కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w04 2/15 పేజీలు 3-4
  • మతం దాని ప్రభావం మేలుకా, కీడుకా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మతం దాని ప్రభావం మేలుకా, కీడుకా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మతం పాత్ర​—మేలుకా, కీడుకా?
  • మతం లేకుంటేనే బాగుంటుందా?
  • మానవాళి సమస్యలకు మతమే మూలకారణమా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
    మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
w04 2/15 పేజీలు 3-4

మతం దాని ప్రభావం మేలుకా, కీడుకా?

“నేను క్రైస్తవ మతానికి రుణపడివున్నాను, మనం గత 2000 సంవత్సరాలుగా జీవిస్తున్న లోకం కూడా రుణపడివుందని నేను నమ్ముతున్నాను.”​—ముందుమాట, టు థౌజండ్‌ ఇయర్స్‌​—ద ఫస్ట్‌ మిల్లేనియం: ద బర్త్‌ ఆఫ్‌ క్రిస్టియానిటీ టు ద క్రూసేడ్స్‌.

“క్రైస్తవ మతాన్ని” బాహాటంగా ఆమోదిస్తూ ఆంగ్ల రచయిత, టీవీ ప్రసారకర్త అయిన మెల్విన్‌ బ్రాగ్‌ ఆ మాటలు పలికాడు. భూ జనాభాలోని లక్షలాదిమంది ఫలానిమతానికి ఎంతో రుణపడివున్నామని, దానికే యథార్థంగా కట్టుబడి ఉండాలని భావిస్తారు, మెల్విన్‌ బ్రాగ్‌ మాటలు వారి మనోభావాలను ప్రతిధ్వనిస్తున్నాయి. తమ జీవితాల్లో మతం మంచి ప్రభావం చూపిందని వారు బలంగా నమ్ముతారు. ఉదాహరణకు, ఇస్లామ్‌ “విశిష్ట నాగరికతను పురికొల్పిందనీ . . . [అది] మొత్తం ప్రపంచానికే మేలు చేసిందని” ఓ రచయిత చెబుతున్నాడు.

మతం పాత్ర​—మేలుకా, కీడుకా?

బ్రాగ్‌ ఆ తర్వాత పలికిన మాటలు, సార్వత్రికంగా మతానికి నిజంగా మేలుచేసే బలమైన శక్తి ఉందా అనే గంభీరమైన ప్రశ్నను లేవదీశాయి. ఆయనింకా ఇలా అన్నాడు: “అలాగే క్రైస్తవ మతం నాకు ఓ వివరణ బాకీవుంది.” ఆయన ఏ వివరణ కోరుతున్నాడు? “దాని ‘చరిత్రలో’ ఎక్కువభాగం మత దురభిమానం, దుష్టత్వం, అమానుషత్వం, బుద్ధిపూర్వక అజ్ఞానం వంటివి ఎందుకున్నాయి అనే విషయంలో” అని ఆయన చెబుతున్నాడు.

చరిత్రంతటిలోనూ ప్రపంచ మతాల్లో అత్యధికం దురభిమానం, దుష్టత్వం, అమానుషత్వం, బుద్ధిపూర్వక అజ్ఞానంవంటి లక్షణాలతో గుర్తించబడ్డాయని చాలామంది చెబుతారు. మతం మానవులకు మేలుచేస్తున్నట్లు వేషం మాత్రం ధరించి, సచ్ఛీలత, పరిశుద్ధత అనే ఆ మోసకరమైన ముసుగు క్రింద నిజానికది పూర్తి వేషధారణతో, అబద్ధాలతో నిండివున్నట్లు వారు దృష్టిస్తారు. (మత్తయి 23:27, 28) “నాగరికతకు సంబంధించి మతానికున్న ప్రత్యేక విలువ గురించి మన సాహిత్యాల్లో లెక్కలేనన్నిసార్లు పేర్కొనబడింది. అయితే ఆ మాటలు చారిత్రక వాస్తవాలచే వట్టి అబద్ధాలుగా నిరూపించబడ్డాయి” అని ఎ రేషనలిస్ట్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది.

ఈ రోజు ఏ వార్తాపత్రిక తీసుకున్నా అందులో ఒక ప్రక్క ప్రేమ, శాంతి, కనికరాల గురించి ప్రకటిస్తూనే మరో ప్రక్క ద్వేషాగ్నికి ఆజ్యంపోస్తూ తాము చేసే అమానుష పోరాటాలను న్యాయసమ్మతం చేయడానికి దేవుని పేరును ఉపయోగించే మతనాయకులకు సంబంధించి లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. అందువల్ల మతం జీవితంలో తరచూ వినాశక శక్తిగానే ఉన్నట్లు చాలామంది భావించడంలో ఆశ్చర్యం లేదు!

మతం లేకుంటేనే బాగుంటుందా?

కొందరు ఆంగ్ల తత్వవేత్త బెర్టాండ్‌ రస్సెల్‌వలెనే చివరకు “అన్ని విధాలైన మత నమ్మకాలు ఉనికిలో లేకుండాపోతే” బాగుంటుందనే తీర్మానానికి వచ్చారు. వారి దృష్టిలో, మతాన్ని తొలగించడమే మానవ సమస్యలన్నిటికీ శాశ్వతమైన ఏకైక పరిష్కారం. అయితే, మతాన్ని నిరాకరించేవారు మతాన్ని బలంగా సమర్థించే వారి మాదిరిగానే ద్వేషాన్ని, దురభిమానాన్ని పుట్టించగలరనే వాస్తవాన్ని వారు అలక్ష్యం చేస్తున్నారు. మతాంశాల రచయిత్రి కారెన్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మనకిలా గుర్తుచేస్తోంది: “ఎంతలేదన్నా, లౌకికవాద ఆలోచనా విధానం కూడా మతసంబంధ పవిత్ర యుద్ధాల్లాగే మారణహోమంగా ఉండగలదని జరిగిన జననహననాలు చూపిస్తున్నాయి.”​—ద బ్యాటిల్‌ ఫర్‌ గాడ్‌​—ఫండమెంటలిజమ్‌ ఇన్‌ జుడాయిజమ్‌, క్రిస్టియానిటీ అండ్‌ ఇస్లామ్‌.

కాబట్టి మతం నిజంగా మేలు చేస్తుందా లేక మానవాళి సమస్యలకు అదే మూలకారణమా? అసలు మతాన్నే ఉనికిలో లేకుండా తొలగించడం సమస్యలకు పరిష్కారమవుతుందా? దీని గురించి బైబిలు ఏమిచెబుతుందో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలించండి. దానికి లభించే జవాబు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి