ప్రాముఖ్యమైన ఉపకరణములను వివేకముగా ఉపయోగించుట
1 మీరు ప్రతి గుమ్మము వద్ద సాక్ష్యమిస్తున్నప్పుడు, బైబిలును మరియు ఇతర ప్రాముఖ్యమైన ఉపకరణములను ఉపయోగిస్తూ ప్రతి గృహస్థునితో నిర్మాణాత్మకంగా, లేఖనపూర్వకంగా సంభాషించుట మీ గమ్యమై యుండాలి. (2 కొరింథీయులు 6:1; 2 తిమోతి 2:15 పోల్చుము.) ఈ రోజుల్లో మీ ప్రాంతమందలి ప్రజలు ఏ విషయంలో శ్రద్ధకలిగి వున్నారు? కుటుంబ జీవితముయొక్క ప్రమాణము క్షీణించుట మరియు ఆర్థిక స్థితిగతులనుగూర్చి వారు చింతిస్తున్నారా? వీటిలో ఏ అంశముపైనైనా, క్లుప్తమైన పరిచయపు మాటలు మంచి బైబిలు చర్చకు నడపవచ్చును.
2 మీరిట్లనవచ్చును:
◼ “సవాలు పూర్వకమైన ఈ దినాలలో, అనేకమంది ప్రజలకు కనీస అవసరతలను తీర్చుకోవడమే కష్టమైపోతుంది. అందరికి న్యాయమైన రీతిలో మానవ ప్రభుత్వములు, మన ఆర్థిక సమస్యలను తీరుస్తాయని మీరనుకుంటారా? [జవాబును వినుము.] ఈ విషయం చాలా ప్రోత్సహకరంగా ఉన్నట్లు నేను వ్యక్తిగతంగా కనుగొన్నాను . . . ”
3 అప్పుడు మీరు కీర్తన 72:12-14 చదివి, రీజనింగ్ పుస్తకము 154-5 పేజీలలోనున్న ఇతర లేఖనాన్ని ఎన్నుకొని సంభాషణను పొడిగించవచ్చును. అలాకాకపోతే, ఒక లేఖనాన్ని చదివిన తరువాత, లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్ అను కరపత్రములో ఒక పేరాను మీరు సూచించవచ్చును. అనేక మంది ప్రచారకులు—పిల్లలతో సహా—ఈ కరపత్రములలో ఒకదానియందలి పేరాను చదివి, చదువబడిన భాగముపై యింటివారి అభిప్రాయమును అడుగుట ద్వారా విజయవంతంగా బైబిలు పఠనములను ప్రారంభిస్తున్నారు.
4 మరి కొన్ని వర్గముల ప్రజలను ఈ విధంగా సమీపించుటకు మీరు యిష్టపడవచ్చును:
◼ “చర్చి సభ్యులైన అనేకమంది ప్రజలకు బైబిలును ఎలా దృష్టించాలో నిర్దిష్టంగా తెలియదు. మీరు బైబిలును దేవుని వాక్యమని అనుకుంటారా, లేక కొంతమంది ప్రజలు తలంచునట్లు అది కేవలం ఒక మంచి సాహిత్యమనుకుంటారా? [జవాబు చెప్పనివ్వండి.] ఒకవేళ అందరూ దానిని అనుసరించగల్గితే, ఎంతో సంతోషభరితమైన జీవితాలను జీవించగల్గేలా చేసే అద్భుతమైన వివేకముగల సలహాతో అది నిండి ఉందని అనేకులు అంగీకరిస్తారు.”
5 ఇప్పుడు మీరు 2 తిమోతి 3:16, 17 లోని అపొస్తలుని వాక్యమును పరిచయము చేసి చర్చించవచ్చు, లేక ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు అనే కరపత్రములోని అంశాలను ఉపయోగిస్తూ, గృహ బైబిలు పఠనములను ప్రారంభించుటకు ప్రయత్నించవచ్చును.
6 ఇంటివారు ఆసక్తిని కనపరిస్తే, మీ భాషలో ఆ నెలకొరకు సూచించబడిన సొసైటియొక్క 192 పేజీల పాత బౌండు పుస్తకముయొక్క విలువను వారికి చూపించుము, లేదా, మీరు అందిస్తుంది మన సమస్యలు బ్రొషూరైతే దానిని ఉపయోగించుము. లేక మీరు సముచితమని భావిస్తే, ఇతర ప్రాముఖ్య ఉపకరణమును అనగా కరపత్రమునుండో, పత్రికనుండో లేదా మరొక బ్రొషూరునుండో యుక్తమైన అంశమును తెలియజేయుము.
7 మీరు మొదటి దర్శనములోనే పఠనాన్ని ప్రారంభించగలిగితే, తరువాత దినాన చర్చను కొనసాగించుటకు కచ్చితమైన ఏర్పాటులను చేసికొనుము. బహుశా ఇంటివారితో ప్రజలు సాధారణంగా అడిగే “దేవుడు దుష్టత్వమును ఎందుకు అనుమతిస్తున్నాడు” అను ప్రశ్నను మరలా తిరిగివచ్చినప్పుడు చర్చిస్తామని చెప్పుటద్వారా తదుపరి దర్శనానికి మీరు పునాదివేయవచ్చును. పునర్దర్శనములో అంశమును ఎలా వివరించవచ్చునో క్రిందనున్న శీర్షిక సూచిస్తుంది.