తరచూ ప్రకటించిన ప్రాంతాల్లో పనిచేయుట
1 కొన్ని సంఘాలు తమ ప్రాంతంలో తరచూ పనిచేస్తున్నట్లు మనకు అందుతున్న రిపోర్టులనుబట్టి మనం ఆనందిస్తాము. (మత్త. 24:14; 1 తిమో. 2:3, 4) ఇది మనకొక సవాలును అందించినప్పటికి, మనం బాగా సిద్ధపడి, ఎదురయ్యే వేర్వేరు పరిస్థితులతో వ్యవహరించడానికి సన్నద్ధులమైతే, దానిని విజయవంతంగా ఎదుర్కోవచ్చునని అనుభవం చూపెట్టింది.
2 ప్రవవంతమైన ఉపోద్ఘాతములనేవి ఓ కీలకం: బాగా ఆలోచించి తయారుచేసుకున్న ఒకటి లేదా ఎక్కువ ఉపోద్ఘాతములను ఉపయోగించడానికి సిద్ధపడడం చాలా ప్రాముఖ్యమైయున్నది. మనం తరచూ సందర్శించడానికి గల ప్రాముఖ్యమైన కారణాలను స్పష్టంచేసే ఉత్తేజకర వ్యాఖ్యానాలు వాటిలో ఇమిడి ఉండాలి.
3 ఉపయోగించదగిన ఉపోద్ఘాతాలకు సంబంధించిన శ్రేష్ఠమైన అనేక ఉదాహరణలను రీజనింగ్ పుస్తకం అందిస్తుంది. “తరచూ పనిచేసిన ప్రాంతం” అనే అంశం క్రింద 15 వ పేజీలో అలాంటివి మూడు వివరించబడ్డాయి. మీ ప్రాంతంలో మీరు ఉపయోగించదలచిన వాటిని రిహార్స్ చేసుకోండి.
4 తరచూ పనిచేసిన ప్రాంతంలో ఉపోద్ఘాతాలను మొదలుపెట్టడానికి స్థానిక వార్తాపత్రికల్లోని విషయాలను ఉపయోగించడం ద్వారా కొంతమంది ప్రచారకులు విజయాన్ని సాధిస్తున్నారు. ఇదెలా చేయవచ్చునో చూపడానికి రీజనింగ్ పుస్తకంలో మూడు ఉదాహరణలివ్వబడ్డాయి. “నేరము/భద్రత” అనే అంశం క్రింద 10 వ పేజీలో ఇవ్వబడ్డ రెండవ ఉపోద్ఘాతాన్ని, 10, 11 పేజీలలో “ప్రస్తుత సంఘటనలు” అనే అంశం క్రింద ఇవ్వబడిన మొదటి రెండు ఉపోద్ఘాతాల్ని పరిశీలించండి.
5 మీరు సిద్ధపడే ఉపోద్ఘాతాలు: రీజనింగ్ పుస్తకంలో ఇవ్వబడిన వాటికి సరిపడే ఉపోద్ఘాత వ్యాఖ్యానాలను తయారుచేసుకుని ఉపయోగించడానికి చొరవతీసుకోండి. మీ స్వంత మాటలను ఉపయోగిస్తూ, వీటిని మీ సహజ పద్ధతిలో వ్యక్తంచేయండి. వాటిని ప్రాంతీయసేవలో ఉపయోగించే ముందు అనుభవంగల ప్రచారకునితో రిహార్స్ చేయండి.
6 ఉదాహరణకు, మీరు ఈ విధంగానైనా చెప్పవచ్చు:
◼ “క్రితం మిమ్మల్ని మేము సందర్శించినప్పటినుండి, [సమాజంలో ప్రజలు ప్రస్తుతం మాట్లాడుకుంటున్న సంఘటనను వివరించండి]. ఏదోవిధంగా మనమంతా ప్రభావితులమయ్యాం కాబట్టి, మన పొరుగువారనేకులు ఎంతో విచారాన్ని వ్యక్తంచేశారు. బహుశ మీరు కూడ దీన్ని గూర్చి ఆలోచించి యుండవచ్చు. [రాబోయే సమాధానం కొరకు కొంచెం ఆగండి.] ఈ పరిస్థితిని పరిష్కరించడానికి ఏదైనా చేయవచ్చని మనం నిశ్చయంగా నిరీక్షిస్తాం. అయినను, శాశ్వత పరిష్కారం కొరకు, ప్రవక్తయైన యిర్మీయా 10 వ అధ్యాయం 23 వ వచనంలో వ్రాసిన దానితో మీరంగీకరించరా?” లేఖనం చదివిన తర్వాత, గృహస్థుని అభిప్రాయం తెలిసికొని, ఆ తర్వాత చర్చిస్తున్న ఆ ప్రత్యేక సమస్యను యెహోవా ఎలా పరిష్కరిస్తాడో చూపే ప్రత్యేక లేఖనంపై అవధానం మళ్లించండి.
7 లేదా మీరిలా అనవచ్చు:
◼ “నిజంగా మీరు ఈ రోజు వార్తల్లో గమనించి యుండవచ్చు [జరిగిన ప్రత్యేక సంఘటనను వివరించండి]. ఇది మనందరిపై ప్రభావం చూపుతుందనే విషయం మీరు బహుశ ఒప్పుకుంటారు. [రాబోయే సమాధానం కొరకు కాస్త ఆగండి.] ప్రభుత్వంవారు స్వల్పకాల నివారణ చర్యలు తీసుకుంటారని మనం వేచియుండగలం; అయితే, శాశ్వతంగా ఆ సమస్య ఎలా పరిష్కరించ బడుతుందో బైబిలు చూపెడుతుంది.” దేవుడు చేయబోయే దాన్ని వివరించే ఒక ప్రత్యేక లేఖనానికి అవధానాన్ని మళ్లించండి.
8 “మీరెందుకిలా తరచు కలుస్తుంటారు?” సంభాషణను ఆటంకపర్చే వారికి తగిన ప్రత్యుత్తరాలు రీజనింగ్ పుస్తకమందలి 10 వ పేజీలో “మీరెందుకిలా తరచు కలుస్తుంటారు?” అనే అంశం క్రింద ఇవ్వబడ్డాయి. దేవుని యెడల, ప్రజలయెడల ఉన్న నిజమైన ప్రేమ, సాధ్యమైనంత తరచుగా సందర్శించేలా పురికొల్పుతుందనే విషయాన్ని మెచ్చుకొనేలా ఇతరులకు సహాయపడడానికి, అడగక ముందు కూడ, మనం సరియైన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లైతే, మనం మంచి సాక్ష్యం ఇవ్వగలం. ఈ విషయంలో యోహాను 21:15-17 నందలి యేసు మాటలను చర్చించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
9 చాలునని యెహోవా చెప్పేంత వరకు, మనం తరచూ ప్రకటించిన ప్రాంతాల్లో పనిచేసే సవాలును ఎదుర్కొనుటలో కొనసాగుదాం. ఈ నిశ్చయతతోనే, ఆయన నడిపింపు, చేయూత, ఆశీర్వాదాలు మనకు అంతం వరకు కూడ ఉంటాయని మనం నమ్మకం కల్గియుండగలము.—మత్త. 28:19, 20.