ఈ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే జవాబులు
చనిపోయినవాళ్లను మళ్లీ చూస్తామా?
మరణం నిద్ర లాంటిది. ఎందుకంటే, చనిపోయినవాళ్లకు ఏమీ తెలియదు, వాళ్లు ఏమీ చేయలేరు. అయితే జీవాన్ని సృష్టించిన వ్యక్తి, చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికించగలడు. దానికి రుజువుగా, చనిపోయిన కొందరిని మళ్లీ బ్రతికించేందుకు దేవుడు యేసుకు శక్తినిచ్చాడు.—ప్రసంగి 9:5; యోహాను 11:11, 43, 44 చదవండి.
మరణం ఏ విధంగా నిద్ర లాంటిది?
చనిపోయి తన జ్ఞాపకంలో ఉన్న వాళ్లను, నీతి నివసించే కొత్త లోకంలో మళ్లీ బ్రతికిస్తానని దేవుడు మాటిచ్చాడు. అయితే, దేవుడు బ్రతికించేంతవరకు వాళ్లు చనిపోయిన స్థితిలోనే ఉంటారు. నిజానికి, అలా బ్రతికించడానికి తన శక్తిని ఉపయోగించాలని సర్వశక్తిగల దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు.—యోబు 14:14, 15 చదవండి.
చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఎలా ఉంటారు?
దేవుడు ప్రజలను తిరిగి బ్రతికించినప్పుడు, వాళ్లను వాళ్లు గుర్తుపట్టుకోగలుగుతారు. తమ స్నేహితులను, కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టగలుగుతారు. ఒక వ్యక్తి శరీరం కుళ్లిపోయినా, దేవుడు కొత్త శరీరంతో అతణ్ణి మళ్లీ బ్రతికించగలడు.—1 కొరింథీయులు 15:35, 38 చదవండి.
తిరిగి బ్రతికేవాళ్లలో చాలా తక్కువమంది పరలోకానికి వెళ్తారు. (ప్రకటన 20:6) అయితే ఎక్కువమంది, ఏదెను తోటలా అందంగా మారే భూమ్మీద జీవిస్తారు. వాళ్లు కొత్త జీవితాన్ని ఆరంభిస్తారు, చావు లేకుండా ఎప్పటికీ జీవించే అవకాశం వాళ్లకు ఉంటుంది.—కీర్తన 37:29; అపొస్తలుల కార్యములు 24:14, 15 చదవండి. (w13-E 10/01)