ప్రశ్నా భాగము
◼ యెహోవాసాక్షులు తన ఇంటిని యిక దర్శించవద్దని ఒక గృహస్థుడు పట్టుబట్టినప్పుడు, ఆ విషయంతో ఎలా వ్యవహరించాలి?
మత సంబంధమైన సందర్శనాలు లేదా ప్రాముఖ్యంగా యెహోవాసాక్షుల సందర్శన కచ్చితంగా నిషేధించబడిందని తలుపుపై వ్రాసియున్నట్లు మనకు కన్పించినట్లైతే, గృహస్థుని కోరికను గౌరవించి, తలుపును తట్టడం మానివేయడం చాలా మంచిది.
అమ్మేవారు లేదా చందాలు వసూలుచేసే వ్యక్తులు నిషేధించబడ్డారని చెప్పే సూచనలను కొన్నిసార్లు మనం గమనించవచ్చు. మనం ధర్మాదాయ మతసంబంధ సేవను చేస్తున్నాము కనుక, అది మనకు వర్తించదు. అలాంటప్పుడు ఆ తలుపును తట్టడం సమంజసమే. ఒకవేళ గృహస్థుడు వ్యతిరేకిస్తే, అలాంటి సూచనలు మన విషయంలో వర్తించవని భావిస్తున్నామని మనం నేర్పుతో వివరించవచ్చు. ఆ తర్వాత ఈ నిషేధంలో యెహోవాసాక్షులు కూడా ఇమిడివున్నారని ఒకవేళ గృహస్థుడు సవివరంగా చెప్పినట్లైతే, అతని కోరికను మనం గౌరవిస్తాము.
కొన్ని సందర్భాల్లో మనం ఒక గృహస్థున్ని సందర్శించినప్పుడు, అతడు బాగా కలవరపడి మరలా రావద్దని నొక్కిచెప్పవచ్చు. అతని విన్నపంతో మనం ఏకీభవించాలి. టెరిటరీ ఎన్‌వెలప్‌లో తారీఖుతో సహా ఆ విషయాన్ని వ్రాయాలి, తద్వారా భవిష్యత్తులో ప్రచారకులు ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నప్పుడు ఆ గృహాన్ని సందర్శించకుండా జాగ్రత్తపడతారు.
అయినను, మనం మనసులో పెట్టుకోవాల్సినదేమంటే, అలాంటి గృహాలను శాశ్వతంగా అలక్ష్యం చేయకూడదు. ప్రస్తుతం దానిలోవున్నవారు మరొకచోటికి వెళ్లవచ్చు. అనుకూలంగా ప్రతిస్పందించే మరొక కుటుంబాన్ని మనం కలుసుకోవచ్చు. మనం మాట్లాడిన గృహస్థుడు హృదయాన్ని మార్చుకునే సాధ్యత కలదు, మనం సందర్శించడానికి మరెక్కువ ఇష్టపడవచ్చు. కాబట్టి, కొంతకాలం తర్వాత, దానిలో నివసించే వారి సరిక్రొత్త భావాలను నిర్ణయించడానికి నేర్పుతో విచారించాల్సి ఉంటుంది.
మనం సందర్శించకూడదని సలహాయివ్వబడిన గృహాల పట్టికను తయారుచేసుకుని, సంవత్సరానికి ఒకసారి టెరిటరీ ఫైల్‌ను పునఃపరిశీలించాలి. సేవాధ్యక్షుని ఆధ్వర్యాన, నేర్పు, అనుభవంగల్గిన ప్రచారకులు కొందరు వీటిని సందర్శించాలని ఏర్పాటు చేయవచ్చు. అదే గృహస్థుడు ఇంకా అక్కడే నివసిస్తున్నాడాయని విచారించడానికి మనం వచ్చామని వివరించవచ్చు. ఆ ప్రచారకుడు రీజనింగ్ పుస్తకమందలి 15-24 పేజీలలోని “సంభాషణను ఆటంకపర్చే వారికి మీరెలా ప్రత్యుత్తరమివ్వవచ్చును” అనే అంశంతో పరిచయం కల్గియుండాలి. సహేతుకమైన ప్రతిస్పందన ఉన్నట్లైతే, భవిష్యత్ సందర్శనలు సాధారణ రీతిలోనే చేయవచ్చు. ఒకవేళ గృహస్థుడు వ్యతిరిక్తంగానే ఉంటున్నట్లైతే, తర్వాతి సంవత్సరం వరకూ ఏవిధంగానూ అతన్ని సందర్శించకూడదు. ఒకవేళ ఎవరి విషయంలోనైనా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లైతే, దాన్ని వేరే విధంగా పరిష్కరించాలని స్థానిక పెద్దల సభ తీర్మానించవచ్చును.