కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 10/15 పేజీ 3
  • ‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాసాక్షుల పరిపాలక సభ అంటే ఏంటి?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • పరిపాలక సభ ఎలా వ్యవస్థీకరించబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఈనాడు గవర్నింగ్‌ బాడితో సహకరించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1990
  • ప్రకటన—పరిపాలక సభ కమిటీల కొరకు సహాయము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 10/15 పేజీ 3
పరిపాలక సభ కమిటీ మీటింగ్‌ను చూపిస్తున్న చిత్రం

‘అలాంటి వాళ్లను ఘనపర్చండి’

పరిపాలక సభలో ఉన్న కమిటీలకు సహాయం చేయడానికి అనుభవం, పరిణతిగల పెద్దల్ని పరిపాలక సభ 1992 నుండి నియమిస్తోంది.a ‘వేరేగొర్రెలకు’ చెందిన ఈ సహోదరులు ఆ కమిటీలకు సహాయకులుగా సేవ చేస్తూ పరిపాలక సభకు చక్కగా మద్దతిస్తారు. (యోహా. 10:16) వాళ్లు ఏ కమిటీకి సహాయకులుగా ఉన్నారో, ఆ కమిటీ ప్రతీవారం జరుపుకునే మీటింగ్‌కు హాజరౌతారు. అక్కడ చర్చించబోయే విషయానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్లు కమిటీ ముందు ఉంచడంతోపాటు కొన్ని సలహాల్ని కూడా సూచిస్తారు. అయితే తుది నిర్ణయం పరిపాలక సభ సభ్యులే తీసుకుంటారు. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం ఈ సహాయకుల బాధ్యత. పరిపాలక సభ తమకు అప్పగించిన ఏ పనినైనా వాళ్లు సంతోషంగా చేస్తారు. వాళ్లు పరిపాలక సభ సభ్యులతో కలిసి ప్రత్యేక సమావేశాలకు, అంతర్జాతీయ సమావేశాలకు హాజరౌతారు. అంతేకాదు, కొన్నిసార్లు ప్రధాన కార్యాలయ ప్రతినిధులుగా బ్రాంచి కార్యాలయాలను సందర్శిస్తారు.

ఆ ఏర్పాటు మొదలైనప్పటి నుంచి అలా సహాయకునిగా సేవచేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, “నాకు అప్పగించిన పనుల్ని నేను సరిగ్గా చేస్తే, పరిపాలక సభ ఆధ్యాత్మిక విషయాలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతుంది.” దాదాపు 20 ఏళ్లు నుండి సహాయకునిగా సేవచేస్తున్న మరో సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘ఇలా సేవచేయడం నేను ఎప్పటికీ ఊహించలేని ఓ గొప్ప అవకాశం.’

పరిపాలక సభ ఈ సహాయకులకు ఎన్నో బాధ్యతల్ని అప్పగిస్తుంది. అంతేకాదు వాళ్లు ఎంతో నమ్మకంగా, కష్టపడి చేస్తున్న సేవను చాలా విలువైనదిగా ఎంచుతుంది. కాబట్టి మనందరం ‘అలాంటి వాళ్లను ఘనపరుద్దాం.’—ఫిలి. 2:29, 30.

a పరిపాలక సభలోని ఆరు కమిటీలు, వాటి బాధ్యతల గురించి తెలుసుకోవడానికి కావలికోట మే 15, 2008 సంచికలో 29వ పేజీ చూడండి.

పరిపాలక సభలోని కమిటీలకు సహాయకులుగా సేవచేస్తున్న సహోదరులు

కో-ఆర్డినేటర్స్‌ కమిటీ

  • జాన్‌ ఎక్రన్‌

  • రాబర్ట్‌ వాలన్‌

పర్సోనెల్‌ కమిటీ

  • జెరల్డ్‌ గ్రిజల్‌

  • పాట్రిక్‌ లఫ్రాంక

  • డానియెల్‌ మోల్చన్‌

  • రాల్ఫ్‌ వాల్స్‌

పబ్లిషింగ్‌ కమిటీ

  • డాన్‌ ఆడమ్స్‌

  • రాబర్ట్‌ బట్లర్‌

  • హెరాల్డ్‌ కార్కెర్న్‌

  • డోనల్డ్‌ గొర్డన్‌

  • రాబర్ట్‌ లుసియోని

  • అలిక్స్‌ రీన్‌మ్యూలర్‌

  • డేవిడ్‌ సింక్లేర్‌

సర్వీస్‌ కమిటీ

  • గ్యారీ బ్రో

  • జోయెల్‌ డెలింగర్‌

  • సేత్‌ హయాట్‌

  • క్రిస్టఫర్‌ మేవర్‌

  • జూ. బాల్టాసర్‌ పెర్లా

  • జూ. విలియమ్‌ టర్నర్‌

  • రాబర్ట్‌ వాలన్‌

  • జూ. లీయాంగ్‌ వీవర్‌

టీచింగ్‌ కమిటీ

  • రానల్డ్‌ కర్జన్‌

  • కెన్నెత్‌ ఫ్లోడీన్‌

  • విలియమ్‌ మాలన్‌ఫంట్‌

  • మార్క్‌ నూమర్‌

  • డేవిడ్‌ షేఫర్‌

రైటింగ్‌ కమిటీ

  • రాబర్ట్‌ సిరాంకో

  • జేమ్స్‌ మాంట్స్‌

  • ఇసాక్‌ మారే

  • జీన్‌ స్మాలీ

  • జాన్‌ విస్‌చక్‌

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి