కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w11 4/1 పేజీలు 28-29
  • మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఈ పత్రికలో
    తేజరిల్లు!—2018
  • మనం తెలుసుకోవడానికి ఇష్టపడే ఒక రహస్యం
    చిన్నారుల కోసం బైబిలు పాఠాలు
  • క్రైస్తవులు దాయకూడని ఓ రహస్యం!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఒక పరిశుద్ధ మర్మము వెల్లడియగుచున్నది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
w11 4/1 పేజీలు 28-29

మీ పిల్లలకు నేర్పించండి

మీరు ఇతరులకు చెప్పగలిగే ఒక రహస్యం

మీకెవరైనా ఎప్పుడైనా ఒక రహస్యం చెప్పారా?—a నేను మీకో రహస్యం చెబుతాను. అదో పరిశుద్ధ రహస్యం. దీన్ని, ‘ఎన్నో సంవత్సరాల నుండి దాచబడిన ఒక రహస్యం’ అని బైబిలు అంటోంది. (ఏటవాలు ముద్దక్షరాలు మావి; రోమీయులు 16:25, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మొదట్లో దేవునికే ఆ పరిశుద్ధ ‘రహస్యం’ తెలుసు. ఆ రహస్యం అందరికీ తెలిసేలా దేవుడు ఎలా చేశాడో చూద్దాం.

ముందుగా, పరిశుద్ధం అంటే ఏమిటో మీకు తెలుసా?— పరిశుద్ధం అనే పదానికి పవిత్రమైన, పరిశుభ్రమైన లేదా చాలా ప్రత్యేకమైన అనే అర్థాలున్నాయి. ఆ రహస్యం పరిశుద్ధ దేవుని నుండి వచ్చింది కాబట్టి దాన్ని పరిశుద్ధ రహస్యమని అంటారు. ఈ ప్రత్యేకమైన రహస్యాన్ని ఎవరు తెలుసుకోవాలనుకున్నారు?— దేవదూతలు తెలుసుకోవాలనుకున్నారు. ‘దేవదూతలు దాని గురించి తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు’ అని బైబిలు చెబుతోంది. వాళ్లు ఆ పవిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలనుకున్నారు.—1 పేతురు 1:12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

యేసు ఈ భూమ్మీదకు వచ్చాక, ఆ పరిశుద్ధ రహస్యం గురించి మాట్లాడుతూ దాన్ని వివరించడం మొదలుపెట్టాడు. ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు, ‘దేవుని రాజ్యం గురించిన పరిశుద్ధ రహస్యం మీకు ఇవ్వబడింది.’ (మార్కు 4:11, NW) ఆ పరిశుద్ధ రహస్యం దేనికి సంబంధించినదో మీరు గమనించారా?— అది దేవుని రాజ్యానికి సంబంధించినది. యేసు దాని గురించే ప్రార్థించమని మనకు బోధించాడు.—మత్తయి 6:9, 10.

యేసు భూమ్మీదకు వచ్చి వివరించడం మొదలుపెట్టేంత వరకు, దేవుని రాజ్యం ‘ఎన్నో సంవత్సరాలు’ ఒక రహస్యంగా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆదాము, హవ్వ దేవుని ఆజ్ఞ మీరి ఏదెను తోట నుండి వెళ్లగొట్టబడినా, ఈ భూమినంతా పరదైసుగా చేయాలన్న దేవుని సంకల్పం మాత్రం మారలేదని దేవుని సేవకులు తెలుసుకున్నారు. (ఆదికాండము 1:26-28; 2:8, 9; యెషయా 45:18) దేవుని రాజ్యంలో భూమ్మీద ప్రజలు పొందే సంతోషం గురించి వాళ్లు రాశారు.—కీర్తన 37:11, 29; యెషయా 11:6-9; 25:8; 33:24; 65:21-24.

దేవుని రాజ్యానికి రాజెవరో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడు ఎవరిని రాజుగా నియమించాడో మీకు తెలుసా?— ఆయన కుమారుణ్ణి, అంటే “సమాధానకర్తయగు అధిపతి” అయిన యేసుక్రీస్తును. ‘ఆయన భుజమ్మీద రాజ్యభారం ఉంటుంది’ అని బైబిలు చెబుతోంది. (యెషయా 9:6, 7) మనం ‘దేవుని పరిశుద్ధ రహస్యం గురించి, అంటే, క్రీస్తు గురించి తెలుసుకోవాలి.’ (కొలొస్సయులు 2:1, 2, NW) దేవుడు తను సృష్టించిన మొదటి దేవదూత జీవాన్ని మరియ గర్భంలో ఉంచాడని మనం తెలుసుకోవాలి. మనం నిత్యజీవం పొందగలిగేలా, ఎంతో శక్తిగల దేవదూతగా ఉన్న ఆ కుమారుడు తన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి దేవుడు ఆయనను భూమ్మీదకు పంపించాడు.—మత్తయి 20:28; యోహాను 3:16; 17:3.

అయితే, మనం ఈ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే, దేవుడు తన రాజ్యానికి రాజుగా యేసును నియమించాడనే దానికన్నా ఎక్కువే తెలుసుకోవాలి. పునరుత్థానం చేయబడిన యేసుతోపాటు వేరే స్త్రీపురుషులు కూడా పరలోకంలో పరిపాలన చేస్తారు. ఇది కూడా ఆ పరిశుద్ధ రహస్యంలో ఒక భాగమే!—ఎఫెసీయులు 1:8-12.

యేసుతోపాటు పరలోకంలో పరిపాలన చేసే వాళ్లలో కొంతమంది పేర్లను తెలుసుకుందాం. యేసు, ‘మీ కోసం స్థలం సిద్ధపర్చడానికి’ పరలోకానికి వెళ్తున్నానని తన నమ్మకమైన అపొస్తలులతో చెప్పాడు. (యోహాను 14:2, 3) ఈ కింద ఇవ్వబడిన లేఖనాలను పరిశీలిస్తే, యేసుతోపాటు ఆయన తండ్రి రాజ్యంలో పరిపాలన చేసే కొంతమంది స్త్రీపురుషుల పేర్లు మీరు తెలుసుకుంటారు.—మత్తయి 10:2-4; మార్కు 15:39-41; యోహాను 19:25.

యేసుతోపాటు ఎంతమంది పరిపాలన చేస్తారనేది చాలాకాలం వరకు రహస్యంగా ఉంది. అయితే ఎంతమంది అనేది ఇప్పుడు మనకు తెలిసింది. ఎంతమందో మీకు తెలుసా?— 1,44,000 మంది అని బైబిలు చెబుతోంది. ఇది కూడా ఆ పరిశుద్ధ రహస్యంలో ఒక భాగమే.—ప్రకటన 14:1, 4.

‘దేవుని రాజ్యం గురించిన ఈ పరిశుద్ధ రహస్యం’ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఎంతో అద్భుతమైన రహస్యమని మీరు ఒప్పుకుంటారా?— అలాగైతే, ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పడం కోసం, దాని గురించి మనం నేర్చుకోగలిగినంత నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. (w10-E 12/01)

a మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.

ప్రశ్నలు:

  • మనం తెలుసుకున్న రహస్యాన్ని ఏమంటారు, దాన్ని ఎందుకు అలా అంటారు?

  • ఆ రహస్యం ఏమిటి, దాన్ని ప్రజలకు మొదట ఎవరు చెప్పడం మొదలుపెట్టారు?

  • ఆ రహస్యం గురించి మీరు తెలుసుకున్న కొన్ని విషయాలు ఏమిటి?

  • పరిశుద్ధ రహస్యాన్ని మీరు మీ స్నేహితులకు ఎలా వివరిస్తారు?

దేవదూతలు ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నించారని మీరు అనుకుంటున్నారు?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి