సువార్తనందించుట—వినుట ద్వారా ఎక్కువ ఫలవంతంగా
1 మన పరిచర్యలో ఎక్కువ ఫలవంతంగా ఉండుటకు ఏ ఇద్దరు వ్యక్తులు ఒక రకంగా ఉండరని మనము గుర్తించవలెను. ఒక్కొక్కరికి జీవితములో విభిన్నమైన అనుభవములుండి వారి వ్యక్తిగత శ్రద్ధలు మరియు కోరికలలో భిన్నముగా ఉందురు. అయితే రాజ్యవర్తమానమును ఆయా వ్యక్తులకు సంబంధించినదే అన్నట్లు చేయుట అనగా, మనము మాట్లాడు వ్యక్తికి వ్యక్తిగతముగా అది ఎలాంటి భావమును కలిగియుంటుందో చూపించుటయే సవాలు. దీనిని ఫలవంతముగా చేయుటకు వారు చెప్పునది జాగ్రత్తగా వినవలెను.
2 అనేకమంది ప్రచారకులు తమ పరిచయ వాక్యములలో యుక్తిగా ప్రశ్నలు ఉపయోగింతురు. ఇది ఇంటి యజమానులను సంభాషణలోనికి దించుటకు సహాయపడును. ఇంటివారిని కలవరపరచని అభిప్రాయ సేకరణకొరకు వేయు ప్రశ్నలు ఎంతో ప్రభావితముగా యుండును. అయితే ఇంటి యజమాని మాట్లాడినప్పుడు, ఆయన చెప్పినదానిని మనము జాగ్రత్తగా వినుట ఆవశ్యకము. వినుట పొరుగువారియెడల ప్రేమను, గౌరవమును ప్రదర్శించుము, మరియు అట్లు చేయుటద్వారా ఆయన ఆలోచించు విషయమునుగూర్చిన అంతర్భావమును మనము తెలుసుకొందుము. వ్యక్తి పరిస్థితిని ఎరుగుట, అతని స్థానములోవుండి విషయమును నొక్కి తెల్పుటకు సహాయపడును. ఆ పిమ్మట బైబిలునుండి మనము ఓదార్పును, నిరీక్షణను ఆయనతో పంచుకొనవచ్చును.
పరిస్థితినిబట్టి మాట్లాడగలవారిగా ఉండుము
3 అపొస్తలుడైన పౌలు ఇట్లు ఉద్బోధించెను: “మీరు కలియు ప్రతి మనుష్యునితో ఏలాగు మాట్లాడవలెనో పఠించుము.” (కొలొ. 4:6, న్యూ ఇంగ్లీషు బైబిల్) ఒక వ్యక్తి ఏమి చెప్తాడో మనకు ముందే ఖచ్చితంగా తెలియకున్నను, ఈనాడు అనేకమంది ప్రజలు ఎదుర్కొనుచున్న సమస్యలను మనము ఎరిగేయున్నాము. ఆ విధంగా మనము “పఠించి” రకారకాల పరిస్థితులలో సమాధానము చెప్పుటకు మనము మానసికంగా సిద్ధపడియుండవచ్చును.
4 ఉదాహరణకు, మనము ప్రపంచ శాంతినిగూర్చి సంభాషించుటకు సిద్ధపడియుండవచ్చును. అయితే యింటివారు తాను ఉద్యోగాన్ని కోల్పోయానని చెప్పవచ్చును. అతని వ్యాఖ్యానాన్ని మనము పట్టించుకొనకుండా తీసివేయవలెనా? నిస్సందేహంగా తన కుటుంబానికి పోషించు విషయము తన మనస్సు మరియు హృదయముపై భారంగా ఉంటుంది. అతని అవసరతలకు తగినట్లు నీవెట్లు ప్రత్యుత్తర మిత్తువు? తన పరిస్థితులయెడల నిజమైన శ్రద్ధను చూపిస్తూ, నీవు ఆయన యెడల సానుభూతిని ప్రదర్శించవచ్చును. తరువాత దయతో దేవుని ప్రభుత్వము తృప్తికరమైన ఉద్యోగమును మనకు కావలసిన అవసరతలను ఎట్లు తీరుస్తుందో లేఖనములవైపు ఆయన అవధానమును మరల్చుము.—యెష. 65:17, 21, 22, 24.
5 బహుశా వ్యక్తిగాని లేక తన కుటుంబ సభ్యుడొకరు ఇటీవల నేరమునకు లేక అన్యాయమునకు గురియయ్యాడని తెలుసుకున్నాము. మన సానుభూతికరమైన శ్రద్ధ మరియు వ్యక్తిగత ఆస్తకి ఆ వ్యక్తియొక్క హృదయమును మెత్తపరచి, యెహోవా ఆ బాధాకరమైన సమస్యలను ఎరిగియున్నాడనియు త్వరలో ఈ దుష్టత్వమంతటిని తీసివేయుటకు ఆయన చర్య తీసుకొనుననియు చూపుటకు వీలుపడును.—రీజనింగ్ ఫ్రంది స్క్రిప్చ్ర్స్, పేజీలు 10, 12, 229-31 చూడుము.
6 వ్యక్తులు బాగుగా ఒకరినొకరు సంభాషించుకొనక పోవటంనుబట్టి సరియైన సంబంధాలు ఉండవు. ఒకరు మాట్లాడునప్పుడు తరచు మరొకరు మనస్సు హృదయముతో అవధానము నిలుపక పోవచ్చును. ఆవిధంగా సరిగా వినకపోవుటనుబట్టి ఆపార్థాలు ఉత్పన్నమై, ఒకరికి సహాయముచేయు అవకాశము జారవిడుచుకొందుము. గౌరవపూర్వకంగా వినునట్టి అలవాటును వృద్ధిచేసుకొనుటనుబట్టి మనమెంతో ఫలవంతంగా సువార్తను అందించి యెహోవాయొక్క నిస్వార్థమైన శ్రద్ధను ఇతరుల పట్ల ప్రతిబింబించి మన ప్రేమగల సృష్టికర్తతో మరియు ఆయన ప్రజలతో మంచి సంబంధమును వృద్ధిచేసుకొనుటకు సహాయపడును.—యాకో. 1:19; g74 11/22 పేజి 21-3.