దైవపరిపాలనా వార్తలు
ఇండియా: ఆగస్టు నెలలో మనం 13,010మంది ప్రచారకుల రిపోర్టుతో ఈ సేవా సంవత్సరం ఆరవ శిఖరాగ్ర సంఖ్యను చేరుకుని, మొత్తానికి 8 శాతం అభివృద్ధిని సాధించాం. వార్షిక రిపోర్టును తయారుచేసే సందర్భంలో 1,200మంది వ్యక్తులు ఈ సేవా సంవత్సరంలో బాప్తిస్మం పొందడాన్ని చూడటం చాలా ప్రోత్సాహకరంగా ఉంది—గత సంవత్సరం కంటే 29 శాతం అభివృద్ధి అనేది చాలా అద్భుతం! సెప్టెంబరు 1993 నుండి 60మంది క్రొత్త క్రమ పయినీర్లు చేరడంతో, మనం మరొక ఫలవంతమైన సంవత్సరం కొరకు ఎదురు చూడవచ్చు.
బ్రెజిల్: ఈ సేవా సంవత్సరం జూలై నెలలో 3,48,634 మందిని రిపోర్టు చేస్తూ నాల్గవ శిఖరాన్ని చేరుకుంది.