సమయోచితమైన సహాయము
1 సంఘముయెడల ఆయన కలిగియున్న శ్రద్ధ మూలముగా యేసు ఎల్లప్పుడు “సమయోచితమైన సహాయము”నందించును. (హెబ్రీ. 4:16) ఎక్కువమట్టుకు ఈ అవసరమైన సహాయము ఎఫెసీయులు 4:8, 11, 12 లో వాగ్దానము చేయబడినట్లు “మనుష్యులలోని ఈవుల”ద్వారా అనుగ్రహించబడియున్నది. అట్టి ఈవులలో ప్రతి సంఘములోని సేవాకాపరి ఒకరు.
2 సేవాకాపరి ఏయే విధములుగా మనకు సహాయము చేయగలడు? అనేకములు కలవు: (1) ప్రకటన మరియు శిష్యులను తయారుచేయు పనియొక్క ప్రాముఖ్యత యెడల మనందరము మనస్సు కలిగియుండునట్లు చేయుటకు ఆయన పోరాడును. (2) సంఘపుస్తక పఠన గ్రూపుల ద్వారా ప్రాంతములో మంచి ఏర్పాటు మరియు నాయకత్వము అందించబడు విషయములో ఆయన శ్రద్ధ కలిగియున్నాడు. (3) పరిచారకులుగా ఫలభరితమగునట్లు వృద్ధి చెందుటకు మనలో ప్రతి ఒక్కరము అవసరమగు వ్యక్తిగత సహాయము అందించబడునట్లు చూచుటలో ఆయన ఆసక్తి కలిగియున్నాడు.
సేవాకాపరి దర్శనములు
3 సంఘపుస్తక పఠన ఏర్పాటు ద్వారా క్రమముగా అందించబడు మంచి సహాయముతోపాటు, వ్యక్తిగతముగా మనము సహాయము పొందుటకు ప్రత్యేక యేర్పాటులు చేయబడియున్నవి. సాధారణముగా సేవాకాపరి ఒక సంఘ పుస్తక పఠనమును నడిపించుటకు నియమించబడును. అయితే ప్రతి నెలలో ఒకసారి ఆయన తన స్వంత గుంపును విడిచిపెట్టి ఇతర పుస్తక పఠనములలో ఒకదానితో వారమంతా పనిచేయుటకు వెళ్లును. ఆయన అలా వెళ్లిన సమయములో తన సహాయకుడు ఆ లోటును పూరించును. వార కార్యక్రమములో నుండి గ్రూపు పూర్తిగా ప్రయోజనము పొందులాగున పథకములు వేసుకొనునట్లు ఆయన తన దర్శనమును గూర్చి కండక్టరుకు ముందుగా తెలియజేయును.
4 ఈ ప్రత్యేకవారములో పుస్తకపఠనము సాధారణ పద్ధతిలోనే 45 నిముషములు చేయబడును. మన సువార్తపనిలో అభివృద్ధి చెందుటకు సహాయపడు ప్రోత్సాహకర ప్రసంగమునిచ్చుటకు ఇది సేవాకాపరికి 15 నిముషములు వీలు కల్పించును. క్రొత్తగా ఆసక్తి చూపువారితోసహా ప్రచారకులందరు, హాజరగుట ప్రాముఖ్యము.
5 దర్శించబడుచున్న గ్రూపులోని ప్రచారకులందరు ఈ ప్రత్యేకవారములో సేవలో పూర్తిగా పాల్గొనునట్లు, మరీ ప్రత్యేకముగా వారాంతములో భాగము వహించునట్లు ఏర్పాటు చేసుకొనవలెను. తగినట్లయిన, ఆ వారమునకు సాయంకాల సాక్ష్యమును ఏర్పాటు చేసుకొనవచ్చును. సేవాకాపరియొక్క గురులలో ఒకటియేమనగా సేవలో సాధ్యమైనంత ఎక్కువమందితో పనిచేయుట. బహుశా ఆయన మనలో కొంతమందితో మన పునర్దర్శనములకును బైబిలు పఠనములకును వెంటరావచ్చును. పరిచర్యలో ప్రోత్సాహము, సహాయము అవసరమని భావించు ఎవరైనను సహాయమును కోరుతూ ఆయనను సమీపించవచ్చును. మరియు ఆ వారమున గ్రూపుకొరకు ఆయనచే నడిపించబడు ప్రాంతీయసేవ కొరకైన కూటములకు హాజరగుట ద్వారా ప్రయోజనములను పొందవచ్చును.
6 సేవాకాపరి గ్రూపు యొక్క పనినిగూర్చి పుస్తకపఠన కండక్టరుతో చర్చించుటకు సమయమును తీసుకొనును. విషయములు అందరికి అనుకూలించునట్లు ఆచరణాత్మకముగా ఏర్పాటు చేయబడియున్నట్లు చూచుటకు సేవకొరకు క్రమముగా జరుగుచున్న యేర్పాటులను పునఃసమీక్షించును. పరిచర్యలో క్రమముగా పాల్గొనుటకు కొంతమందికి ప్రోత్సాహము లేక సహాయము అవసరమైనట్లయిన వారితో ఒంటరిగా మాట్లాడి అభివృద్ధి చెందుటకు వారికి సహాయపడు దయాపూర్వకమైన సలహాలను అందించవచ్చును. క్రమము తప్పిన ప్రచారకులను పుస్తక పఠన కండక్టరుతోపాటు కలియుటకు సేవాకాపరి యేర్పాట్లు చేయవచ్చును. ఇంకను, పుస్తక పఠన కండక్టరుతోపాటు ఆ గ్రూపు యొక్క బైబిలు పఠన రిపోర్టు ఫైల్‌ను పునఃసమీక్షించవచ్చును. బహుశా వారు కొంతమంది ప్రచారకుల వెంట వారి బైబిలు పఠనములకెళ్లి ఆత్మీయ ప్రోత్సాహమునివ్వ వచ్చును.
7 ఎక్కువ పుస్తక పఠనములున్న సంఘములలో సేవాకాపరి దర్శనములు తక్కువ తరచుగానుండును. కావున తాను దర్శించునప్పుడు పూర్తి ప్రయోజనము పొందునట్లు అందరు అదనపు ప్రయత్నమును చేయవలెను. ఆయన దర్శనకాలములో నీ పరిచర్యను అభివృద్ధిపరచుకొనుటకు యివ్వబడు సలహాలను వ్రాసుకొని తదుపరి దర్శనములోపల వాటిని అన్వయించుకొనునట్లు పట్టుదలతో ప్రయత్నించుము. అవును, మనకవసరమైన ఏ సమయములోనైనను సహాయము చేయుటకు ఆయన సంఘములో అందుబాటులోనే యున్నాడు. కొన్ని పుస్తక పఠనములు మాత్రమేయున్న సంఘములలో కనీసము ప్రతి ఆరునెలలకు ఒకసారి దర్శించుటకు సేవాకాపరి ప్రయత్నించును.
8 సేవాకాపరి మన సంఘపుస్తక పఠనమును దర్శించునప్పుడు ఆయనతో సహకరించి, మన పూర్ణహృదయ మద్దతునిచ్చు యిష్టత, శిష్యులను చేయుపనిలో మన ప్రభావమును వృద్ధి చేసుకొనుటకును పరిచర్యలో మరి ఎక్కువ ఆనందమును కనుగొనుటకును సహాయము చేయును.