కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 1/1 పేజీ 21
  • ఆయన మనలో మంచి కోసం చూస్తాడు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఆయన మనలో మంచి కోసం చూస్తాడు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మంచి దేశములో’ ఒక ఏడాది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • “ఆహా! ఆయన మంచితనం ఎంత గొప్పది!”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • విస్మయము నొందించు విశాలమైన దేవుని మంచితనము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • యెహోవా —మంచితనానికి సర్వోత్కృష్టమైన మాదిరి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 1/1 పేజీ 21

దేవునికి దగ్గరవ్వండి

ఆయన మనలో మంచి కోసం చూస్తాడు

1 రాజులు 14:13, NW

‘యెహోవా అందరి హృదయాలను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ ఎరిగినవాడు.’ (1 దినవృత్తాంతములు 28:9) యెహోవాకు మనమీద ఎంతో శ్రద్ధ ఉందని తెలుసుకుని మనం ఆయన పట్ల ఎంతో కృతజ్ఞత కలిగివుండాలని ఆ ప్రేరేపిత మాటలు రాయబడ్డాయి. మనం ఎంతమాత్రం పరిపూర్ణులం కాకపోయినా యెహోవా మన హృదయంలో మంచి కోసం చూస్తాడు. అబీయా గురించి ఆయన చెప్పిన మాటల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆ మాటలు 1 రాజులు 14:13లో ఉన్నాయి.

అబీయా ఇంటివాళ్లు చాలా దుష్టులు. ఆయన తండ్రి యరొబాము మతభ్రష్ట రాజ్యానికి రాజు.a యెహోవా యరొబాము ఇంటి వాళ్లందరినీ ‘పెంటను ఊడ్చేసినట్లు’ ఊడ్చేయాలని అనుకున్నాడు. (1 రాజులు 14:10) కానీ, యరొబాము కుటుంబంలో ఒక్కరే, అంటే ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్న అబీయా మాత్రమే గౌరవప్రదంగా సమాధి చేయబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు.b ఎందుకు? ఎందుకంటే, ‘యరొబాము ఇంటి వాళ్లలో ఇతనిలోనే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దృష్టికి మంచిదైనదేదో కనిపించింది.’ (1 రాజులు 14:1, 12, 13, NW) ఈ మాటలను బట్టి అబీయా గురించి ఏమి తెలుసుకోవచ్చు?

అబీయా యెహోవాను నమ్మకంగా ఆరాధించాడని బైబిలు చెప్పడం లేదు. అయినా, ఆయనలో కొంత మంచితనం ఉంది. ఆయన ‘యెహోవా దృష్టికి మంచిదైనదేదో’ చేశాడు, అంటే బహుశా ఆయన ఆరాధనకు సంబంధించిన విషయాల్లో మంచితనం చూపించివుంటాడు. అబీయా యెరూషలేములోవున్న ఆలయానికి వెళ్లివుంటాడని లేదా ఇశ్రాయేలీయులు యెరూషలేముకు వెళ్లకుండా ఆపడానికి ఆయన తండ్రి ఏర్పాటు చేసిన కాపలాదారులను తీసివేసివుంటాడని యూదా మత రచయితలు అభిప్రాయపడుతున్నారు.

అబీయా ఎలాంటి మంచితనాన్ని చూపించాడో మనకు తెలీకపోయినా ఆయన మంచితనం గమనించదగినది. మొదటిగా, ఆయన మంచితనాన్ని మనస్ఫూర్తిగా చూపించాడు. ఆ మంచితనం ‘అతనిలో’ అంటే అతని హృదయంలో ఉంది. రెండవదిగా, ఆయన చూపించిన మంచితనం అసాధారణమైనది. అబీయా ‘యరొబాము ఇంటివాళ్లలో’ ఒకడైనా సరే ఈ మంచితనాన్ని చూపించాడు. ఒక పండితుడు ఇలా చెప్తున్నాడు, “చెడ్డ స్థలాల్లో, చెడ్డ కుటుంబాల్లో ఉంటూ కూడా తమ మంచితనాన్ని విడిచిపెట్టని వాళ్లు నిజంగా అభినందనీయులే.” మరొక పండితుడు చెప్తున్నట్లు, అబీయా మంచితనం “గమనార్హమైనది. ఎలాగంటే, ఆకాశం నల్లగా ఉన్నప్పుడు నక్షత్రాలు మిలమిల మెరుస్తాయి, చుట్టూ ఉన్న చెట్లు నిర్జీవంగా ఉన్నప్పుడు దేవదారు వృక్షం ఎంతో అందంగా కనిపిస్తుంది.”

మరింత ముఖ్యంగా 1 రాజులు 14:13లోని మాటలు యెహోవా గురించి, ఆయన మనలో ఏమి చూస్తాడనే దాని గురించి ఒక చక్కని విషయం తెలియజేస్తున్నాయి. అబీయాలో మంచిదైనదేదో ‘కనిపించిందనే’ విషయం గుర్తుచేసుకోండి. యెహోవా అబీయా హృదయంలో మంచితనం లేశమాత్రమైనా కనబడేంత వరకూ వెదికాడని స్పష్టంగా అర్థమవుతోంది. అబీయా, ఆయన కుటుంబ సభ్యులతో పోలిస్తే, “ఎన్నో గుళకరాళ్ల మధ్యన” ఏకైక ముత్యంలాంటివాడని ఒక పండితుడు అంటున్నాడు. యెహోవా ఈ మంచితనాన్ని విలువైనదిగా ఎంచి, దానికి ప్రతిఫలంగా చెడ్డ కుటుంబంలోని ఈ సభ్యుడి మీద కొంత కనికరం చూపించాడు.

మనలో అపరిపూర్ణతలున్నా యెహోవా మనలో మంచి కోసం చూస్తాడనీ, దాన్ని విలువైనదిగా ఎంచుతాడనీ తెలుసుకోవడం నిజంగా మనకు ఊరటనివ్వడంలేదా? (కీర్తన 130:3) దీన్ని తెలుసుకుంటే, మన హృదయంలో లేశమాత్రం మంచితనం ఉన్నా దానిని జాగ్రత్తగా పరిశీలించే యెహోవా దేవునికి దగ్గరవ్వాలనే కోరిక మనలో కలుగుతుంది. (w10-E 07/01)

[అధస్సూచీలు]

a ప్రజలు యెహోవాను ఆరాధించడానికి యెరూషలేములోవున్న ఆలయం వరకు వెళ్లకుండా ఉండడం కోసం, యరొబాము ఇశ్రాయేలు పది గోత్రాల ఉత్తర రాజ్యంలో దూడను ఆరాధిస్తూ విగ్రహారాధనను ప్రారంభించాడు.

b బైబిలు కాలాల్లో, ఎవరైనా సరిగ్గా సమాధి చేయబడకపోతే వాళ్లమీద దేవుని అనుగ్రహం లేనట్టు పరిగణించబడేది.—యిర్మీయా 25:32, 33.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి