రాజ్య వర్తమానాన్ని వ్యాపింపజేయుటలో ఆసక్తిని కలిగియుండుడి
1 యెహోవా సత్క్రియలుచేసే దేవుడు, వాటిని నెరవేరునట్లు చూచుటలో ఆయన ఆసక్తిగలవాడు. సమస్తము ఆయన తనను సేవించే వారి మంచినిమిత్తమే చేస్తాడు. తన తండ్రి ఆసక్తిని అనుకరించుటలో యేసు శ్రేష్టమైన మాదిరిని చూపాడు. ఆయనొకసారి యెహోవా యింటిని గూర్చిన ఆసక్తిని బట్టి దేవాలయాన్ని వ్యాపార గృహముగా మార్చేవారిని తరిమికొట్టాడు. (యోహాను 2:14-17) మనమును “సత్క్రియల యందాసక్తిగల” ప్రజలుగా గుర్తింపబడవలెనంటే మనము కూడి యెహోవాదేవుని సేవలో ఆసక్తిని కనపర్చాలి.—తీతు 2:14.
2 క్రైస్తవుల సత్క్రియలు ఇతరులకు ప్రయోజనము కలుగజేస్తాయి. ఒక వ్యక్తికి చేయగలిగిన అత్యంత ప్రయోజనకరమైన సహాయమేదనగా యెహోవానుగూర్చి అతనికి సహాయపడుటయే. (యోహాను 17:3) రాజ్యసువార్త ప్రకటించుటలోను, శిష్యులను చేయు పనిలోను, మనము ఆసక్తిని కనపర్చుట ద్వారా అట్టి సహాయమందించగలము.
3 ఆసక్తి అనగా నేమి? ఆసక్తి అంటే ఉత్సాహము, క్రైస్తవుని ఆసక్తి అనేది సరియైనది, యుక్తమైనదాన్ని చేయుటకున్న మనఃపూర్వక కోరికనుండి ఉత్పన్నమవుతుంది. గ్రీకులో “ఆసక్తి” అంటే “ఉడికి పోవుట” అని అర్థము. దేవుని పరిచారకులుగా రాజ్యసమాచారమును ప్రకటించుటలో మనము ఈ లక్షణాన్ని కనపర్చాలి. మనము పరిచర్యలో ఆసక్తిని చూపిస్తున్నామా? యెహోవా సంకల్పములు ఇతరులు తెలిసికొనునట్లు సహాయపడుటలో మనము చేయగలిగినదంతా మనము చేస్తున్నామా?
బ్రొషూర్లను అందించుటలో ఆసక్తిని కనపర్చుడి
4 సెప్టెంబరులో మనము మరలా 32 పుటలున్న బ్రొషూర్లను అనగా స్కూల్ అండ్ జెహోవాస్ విట్నెసెస్ అనేది తప్ప తక్కినవాటిని అందించే ఆధిక్యత కలిగియున్నాము. మనము భూమిపై నిరంతర జీవితమును అనుభవించుట!, “లుక్ అయాం మేకింగ్ ఆల్ థింగ్స్ న్యూ,” షుడ్యు బిలివ్ ఇన్ ది ట్రినిటీ?, ది డివైన్ నేమ్ దట్ విల్ బ్రింగ్ ప్యారడైజ్ అనువాటిని అందించవచ్చును. ఆ ప్రాంతానికి, యింటింట నీవు కలిసే వ్యక్తికి తగిన బ్రొషూరును దేనినైన అందించుటకు సిద్ధపడుము.
