కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 4/1 పేజీలు 27-30
  • ఎల్లప్పుడూ మీ భారాన్ని యెహోవా మీద మోపండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎల్లప్పుడూ మీ భారాన్ని యెహోవా మీద మోపండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా బలంతో పనులను చేయుట
  • సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చేయగల్గింది చేయండి
  • మీ భారాల్ని అధికం చేసుకోకండి
  • అపరాధ భారాన్ని తాళుకోవడం
  • విశ్వాసఘాతుకాన్ని తాళుకోవడం
  • యెహోవాతో పటిష్ఠమైన, నమ్మకమైన సంబంధాన్ని నిర్మించి, పెంపొందించుకోండి
  • మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • జ్ఞానవంతులై ఉండండి—దేవునికి భయపడండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • “యుద్ధము యెహోవాదే”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • రెండవ సమూయేలు పుస్తకంలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 4/1 పేజీలు 27-30

ఎల్లప్పుడూ మీ భారాన్ని యెహోవా మీద మోపండి

అనేకులు నేడు భారాలచే నలుగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్థిక మాంద్యాలు, దుఃఖాన్ని కల్గిస్తున్న కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అణచివేత మరియు క్రూరత్వం మూలంగా వేదన, బాధలు మరియు అనేకమైన ఇతర కష్టాలు తమ మెడకు గుదిబందల్లా వ్రేళ్లాడుతున్నాయి. ఈ బాహ్య ఒత్తిళ్లతోపాటు కొంతమంది వ్యక్తిగత అయోగ్యతా భావంచే, తమ స్వంత అపరిపూర్ణతల మూలంగా కల్గిన వైఫల్యంచే కృంగిపోయినట్టు భావిస్తున్నారు కూడా. అనేకులు పోరాడడాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి శోధింపబడుతుంటారు. భారాలు తట్టుకోలేనివిగా కన్పించినప్పుడు వాటిని మీరెలా అధిగమించగలరు?

ఒత్తిళ్లు దాదాపు భరించలేనివిగా ఉన్నాయని ఇశ్రాయేలు రాజైన దావీదు ఒకప్పుడు భావించాడు. కీర్తన 55 ప్రకారంగా, తన శత్రువుల నుండి వచ్చిన ఒత్తిళ్లు, ద్వేషం మూలంగా కల్గిన చింతచే ఆయన తీవ్రమైన కలతకు గురయ్యాడు. ఆయన ఎంతో హృదయ వేదనను, భయాన్ని అనుభవించాడు. ఆయన తన బాధలో మూల్గడం మాత్రమే చేయగలిగాడు. (కీర్తన 55:2, 5, 17) అయినా, తన దుఃఖమంతటినీ లక్ష్యపెట్టకుండా, దానిని అధిగమించేందుకో మార్గాన్ని ఆయన కనుగొన్నాడు. ఎలా? మద్దతు కోసం తన దేవుని వైపు ఆయన చూశాడు. ఆయన భావించినట్లుగా భావించే ఇతరులకు ఆయన ఇచ్చే సలహా ఇదే: “నీ భారము యెహోవామీద మోపుము.”—కీర్తన 55:22.

“నీ భారము యెహోవామీద మోపుము” అనడంలో ఆయన భావం ఏమిటి? అది కేవలం ప్రార్థనలో యెహోవాను సమీపించి, మన చింతను వ్యక్తపర్చడం మాత్రమేనా? లేక ఆ పరిస్థితి నుండి ఉపశమనాన్ని పొందేందుకు మనంతట మనమే ఏదైనా చేయగలమా? యెహోవాను సమీపించేందుకు మరీ అయోగ్యులమని మనం భావించినట్లయితే ఏమి చేయాలి? దావీదు ఆ మాటల్ని వ్రాసినప్పుడు ఆయన స్పష్టంగా జ్ఞాపకం చేసుకొనిన కొన్ని అనుభవాల్ని చూడడం ద్వారా ఆయన భావం ఏమిటో మనం తెలుసుకొనగలం.

యెహోవా బలంతో పనులను చేయుట

ఇశ్రాయేలు యుద్ధ శూరుల హృదయంలో గొల్యాతు ఎంతగా భయాన్ని కల్గించాడో మీరు జ్ఞాపకం చేసుకొనగలరా? తొమ్మిది అడుగులకుపైగా పొడుగున్న ఈ మహాకాయుడు వారిని భయపెట్టాడు. (1 సమూయేలు 17:4-11, 24) కాని దావీదు భయపడలేదు. ఎందుకు? ఎందుకంటే తన స్వంత బలంతో గొల్యాతుని ఎదుర్కొనడానికి ఆయన ప్రయత్నించలేదు. ఇశ్రాయేలీయుల భవిష్య రాజుగా ఆయన అభిషేకించబడినప్పటి నుండీ తనను నడిపించేందుకు, తాను చేసిన వాటి అన్నింటిలో తనను బలపర్చేందుకు ఆయన దేవుని ఆత్మను అనుమతించాడు. (1 సమూయేలు 16:13) అందుకే ఆయన గొల్యాతుతో ఇలా చెప్పాడు: “నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదకు వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును.” (1 సమూయేలు 17:45, 46) వడిసెల రాయి విసురువానిగా దావీదు ప్రావీణ్యంగలవాడు, కాని యెహోవా పరిశుద్ధాత్మ నడిపించి, గొల్యాతు పైకి ఆయన విసిరిన రాయిని మరింత మరణకారకమైనదిగా చేసిందని మనం నిశ్చయత కల్గివుండగలం.—1 సమూయేలు 17:48-51.

దావీదు తనకు దేవుడు మద్ధతునిచ్చి బలపర్చాడనే నమ్మకంతో ఈ గొప్ప సవాల్ని అధిగమించి, విజయుడయ్యాడు. ఆయన దేవునితో ఓ మంచి, విశ్వసనీయమైన సంబంధాన్ని పెంపొందించుకున్నాడు. యెహోవా మునుపు ఆయనను విడుదల చేసిన విధానాన్నిబట్టి ఇది నిస్సందేహంగా బలపర్చబడింది. (1 సమూయేలు 17:34-37) దావీదువలె మీరు యెహోవాతో బలమైన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకొని, ఆయన సామర్థ్యమందు పూర్ణ నమ్మకాన్ని కల్గివుండగలరు మరియు అన్ని పరిస్థితుల్లోను మీరు బలపర్చబడేందుకు, కాపాడుకొనేందుకు సుముఖత కల్గివుండగలరు.—కీర్తన 34:7, 8.

సమస్యల్ని పరిష్కరించడానికి మీరు చేయగల్గింది చేయండి

అయినా, కీర్తన 55 స్పష్టంగా చెబుతున్నట్లు, తీవ్రమైన బాధ, చింత మరి భయం కూడా లేని సమయాలు ఇక ఎప్పటికీ ఉంటాయని దీని భావం కాదు. ఉదాహరణకు, యెహోవాయందలి నమ్మకాన్ని ఇలా నిర్భయంగా చూపిన తర్వాత కొన్ని సంవత్సరాలకు, తన శత్రువుల్ని ఎదుర్కోవడంలో దావీదు ఎంతో భయపడ్డాడు. ఆయన రాజైన సౌలు అనుగ్రహాన్ని కోల్పోయాడు, మరి తన జీవం కొరకు పారిపోవాల్సి వచ్చింది. ఇది దావీదుకు కల్గించిన భావోద్రేక సంక్షోభాన్ని, యెహోవా సంకల్పం జరిగే విషయంలో ఆయన మనస్సులో ఇది ఉద్భవింపజేసిన ప్రశ్నలను గూర్చి ఊహించడానికి ప్రయత్నించండి. ఆయన ఇశ్రాయేలులో భవిష్య రాజుగా అభిషేకించబడ్డాడు, కాని ఒక క్రూరమృగంవలె వేటాడబడి, ఓ పలాయితుడుగా అరణ్యంలో ఆయన బ్రతకాల్సి వచ్చింది. గొల్యాతు స్వంత పట్టణమైన గాతు పట్టణంలో ఆయన ఆశ్రయాన్ని వెదికేందుకు ప్రయత్నించినప్పుడు ఆయనను గుర్తుపట్టడం జరిగింది. దాని ఫలితమేమిటి? ఆయన “బహుగా భయపడెను” అని ఆ వృత్తాంతం చెబుతోంది.—1 సమూయేలు 21:10-12

అయితే సహాయం కొరకు తాను యెహోవా వైపు చూడడాన్నుండి తనను నిలిపివేయడాన్కి తన భయాన్ని, అధిక చింతను ఆయన అనుమతించలేదు. కీర్తన 34 (ఈ అనుభవం ఫలితంగా వ్రాయబడిన) ప్రకారం, దావీదు ఇలా చెప్పాడు: “నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను. ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటిలోనుండి అతని రక్షించెను.”—కీర్తన 34:4, 6.

అవును, ఆయనను యెహోవా బలపర్చాడు. అయినా యెహోవా తనను విడుదల చేసేంతవరకూ దావీదు ఊరకే చేతులు కట్టుకుని కూర్చోలేదని గమనించండి. ఆ క్లిష్టమైన స్థితినుండి బయట పడేందుకు ఆ పరిస్థితుల్లో తాను చేయగల్గిందంతా తాను చేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తించాడు. తన విడుదల విషయంలో యెహోవా హస్తాన్ని గురించి ఆయన గుర్తించినా తనను గాతు రాజు చంపకుండేందుకు పిచ్చివానివలె ప్రవర్తించడం ద్వారా తనకు తానుగానే చర్యను తీసుకున్నాడు. (1 సమూయేలు 21:14–2122:1) మనల్ని విడిపించేందుకు యెహోవాపై ఆధారపడడం మాత్రమేకాకుండా, మనం కూడా భారాల్ని అధిగమించేందుకు చేయగలిగినంత చేయాల్సిన అవసరం ఉంది.—యాకోబు 1:5, 6; 2:26.

మీ భారాల్ని అధికం చేసుకోకండి

దావీదు తన జీవితంలో తరువాత బాధాకరమైన మరో గుణపాఠాన్ని నేర్చుకొన్నాడు. అదేమిటి? అదేంటంటే కొన్నిసార్లు మన భారాల్ని మనమే అధికం చేసుకోవడం. ఫిలిష్తీయులపై విజయం సాధించిన తర్వాత దావీదు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకు రావాలని నిర్ణయించినప్పుడు ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఆ చారిత్రాత్మకమైన వృత్తాంతం మనకిలా చెబుతోంది: “బయలుదేరి, . . . [నిజ] దేవుని మందసమును అచ్చట నుండి తీసికొని వచ్చుటకై తన [దావీదు] యొద్దనున్న వారందరితో కూడ బాయిలా యెహూదాలోనుండి ప్రయాణమాయెను. వారు [నిజ] దేవుని మందసమును క్రొత్త బండిమీద ఎక్కించి . . . అబీనాదాబు కుమారులగు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి.”—2 సమూయేలు 6:2, 3.

మందసాన్ని తీసుకెళ్లడాన్కి బండిని ఉపయోగించడం ద్వారా దాని గురించి యెహోవా ఇచ్చిన ఉపదేశాలన్నీ ఉల్లంఘించబడ్డాయి. అధికారిక మోతగాండ్రైన కెహాతీయ లేవీయులు మాత్రమే మందసానికి ప్రత్యేకంగా నిర్మింపబడిన రింగుల్లోనికి కర్రలను పెట్టి ఉపయోగిస్తూ తమ భుజాలపై మందసాన్ని మోయాలి. (నిర్గమకాండము 25:13, 14; సంఖ్యాకాండము 4:15, 19; 7:7-9) ఈ ఉపదేశాల్ని నిర్లక్ష్యం చేయడం విపత్తును తెచ్చింది. దాదాపు బండి పడిపోయేంతగా ఎద్దు లాగినప్పుడు, బహుశా లేవీయుడే అయినా కచ్చితంగా యాజకుడుకాని ఉజ్జియా మందసాన్ని సరిచేయడానికి సమీపించాడు, అతని అగౌరవనీయమైన పనినిబట్టి యెహోవాచే మొత్తబడ్డాడు.—2 సమూయేలు 6:6, 7.

