నియు న్యాయములు” అని బైబిలు చెబుతుంది. నిజానికి, యెహోవా “నీతిని, న్యాయమును ప్రేమించుచున్నాడు.” (ద్వితీయోపదేశకాండము 32:4; కీర్తన 33:5) దేవున్ని బాగా తెలుసుకోవాలంటే, మనం ఆయన న్యాయ భావాన్ని గ్రహించాలి దానిని అనుకరించడానికి నేర్చుకోవాలి.—హోషేయ 2:19, 20; ఎఫెసీయులు 5:1.

న్యాయంయెడల మన భావన, మానవులు ఈ లక్షణాన్ని ఎలా పరిగణిస్తారన్నదాని వలన బహుశ ప్రభావితం చేయబడివుండవచ్చు. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో, కళ్ళకు గంతలు కట్టుకుని ఒక ఖడ్గాన్ని, త్రాసును పట్టుకునివున్న ఒక స్త్రీగా తరచూ న్యాయం చిత్రించబడుతుంది. మానవ న్యాయం నిష్పక్షపాతమైనదిగా, అంటే ధనము పలుకుబడులయెడల గ్రుడ్డిదిగా ఉండాలని తలంచబడుతుంది. నిందితుని దోషాన్ని లేదా నిర్దోషత్వాన్ని అది జాగ్రత్తగా త్రాసులో తూచాలి. న్యాయం దాని ఖడ్గంతో, నిర్దోషులను రక్షించి తప్పిదస్తులను శిక్షించాలి.

హక్కు మరియు తర్కము—సిద్ధాంతము, ఆచరణలలో నీతిశాస్త్రము అనే పుస్తకం, “న్యాయం చట్టము, విధ్యుక్తము, హక్కులు, మరియు కర్తవ్యాలతో ముడిపెట్టబడివుంది, మరి సమానత్వం లేక యోగ్యతల ప్రకారం దాని తీర్పులను తూచి ఇస్తుంది” అని చెబుతుంది. కానీ యెహోవా న్యాయం అందుకు మించింది. తన పరలోకపు తండ్రిని ఎంతగానో పోలివున్న యేసు క్రీస్తు కార్యాలను లక్షణాలను పరిశీలించడంద్వారా మనం దీనిని చూడగలము.—హెబ్రీయులు 1:3.

యెషయా 42:3లోని మాటలు సువార్త రచయిత మత్తయి ద్వారా యేసుకు అన్వయించబడ్డాయి, ఆయనిలా తెలియజేసాడు: “విజయమొందుటకు న్యాయవిధిని ప్రబలము చేయువరకు ఈయన నలిగిన రెల్లును విరువడు మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు.” వంగిపోయి చివరికి త్రొక్కివేయబడిన నలిగిన రెల్లు వంటివారికి ఓదార్పుకరమైన సమాచారాన్ని యేసు ప్రకటించాడు. వారు దీపపు మకమకలాడుతున్న వత్తివలె, వారి జీవితపు చివరి అగ్నికణం దాదాపు ఆర్పివేయబడిందన్నట్లుగా ఉన్నారు. సూచనార్థకంగా, నలిగిన రెల్లును విరవడానికి మరియు మకమకలాడుతున్న వత్తులను ఆర్పివేయడానికి బదులుగా, యేసు బాధపడేవారిని కనికరించాడు, బోధించి వారిని స్వస్థపరచాడు, మరియు యెహోవా దేవుని న్యాయాన్ని వారికి స్పష్టం చేశాడు. (మత్తయి 12:10-21) యెషయా ప్రవచనం ముందే చెప్పినట్లు, ఆ విధమైన న్యాయం నిరీక్షణను రేకెత్తించింది.

కరుణ మరియు యెహోవా న్యాయము

కరుణ దేవుని న్యాయంలోని ఒక ప్రధాన భాగము. యేసు భూమిపై ఉన్నప్పుడు ఇది ప్రముఖ పాత్రను వహించింది. న్యాయం మరియు నీతియొక్క దేవుని ప్రమాణాలకు ఆయన పరిపూర్ణంగా ప్రాతినిధ్యం వహించాడు. అయితే, యూదా శాస్త్రులు, పరిసయ్యులు కఠినమైన నియమాల స్మృతిని—దానిలో అనేకం తమ స్వంతంగా తయారు చేసుకొన్నవే—అనుసరించడంద్వారా నీతిని వెంటాడడానికి ప్రయత్నించారు. వారి శాసనపరమైన న్యాయం సాధారణంగా కరుణను నిర్మూలించింది. యేసుకు పరిసయ్యులకు మధ్య జరిగిన అనేకమైన ఘర్షణలు ఈ వివాదం చుట్టూ తిరిగాయి: నిజమైన న్యాయం మరియు నీతి అంటే ఏమిటి?—మత్తయి 9:10-13; మార్కు 3:1-5; లూకా 7:36-47.

న్యాయంగా మరియు నీతియుక్తంగా ఇతరులతో ఎలా వ్యవహరించాలన్నది యేసు తేటపరిచాడు. నిత్య జీవాన్ని వారసత్వంగా పొందడానికి ఏం చేయాల్సిన అవసరముందని ధర్మశాస్త్రమందు ప్రావీణ్యతగల ఒక వ్యక్తి ఒకసారి యేసును అడిగాడు. దానికి జవాబుగా యేసు ఆయనను ఒక ప్రశ్న అడిగాడు మరి అందుకు, దేవున్ని తన పూర్ణ హృదయంతో, పూర్ణ ప్రాణంతో, పూర్ణ మనస్సుతో, మరియు పూర్ణ బలంతో ప్రేమించుట మరియు తన పొరుగువానిని తన వలెనే ప్రేమించుట అన్నవి అత్యంత ప్రాముఖ్యమైన రెండు నియమాలు అని ఆయన ప్రత్యుత్తరమిచ్చినప్పుడు ఆయనను మెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇలా అడిగాడు: ‘నా పొరుగువాడెవడు?’ స్నేహశీలుడైన సమరయుని దృష్టాంతమును వివరిస్తూ యేసు ప్రత్యుత్తరమిచ్చాడు.—లూకా 10:25-37.

సమరయుని గూర్చిన యేసు దృష్టాంతములో యెహోవాయొక్క నీతి మరియు కరుణాపూర్వకమైన న్యాయము ఉదాహరించబడ్డాయి. తనకు తెలియని గాయపడిన వ్యక్తికి స్వార్థరహితంగా సహాయం చేయడంద్వారా సమరయుడు నీతియుక్తమైన, న్యాయమైన, మరియు కరుణాపూర్వకమైన పనిని చేశాడు. భూమిపైనున్నప్పుడు యేసు తానుగా అదే స్వభావాన్ని కనపరిచాడు. ఆయన నీతిగా న్యాయంగా ఉన్నాడు. అంతేగాక బాధ, వ్యాధి, మరియు మరణం వంటివాటి బాధితులైన పాపభరితమైన అపరిపూర్ణ మానవజాతికి, అవసరంలో ఉన్న ప్రజలకు ఆయన తన జీవాన్ని ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు నీతిని విమోచన ఏర్పాటుతో లంకె పెట్టాడు. ఆయన ఇలా వ్రాశాడు: “తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్య కార్యమువలన [లేక, “ఒక్క నీతియుక్తమైన కార్యము,” అథఃస్సూచి, NW] కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను.” (రోమీయులు 5:18) ఈ “ఒక్క నీతియుక్తమైన కార్యము,” తాము ప్రత్యక్షంగా బాధ్యులు కాని ఆదాము పాపంయొక్క దారుణ పరిణామాలనుండి విధేయులైన మానవజాతిని రక్షించడానికి దేవుని మార్గమైవుంది.

దేవుని న్యాయం పాపభరిత మానవులను విమోచించడానికి అదే సమయంలో నీతియుక్తమైన నియమాలను సమర్థించడానికి ప్రయత్నించింది. పాపాన్ని అలక్ష్యం చేయడం అరాచకత్వాన్ని ప్రోత్సహించి ఉండేది గనుక, అది అన్యాయమూ మరియు ప్రేమరాహిత్యమూ అయి ఉండేది. ఇంకొకవైపు, ఒకవేళ దేవుని న్యాయం ఒక బహుమానాన్ని లేక ఒక శిక్షను ఇవ్వడానికే పరిమితమై ఉంటే, మానవజాతి పరిస్థితి నిరాశాజనకంగా ఉండేది. బైబిలు ప్రకారం, “పాపమువలన వచ్చు జీతము మరణము” మరియు “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.” (రోమీయులు 3:10; 6:23) యెహోవా తనయొక్క, తన ప్రియమైన కుమారునియొక్క గొప్ప వ్యక్తిగత వెలపై, పాపముల కొరకు శాంతికరమైన బలిని ఏర్పాటు చేశాడు.—1 యోహాను 2:1, 2.

దైవిక న్యాయం సూత్రానుసారమైన ప్రేమతో (గ్రీకు, అ·గాʹపె) అల్లబడివుందని విమోచన క్రయ ధనం చూపిస్తుంది. నిజానికి, దేవుని న్యాయం ఆయన నీతియుక్తమైన నియమాల పరిపూర్తియైవుంది—దేవుని నైతిక ప్రమాణాలకు ఇదొక ప్రతిబింబము. అందువలన, దేవుడు న్యాయాన్ని అమలుపర్చినప్పుడు దైవిక న్యాయం అ·గాʹపె ప్రేమపై ఆధారపడినదై ఉంటుంది. (మత్తయి 5:43-48) కాబట్టి మనం యెహోవా న్యాయాన్ని నిజంగా గ్రహిస్తే, ఆయన న్యాయ నిర్ణయాలయందు మనకు పూర్తి నమ్మకం ఉంటుంది. ‘సర్వలోకమునకు తీర్పు తీర్చువానిగా,’ ఆయన ఎల్లప్పుడు సరియైనదే చేస్తాడు.—ఆదికాండము 18:25; కీర్తన 119:75.

యెహోవా న్యాన్ని పోలి నడుచుకొనుడి

“దేవునిపోలి నడుచుకొనుడి” అని బైబిలు మనకు ఉద్బోధిస్తుంది. (ఎఫెసీయులు 5:1) దీనర్థం ఆయన న్యాయాన్ని, దానితోపాటు ప్రేమను పోలి నడుచుకోవడమే. అయితే, మనం అపరిపూర్ణులం గనుక, మన మార్గాలు యెహోవా దేవుని మార్గాలంత ఉన్నతమైనవి కావు. (యెషయా 55:8, 9; యెహెజ్కేలు 18:25) అందువలన మనం నీతిని న్యాయాన్ని ప్రేమించే వ్యక్తులమని ఎలా రుజువుచేయగలము? ‘నిజమైన నీతియు యథార్థమైన భక్తియుగలవారమై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును’ ధరించుకోవడంద్వారా అలా చేయవచ్చు. (ఎఫెసీయులు 4:24) అప్పుడు మనం దేవుడు ప్రేమించే వాటిని ప్రేమిస్తాము, ఆయన ద్వేషించేవాటిని ద్వేషిస్తాము. దౌర్జన్యాన్ని, అనైతికతను, అశుభ్రతను, మరియు మతభ్రష్టత్వాన్ని ‘నిజమైన నీతి’ విసర్జిస్తుంది ఎందుకంటే అవి పరిశుద్ధమైనదానిని అతిక్రమిస్తాయి. (కీర్తన 11:5; ఎఫెసీయులు 5:3-5; 2 తిమోతి 2:16, 17) ఇతరుల ఎడల నిష్కపటమైన ఆసక్తిని కనబరచడానికి కూడా దైవిక న్యాయం మనలను కదిలిస్తుంది.—కీర్తన 37:21; రోమీయులు 15:1-3.

అంతేగాక, ఒకవేళ మనం దేవుని న్యాయంయొక్క కరుణా స్వభావాన్ని గుణగ్రహిస్తే, ఆత్మీయ సహోదరులను లేక సహోదరీలను తీర్పు తీర్చేందుకు మనం ఇష్టపడము. వారిని యెహోవా అర్థం చేసుకున్నంత బాగా మనమెలా అర్థం చేసుకోగలం? మన స్వంత పక్షపాత దృక్కోణం నుండి వారికి తీర్పు తీర్చమా? అందుకే, యేసు ఇలా హెచ్చరించాడు: “మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మునుగూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచుకొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేల? నీ కంటిలో దూలముండగా, నీవు నీ సహోదరుని చూచి—నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారీ, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.” (మత్తయి 7:1-5) మన స్వంత అపరిపూర్ణతలను నిజాయితీగా అంచనా వేసుకోవడం, యెహోవా అనీతియుక్తమని పరిగణించే తీర్పులను చేయకుండా మనలను ఆపుతుంది.

నియమిత సంఘ పెద్దలు గంభీరమైన తప్పిదముల విషయంలో తీర్పు తీర్చబద్దులై ఉన్నారు. (1 కొరింథీయులు 5:12, 13) అలా చేసేటప్పుడు, సాధ్యమైన చోటెల్ల కరుణ చూపాలని దేవుని న్యాయం కోరుతుందని వారు జ్ఞాపకముంచుకుంటారు. ఒకవేళ దానికి ఆధారం లేకపోతే—పశ్చాత్తాపం చూపని పాపుల విషయంలోలా—కరుణ చూపడం కుదరదు. కానీ పెద్దలు అటువంటి తప్పిదస్థున్ని కక్షసాధింపు చర్యగా సంఘం నుండి వెళ్ళగొట్టరు. బహిష్కరణ చర్యే విషయాలను ఆయన గ్రహించేలా చేస్తుందని వారు ఎదురుచూస్తారు. (యెహెజ్కేలు 18:23 పోల్చండి.) క్రీస్తు శిరస్సత్వం క్రింద, పెద్దలు న్యాయం కొరకు సేవ చేస్తారు, మరి ఇందులో “గాలికి మరుగైనచోటు” వలె ఉండడం కూడా ఇమిడివుంది. (యెషయా 32:1, 2) అందువలన వారు నిష్పక్షపాతాన్ని మరియు సహేతుకతను చూపించాలి.—ద్వితీయోపదేశకాండము 1:16, 17.

నీతి ఫలించునట్లు విత్తనములు విత్తుడి

మనం దేవుని నీతియుక్త నూతన లోకం కొరకు వేచిచూస్తుండగా, దైవిక అనుగ్రహాన్ని పొందడానికి మనం ‘నీతిని అనుసరించాలి.’ (జెఫన్యా 2:3; 2 పేతురు 3:13) హోషేయ 10:12 నందు కనుగొనబడే ఈ మాటల్లో ఈ తలంపు సుందరంగా వ్యక్తం చేయబడింది: “నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి; ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.”

యేసు తన స్నేహశీలుడైన సమరయుని దృష్టాంతముతో వివరించినట్లుగానే, మన అనుదిన జీవితాల్లో ‘నీతితో విత్తనములు విత్తడానికి’ మనకెన్నో అవకాశాలున్నాయి. మనము “ప్రేమయను కోత” కోసేలా యెహోవా చూస్తాడు. మనం “న్యాయమార్గము”లో నడిస్తే, రాజ్య పరిపాలనలో మనం నీతియందు ఉపదేశమును పొందుటలో కొనసాగుతాము. (యెషయా 40:14) సమయం గతించే కొలది, యెహోవా నీతిని న్యాయాన్ని ప్రేమించే వ్యక్తియని మనం నిస్సందేహముగా ఇంకా పూర్తిగా గుణగ్రహిస్తాము.—కీర్తన 33:4, 5.

[23వ పేజీలోని చిత్రం]

స్నేహశీలుడైన సమరయుడు యెహోవా న్యాయాన్ని ఉదాహరించాడు

[23వ పేజీలోని చిత్రం]

నలిగిన రెల్లు వలెవున్న, బాధపడే ప్రజలను యేసు కనికరించాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి