కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w07 9/1 పేజీ 31
  • పాఠకుల ప్రశ్నలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పాఠకుల ప్రశ్నలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ‘దాసుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • నమ్మకమైన, బుద్ధిగల దాసుడు ఎవరు?
    నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు చేస్తున్నారు?
  • వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
w07 9/1 పేజీ 31

పాఠకుల ప్రశ్నలు

యేసు తన నమ్మకమైన దాసుడు “బుద్ధిమంతుడు” అయ్యుంటాడని చెప్పడంలో ఆయన ఉద్దేశమేమిటి?

యేసు ఇలా ప్రశ్నించాడు: “యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు?” (మత్తయి 24:45) ఆధ్యాత్మిక “అన్నము” అందిస్తున్న “దాసుడు” ఆత్మాభిషిక్త క్రైస్తవుల సంఘం. యేసు వారిని బుద్ధిమంతుడు అని ఎందుకు పిలిచాడు?a

“బుద్ధిమంతుడు” అనే పదాన్ని ఉపయోగించడంలో యేసు ఉద్దేశమేమిటో మనమాయన స్వంత బోధల నుండి చక్కగా అర్థంచేసుకోవచ్చు. ఉదాహరణకు, యేసు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” గురించి మాట్లాడినప్పుడు, పెండ్లికుమారుని రాకకోసం ఎదురుచూస్తున్న పదిమంది కన్యకల ఉపమానాన్ని చెప్పాడు. కన్యకలు, గొప్ప పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు రాకకోసం 1914కు ముందు ఆతురతతో ఎదురుచూస్తున్న అభిషిక్త క్రైస్తవులను మనకు గుర్తుచేస్తారు. పదిమంది కన్యకల్లో, పెండ్లికుమారుడు వచ్చే సమయానికి ఐదుగురి దగ్గర సరిపడా నూనె లేకపోవడంతో వారు పెండ్లి విందులో పాల్గొనలేకపోయారు. మిగతా ఐదుగురు బుద్ధిగలవారిగా నిరూపించుకున్నారు. సరిపడా నూనె వారిదగ్గర ఉన్నందువల్ల వారు పెండ్లికుమారుడు వచ్చిన సమయానికి తమ వెలుగును ప్రకాశిస్తూ ఉండగలిగారు కాబట్టే పెండ్లి విందులో పాల్గొనగలిగారు.—మత్తయి 25:10-12.

యేసు 1914లో తన రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు, అభిషిక్త క్రైస్తవుల్లోని అనేకులు వెంటనే తాము కూడా పరలోకానికి వెళ్ళి ఆయనతోపాటు పరిపాలిస్తామని ఎదురుచూశారు. అయితే, వారు భూమిపై చేయాల్సిన పని చాలా ఉంది, కానీ కొంతమంది దానికి సిద్ధంగా లేరు. బుద్ధిలేని కన్యకల్లా వారు, ముందుగానే తమను తాము ఆధ్యాత్మికంగా బలపర్చుకోలేదు, కాబట్టి వారు వెలుగు ప్రకాశకులుగా కొనసాగేందుకు సిద్ధంగాలేరు. అయితే చాలామంది బుద్ధి కలిగి, అంటే తెలివితో, ముందుచూపుతో చర్య తీసుకుని ఆధ్యాత్మికంగా బలపర్చబడ్డారు. చేయాల్సిన పని చాలావుందని వారు గ్రహించినప్పుడు, దానిని పూర్తిచేసేందుకు సంతోషంగా సిద్ధపడ్డారు. కాబట్టి, వారు ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసునిగా’ నిరూపించుకున్నారు.

మత్తయి 7:24లో యేసు, ‘బుద్ధిమంతుడు’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని కూడా పరిశీలించండి. యేసు ఇలా చెప్పాడు: “యీ నా మాటలు విని వాటిచొప్పున చేయు ప్రతివాడును బండమీద తన యిల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును.” తుఫాను వచ్చే అవకాశమున్న దృష్ట్యా బుద్ధిమంతుడైన వ్యక్తి తన ఇంటిని స్థిరంగా కట్టుకుంటాడు. దానికి భిన్నంగా, బుద్ధిహీనుడు ఇసుకమీద తన ఇంటిని కట్టుకొని దానిని పోగొట్టుకుంటాడు. ఆ విధంగా, మానవ బుద్ధిని అనుసరించడం వల్ల వచ్చే చెడు పరిణామాలను ముందే గ్రహించేవాడే బుద్ధిమంతుడైన యేసు అనుచరుడు. ఆ బుద్ధిమంతుని వివేచన, యుక్తాయుక్త పరిజ్ఞానం, ఆయన తన విశ్వాసానికి, క్రియలకు, బోధలకు యేసు బోధించిన వాటిని ఆధారంగా తీసుకునేలా ఆయనను నడిపిస్తాయి. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అలాగే ప్రవర్తిస్తాడు.

హెబ్రీ లేఖనాల అనేక అనువాదాల్లో “బుద్ధిమంతుడు” అని అనువదించబడిన పదం ఎలా ఉపయోగించబడిందో కూడా గమనించండి. ఉదాహరణకు, ఫరో ఐగుప్తీయుల ఆహార సరఫరా మీద యోసేపును అధికారిగా నియమించాడు. ఇది తన ప్రజలకు ఆహారాన్ని సరఫరా చేయలనే యెహోవా ఏర్పాటులో భాగం. యోసేపే ఎందుకు ఎన్నుకోబడ్డాడు? ఫరో ఆయనతో ఇలా చెప్పాడు: “నీవలె వివేక [“బుద్ధి,” NW] జ్ఞానములు గలవారెవరును లేరు.” (ఆదికాండము 41:33-39; 45:5) అదే విధంగా బైబిలు, అబీగయీలు ‘సుబుద్ధిగలది’ అని చెబుతోంది. ఆమె యెహోవా అభిషిక్తుడైన దావీదుకు, అతని దాసులకు ఆహారాన్ని అందించింది. (1 సమూయేలు 25:3, 11, 18) యోసేపు, అబీగయీలు, దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుచూపుతో, యుక్తాయుక్త పరిజ్ఞానంతో ప్రవర్తించారు కాబట్టి వారు బుద్ధిమంతులని పిలవబడవచ్చు.

అందువల్ల, యేసు నమ్మకమైన దాసుణ్ణి బుద్ధిమంతుడు అని పేర్కొన్నప్పుడు ఆయన, ఆ దాసునికి ప్రాతినిధ్యం వహించేవారు తమ విశ్వాసానికి, క్రియలకు, బోధలకు దేవుని వాక్య సత్యాన్ని ఆధారంగా తీసుకొంటారు కాబట్టి వివేచనను, ముందుచూపును, యుక్తాయుక్త పరిజ్ఞానాన్ని కనబరుస్తారని సూచించాడు.

[అధస్సూచి]

a ప్రోనిమోస్‌ అనే గ్రీకు పదం “బుద్ధిమంతుడు” అని అనువదించబడింది. యమ్‌. ఆర్‌. విన్సెంట్‌ రచించిన వర్డ్‌ స్టడీస్‌ ఇన్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ అనే గ్రంథం, ఈ పదం ఎంతో తరచుగా లెస్సయైన జ్ఞానాన్ని, వివేచనను సూచిస్తుందని వ్యాఖ్యానిస్తోంది.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి