కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/90 పేజీ 3
  • అభివృద్ధికర కార్యమునకు సమయము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అభివృద్ధికర కార్యమునకు సమయము
  • మన రాజ్య పరిచర్య—1990
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • జ్ఞాపకార్థదిన ఆచరణ
  • ప్రత్యేక ఆసక్తిగల పత్రికల పంపకమును వృద్ధిచేయుడి
  • మే నెల మీకు ప్రత్యేక మాసము కాగలదా?
    మన రాజ్య పరిచర్య—1992
  • ‘దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించండి’
    మన రాజ్య పరిచర్య—2002
  • జ్ఞాపకార్థ ఆచరణ కాలం—పరిచర్య ఎక్కువగా చేయడానికి ఒక అవకాశం!
    మన రాజ్య పరిచర్య—2011
  • మంచి విషయాల పట్ల ఆసక్తితో ఉండండి!
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1990
km 4/90 పేజీ 3

అభివృద్ధికర కార్యమునకు సమయము

1 ప్రస్తుత దుష్టవిధాన అంతము సమీపించుటను, మన పరిచర్యను యెహోవా ఆశీర్వదించుటను చూచుకొలది, “కార్యమునకు మీ మనస్సును ధైర్యపరచుకొనుడి,” అను పేతురు మాటలను పాటించుట తప్పనిసరియైన విషయమైయున్నది.​—1 పేతు. 1:13; యెష. 60:22.

2 పేతురు పై హెచ్చరికనిచ్చినప్పుడు క్రీస్తు చిందించిన రక్తముద్వారా మనదికాగల రక్షణను గూర్చి ఆయన వ్రాయుచున్నాడు. మనము రాజ్యసువార్తను ప్రకటించుటయనునది తన కుమారుని వరముగా యిచ్చుటద్వారా యెహోవా వ్యక్తపరచిన ప్రేమనుబట్టి మనము పొందు ప్రయోజనములయెడల మెప్పును, మరియు విశ్వాసమును ప్రదర్శించుటకు ఒక ప్రాముఖ్యమైన మార్గమైయున్నది. (యోహాను 3:16) జ్ఞాపకార్థదిన సమయము దేవుడు నియమించిన ఈ పనియందు మరెక్కువ చురుకుగా యుండవలసిన సమయము.

జ్ఞాపకార్థదిన ఆచరణ

3 ఈ సంవత్సరపు జ్ఞాపకార్థదిన ఆచరణ ఏప్రిల్‌ 10 సూర్యాస్తమయము తర్వాత జరుగును. ఈ ప్రత్యేక సందర్భము దృష్ట్యా యెహోవా దేవునితోగల మన సంబంధమును, యేసు బలిని మనము జ్ఞాపకముంచుకొనుచున్న విధానమును పరిశీలించుకొందుముగాక. ప్రతిదినము మన ఆలోచనయందును, మాటలోను, ప్రవర్తనలోను యెహోవా నీతియుక్తమైన ప్రమాణములకు ఖచ్చితముగా హత్తుకొనియుండుటద్వారా మన విశ్వాసమును ప్రదర్శించుదుమా? రాజ్యమును ప్రకటించుటలోను, శిష్యులను తయారుచేయుటలోను మనకై మనము కష్టించి పోరాడుట ద్వారా ఇతరుల యెడల మన ప్రేమను చూపించుచున్నామా? ప్రతి సంవత్సరము జ్ఞాపకార్థదిన ఆచరణలో యెహోవా మరియు యేసు మనకొరకు చేసిన దానిని ఒక ప్రత్యేకమైన రీతిలో జ్ఞాపకము చేసుకొందుము. (లూకా 22:19; 1 కొరిం. 11:23, 24) అట్టి ఆలోచనాపూర్వకమైన ఆచరణ మన వ్యక్తిగత సామర్థ్యములు, పరిస్థితులనుబట్టి అనుకూలమైన చర్యకు మనలను నడుపవలెను.

4 మార్చి 25వ, తారీఖున ప్రపంచవ్యాప్తముగానున్న యెహోవాసాక్షుల సంఘములు చాలామట్టుకు “వాస్తవమైన జీవమునకు చేరుము” అను ప్రత్యేక బహిరంగ ప్రసంగమును కలిగియున్నవి. క్రొత్తవారు సంఘముతో సహవసించుటకు అది ఎంతటి శ్రేష్టమైన అవకాశమును అందించినది! ఈ ప్రత్యేక ప్రసంగమునకు హాజరైనవారు యెహోవా ప్రజలతో తమ సహవాసమును కొనసాగించులాగున ప్రోత్సహింపబడవలెను.

ప్రత్యేక ఆసక్తిగల పత్రికల పంపకమును వృద్ధిచేయుడి

5 ది వాచ్‌టవర్‌ మరియు అవేక్‌! మనకు ఆత్మీయ ఆహారమునిచ్చుచు చదువుటకు సమయానుకూలమైనవేగాక మన బహిరంగ పరిచర్యలో ప్రాముఖ్యమైన పాత్రను వహించుచున్నవి. మే మరియు జూన్‌ పత్రికలను తయారుచేయుటలో చేయబడిన ప్రత్యేక ప్రయత్నమును రాజ్య ప్రచారకులందరు మెచ్చుకొందురు. చందాలను అందించునప్పుడు ఈ సంచికలను మనము ఉన్నతపరచుదుము. వాటిని పొందిన వెంటనే ప్రతి సంచికతో బాగుగా పరిచయము కలిగియుండుటకు ప్రయత్నించుము. చందాను, విడిప్రతులను లేక చందా చేయనివారికి ఒక బ్రొషూర్‌తోపాటు రెండు పత్రికలను అందించుటకు మీ ఆసక్తిని ఇది రేకెత్తించును.

6 మే మరియు జూన్‌ మాసములలో ఆక్సిలరీ పయినీర్‌గా చేయుటకు మీ వ్యక్తిగత కాలనిర్ణయపట్టికలో చోటు కల్పించుకొందువా? సంఘములోని అనేకమంది ప్రచారకులు ఒకే సమయములో పయినీర్‌ సేవ చేయదలచినట్లయిన కార్యమును వృద్ధిచేయు ఈ ప్రత్యేక సమయములో వారు ఒకరికొకరు సహాయము చేసుకొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకొనవచ్చును. అవసరమైన చోట సామూహిక సాక్ష్యము కొరకు (గ్రూప్‌ విట్‌నెసింగ్‌) అదనపు ఏర్పాటులను చేయు పెద్దలు సంతోషించెదరు.

7 నీ స్వంత పరిస్థితులనుగూర్చి అనగా, కుటుంబ బాధ్యతలు, భౌతిక ఆరోగ్యము, లౌకిక వృత్తి, పాఠశాల కార్యక్రమము మొదలగు వాటినిగూర్చి గంభీరముగా తలంచుము. ఈ సమయములో నీవు పయినీర్‌సేవ చేయలేకపోయినట్లయిన ప్రాంతీయ పరిచర్యలో పాల్గొనుటను ఎంతవరకు వృద్ధి చేయగలవు? ఆయనయెడల, ప్రశస్తమైన వరముగా ఆయన యిచ్చిన కుమారుడైన యేసుయెడల మనప్రేమను, మెప్పును, వ్యక్తపరచు పూర్ణాత్మతో కూడిన సేవతో యెహోవా నిశ్చయముగా ఆనందించును. దేవుని వాక్యపు వెలుగులో మనలను మనము పరిశీలించుకొంటూ కార్యముకొరకు మన మనస్సులను ధైర్యపరచుకొనుకొలది ఆయనకు అంగీకృతమైన స్తుతులను బలులను అర్పించుటలో మనలను బలపరచుటకు యెహోవా ఆత్మను కలిగియుందుమని నమ్మకమును కలిగియుండగలము.​—హెబ్రీ. 13:15.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి