మన గొప్ప సృష్టికర్తను గుణగ్రహించునట్లు ఇతరులకు సహాయము చేయుము
1 మన చుట్టూవున్న సృష్టిని పరిశీలించుకొలది, ఒక సృష్టికర్త ఉన్నాడనుటకు మన భవిష్యత్తు విషయంలో ఆయన శ్రద్ధ కలిగి యున్నాడనుటకు ఏ సందేహములేదు. (రోమా. 1:20) ఆ సృష్టికర్త యెడల మన గుణగ్రహణను ఎక్కువగా పెంచుకొనుటకు లైఫ్—హౌ డిడ్ ఇట్ గెట్ హియర్? బై ఎవల్యూషన్ ఆర్ బై క్రియేషన్ అను పుస్తకము ఒక పనిముట్టుగా ఉండెను. మరియు జీవము ఏలా వచ్చినది ఇతరులకు వివరించుటకును అది మనకు సహాయపడినది.
2 ఆ పుస్తకమును చదివిన తరువాత, సైన్సు సంబంధమైన పరిజ్ఞానముగల ఒక వ్యక్తి జీవము యెడల గుణగ్రహణను పెంచుకొనుటకు తాను చదివిన వాటన్నిటిలో కెల్లా ఇది అతి శ్రేష్టమైన పుస్తకమని దానిని వర్ణించెను. ఒక కాలేజి ఫ్రొఫెసరు: “సృష్టిని గూర్చి అంత బాగా తర్కమును అందించిన పుస్తకమును నేను ఎప్పుడూ చూడలేదని” తెలియజేశాడు. స్పష్టముగా, మన గొప్ప సృష్టికర్తయైన యెహోవా దేవుని గుణగ్రహించునట్లు ఇతరులకు సహాయము చేయుటకు క్రియేషన్ పుస్తకము ఒక శ్రేష్టమైన పనిముట్టైయున్నది.
తగిన ప్రతి అవకాశమునుండి ప్రయోజనము పొందుటకు ప్రయత్నించుము
3 అక్టోబరు మాసములో మరలా ఒకసారి ప్రాంతీయ పరిచర్యలో ఈ పుస్తకమును అందించు ఆధికత్యను మనము కలిగియుందుము. క్రమమైన మన యింటింటి పరిచర్యలోనేగాక, వీధి పనిలోను లేక యాధృచ్చికముగా సాక్ష్యమిచ్చునప్పుడును మనము క్రియేషన్ పుస్తకమును అందించవచ్చును. జతపనివారికి, పాఠశాలలోని తోటి వారికి, బంధువులకు మరియు మనము కలిసికొను యితరులకును దానిని అందించవచ్చును. మీ బైబిలు విద్యార్థులు ఒక కాపీని కల్గియున్నారా? లేక పోయినట్లయిన, వారు ఒకటి కల్గియుండులాగున ఎందుకు చేయకూడదు? నీవు క్రమముగా మాగజైన్లలను అందించు మాగజైను రూట్‌ను కలిగియున్నావా? ఒకవేళ అట్టివారును ఒక కాపీని కలిగియుండ యిష్టపడవచ్చును. ఈ నెలలో దొరికిన ప్రతి మంచి అవకాశమును ఈ పుస్తకమును అందించుటకై ఉపయోగించుము.
4 క్రియేషన్ పుస్తకమును పాఠశాలయందు అందించుటలో అనేకమంది చిన్న పిల్లలు విజయవంతులైరి. ఈ పుస్తకపు ఒక కాపీని నీతోపాటు స్కూలుకు తీసుకు వెళ్ల ప్రయత్నించావా? ఆసక్తిగల వారు ప్రశ్నలడిగినట్లయిన వారికి సాక్ష్యమిచ్చు అవకాశమును నీవు కలిగియుందువు. కొందరు ప్రచారకులు కేవలం కాలేజి ఆవరణకు బయటనే వీధి పని చేయుట ద్వారా (స్ట్రీట్ వర్క్) విజయమును కనుగొని అనేకమంది విద్యార్థులతో మంచి చర్చలను కలిగియుండిరి.
సంభాషణా అంశమును ఉపయోగించుము
5 “ప్రాణమిచ్చువానిని ఆరాధించుము,” అను మన సంభాషణా అంశముతో క్రియేషన్ పుస్తకమును బాగుగా అందించవచ్చును. ఈ పుస్తకమును అందించుటలో నీవు యిలా చెప్పవచ్చును: “జీవము ఎలా ప్రారంభమైందని తెలుసుకొనుటలో అనేకమంది ప్రజలు ఆసక్తి కల్గియున్నారు. ఆ విషయమును గూర్చి నీవెప్పుడైనా ఆశ్చర్యపడియున్నావా? బైబిలు అందించు కారణ సహితమైన వివరణను పరిశీలించుదాము. (హెబ్రీ. 3:4 చదువుము) కారణ సహితంగా మన చుట్టూవున్న ప్రతి భవనము లేక యిల్లు దానిని రూపించిన వానిని ఒక నిర్మాణకుని కలిగివున్నది. అందుచేత, ఎంతో చిక్కైన విశ్వము కూడా తప్పక సృష్టికర్తను కలిగియుండాలి. హెబ్రీ. 3:4 ప్రకారము ఆ సృష్టికర్త దేవుడు. అయితే ఈ వాస్తవమును గూర్చిన జ్ఞానము మనలనెట్లు ప్రభావితం చెయ్యాలి? (ప్రకటన 4:11 చదువుము) కాబట్టి జ్ఞానయుక్తమైన పని ఏమనగా సమయముండగనే ఆయన చిత్తమును నేర్చుకొని దానికి తగినట్లు మన జీవితములను చక్కదిద్దుకొనుట.” ఆ తరువాత మానవుడు ఎలా వచ్చాడు, మరియు సృష్టికర్తకు విధేయత చూపుట ఎట్లు నిత్యజీవమునకు నడుపగలదో ఇది చూపగలదని తెల్పుతూ పుస్తకమును అందించుము.
6 ఎంతో అందముగా వర్ణిస్తూ, పరిణామము మరియు సృష్టిని గూర్చిన సత్యమును తెలుపు 256 పేజీలు గల ఈ పుస్తకమును కలిగియున్నందుకు మనము ఎంత సంతోషభరితులము! ముఖ్యముగా ఈ పుస్తకము మన గొప్ప సృష్టికర్తను ఘనపర్చుచున్నది. ఎందుకనగా జీవము ఎలా వచ్చినది, తన నామమును పరిశుద్ధపరచుకొనుటకు గల యెహోవా సంకల్పము, మరియు రాజ్యము ద్వారా మానవజాతిని ఆశీర్వదించు ఆయన వాగ్దానమును గూర్చి అది మనకు తెలియజేయుచున్నది.