కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w09 4/1 పేజీలు 3-4
  • దేవుని గురించి మీకెంతవరకు తెలుసు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని గురించి మీకెంతవరకు తెలుసు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వీటికి జవాబులు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
  • ఎవరి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
  • ‘సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యోహాను 14:6—“నేనే మార్గమును, సత్యమును, జీవమును”
    బైబిలు వచనాల వివరణ
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
w09 4/1 పేజీలు 3-4

దేవుని గురించి మీకెంతవరకు తెలుసు?

మీ అభిప్రాయమేమిటి? చాలామంది దేవుడు ఉన్నాడని నమ్ముతారు. వాళ్ళకు ఆయనంటే భక్తి, నమ్మకం ఉంటాయి. కానీ ఆయన గురించి వారికి పెద్దగా తెలీదు. మీరు దేవుడున్నాడని నమ్ముతుంటే ఈ ప్రశ్నలకు జవాబివ్వగలరేమో చూడండి.

1. దేవునికి వ్యక్తిత్వం ఉందా?

2. దేవునికి ఒక పేరుందా?

3. యేసు సర్వశక్తిగల దేవుడా?

4. దేవునికి నేనంటే పట్టింపు ఉందా?

5. మనమెలా ఆరాధించినా దేవునికి నచ్చుతుందా?

ఈ ప్రశ్నలకు ఒక్కొక్కరు ఒక్కోలా జవాబిస్తారు. అందుకే, లోకంలో దేవుని గురించిన పురాణాలు, తప్పుడు నమ్మకాలు ఏర్పడ్డాయి.

వీటికి జవాబులు తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

భక్తిపరురాలైన ఒక స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, దేవుని గురించి సత్యం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రవక్త అని ఆమె అర్థంచేసుకుంది. కానీ ఒక విషయం మాత్రం ఆమెకు అంతుబట్టలేదు. అదేమిటంటే, ఆమెదీ, యేసుదీ వేర్వేరు మతాలు. ఈ విషయాన్నే ఆమె యేసును అడిగినప్పుడు ఆయన ‘మీరు మీకు తెలియనిదానిని ఆరాధిస్తున్నారు’ అని అన్నాడు. (యోహాను 4:19-22) ఆయనెందుకు అలా అన్నాడు? భక్తిపరులందరికీ దేవుని గురించి ఖచ్చితంగా తెలుసు అని చెప్పలేము.

మరైతే దేవుని గురించి అసలెవరూ తెలుసుకోలేరని యేసు ఉద్దేశమా? ఆయన ఉద్దేశం అది కాదు. యేసు ఆ స్త్రీతో, ‘యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధిస్తారు’ అని కూడా చెప్పాడు. (యోహాను 4:23) మీరు కూడా దేవుణ్ణి ‘ఆత్మతో సత్యముతో’ ఆరాధిస్తున్నారా?

మీరలా దేవుణ్ణి సత్యంతో ఆరాధిస్తున్నారో లేదో చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే సత్యం లేదా సరైన జ్ఞానం ఎంత ప్రాముఖ్యమో యేసు తన ప్రార్థనలో చెబుతూ ‘అద్వితీయ సత్యదేవుడైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం’ అని అన్నాడు. (యోహాను 17:3) మీరు దేవుని గురించిన సత్యాన్ని తెలుసుకుంటేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది.

దేవుని గురించి సత్యం తెలుసుకోవడం నిజంగా సాధ్యమేనా? అవును ఖచ్చితంగా సాధ్యమే! మరి మీరు ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవచ్చు? ‘నేనే మార్గం, సత్యం, జీవం; నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రియొద్దకు రారు’ అని యేసు చెప్పాడు. (యోహాను 14:6) ‘తండ్రి ఎవరో, కుమారుడును, కుమారుడెవరికి ఆయనను బయలుపరచాలని ఉద్దేశించాడో వారును తప్ప, మరెవరును ఎరుగరు’ అని కూడా ఆయన చెప్పాడు.—​లూకా 10:22.

కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు బోధలను అర్థంచేసుకోవాలి. యేసే స్వయంగా ఇలా మాటిస్తున్నాడు, “మీరు నా బోధనలు పాటిస్తే, మీరు నా నిజమైన శిష్యులు. అప్పుడు మీరు సత్యాన్ని గురించి తెలుసుకుంటారు. ఆ సత్యమే మీకు స్వేచ్ఛ కలిగిస్తుంది.”—​యోహాను 8:31, 32, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

దట అడిగిన ఐదు ప్రశ్నలకు యేసు ఇచ్చిన జవాబులేమిటి? (w09 2/1)

[4వ పేజీలోని చిత్రం]

దేవుని గురించి తెలియకుండానే మీరు ఆయనను ఆరాధిస్తున్నారా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి