కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 4/1 పేజీలు 16-17
  • సరైన ఆరాధన ఏదో ఎలా తెలుసుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సరైన ఆరాధన ఏదో ఎలా తెలుసుకోవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • సరైన ఆరాధనను ఎలా గుర్తుపట్టవచ్చు?
    దేవుడు చెప్తున్న మంచివార్త!
  • దేవుడు ఆమోదించే ఆరాధన
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
  • మీరు నిజమైన మతాన్ని ఎలా కనుగొనగలరు?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • నిజమైన మతం ఏదో నేనెలా తెలుసుకోవాలి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 4/1 పేజీలు 16-17

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

సరైన ఆరాధన ఏదో ఎలా తెలుసుకోవచ్చు?

ఈ ఆర్టికల్‌సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు మీ బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. సరైన మతం ఒక్కటే ఉందా?

యేసు తన అనుచరులకు ఒకే ఒక్క మతం గురించి అంటే సరైన మతం గురించి బోధించాడు. అది జీవానికి నడిపించే మార్గం లాంటిది. ఆ మార్గం గురించి మాట్లాడుతూ యేసు, “దాని కనుగొనువారు కొందరే” అని చెప్పాడు. (మత్తయి 7:13, 14) తన సత్య వాక్య ప్రకారం ఉన్న ఆరాధననే దేవుడు అంగీకరిస్తాడు. నిజమైన ఆరాధకులందరికీ ఒకే విశ్వాసం ఉంటుంది.—యోహాను 4:23, 24; 14:6; ఎఫెసీయులు 4:4, 5 చదవండి.

2. అబద్ధ ఆచారాలు ఎలా వ్యాప్తి చెందాయి?

అబద్ధ ప్రవక్తలు క్రైస్తవత్వాన్ని భ్రష్టుపట్టించి, తమ సొంత ప్రయోజనాల కోసం దాన్ని వాడుకున్నారు. యేసు ముందే చెప్పినట్లు, ఆయన ‘గొర్రెలం’ అని వాళ్లు చెప్పుకుంటున్నారు గానీ నిజానికి వాళ్లు క్రూరమైన తోడేళ్లలా ప్రవర్తిస్తున్నారు. (మత్తయి 7:13-15, 21, 23) ముఖ్యంగా యేసు అపొస్తలులు చనిపోయిన తర్వాతే క్రైస్తవత్వంలో అబద్ధ ఆచారాలు వ్యాప్తి చెందాయి.—అపొస్తలుల కార్యములు 20:29, 30 చదవండి.

3. సరైన ఆరాధన చేసేవాళ్లు ఏమి చేయాలి?

సరైన ఆరాధన చేసేవాళ్లు బైబిలును దేవుని వాక్యమని నమ్మి దాన్ని గౌరవిస్తారు. వాళ్లు దానిలోని సూత్రాల ప్రకారం జీవించడానికి కృషి చేస్తారు. కాబట్టి సరైన మతానికీ, మనుషుల ఆలోచనలపై ఆధారపడిన మతానికీ తేడా ఉంటుంది. (మత్తయి 15:7-9) సరైన ఆరాధన చేసేవాళ్లు ఒకటి చెప్పి, మరొకటి చేయరు.—యోహాను 17:17; 2 తిమోతి 3:16, 17 చదవండి.

సరైన మతం యెహోవా దేవుని పేరును ఘనపరుస్తుంది. దేవుని పేరును యేసు తెలియజేశాడు. దేవుణ్ణి తెలుసుకునేందుకు ప్రజలకు సహాయం చేశాడు. దేవుని పేరు పరిశుద్ధపర్చబడాలని ప్రార్థించమని వాళ్లకు నేర్పించాడు. (మత్తయి 6:9, 10) దేవుని పేరు ఉపయోగించాలని మీ ప్రాంతంలోని ఏ మతం ప్రోత్సహిస్తోంది?—యోహాను 17:26; యోవేలు 2:32; రోమీయులు 10:14 చదవండి.

4. సరైన ఆరాధన చేసేవాళ్లను ఎలా గుర్తుపట్టవచ్చు?

నిజమైన క్రైస్తవులు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తారు. దేవుడు, ఆ రాజ్యం గురించి ప్రకటించమని యేసును పంపించాడు. దేవుని రాజ్యం మాత్రమే మానవుల సమస్యలన్నిటినీ పరిష్కరిస్తుంది. తన చివరి క్షణంవరకు యేసు దాని గురించి మాట్లాడాడు. (లూకా 4:43; 8:1; 23:42, 43) దేవుని రాజ్యం గురించి ప్రకటించమని ఆయన తన అనుచరులకు చెప్పాడు. ఎవరైనా మీతో దేవుని రాజ్యం గురించి మాట్లాడడానికి వస్తే వాళ్లు ఏ మతానికి చెందిన వాళ్లని మీరు అనుకుంటారు?—మత్తయి 10:7; 24:14 చదవండి.

యేసు అనుచరులకు ఈ చెడ్డ లోకంతో సంబంధం ఉండదు. వాళ్లు రాజకీయాల్లో లేదా సాంఘిక పోరాటాల్లో భాగం వహించరు. (యోహాను 17:16) అంతేకాదు, వాళ్లు హానికరమైన లోక ఆచారాలను, వైఖరులను అవలంబించరు.—యాకోబు 1:27; 4:4 చదవండి.

5. నిజమైన క్రైస్తవులను ముఖ్యంగా దేన్నిబట్టి తెలుసుకోవచ్చు?

నిజమైన క్రైస్తవులు ఒకరిపట్ల ఒకరు ఎంతో ప్రేమ చూపించుకుంటారు. అన్ని సంస్కృతుల ప్రజలను గౌరవించాలని వాళ్లు దేవుని వాక్యం నుండి నేర్చుకున్నారు. దేశాల మధ్య జరిగిన యుద్ధాలకు అబద్ధమతం తరచూ పూర్తి మద్దతునిచ్చింది. కానీ సరైన ఆరాధన చేసేవాళ్లు మాత్రం అలా చేయరు. (మీకా 4:1-4) వాళ్లు నిస్వార్థంగా తమ సమయాన్ని, తమకున్న వాటిని ఇతరులకు సహాయం చేయడానికి, ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు.—యోహాను 13:34, 35; 1 యోహాను 4:20, 21 చదవండి.

ఏ మత గుంపు దేవుని వాక్యం చెప్పేదాన్ని మాత్రమే బోధిస్తోంది? ఏది దేవుని నామాన్ని ఘనపరుస్తోంది? ఏది దేవుని రాజ్యమే మనుషుల సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారమని ప్రకటిస్తోంది? ఏ మత గుంపు, ఒకరిపట్ల ఒకరు ప్రేమ చూపించుకుంటూ యుద్ధాలకు మద్దతివ్వడం లేదు? మీకు అలాంటి మతం ఏదైనా తెలుసా? యెహోవాసాక్షులు అలాంటి మతాన్నే అవలంబిస్తున్నారని చాలామంది ఒప్పుకుంటారు.—1 యోహాను 3:10-12. (w11-E 08/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 15వ అధ్యాయం చూడండి.

[16వ పేజీలోని చిత్రం]

‘దేవుని ఎరుగుదుమని వాళ్లు చెప్పుకుంటారు కానీ, తమ క్రియలవల్ల ఆయనను ఎరుగమన్నట్టున్నారు.’—తీతు 1:16

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి