మే నెల మీకు ప్రత్యేక మాసము కాగలదా?
1 తరచుగా మనము మార్చి మరియు ఏప్రిల్ మాసములను జ్ఞాపకార్థదినకాలం అన్నట్లు చెప్తూవుంటాం. ఎందుకనగా ఎప్పుడూ సంవత్సరములోని ఈ రెండు మాసములలోనే జ్ఞాపకార్థదిన ఆచరణ జరుగుతుంది. కావున యెహోవా ప్రజలు ప్రాంతీయ పరిచర్యలో తమ వంతును అభివృద్ధి చేసికొనుటకు ఉత్తేజితులగుదురు.
2 ఏప్రిల్ మాసములో సహాయ పయినీర్లుగా పాల్గొనిన కొందరు, మే మాసములోను కొనసాగుతుండగా, ఈ విస్తృత పనిలో మరికొందరు వారితో కలియుదురు. నీవును ఇందు పాల్గొనగోరితే, తక్షణమే నీ దరఖాస్తును ఇవ్వవలెను.
3 పయినీరుగా చేయలేనివారును, వారి ప్రాంతీయ పరిచర్యను వృద్ధి చేసికొనుట ద్వారా మే నెలను ఒక ప్రత్యేక మాసంగా చేసికొనవచ్చును. నిశ్చయంగా చేయవలసినది ఎంతోవున్నది. బహుశా సంఘ ప్రచారకులు, పయినీర్లు క్రొత్తగా బాప్తిస్మము తీసుకొనని ప్రచారకులను వారితోపాటు ప్రాంతములో పనిచేయుటకు ఆహ్వానించవచ్చును.
4 హాజరగు క్రొత్తవారిని ఆహ్వానించుటలో మెలకువగా నుండుటద్వారా మీరు మరొక బైబిలు పఠనమును ప్రారంభించవచ్చును. విస్తృతపరచిన మీ ప్రయత్నములపై యెహోవా ఆశీర్వాదముతో, మీ పరిచర్య ఫలదాయకమై, మే నెల మీకు ఒక ప్రత్యేక మాసముగా అగును.—కీర్త. 34:8, సామె. 10:22.