కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 1/1 పేజీ 4
  • మీకు దేవుని పేరు తెలుసా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు దేవుని పేరు తెలుసా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని పేరు
    తేజరిల్లు!—2017
  • దేవుని పేరేంటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2019
  • దేవునికి ఒక పేరుందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • దేవుని పేరు—దానిని ఉపయోగించడం, దాని అర్థం
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 1/1 పేజీ 4
ఒకరి పేరు ఒకరు చెప్పుకుని పరిచయం చేసుకుంటున్నారు

పత్రిక ముఖ్యాంశం | సృష్టికర్తకు దగ్గరవ్వడం సాధ్యమే!

మీకు దేవుని పేరు తెలుసా? దాన్ని ఉపయోగిస్తారా?

“ఇతను నాకు చాలా మంచి స్నేహితుడు కానీ ఇతని పేరు నాకు తెలీదు” అని మీరు ఎప్పుడైనా అన్నారా? బహుశా అలా ఎప్పుడూ అని ఉండరు. “దేవుని పేరు తెలీకుండా ఆయనకు దగ్గరవడం అసాధ్యం” అని బల్గేరియాలో ఉండే ఐరీనా చెబుతుంది. అయితే విషయమేమిటంటే, మీరు తనకు దగ్గరవ్వాలని దేవుడే కోరుకుంటున్నాడు. అందుకే, బైబిలు ద్వారా “యెహోవాను నేనే; ఇదే నా నామము” అని చెప్పి మీకు పరిచయం చేసుకుంటున్నాడు.—యెషయా 42:8.

తన పేరు తెలుసుకుని, దాన్ని వాడాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఎలా చెప్పవచ్చు? మొదట్లో హీబ్రూలో రాసిన బైబిలు వచనాల్లో దేవుని పేరు (నాలుగు హీబ్రూ హల్లులతో ఉన్న దేవుని పేరును టెట్రగ్రామటన్‌ అని పిలుస్తారు) దాదాపు 7000 సార్లు కనిపిస్తుంది. బైబిల్లో వేరే ఏ పేరూ అన్నిసార్లు లేదు. అంటే, దేవుని పేరు తెలుసుకుని, మనం దాన్ని ఉపయోగించాలనే కదా దేవుడు అన్నిసార్లు రాయించింది.a

దేవుడు పవిత్రుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన పేరును ఉపయోగించడం అమర్యాద అని కొంతమందికి అనిపిస్తుంది. నిజమే, మీకు ఇష్టమైన స్నేహితుని పేరును మీరు తప్పుగా ఉపయోగించరు. అలాగే, దేవుని పేరును మనం తప్పుగా ఉపయోగించకూడదు. అయితే, తనను ప్రేమించేవాళ్లు తన పేరును గౌరవించాలని, దాన్ని ఇతరులకు చెప్పాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్తన 69:30, 31; 96:2, 8) యేసు తన శిష్యులకు “పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అని ప్రార్థించమని నేర్పించాడని గుర్తుచేసుకోండి. మనం దేవుని పేరును పరిశుద్ధపర్చడానికి ఆ పేరును అందరికీ తెలపాలి. అలా చేస్తే మనం ఆయనకు ఇంకా దగ్గరౌతాం.—మత్తయి 6:9, 10.

దేవుని పేరుకు విలువనిచ్చే వాళ్లను ఆయన ప్రత్యేకంగా చూసుకుంటాడని బైబిల్లో ఉంది. (మలాకీ 3:16) వాళ్లకు దేవుడు ఈ మాటిచ్చాడు: “నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను. నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు. నేను వారికి జవాబు ఇస్తాను. వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను.” (కీర్తన 91:14, 15, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) మనం యెహోవాతో మంచి స్నేహాన్ని ఆనందించాలంటే ఆయన పేరును తెలుసుకుని ఉపయోగించడం చాలా ప్రాముఖ్యం. (w14-E 12/01)

a పాత నిబంధన లేదా హీబ్రూ భాషలో ఉన్న వచనాల్లో దేవుని పేరు చాలాసార్లు ఉన్నా విచారకరంగా చాలా బైబిలు అనువాదాల్లో దేవుని పేరును తీసివేశారు. బదులుగా, దేవుని పేరు స్థానంలో “ప్రభువు,” “దేవుడు” లాంటివి పెట్టారు. ఈ విషయం గురించి ఎక్కువ సమాచారం కోసం యెహోవా సాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలో 195-197 పేజీలు చూడండి.

“యెహోవాను నేనే; ఇదే నా నామము” అని చెప్పి దేవుడు బైబిలు ద్వారా మనకు పరిచయం చేసుకుంటున్నాడు.—యెషయా 42:8

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి