కూటములకు హాజరగుట—ఒక గంభీరమైన బాధ్యత
1 కూటములకు హాజరవ్వడాన్ని మీరెంత గంభీరంగా తీసుకుంటారు? అది ఆలోచించదగిన ప్రశ్నే, కాదంటారా? నిస్సందేహంగా మనలో అనేకమంది కూటముల విలువను గుణగ్రహిస్తున్నామనే భావిస్తుంటాం. అయినను, ఇటీవల కొన్ని సంఘాల్లో కూటములకు హాజరయ్యేవారి సంఖ్య తగ్గిపోతున్నట్లుగా రిపోర్టులు సూచిస్తున్నాయి. కారణమేమైయుండవచ్చు? కూటములకు క్రమంగా హాజరయ్యే మన బాధ్యతలో, అనవసరమైన ఉద్యోగ పని, అలసట, ఇంటిపని, కొద్దిపాటి అస్వస్థత, లేదా కొంచెం అననుకూల వాతావరణం జోక్యం చేసుకొనేలా మనలో కొందరు అనుమతిస్తున్నారా? (ద్వితీ. 31:12) లేఖనబద్ధంగా ఇది మన బాధ్యత కాబట్టి, కూటమునకు హాజరగుటను నేను ఎంత గంభీరంగా తీసుకుంటున్నాను? అనే ప్రశ్నను మనలో ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా పరిశీలించాల్సి ఉంటుంది.
2 కూటములకు హాజరవ్వడానికి మన సహోదరులలో కొందరు, గంటల తరబడి దుమ్ముతో కూడిన రోడ్లపై నడిచి, మొసళ్లతో నిండిన నదులను దాటి వెళ్తున్నారు. గంభీరమైన ఆరోగ్య సమస్యలు, అంగవైకల్యతలు, ఉద్యోగ స్థలాల్లో కృంగజేసే పనిభారం, లేదా ఒత్తిడిచేసే పాఠశాల పని ఉన్నప్పటికీ “ఎన్నడూ తప్పిపోకుండా” హాజరయ్యే విశ్వాసవంతులు మీ స్వంత సంఘంలోనే ఉండవచ్చు. (లూకా 2:37) కూటాలకు హాజరవ్వడానికి వారెందుకు కృషి చేస్తున్నారు? ఎందుకంటే ఒత్తిడితో నిండిన ఈ లోక సమస్యలను తమ స్వశక్తితో పరిష్కరించలేరని వారికి తెలుసు. దేవుడనుగ్రహించే శక్తిపై వారు ఆధారపడాల్సి ఉంది.—2 కొరిం. 12:9, 10.
3 ప్రార్థించడానికి, అనుభవాలను పంచుకోవడానికి, దేవుని వాక్యాన్ని పఠించడానికి క్రమంగా కూడుకున్న తొలి క్రైస్తవులు చూపిన మాదిరినే ఈనాడు మనం అనుసరిస్తున్నాము. (అపొ. 4:23-30; 11:4-18; కొలొ. 4:16) బైబిలు ప్రవచనమూ సిద్ధాంతాలపై ఉపదేశం, ఆలాగే దైవిక ప్రవర్తన, క్రైస్తవ నైతికతలు, వాటితో పాటు ప్రస్తుత లేఖన నియమాలను జాగ్రత్తగా పాటించడంద్వారా మన జీవితాలను మెరుగుపర్చుకోవడానికి సమయానుకూలమైన ఉద్బోధను మనం పొందుతున్నాము. (1 తిమో. 4:8) అంతేకాకుండా, సమస్యలూ వేదనలనేవి ఏదొకరోజు అంతమౌతాయనే మన నిరీక్షణనుగూర్చి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఈ నిరీక్షణను సజీవంగా ఉంచడం చాలా ప్రాముఖ్యము.—హెబ్రీ. 6:19.
4 కూటములకు హాజరయ్యే విషయాన్ని మీ కుటుంబం ఎంత గంభీరంగా తీసుకుంటుంది? భోజనసమయం లేదా ఉద్యోగంవలే ఇది మీ నిర్దిష్ట పట్టికలో ఒక ప్రాముఖ్య భాగమైయుందా? కూటం జరిగే రాత్రులందు, హాజరు కావాలా వద్దాయని నీకై నీవు తర్కించుకుంటున్నావా, లేదా మీ సహోదరులతో క్రమంగా సహవసించడానికి మీ కుటుంబం ఎంచుకోవడంలేదా? అనేకమంది ప్రచారకులు తాము ఎదిగేటప్పుడు సమర్పించుకున్న తమ తలిదండ్రుల మాదిరిని జ్ఞప్తికితెచ్చుకుంటారు. “నాన్నయితే, ఎల్లప్పుడూ కుటుంబమంతా కూటములకు వెళ్లేలా చూసేవాడు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే, వారితో మాలో ఒకరు ఇంటివద్దనే ఉంటారు, కాని మిగిలిన వారంతా కూటములకు వెళ్లేవారు!” అంటూ ఒక పెద్ద ఎంతో ఇష్టంగా గుర్తుచేసుకుంటున్నాడు.
5 ఈ ఆత్మీయ ఏర్పాట్లయెడల మెప్పుదలను వృద్ధిచేసే దృక్పథంతో, ప్రతీ సంఘ కూటముల విలువలను గూర్చి దీని తర్వాత వచ్చే మన రాజ్య పరిచర్య సంచికల్లో మనం చర్చించుకుందాం. మీరు కూటములకు హాజరగుటలో మరింత అనుగుణంగా ఉండగల్గితే, మీరు దేనిని పోగొట్టుకుంటున్నారో తెలిసికోవడానికి ఆ శీర్షికలు మీకు సహాయపడతాయి. కూటములను నిర్వహించే వారికి సహాయకరమైన జ్ఞాపికలు, ఆలాగే కూటములకు సిద్ధపడుటలోను వాటిలో భాగం వహించుటలోను మనమంతా అన్వయించుకోగలిగే సలహాలు వాటిలో ఇమిడివున్నాయి. కుటుంబ సమేతంగా సమకూడి మీరు కూటములకు హాజరయ్యే విధానాన్ని గూర్చి ప్రార్థనాపూర్వకంగా ఎందుకు పరిశీలించకూడదు? ఆ తర్వాత మీ పట్టికలో అవసరమైన మార్పులను చేసుకోండి. మన దైవపరిపాలనా బోధనలో క్రమంగా కూటములకు హాజరవ్వడం చాలా ప్రాముఖ్యమైన భాగమైయుంది, మరి నిజంగా దానిని మనం చాలా గంభీరంగా తీసుకోవాలి.