కూటములనుండి ఎక్కువగా ప్రయోజనము పొందునట్లు పిల్లలకు సహాయము చేయుము
1 మీ పిల్లలు కూటములకు హాజరగునప్పుడు వారు నిజముగా వినుచున్నారా? ప్రతి కూటములనుండి తాము నేర్చుకొన్న వాటిని ఆ తరువాత మీకు తెలియజేయగలరా? అవధానమును నిలిపి, జాగ్రత్తగా గమనించుట ద్వారా వచ్చు జ్ఞానమును ఉపయోగించమని నీవు వారిని ప్రోత్సహించియున్నావా? వారు చూచి, విని, అనుసరించదగునట్లు కూటములలో నీవు వ్యక్తపరచు మాటలద్వారా వారికి మంచి మాదిరినుంచుతున్నావా? మీ పిల్లలు మీ విశ్వాసముననుసరిస్తారా? పిల్లలు యెహోవాకు అంకితమైనట్టి సేవకులుగా కావాలంటే ఈ ప్రశ్నలకు అనుకూలమైన సమాధానములు చాలా ప్రాముఖ్యము.
కూటములకు హాజరగు ప్రాముఖ్యతను నాటుము
2 ఒక పిల్లవాడు నిత్యజీవము పొందాలంటే అతనికి బైబిలు ఉపదేశమవసరము. (యోహా. 17:3) పిల్లవాడు ఆత్మీయసంగతులను మెచ్చుకొనుటను నేర్చుకొనాలంటే కూటములకు హాజరగుట అవసరము. కొన్నిసార్లు తమ పిల్లలు ఇతరులకు ఆటంకము కలుగజేస్తారనే భయంతో తమ పిల్లలను కూటములకు తీసుకురావటానికి తల్లిదండ్రులు వెనుకాడుదురు. కొందరు తమ పిల్లలను పాఠశాల హోమ్‌వర్క్ చేసికొనుటకు ఇంటి దగ్గర వదలివేయవచ్చును. ఏమైనను వివేకము కలిగిన తల్లి లేక తండ్రి తన పిల్లలను కూటములకు తీసుకొనివచ్చును.—ద్వితీ. 31:12.
3 బాల్యమునుండి ఒక పిల్లవాడు నేర్చుకొనవలసిన మొదటి విషయమేమనగా తాను రాజ్యమందిరమునకు వెళ్తున్నది వినుటకనునదియే, అయితే తాను వేరేదానిలో నిమఘ్నడైయుండునట్లు తన చేతికి బొమ్మలను, తినే ఆహారమునిచ్చినట్లయిన లేక తాను కూర్చున్నచోట ఆడుకొనుటకు అనుమతించినట్లయిన రాజ్యమందిరములో మనమెందుకు కూటములకు హాజరవుతున్నామో పిల్లవాడు గుణగ్రహించి, విని, నేర్చుకొనునా? ఒప్పుకొనవలసిన విషయమేమంటే కొందరు పిల్లలు ఇతరులకన్న ఎక్కువ అవధానమును నిలుపుతారు. ఏమైనను పిల్లవాడు తప్పుగా ప్రవర్తించునప్పుడు లంచము మాదిరి తినుబండారాన్నో లేక ఆటవస్తువునో యిచ్చుటకు బదులు తెలివిగల తండ్రి లేక తల్లి సరిదిద్ది, దేవుని వాక్యముతో క్రమశిక్షణను అమలు జరుపుట ద్వారా వినుటకు తగిన తర్ఫీదును ప్రేమతో ఇచ్చును.—సామె. 13:24; ఎఫె. 6:4.
తండ్రి లేక తల్లిగా నీ మాదిరి
4 1982 ది వాచ్‌టవర్ జనవరి 15, పేజి 17 నందు ఈ క్రింది ప్రశ్నలను అడిగినది: “బైబిలు కూటములను నీవు గంభీరముగా తీసుకుంటావని మీ పిల్లలకు తెలియునా? నీవు ఈ కూటములకు కేవలము హాజరగుటయే కాక కోరినప్పుడు వ్యాఖ్యానములనిచ్చుట ద్వారా అందు పాల్గొనుటను కూడా నీవు ప్రాముఖ్యముగా యెంచుతావని వారు చూస్తున్నారా?” మీరు కూటముల సమయమందు అనవసరముగా గుసగుసలాడుటను, నీవు లేక యితరులు వారితో ఆటలాడుచుండుటను మీ పిల్లలు చూచినట్లయిన అది వారిపై ఎటువంటి భావమును ముద్రించును? కూటముల సమయములను వారెట్లు దృష్టింతురు? సాధారణంగా పిల్లలు చాలా బాగా అనుకరించువారు గనుక నీ యొక్క మాదిరి వారిపై ఎంతో ఎక్కువ ప్రభావమును కలిగియుండగలదు.
5 కొంతమంది తల్లిదండ్రులు ఎంతో చిన్నపిల్లలకుకూడా కూటములందు ఉపయోగింపబడు ప్రచురణలయొక్క స్వంత కాపీలను వారికిచ్చుటను ప్రయోజనకరంగా కనుగొనిరి. కుటుంబ పఠన సమయములలో తగినటువంటి వ్యాఖ్యానములను సిద్ధపడుటకు వారి పిల్లలకు వారు సహాయపడుతారు. ఇంకను తల్లిదండ్రులు కూటములందలి అంశములను పునర్విమర్శ చేయుట ద్వారా లేక వారు కలిగియున్న ప్రశ్నలకు సమాధానములనిచ్చుటకు సమయాన్ని తీసుకొనుట ద్వారా ప్రోత్సహించవచ్చును. పిల్లలు కూటములో పాల్గొనినప్పుడు వారిని మెచ్చుకొను విషయములోను తల్లిదండ్రులు మెలకువగా నుండవలెను.
6 అవును, ఈ తర్ఫీదునందు తల్లిదండ్రులు కష్టించి పనిచేయుట ఇమిడియున్నదనుట సత్యమే. అయినను విషయములను దేవుని మార్గమందు చేయుట మంచిఫలితములను కలుగజేయును. లేఖనము చెప్పునట్లు: “యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.”—సామె. 20:7.