ఈ విషయంలో రాజుగా దావీదు కొంత బాధ్యత వహించాల్సిందే. యెహోవాతో సత్సంబంధాన్ని కల్గివున్నవారు కూడా విపత్కరమైన పరిస్థితులకు అప్పుడప్పుడూ చెడుగా ప్రతిస్పందించగలరని ఆయన ప్రతిచర్య చూపుతోంది. మొదట దావీదు కోపపడ్డాడు. తర్వాత ఆయన భయపడ్డాడు. (2 సమూయేలు 6:8, 9) యెహోవాతో ఆయనకుగల నమ్మకమైన సంబంధం తీవ్రంగా శోధించబడింది. యెహోవా ఆజ్ఞలను తాను అనుసరించనప్పుడు, ఆయనపై తన భారాన్ని మోపడం విషయంలో తాను వైఫల్యం చెందినట్లు కన్పించినప్పటి సందర్భమిది. కొన్నిసార్లు మన పరిస్థితీ అదే అయ్యుండవచ్చా? యెహోవా ఉపదేశాల్ని మనం నిర్లక్ష్యపర్చడం ఫలితంగా వచ్చిన సమస్యల్నిబట్టి మనమెప్పుడైనా ఆయనను నిందించామా?—సామెతలు 19:3.

అపరాధ భారాన్ని తాళుకోవడం

తరువాత, దావీదు యెహోవా నైతిక ప్రమాణాలకు వ్యతిరేకంగా గంభీరమైన పాపాన్ని చేయడం ద్వారా తానుగా అపరాధం యొక్క ఓ పెద్ద భారాన్ని సృష్టించుకున్నాడు. ఈ సందర్భంలో యుద్ధంలో తన మనుష్యుల్ని నడిపించే బాధ్యతను దావీదు విస్మరించాడు. వారు యుద్ధానికిపోగా ఆయన యెరూషలేములోనే ఉన్నాడు. ఇదే గంభీరమైన సమస్యకు నడిపింది.—2 సమూయేలు 11:1.

రాజైన దావీదు అందమైన బత్సెబ స్నానం చేయడాన్ని చూశాడు. ఆయన ఆమెతో అనైతికంగా కలిశాడు, ఆమె గర్భవతియైంది. (2 సమూయేలు 11:2-5) ఆ దుష్ప్రవర్తనను కప్పిపెట్టుకొనే ప్రయత్నంలో, ఆమె భర్తయైన ఊరియా యుద్ధక్షేత్రం నుండి యెరూషలేమునకు తిరిగి రావడం కొరకు ఆయన ఏర్పాటు చేశాడు. యుద్ధంలో ఇశ్రాయేలు ఇమిడివుండగా తన భార్యతో వైవాహిక సంబంధాల్ని కల్గివుండడాన్ని ఊరియా తిరస్కరించాడు. (2 సమూయేలు 11:6-11) తన పాపాన్ని కప్పిపుచ్చుకునేందుకు దుష్టమైన, కపటమైన మార్గాల్ని దావీదు ఇప్పుడు ఆశ్రయించాడు. ఆయన చంపబడేలా యుద్ధంలో భేద్యమైన స్థానమందు ఊరియాను విడిచిపెట్టేందుకు ఊరియా తోటి సైనికుల్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఎంత హేయకరమైన, ఘోరమైన పాపమో!—2 సమూయేలు 11:12-17.

అయినా, చివరకు దావీదు పాపం పట్టబడింది, ఆయన బయల్పర్చబడ్డాడు. (2 సమూయేలు 12:7-12) తనలో ప్రారంభమైన కామఫలితంగా తాను చేసిన పాప దుష్కృత్యాన్ని తాను గ్రహించినప్పుడు దావీదు పడిన బాధను, అపరాధ భారాన్ని ఊహించేందుకు ప్రయత్నించండి. బహుశా ఆయన ఓ భావోద్రేకి, సున్నితమైనవాడు గనుక తన స్వంత వైఫల్య భావంచే, ఆయన ఎంతో కృంగిపోయి ఉంటాడు. పూర్తిగా అయోగ్యుడినని ఆయన భావించి ఉండవచ్చు!

అయిననూ “నేను పాపము చేసితినని” ప్రవక్తయైన నాతానుతో ఒప్పుకుంటూ, దావీదు తన తప్పును త్వరగా గుర్తించాడు. (2 సమూయేలు 12:13) ఆయన ఎలా భావించాడో, తనను పవిత్రపరచి, క్షమించమని ఆయన యెహోవా దేవుని ఎలా విన్నవించుకున్నాడో కీర్తన 51 మనకు చెబుతోంది. ఆయన ఇలా ప్రార్థించాడు: “నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి. నా పాపమెల్లప్పుడు నా యెదుట నున్నది.” (కీర్తన 51:2, 3) ఆయన నిజంగా పశ్చాత్తాపపడినందున, ఆయన యెహోవాతో తన పటిష్ఠమైన సన్నిహిత సంబంధాన్ని పునర్నిర్మించుకోగలిగాడు. అనుతాప అయోగ్యతా భావాలపైనే దావీదు అవధానాన్ని నిలపలేదు. తన అపరాధాన్ని నమ్రతతో గుర్తించడంద్వారా, యథార్థమైన పశ్చాత్తాపాన్ని చూపడం ద్వారా, యెహోవా క్షమాపణ కొరకు విడువక ప్రార్థించడం ద్వారా యెహోవాపై తన భారాన్ని ఆయన వేశాడు. ఆయన దేవుని అనుగ్రహాన్ని మరలా పొందాడు.—కీర్తన 51:7-12, 15-19.

విశ్వాసఘాతుకాన్ని తాళుకోవడం

దావీదు కీర్తన 55ను వ్రాయడాన్కి ప్రేరేపించిన అంకానికి మనల్నిది తీసుకొస్తోంది. ఆయన గొప్ప భావోద్రేక ఒత్తిడికి గురయ్యాడు. “నా గుండె నాలో వేదనపడుచున్నది. మరణభయం నాలో పుట్టుచున్నది” అని ఆయన వ్రాశాడు. (కీర్తన 55:4) ఈ వేదనకు ఏది కారణమైంది? దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదు నుండి రాజ్యాధిపత్యాన్ని అపహరించడాన్కి పథకం వేశాడు. (2 సమూయేలు 15:1-6) తన స్వంత కుమారునిచే జరిగించబడిన ఈ విశ్వాసఘాతుకం తట్టుకోవడం కష్టమైనా దావీదు యొక్క అత్యంత నమ్మకమైన సలహాదారుడైన అహీతోపెలు అను మనుష్యుడు దావీదుకు వ్యతిరేకంగా కుట్రలో చేరడం దానిని మరీ చెడ్డదిగా చేసింది. కీర్తన 55:12-14లో దావీదు వర్ణించిన వాడు అహీతోపెలే. కుట్ర, విశ్వాసఘాతుకాల ఫలితంగా దావీదు యెరూషలేమునకు పారిపోయాడు. (2 సమూయేలు 15:13, 14) ఇది ఆయనకు ఎంతటి విచారానికి కారణమైందో!

అప్పటికీ యెహోవాయందలి తన నమ్మకాన్ని విశ్వాసాన్ని బలహీనపర్చేందుకు, తన ప్రగాఢమైన భావోద్రేకాన్ని, విచారాన్ని ఆయన అనుమతించలేదు. కుట్రదారుల పథకాలను చెడగొట్టమని ఆయన యెహోవాకు ప్రార్థన చేశాడు. (2 సమూయేలు 15:30, 31) అంతా యెహోవాయే చేస్తాడులే అని దావీదు ఊరకనే వేచి ఉండకపోవడాన్ని మనం మరలా గమనిస్తాం. తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఎదుర్కొనే అవకాశం దానంతటదే రాగానే తాను చేయగల్గినంత చేశాడు. అయినా ఆ కుట్రలో చేరుతున్నట్లు నటించడానికి యెరూషలేములోనికి తన సలహాదారుల్లో మరొకడైన హూషైను తిరిగి పంపించాడు, ఆయన నిజానికి వాటిని నీరుగార్చడానికే వెళ్లాడు. (2 సమూయేలు 15:32-34) యెహోవా మద్దతుతో ఈ పథకం పనిచేసింది. తిరిగి సమకూడడానికి మరియు తనను తాను కాపాడుకోవడానికి దావీదు కొరకు హూషై పాగా వేశాడు.—2 సమూయేలు 17:14.

యెహోవా యొక్క రక్షిత శ్రద్ధ అలాగే ఆయన సహనం, క్షమించే సుముఖతలను దావీదు తన జీవితమంతా ఎంతగా ప్రశంసించి ఉండవచ్చో కదా! (కీర్తన 34:18, 19; 51:17) మన విపత్కరమైన కాలంలో సహాయం కొరకు యెహోవావైపు మళ్లేందుకు, ‘యెహోవాపై మన భారాన్ని వేసేందుకు’ దావీదు ఈ పూర్వ చరిత్రతో మనల్ని నమ్మకంగా ప్రోత్సహిస్తున్నాడు.—1 పేతురు 5:6, 7, పోల్చండి.

యెహోవాతో పటిష్ఠమైన, నమ్మకమైన సంబంధాన్ని నిర్మించి, పెంపొందించుకోండి

గొప్ప శోధన, శ్రమల కాలాల్లో దావీదును పరిరక్షించిన యెహోవాతో ఆయన కల్గివున్న సంబంధం వంటి సంబంధాన్ని మనమెలా పొందగలం? దేవుని వాక్యమైన బైబిలు యొక్క శ్రద్ధగల విద్యార్థులుగా ఉండడం ద్వారా మనం అటువంటి సంబంధాన్ని నిర్మించుకోగలం. తన చట్టాలు, సూత్రాలు మరి వ్యక్తిత్వం గురించి మనమాయనను బోధింపనిద్దాం. (కీర్తన 19:7-11) దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, మనం ఆయనకు మరింత సన్నిహితంగా ఉంటాం మరియు పూర్ణంగా ఆయనపై నమ్మకం ఉంచడాన్ని గురించి తెలుసుకుంటాం. (కీర్తన 143:1-5) యెహోవాచే ఇంకా ఉపదేశింపబడేందుకు తోటి ఆరాధికులతో మనం సహవసిస్తుండగా ఆ సంబంధాన్ని మనం ప్రగాఢంగా పటిష్ఠపర్చుకుంటాం. (కీర్తన 122:1-4) హృదయపూర్వకమైన ప్రార్థన ద్వారా యెహోవాతో మన సంబంధాన్ని మనం బలపర్చుకోగలం.—కీర్తన 55:1.

నిజమే, యెహోవాతో దావీదు సంబంధం ఉండాల్సినంత దృఢంగా లేనప్పుడు ఆయన, మనవలె క్రుంగుదలల్ని కల్గివున్నాడు. అణగద్రొక్కబడడం మనల్ని “వెఱ్ఱిగా ప్రవర్తించు”నట్లు చేయగలదు. (ప్రసంగి 7:7) అయినా జరుగుతున్నదానిని యెహోవా చూస్తున్నాడు, మన హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. (ప్రసంగి 4:1; 5:8) యెహోవాతో మన సంబంధాన్ని బలంగా ఉంచుకునేందుకు మనం కష్టపడాల్సివుంది. అప్పుడు ఎన్ని భారాల్ని మనం మోయాల్సి వచ్చినా, ఒత్తిళ్లనుండి విడుదల పొందేందుకు లేక మన పరిస్థితిని ఎదిరించేందుకు మనకు బలాన్ని ఇవ్వడానికి యెహోవాపై మనం ఆధారపడగలం. (ఫిలిప్పీయులు 4:6, 7, 13) ఇది యెహోవాతో మనం సన్నిహితంగా ఉండే విషయమే. దావీదు దీనిని చేసినప్పుడు, ఆయన పూర్తి భద్రతతో ఉన్నాడు.

కాబట్టి, మీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఎల్లప్పుడూ మీ భారాన్ని యెహోవా మీద మోపండని దావీదు చెబుతున్నాడు. అప్పుడు “ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు” అనే వాగ్దాన సత్యాన్ని మనం అనుభవిస్తాం—కీర్తన 55:22.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి