పురికొల్పే ఉపోద్ఘాతమును అందించుము
1 పాఠకుల మనస్సులలో హృదయాలలో సత్యముయొక్క విత్తనములను నాటుటకు కావలికోట మరియు అవేక్! రెండును ఉపయోగకరమైనవి. కాబట్టి వీటిలోని ఆత్మీయ ముత్యాలనుండి ప్రయోజనము పొందగలవారి గృహాలలోకి ఈ పత్రికలు వెళ్లటానికి మనము సమర్థవంతమైన మార్గాలను వృద్ధిచేసుకోవలెను.
2 మన పత్రికలను అంగీకరించి, వాటిని చదువులాగున యింటివారిని మనమెలా పురికొల్పవచ్చును? అది, చాలావరకు మనము వాటిని ఎలా పరిచయము చేస్తామనే దానిపై ఆధారపడివుంటుంది. ఫలవంతమగు ఉపోద్ఘాతములను సిద్ధపడుటకు రీజనింగ్ పుస్తకములో 9-15 పేజీలలో అద్భుతమైన సలహాలున్నవి.
3 నవంబరు 1 కావలికోట నందించేటప్పుడు రీజనింగ్ పుస్తకములోని 14వ పేజిలో చూపబడిన “ఓల్డ్ ఏజ్/డెత్” అనేదాని క్రింది మొదటి సలహాను మీరు ఉపయోగించ ప్రయత్నించవచ్చును.
మిమ్మును మీరు పరిచయము చేసుకొన్న తర్వాత మీరిలా చెప్పవచ్చును:
◼ “మీ అభీష్టము తెలిపే అవకాశముంటే, నేడు ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న సమస్యలలో ఏది మొదట సరిదిద్దబడాలని మీరు కోరుకుంటారు?” ఇంటివారి జవాబును విని, ఆయన అభిలాషను ఒప్పుకొనుము. తరువాత మీరు మరలా ఇలా చెప్పవచ్చును: “అలాంటి సమస్యలకు బైబిలు ఏ పరిష్కారాన్ని అందిస్తుందో చూడండి. [యెషయా 9:6, 7] కాబట్టి మానవజాతి సమస్యలన్నిటికి నిజమైన పరిష్కారం నిరంతరము జీవించగల, నీతియుక్తమైన, న్యాయమైన పరిపాలకుని చేతిలో ఉన్నది. దేవుడు వృద్ధాప్యము, మరణమును తీసివేసి పరదైసు భూమిపై మానవులకు నిరంతరము జీవించే అవకాశాన్నిస్తాడని బైబిలు వాగ్దానముచేయుచున్నది.” తరువాత వాచ్‌టవర్ 6వ పేజి వైపు త్రిప్పి “నిత్యజీవమునకై దేవుడిచ్చు ఆహ్వానము” అను ఉపశీర్షికను చూపుము.
4 నవంబరు 1 కావలికోటతో మీరు ఉపయోగించగల రెండు ఇతర ఉపోద్ఘాతములేమంటే రీజనింగ్ పుస్తకము 13 పేజిలోని “లైఫ్/హ్యాపినెస్” అనే శీర్షిక క్రింది మొదటి రెండు ఉపోద్ఘాతములు. వాటిలోని ఆలోచనలను, ప్రశ్నలను మీ స్వంతమాటలలో వ్యక్తపర్చవచ్చును, లేక రీజనింగ్ పుస్తకములో ఉన్నదానినే మీరు తిరిగి చెప్పవచ్చును. ఆ వ్యక్తి జవాబును అంగీకరించిన తరువాత కావలికోట 7వ పేజిలోని సమాచారమును అందించవచ్చును. యెషయా 65:21-23 చదివి, నిత్యజీవపు ఆశీర్వాదము అందరికి తెరువబడియున్నదని సూచించుము.
5 మీరు నవంబరు 8 అవేక్! నందలి “జనాబా పెరుగుదల” అనే అంశాన్ని ఉపయోగిస్తున్నయెడల “లైఫ్/హ్యాపినెస్” కింది 3వ ఉపోద్ఘాతమును మీరు వాడవచ్చును. దానిని కీర్తన 1:1, 2కు సంబంధపరచిన తరువాత అవేక్! 20 పేజీలో ఉన్న బాక్సునందలి “యెహోవా దైవపరిపాలన ఏమి చేస్తుంది” అనే దానివైపు మీ అవధానమును మరల్చవచ్చును.
6 సాధారణంగా మాకు మా స్వంత మత సాహిత్యమున్నదని చెప్పే గృహస్థులను మీరు కలువవచ్చును. అప్పుడు మీరు, మాకు కూడ మా స్వంత ఉపయోగమునకు ప్రచురణలున్నవి అని చెప్పవచ్చును. (మన రాజ్య పరిచర్య మొదలగునవి); అయినను మన పత్రికలు యెహోవాసాక్షులు కాని లక్షలాదిమందిచే చదువబడుతున్నవి.
7 మొదటి కొరింథీయులు 3:6లో పౌలు ఇలా చెప్పాడు: “నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను. వృద్ధికలుగజేయువాడు దేవుడే.” యెహోవా ఆసక్తిగలవారి హృదయాలలో సత్యమనే విత్తనాలను పెరుగునట్లు చేయాలని మనము కోరినట్లయిన, పురికొల్పునట్టి ఉపోద్ఘాతములను ఉపయోగించుటద్వారా విత్తనములను సమర్ధవంతముగా విత్తుటకు మనము అవధానమియ్యవలెను.