కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w12 7/1 పేజీలు 18-19
  • మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుణ్ణి ప్రేమించేవాళ్లను స్నేహితులుగా ఎంచుకోండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • స్నేహితుల్ని జాగ్రత్తగా ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • దేవుడు ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
w12 7/1 పేజీలు 18-19

దేవుని వాక్యం ఏమి చెబుతుందో తెలుసుకోండి

మంచి స్నేహితులను మనమెలా ఎంచుకోవచ్చు?

ఈ ఆర్టికల్‌సాధారణంగా మీకు వచ్చే సందేహాలను ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి జవాబులు బైబిల్లో ఎక్కడ ఉన్నాయో కూడా ఈ ఆర్టికల్‌తెలియజేస్తుంది. ఆ జవాబులను మీతో చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

1. స్నేహితులను మనం ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి?

ఎదుటివాళ్లు తమను ఇష్టపడాలని చాలామంది కోరుకుంటారు. ఆ కోరికవల్లే మనం తరచూ మన చుట్టూ ఉన్న వాళ్లను అనుకరిస్తాం. మన హృదయంలో ఎలాంటి ఆలోచనా విధానాలు వృద్ధి చెందుతాయనేది ఎక్కువగా మన స్నేహితులను బట్టే ఉంటుంది. అంటే మనం ఎలాంటి స్నేహితులను ఎంచుకుంటామో అలాంటి వ్యక్తులుగా తయారౌతామని చెప్పవచ్చు.—సామెతలు 4:23; 13:20 చదవండి.

ప్రేరేపిత బైబిలు రచయిత దావీదు తన స్నేహితులను జ్ఞానయుక్తంగా ఎంచుకున్నాడు. దేవుని సేవకుడిగా తన యథార్థతను కాపాడుకునేందుకు తోడ్పడే వ్యక్తులతో ఆయన సహవాసం చేశాడు. (కీర్తన 26:4, 5, 11, 12) ఉదాహరణకు, యెహోవా మీద నమ్మకం ఉంచమని యోనాతాను తనను ప్రోత్సహించాడు కాబట్టి దావీదు ఆయనతో స్నేహం చేశాడు.—1 సమూయేలు 23:16-18 చదవండి.

2. మీరు ఎలా దేవునికి స్నేహితులు కావచ్చు?

యెహోవా సర్వశక్తిమంతుడే, అయినా మనం ఆయన స్నేహితులం కావచ్చు. ఉదాహరణకు, అబ్రాహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రాహాము, యెహోవా మీద నమ్మకముంచి ఆయనకు లోబడ్డాడు అందుకే యెహోవా ఆయనను స్నేహితునిగా పరిగణించాడు. (ఆదికాండము 22:2, 9-12; యాకోబు 2:21-23) యెహోవా మీద నమ్మకముంచి, ఆయన చెప్పిన వాటిని చేస్తే మనం కూడా ఆయన స్నేహితులం కావచ్చు.—కీర్తన 15:1, 2 చదవండి.

3. మంచి స్నేహితుల వల్ల మీకెలా మేలు జరుగుతుంది?

నిజమైన స్నేహితులు నమ్మకంగా ఉంటారు, సరైనది చేయడానికి మీకు సహాయం చేస్తారు. (సామెతలు 17:17; 18:24) దావీదు కన్నా యోనాతాను బహుశా 30 ఏళ్లు పెద్దవాడు, తన తండ్రి తర్వాత ఇశ్రాయేలీయులకు రాజు కావాల్సింది ఆయనే. అయినా దావీదునే తర్వాతి రాజుగా దేవుడు ఎంచుకున్నాడని తెలిసి దావీదుకు నమ్మకంగా మద్దతిచ్చాడు. నిజమైన స్నేహితులు, మీరు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినప్పుడు మిమ్మల్ని సరిదిద్దడానికి వెనకాడరు. (కీర్తన 141:5) మీ స్నేహితులకు దేవుని మీద ప్రేముంటే, మీరు మంచి అలవాట్లు వృద్ధి చేసుకునేలా వాళ్లు సహాయం చేస్తారు.—1 కొరింథీయులు 15:33 చదవండి.

మీలా సరైనది చేయడానికి ఇష్టపడే వాళ్లను యెహోవాసాక్షుల రాజ్యమందిరంలో కలుసుకోవచ్చు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు చేస్తున్న కృషిని ప్రోత్సహించే స్నేహితులు అక్కడ మీకు దొరుకుతారు.—హెబ్రీయులు 10:24, 25 చదవండి.

అయితే, మన స్నేహితులు దేవుణ్ణి ప్రేమించేవాళ్లే అయినా అప్పుడప్పుడు వాళ్లు మనల్ని బాధపెట్టవచ్చు. అలాంటప్పుడు వెంటనే కోప్పడకండి. (ప్రసంగి 7:9, 20-22) తప్పులు అందరూ చేస్తారని, అయితే దేవుణ్ణి ప్రేమించే స్నేహితులు మనకు అమూల్యమైన వాళ్లని గుర్తుంచుకోండి. తోటి సహోదరులు చేసిన పొరపాట్లను చూసీచూడనట్లు వదిలేయమని దేవుని వాక్యం మనకు చెబుతోంది.—కొలొస్సయులు 3:13 చదవండి.

4. “స్నేహితులు” మిమ్మల్ని వ్యతిరేకిస్తే?

తాము ఇతరుల సహాయంతో దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టినప్పుడు పాత స్నేహితులు కొందరు వ్యతిరేకించారని చాలామంది అంటారు. బైబిల్లో ఉన్న ఉపయోగకరమైన సలహాలను, భవిష్యత్తుపై అది కలిగించే ఆశను మీరు అర్థం చేసుకున్నట్లు వాళ్లు అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. మీరు వాళ్లకు సహాయం చేయవచ్చు.—కొలొస్సయులు 4:6 చదవండి.

మరికొన్ని సందర్భాల్లో, “స్నేహితులు” దేవుని వాక్యంలో ఉన్న మంచి వార్తను ఎగతాళి చేస్తారు. (2 పేతురు 3:3, 4) మరికొందరు, సరైనది చేయడానికి మీరు చేస్తున్న కృషిని హేళన చేస్తారు. (1 పేతురు 4:4) మీ స్నేహితులు అలాంటి వాళ్లయితే, మీరు వాళ్ల స్నేహితులుగా ఉంటారో, దేవుని స్నేహితులుగా ఉంటారో నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మీరొకవేళ దేవుని స్నేహితులుగా ఉండాలని నిర్ణయించుకుంటే అత్యంత గొప్ప స్నేహితుణ్ణి ఎంచుకున్నట్టే.—యాకోబు 4:4, 8 చదవండి. (w11-E 12/01)

ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే యెహోవాసాక్షులు ప్రచురించిన ఈ పుస్తకంలోని, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?, 12, 19 అధ్యాయాలు చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి