సువార్తనందించుట—“నిజమైన శాంతి” అను పుస్తకముతో
1 థెస్సలొనీకయులకు 5:2, 3 లో ఉన్న ప్రవచనము పూర్తవుటకు దారితీయు పరిస్థితుల వృద్ధిని మనము చూచుకొలది జరగనున్న విషయములను గూర్చి మనుషులందరికి ప్రకటించు పనిని కొనసాగించుటలో ధృఢ నిశ్చయమును కలిగియుందము. అందునుబట్టి జూలై నెలలో మన క్షేత్ర సేవయందు “నిజమైన శాంతి మరియు భద్రత—నీవు దానినెట్లు కనుగొందువు” అను పుస్తకమును ఉపయోగించెదము. ఈ మంచి ప్రచురణ మనుషులు ఆలోచించు విషయములను చర్చించి నిరీక్షణకు ఒక హేతువును అందజేయుచున్నది.
ఎందుకు సమయానుసారమైయున్నది
2 ఎందరో వ్యక్తులు ఈనాడు శాంతిని నెలకొల్పుటకు లోకశక్తులు చేయు ప్రయత్నము సఫలమవునా? లేక అసఫలమై లోకము అణుయుద్ధమునకు లోనగునా అని ఆలోచించుచున్నారు. నిజమైన శాంతి అను పుస్తకము దేవుడు మానవజాతి కొరకు నిరంతరము నిలుచు శాంతిని తేనైయున్నాడన్న జ్ఞానము నిచ్చుట ద్వారా వారిని ఓదార్చగలదు. భూమియెడల దేవుని సంకల్పము అది మనుష్యులవలన నాశనము చేయబడవలెనని కాదు. ఆకలి, దారిద్ర్యము, ఇండ్లు లేని పరిస్థితి నేడు కోట్ల కొలది ప్రజల అనుదిన సమస్యలైయున్నవి. ఈ “నిజమైన శాంతి” పుస్తకము అన్ని దేశములను పీడించు సమస్యలకు ఒక పరిష్కారము చూపుచున్నది. పెరుగుతున్న నేరముల వలన కలుగు వ్యక్తిగత అభద్రతతో అనేకులు ఇండ్లలోనే ఖైదీలవలె ఉన్నారు. నిజమైన శాంతి (ట్రూపీస్) పుస్తకము ఈ సమస్యల పరిష్కారముపై లేఖనానుసారమైన వెలుగును చూపుచున్నది. ఈ పుస్తకము నేడు కుటుంబములను, వేలకొలది మనుషులను పాడుచేసిన ఆధునిక జీవిత వ్యవహారముల విషయమై అనగా దుర్వినియోగము, దేవుడిచ్చిన లైంగిక శక్తులను దుర్వినియోగపర్చు వాటిపై దేవుని ప్రమాణములను, వాటిని పాటించుటలో వచ్చు రక్షణను చూపుచున్నది.
నీ అందింపు
3 “నిజమైన శాంతి భద్రతలకు మూలము” అను సంభాషణాంశము జూలై నుండి వాడబడును. అందు వాడబడు రెండు లేఖనములు ఏమనగా 1 థెస్స. 5:3, మీకా. 4:3, 4. వీటి విషయములో సలహాగా యివ్వబడిన అనేక ఉపోద్ఘాతములను రీజనింగ్ పుస్తకము 9-15 పేజీలలో నీవు కనుగొనవచ్చును. వాటిని మీ ప్రాంత అవసరతకు తగినట్లు వాడవచ్చును.
4 ఇవ్వబడిన ఈ రెండు లేఖనములను మీ సంభాషణలో ఉపయోగించుచు మనుషులు తెచ్చు శాంతి నిరంతరముండదనియు, దేవుడు తెచ్చు శాంతి మాత్రమే నిరంతరము నిల్చుననియు తెలుపుము. మీకా 4:3, 4ను చదివి దానిపై క్లుప్తముగా సంభాషించి బాధననుభవించుచున్న మానవ జాతికి ఈ ప్రవచన నెరవేర్పు వల్ల కలుగు లాభమేమని అడుగుట ద్వారా ఆ యింటి యజమానుని సంభాషణలోనికి దించుము. ఈ ప్రవచనము మన కాలములోనే నిజమగుట చూచుటకు అతడు సంతోషించిన అటు తరువాత నిజమైన శాంతి పుస్తకము 99వ పేజీలో ఉన్న చిత్రము తెరచి దానిపై మాట్లాడుము. ఆ తరువాత కొన్ని పేజీలలోని ముందే ఎన్నుకొన్న వాక్యములను చూపించి శాంతిభద్రత ఎందుకు ఒక నమ్మదగిన నిరీక్షణయో చూపించుము. నిజమైన శాంతి పుస్తక సహాయముతో ఈ విషయమును ఇంకా పరిశీలించుటకు అతనిని ఆహ్వానించుము. మీకిష్టమైతే ఈ పుస్తకములోని వేరేభాగమునైనను మీ సంభాషణలో వాడవచ్చును.
5 ఒకవేళ నిజమైన శాంతి పుస్తకము మీ యొద్ద లేనట్లయితే లేక అయిపోయినట్లయితే 192 పేజీల ఏ ఇతర పుస్తకమునైనను వాడవచ్చును.
6 నిజమైన శాంతిలో ఆరోగ్యము, భద్రత, సాధారణ సంక్షేమము ఇమిడియున్నది గనుక ఆయుధముతో పోరాడు యుద్ధము లేనందువలన కలిగేదే నిజమైన శాంతి కాదు. ‘సమాధానకర్త’యగు యెహోవా దేవుడు ‘సమాధానమునకు అధిపతి’యగు యేసుక్రీస్తు మాత్రమే తమతో సమాధానము నేర్పరచుకొనువారికి ఈ నిత్య ఆశీర్వాదములను ఇవ్వగలరు. (1 థెస్స. 5:23; యెషయా 9:6) వీటిని పొంద ఇతరులకు సహాయము చేయుటకు మన పాదములకు సమాధాన సువార్తయను జోడు తొడుగుకొని జూలై నెలలో నిజమైన శాంతి పుస్తకమును అందించవచ్చును.—ఎఫెసీ. 6:15.