సంఘములో మన రాజ్యపరిచర్యను నెరవేర్చుట
1 క్రైస్తవ సంఘమునకు శిరస్సైన యేసుక్రీస్తు ద్వారా “నమ్మకమైన గృహనిర్వాహకునికి,” లేక యింటి యజమానికి యెహోవా బాధ్యతను అప్పగించాడు. (లూకా 12:42, 43) ఈ ఏర్పాటునుబట్టి ‘దేవుని మందిరములో మనమేలాగు ప్రవర్తింపవలెనో’ తెలియజేయుటకు అవసరమగు ముద్రితమైన నడిపింపును మనము పొంద సాధ్యమగుచున్నది. (1 తిమో. 3:15) అయితే ముద్రించబడియున్న దానిని కనుగొనుటకు మనకు వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ ముఖ్యసాధనము. అది మీకెట్లు సహాయపడగలదు?
2 మీరు ఒక పెద్దయైయున్నాడా? మీ బాధ్యతలను గూర్చి చర్చించు రెండు సాధారణ శీర్షికలు అందున్నవి. “ఎల్డర్స్” మరియు “ఓవర్సీర్స్,” “ఎల్డర్స్” అను విభాగములో సంఘములోని విభిన్న వ్యక్తులకు సహాయముచేయుట, హెచ్చరికను ఎట్లు ఇవ్వవలెను. పెద్దల కూటమిలో ఉండవలసిన సంబంధమేమిటి, పెద్దల బాధ్యతలు మొదలగు వాటికి సంబంధించిన సమాచారమునకు తగిన నడిపింపులున్నవి. “ఓవర్సీర్స్” అను దానిక్రింద ఓవర్సీర్స్కు ఉండవలసిన అర్హతలనుగూర్చి నడిపింపులున్నవి. ఎందుకనగా వాటిని చర్చించునప్పుడు బైబిలు ఆ పదమును ఉపయోగించినది. ఇంకా ఓవర్సీర్స్ క్రింద అధికారపూర్వకమైన నియామకములగు “ప్రిసైడింగ్ ఓవర్సీర్,” “సర్వీస్ ఓవర్సీర్,” “సెక్రెటరీ” మొదలగునవి ఉన్నవి. ఇంకా “కాంగ్రిగేషన్స్” అను ముఖ్య శీర్షిక కూడా కావలసిన సమాచారము నివ్వగలదు.
3 పరిచారుకులైన మీరు కూడా సంఘములో ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించెదరు. “మినిస్టేరియల్ సర్వెంట్స్” అను శీర్షిక మీ అర్హతలను గూర్చి మరియు బాధ్యతలను గూర్చి సమాచారమందించును. మీకొరకు వేచియున్న సేవా అధిక్యతల ప్రాముఖ్యత, మరియు మరియెక్కువ బాధ్యతలను ఎట్లు చేపట్టవలెను దానిని గూర్చిన సమాచారమునకు నడిపింపులివ్వబడినవి.
4 పెద్దలు మరియు పరిచారకులు సంఘ కూటములకు సంబంధించి అధిక్యతలను కలిగియున్నారు. “మీటింగ్స్” అను శీర్షిక ప్రతివిధమైన అంశములు, “ఎఫర్ట్స్ టు అటెండ్” అను దానిక్రింద ఉప్పోంగజేయు ఉదాహరణములు ఉన్నవి. ఇంకా ప్రతికూటముల పేరు మీద ఒక ముఖ్య శీర్షిక కూడా ఉన్నది.
5 కీర్తన 68:11 ఇట్లు చెప్పుచున్నది: “సువార్తను ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.” సంఘములో పురుషులైన సభ్యులవలెనే సహోదరీలు కూడా దేవుని గృహములో యుక్తమైన ప్రవర్తనకు కట్టుబడియుండవలెను. కొన్నిసార్లు ఒక సహోదరి ఎప్పుడు తలకు ముసుకు వేసుకొనవలెను లేక కూటములు చేయగలిగిన, లేక సంఘమునకు ప్రార్థనలో ప్రాతినిధ్యము వహించగలిగిన సహోదరులు లేనప్పుడు ఏమి చేయవలెనను ప్రశ్నలు ఉత్పన్నమగును. ఈ అంశములపై “ఉమెన్” అను ముఖ్య శీర్షిక నడిపింపునివ్వగలదు. ఇంకా “సిస్టర్స్,” “హెడ్ కవరింగ్,” “ప్రేయర్,” అను శీర్షికలు కూడా సహాయపడును.
6 1 తిమోతి 3:15 చివరలో క్రైస్తవ సంఘము “సత్యమునకు స్తంభము మరియు ఆధారమునైయున్నద”ని సూచించుచున్నది. దేవుని గృహములో యుక్తముగా నడుచుకొనుచు సంఘములో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుచుండుట ద్వారా సత్యమును బలపరచుట మన అధిక్యతైయున్నది.