1991 జ్ఞాపకార్థ ఆచరణ
1 1991, మార్చి 30, శనివారము క్రీస్తుమరణ జ్ఞాపకార్థపు 1958వ సాంవత్సరిక ఆచరణ దినమును గుర్తిస్తుంది. అందుకు హాజరగుటకు మన స్వంతపథకములు వేసుకొనునప్పుడు ఆహ్వానము లేక మరొక రీతిలో మన వ్యక్తిగత సహాయము అవసరమైన ఇతరులను గూర్చియు మనము తలంచవలసియున్నాము. జ్ఞాపకార్థమునకు సిద్ధపాటులు చేసికొన మొదలు పెట్టి, ఇతరులను ఆహ్వానించుటను గూర్చి తలంచుటకు సమయము ఇదే—దయచేసి పేజి 3 నందు “జ్ఞాపకార్థమునకు సిద్ధపడవలసిన విషయములు” చూడుము.
2 జ్ఞాపకార్థమునకు హాజరగుటను మనమెట్లు దృష్టింతుము? ఒక ఆధిక్యతగాను, క్రీస్తు బలియెడల మెప్పుచూపుటకు ఒక అవకాశముగాను దానిని మనము దృష్టించవలెను. మీ స్వంత సంఘమునకు దూరముగా వెళ్తున్నారని మీకు తెలిసినట్లయిన అక్కడ హాజరగునట్లు మీరు వెళ్లబోవు ప్రాంతములో రాజ్యమందిరపు అడ్రసును తీసుకొనియుండునట్లు ఖచ్చితముగా చూసుకొనుము.
ప్రత్యేక ఆహ్వానములను ఉపయోగించుము
3 ప్రత్యేక జ్ఞాపకార్థ ఆహ్వానపత్రములను ఉపయోగించుటను మీరు మార్చి తొలిభాగములో ప్రారంభించవచ్చును. అవి వీధిన పోయేవారికి అందించు కరపత్రములవలె ఉపయోగించునవి కాదని గుర్తుంచుకొనుము. అయితే వాటిని ఆసక్తి గలవారికి వ్యక్తిగతంగా యివ్వవలెను. ప్రజలు తరచుగా తారీఖులను, సమయములను మరచి పోతుంటారు గనుక ఆహ్వానముయొక్క వెనుక గాని లేక క్రిందగాని చక్కగా రాజ్యమందిరపు అడ్రసు మరియు జ్ఞాపకార్థ ఆచరణ సమయమును వ్రాయటంగాని లేక టైపు చేయటంగాని చేయవలెనని సూచించబడుతుంది. సాధ్యమైన జ్ఞాపకార్థపు ప్రత్యేకతను స్పష్టంగా అర్థము చేసుకొనునట్లు సహాయపడుటకు ఆహ్వానించు వ్యక్తితో నీవు కొంత సమయము గడుపుము. క్రొత్తగా ఆసక్తిగలవారు రాజ్యమందిరమునకు తమకై తాము వెళ్లుటకు కొంత వెనుకాడవచ్చును. రవాణా సౌకర్యమును ఏర్పాటుచేయుట లేక రాజ్యమందిరమునకు వెలుపట వేచియుండి వారిని కలియుటకు నిన్ను వినియోగించుకొనగలవా? దీనికి అదనపు సమయము మరియు ప్రయత్నము అవసరము. అయితే నీ సహాయము మెచ్చుకొనబడుతుంది. ఇంకా, సత్యమును కొన్ని సంవత్సరములుగా తెలుసుకొనియుండి కూటములకు క్రమముగా హాజరగుటకు వెనుకబడువారికి సహాయపడుటకు ప్రత్యేకమైన కృషి అవసరము.—లూకా 11:23; యోహా. 18:37 b.
అవసరమైన సిద్ధపాటులు
4 జ్ఞాపకార్థమునకు అన్ని ఏర్పాటులు చాలా ముందుగానే జాగ్రత్తగా చేసుకొనియుండులాగున సంఘపెద్దలు నిశ్చయపరచుకొనవలెను. చిహ్నములను అందించుటకు బాగా అర్హులైన సహోదరులను ఎన్నుకొనునట్లు ఖచ్చితముగా చూచుకొనుము. అందుబాటులో నున్నట్లయిన ఈ సహోదరులు పెద్దలు లేక పరిచారకులై యుండవలెను. ఈ చిహ్నములు అందించుటకు అనవసరముగా ఎక్కువ సమయము తీసుకొనకుండునట్లు చాలినంతమంది సహోదరులు ఈ పనికి సిద్ధపడియుండులాగున చూసుకొనుము. వీటిని అందించువారు ప్రేక్షకులకు అందజేసిన తరువాత మొదటి వరుసలో వచ్చి కూర్చొందురు. అప్పుడు ప్రసంగీకుడు వారికి చిహ్నములను అందించును. చివరగా వారిలో ఒకరు ప్రసంగీకునికి వాటిని అందింతురు.
5 ఒక్కొక్క సంవత్సరము గడుచుకొలది ప్రభువురాత్రి భోజనము ఆచరించుట ఇక ఏ మాత్రము ఉండని సమయమునకు మనము సమీపించుచున్నాము. కేవలము చాలా కొద్దిమంది క్రీస్తు అభిషక్త సహోదరులు మాత్రమే మిగిలియున్నారు. తన సహోదరులందరు రాజ్యములో తనతోపాటు ఉండేంతవరకు తన మరణమును జ్ఞాపకము చేసుకొనవలెనని యేసు ఆజ్ఞాపించెను. (లూకా 22:19; 1 కొరిం. 11:25) అప్పటివరకు మనము విధేయతతోను మరియు నమ్మకముగాను గొప్ప ఆనందముతో మరియు మెప్పుదలతో ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థ ఆచరణకు సమకూడుదము.
[3వ పేజీలోని బాక్సు]
జ్ఞాపకార్థమునకు సిద్ధపడవలసిన విషయములు
(1985, ఫిబ్రవరి 15, వాచ్‌టవర్, పేజి 19 చూడుము.)
1. ప్రసంగీకునితో సహా ప్రతి ఒక్కరు ఆచరణయొక్క ఖచ్చితమగు స్థలము మరియు సమయమును గూర్చి తెలియపరచబడియున్నారా? ప్రసంగీకునికి రవాణా సౌకర్యమున్నదా?
2. చిహ్నములను అందించుటకు ఖచ్చితమైన ఏర్పాటులు చేయబడియున్నవా?
3. పరిశుభ్రమైన టేబుల్ క్లాత్, కావలసిన గ్లాసులు మరియు గిన్నెలు తీసుకురావటానికి ఎవరైన ఒకరితో ఏర్పాటులు చేయబడియున్నవా?
4. హాలును శుభ్రము చేయుటకు ఏ ఏర్పాటులు చేయబడియున్నవి?
5. అటెండెంట్లు, చిహ్నములను అందించువారు నియమించబడియున్నారా? జ్ఞాపకార్థములో తమ పనులను నిర్వర్తించుటకు ముందు వారితో ఒక కూటము ఏర్పాటు చేయబడియున్నదా? ఎప్పుడు? ప్రతిది చక్కగా అందించబడునట్లు ఏ పద్ధతిని అనుసరింతురు?
6. ముసలివారు మరియు అంగవైకల్యముగల సహోదర సహోదరీలకు సహాయము చేయుటకై అన్ని ఏర్పాటులు పూర్తియైనవా? అభిషక్తులైన వారెవరైన ఆసుపత్రిలోయుండి, రాజ్యమందిరమునకు హాజరుకాలేని స్థితిలోయున్నట్లయిన చిహ్నములు వారికి అందించబడుటకు ఏర్పాటులు చేయబడియున్నవా?