దైవ పరిపాలనా వార్తలు
కొలంబియా: జ్ఞాపకార్థ దినమునకు శిఖరాగ్ర సంఖ్య 2,05,355 మంది హాజరైరి, ఇది పోయిన సంవత్సరము కంటే 23,000 ఎక్కువ. ఏప్రిల్‌లో ప్రచారకుల శిఖరాగ్ర సంఖ్యయగు 48,774తో పోల్చినట్లయిన, హాజరైన వారిలో 76 శాతము మంది ఆసక్తిగలవారై యున్నారు.
గ్రీసు: ఏప్రిల్‌లో 24,504 మంది ప్రచారకులు శిఖరాగ్ర సంఖ్యలో రిపోర్టుచేసిరి, మరియు 1,516 మంది క్రమపయనీర్ల శిఖరాగ్ర సంఖ్యయు కలదు.
హంగెరీ: ఏప్రిల్‌లో 11,296 మంది ప్రచారకులు మొత్తము 8,084 బైబిలు పఠనములను రిపోర్టు చేయుచున్నారు.
ఫిలిఫ్పైన్స్: ఏప్రిల్ 13న క్రొత్త బ్రాంచి వసతులను ప్రతిష్ఠించుట జరిగినది, దీనికి 1,718 మంది హాజరైరి. ఆ మరుసటి దినము ఆరు ప్రాంతములలో ప్రత్యేక ప్రసంగమివ్వబడగా, దానికి 78,501 మంది హాజరైరి. ఫిలిఫ్పైన్స్ ఏప్రిల్ నెలలో శిఖరాగ్ర సంఖ్యలో 1,10,225 మంది ప్రచారుకులను రిపోర్టు చేసినది.