5 రాజ్య వర్తమానమును ప్రకటించుటలో ఆసక్తిని కనపర్చాలంటే మనము బాగా సిద్ధపడాల్సిన అవసరం వుంది. ప్రస్తుత సంభాషణ అంశమేమిటో మనకు బాగా తెలుసా? ఈ సంభాషణాంశాన్ని మనమందించబోయే బ్రొషూరుతో ఎలా ముడి పెట్టాలి? బ్రొషూరులోని ఏ ముఖ్యాంశాలను మనము ప్రస్తావించవచ్చును? ఈ ఐదు బ్రొషూర్లలోని అంశాలను మనము బాగా తెలిసికొనుటకు సమయాన్ని వెచ్చిస్తే మన మనస్సులో వాటియెడల మంచి ఉత్సాహాన్ని వృద్ధి చేసుకొంటే అప్పుడు మనము వాటిని మన ప్రాంతములో ఆసక్తితో అందించగలము.
బ్రొషూర్లను అందించుటకు సలహాలు
6 నిన్ను నీవు పరిచయము చేసుకొన్న తర్వాత నీవిట్లనవచ్చును: “లోకములో ఈనాడున్న దుష్టత్వమును గూర్చి దేవుడు శ్రద్ధ కలిగియున్నాడా లేదా యని నీవెప్పుడైనా తలంచావా? [సమాధాన మివ్వనిమ్ము.] త్వరలో దుష్టులు నిర్మూలమగుదురని బైబిలు వివరిస్తుంది. [కీర్తన 92:7 చదువుడి.] ఈ కారణముచేత సరైన నడిపింపు. రక్షణకొరకు మనమెవరివైపు చూడగలము? [కీర్తన 145:20 చదువుడి.] గనుక మన సృష్టికర్తయైన యెహోవా దేవునితో గల సంబంధమువల్లనే మనకు రక్షణ కల్గుతుంది. విధేయులైన మానవులందరికి ఆయన చేసిన వాగ్దానముతో కూడిన దీవెనలను గూర్చి మనము తలంచవలసిన అవసరమున్నది.” అప్పుడు నీవు భూమిపై జీవించుట అనే బ్రొషూరులోని 49 పటాన్ని చూపించి ఆ క్రింది వాక్యాన్ని చదివి అందు వర్ణించబడిన దీవెనలను గూర్చి నొక్కి చెప్పుము. లేదా “గవర్న్మెంట్” బ్రొషూరులోని 29వ పేజీకి త్రిప్పి అచ్చట వివరించబడిన ఆశీర్వాదములను గూర్చి చర్చించుము. కొందరు “లుక్” బ్రొషూరులోని 49, 50 పేరాల నుపయోగించి దేవుని రాజ్యము మానవజాతికి తేనైయున్న మేలులను గూర్చి వివరించుటకు ఇష్టపడెదరు.
7 ఇవి క్లిష్ట పరిస్థితులు గనుక మన వర్తమానము అత్యవసరము. రాజ్య వర్తమానమును అందించుటలో ఆసక్తిని కనపరుస్తూ, ఇతరులు దేవునిని ఆయన వాక్యాన్ని తెలిసికొనుటకై వారిని ప్రోత్సహించే అవసరము. ఎంతైనా ఉన్నది, జీవాన్నిచ్చే ఈ జ్ఞానమును ఆసక్తితో ప్రకటిస్తూ, మనకున్న దైవభక్తిని, యెహోవా యెడల మనకున్న ప్రేమను వ్యక్తపరిచెదము. నిన్ను నీవే యిలా ప్రశ్నించుకొనుము: ‘నేను సత్క్రియల యందు ఆసక్తి కలిగియున్నానా? సువార్త పనిలో ఉత్సాహముతో, పూర్ణాత్మతో పాల్గొంటున్నానని నేను చెప్పగలనా?’ వీటికి మనమిచ్చే సమాధానాలే మన ఆసక్తి ఎలాంటిదో ఎంతో తెలియజేయగలవు. రాజ్య వర్తమానమును వ్యాప్తిజేయుటలో మనమెంత ఎక్కువగా పాల్గొంటే మన ఆసక్తి అంత అధికమవుతుంది. మనము సత్క్రియల యందు నిజంగా ఆసక్తి గలవారమని ఇతరులు మనలను చూడగలరు.