చందా మరియు పత్రికలను అందించిన వారియొద్దకు వెళ్లండి
1 శిష్యులను చేయటంలో కృషి చేయమని యేసు తన అనుచరులను ప్రోత్సహించాడు. (మత్త. 28:19) అంటే దాని అర్థం కేవలం పత్రికలను అందించడం మాత్రమే కాదు; ప్రజలు ఆత్మీయంగా అభివృద్ధి చెందేలా సహాయం చేయాలని మనము ఇష్టపడతాము. అలా చేయాలంటే, ఆసక్తిని ప్రదర్శించిన వారికి కావలసిన ఇతర సహాయాన్ని అందించడానికి మనము మళ్లీ వెళ్లాలి.
2 మీరు మీ మొదటి దర్శనంలో ఒక పత్రికలోని ఒక శీర్షికను ఉన్నతపర్చటం ద్వారా చందాను అందించినట్లైతే, మరలా తిరిగి వెళ్లినప్పుడు కూడా అదే అంశాన్ని చర్చించటం మంచిగా ఉంటుంది:
◼ “నేను క్రితంసారి దర్శించినప్పుడు, కావలికోట (లేక తేజరిల్లు!) లోని శీర్షికను మీ అవధానానికి తెచ్చాను. మనము బైబిలును పరిశీలించ వలసిన అవసరతను గుణగ్రహించడానికి అది సహాయపడింది. మానవజాతి కొరకు మంచి భవిష్యత్తును గురించిన దేవుని సంకల్పం ఆయన రాజ్య ప్రభుత్వంపైనే కేంద్రీకరించబడి ఉంది. ఈ ప్రభుత్వం అన్ని యుద్ధాలను అంతమొందిస్తుందను ఆయన వాగ్దానం మీకా 4:3, 4 నందు వ్రాయబడి ఉంది.” లేఖనాన్ని చదివిన తరువాత, మీరు “ఇదిగో!” బ్రోషూరును పరిచయం చేయాలని ఎంపిక చేసుకొనవచ్చు, కవరుపైన ఉన్న పటాన్ని చూపవచ్చు. మొదటి పేరాను, ఆ పేరా కొరకు సూచించబడిన లేఖనాలను చూపుతూ అందులో మీకా 4:3, 4 కూడ ఒకటని గుర్తించవచ్చును. పేరా 2 తో చర్చను కొనసాగించడానికి పునర్దర్శనాన్ని ఏర్పాటు చేయవచ్చు.
3 ఒకవేళ ఇంటి యజమాని కేవలం ఒక ప్రతినే తీసుకొని ఉండి అతనికి తగుమాత్రమే ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తే లేక చర్చించడానికి అతనికి సమయం లేకపోతే, మీరు కేవలం అతని పేరును మీ పత్రికా మార్గంలో కలుపుకొనటానికి తీర్మానించుకొనవచ్చు:
◼ “నేను మీకు ముందు ఇచ్చి వెళ్లిన పత్రికలపై మీరు ఆసక్తిని కనపరిచారు గనుక, ఈ తాజా సంచికలను చదవడానికి మీరు ఇష్టపడతారని నేను భావించాను. ఈ శీర్షిక మీకు ప్రత్యేకంగా ఆసక్తికరంగా ఉండవచ్చని నేను విశ్వసిస్తున్నాను.” అతనికి నచ్చుతుందని మీరు భావించే ఒక శీర్షికను సూచించండి. తదుపరి సంచికలను తీసుకుని మళ్లీ వస్తానని చెప్పండి.
4 ఒకవేళ ఇంటి యజమాని ఆ ఒక్క ప్రతిని చదివి ఉండి వాటిపట్ల మెప్పును వ్యక్తపరిస్తే, మీరు చందాను అందించవచ్చు:
◼ “మీరు కావలికోట (లేక తేజరిల్లు!) ను చదివి ఆనందించినట్లు కనిపిస్తున్నారు గనుక, మీరు దానికి (కావలికోట లేక తేజరిల్లు! లేక రెండు) చందా చేయమని నేను సలహా ఇస్తున్నాను, ఎందుకంటే మీరు దానిని (లేక వాటిని) పోస్టు ద్వారా క్రమంగా పొందవచ్చు మరి మీరు ప్రతి సంచికను కచ్చితంగా పొందుతారు.” ఒకవేళ అతను చందాను అంగీకరిస్తే లేక ఆసక్తిని చూపిస్తే తిరిగి రావడానికి ఏర్పాటు చేయండి.
5 మొదటి దర్శనాల్లోనే చందాలను అందించడానికి అనుకూల భావాన్ని కలిగి ఉండండి, ఒకవేళ ఆ వ్యక్తి పత్రికయొక్క కేవలం ఒక ప్రతినే అంగీకరిస్తే, మీరు మళ్లీ వెళ్లినప్పుడు చందాను అందించండి. చందా స్లిప్పులను పూర్ణంగా మరియు స్పష్టంగా నింపడానికి, మరి మూడు కాపీలను వ్రాయడానికి జ్ఞాపకం ఉంచుకోండి—ఇంటి యజమాని వద్ద రిసిప్టుగా ఒకటి ఉంచండి. మిగతా రెండు కాపీలను చందాతోపాటు మీ సంఘంలో చందాలను గురించి శ్రద్ధ తీసుకునే సహోదరునికి ఇవ్వండి. కావలికోట మరియు తేజరిల్లు! లలో దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేయడానికి మనకు సహాయపడే అద్భుతమైన పనిముట్లను కలిగి ఉన్నాము. యేసు ఆజ్ఞాపించిన సంగతులను ఇంకా ఎక్కువ నేర్చుకొనడానికి యథార్థవంతులకు సహాయం చేయడానికి మనము వీటిని పూర్తిగా ఉపయోగించుదాము.—మత్త. 28:20.