కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 అక్టోబరు పేజీ 32
  • మీకు తెలుసా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీకు తెలుసా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘స్తెఫను దేవుని అనుగ్రహంతో, శక్తితో నిండిపోయాడు’
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • స్తెఫను రాళ్లతో కొట్టబడడం
    నా బైబిలు కథల పుస్తకము
  • పాఠకుల ప్రశ్నలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • యెహోవా యందలి భయముతో నడచుకొనుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 అక్టోబరు పేజీ 32

మీకు తెలుసా?

స్తెఫను హింసించబడుతున్నా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు?

మహాసభ ముందు ప్రశాంతంగా నిలబడివున్న స్తెఫను

స్తెఫను ఎదురుగా, కోపంతో రగిలిపోతున్న కొంతమంది ఉన్నారు. వాళ్లు ఇశ్రాయేలులోని అత్యున్నత న్యాయస్థానమైన మహాసభ సభ్యులు. ఆ 71 మంది న్యాయమూర్తులు దేశంలో చాలా పలుకుబడి ఉన్నవాళ్లు. ప్రధానయాజకుడైన కయప వాళ్లను సమావేశపర్చాడు. కొన్ని నెలల క్రితం అతని ఆధ్వర్యంలోనే మహాసభ యేసుకు మరణశిక్ష విధించింది. (మత్త. 26:57, 59; అపొ. 6:8-12) మహాసభ సభ్యులు అబద్ధసాక్షుల్ని ఒకరి తర్వాత ఒకర్ని ప్రవేశపెడుతున్నారు. ఇంతలో, స్తెఫను ముఖం “దేవదూత ముఖంలా” కనిపించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.—అపొ. 6:13-15.

అలాంటి భయానక పరిస్థితిలో కూడా స్తెఫను ఎలా ప్రశాంతంగా, నింపాదిగా ఉండగలిగాడు? మహాసభకు రాకముందు, “పవిత్రశక్తితో నిండిన స్తెఫను” పరిచర్య పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. (అపొ. 6:3-7) విచారణ జరుగుతున్నప్పుడు కూడా అదే పవిత్రశక్తి ఆయన మీద పనిచేసింది. అది ఆయనకు ఓదార్పును ఇచ్చి, కొన్ని విషయాల్ని గుర్తుచేసింది. (యోహా. 14:16, అధస్సూచి) అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం ప్రకారం, స్తెఫను ధైర్యంగా తన వాదనను వినిపిస్తున్నప్పుడు, హీబ్రూ లేఖనాల్లోని దాదాపు 20 వృత్తాంతాలను పవిత్రశక్తి ఆయనకు గుర్తుచేసింది. (యోహా. 14:26) అంతేకాదు, దేవుని కుడిపక్కన యేసు నిలబడివున్న దర్శనాన్ని చూసినప్పుడు స్తెఫను విశ్వాసం ఇంకా బలపడింది.—అపొ. 7:54-56, 59, 60.

మనకు కూడా ఏదోకరోజు బెదిరింపులు, హింసలు ఎదురవ్వవచ్చు. (యోహా. 15:20) బైబిల్ని రోజూ చదువుతూ, పరిచర్యలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటే దేవుని పవిత్రశక్తి మనమీద కూడా పనిచేస్తుంది. అప్పుడు, వ్యతిరేకత వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం, ప్రశాంతంగా ఉంటాం.—1 పేతు. 4:12-14.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి