ప్రకటన ముగింపు పుస్తకాన్ని మరలా పఠించడం
1 ప్రకటన ముగింపు పుస్తకంలోని ముఖపత్రం ప్రకటన 1:3 ను ఎత్తి రాసింది: “సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.” బైబిలు పుస్తకమైన ప్రకటన నందున్న ప్రవచనాల ఆధునిక దిన నెరవేర్పు యెహోవా ప్రజల ఆనందాన్ని తప్పకుండా ఎంతో అధికం చేసింది. ఈ కాలంలోని అంటే “ప్రభువు దినం” నందు జరిగే విషయాలు మన ఆధునిక దిన గ్రహింపు, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో ఉంది. (ప్రకటన 1:10) దాన్ని పఠించడం ద్వారా ప్రాముఖ్యమైన ప్రపంచ సంఘటనల జ్ఞానాన్ని మనం పొందాము, ప్రత్యేకంగా ప్రపంచ అబద్ధ మతాన్ని గూర్చి, రాజ్యాలు అర్మగిద్దోనువైపు పయనించడం గూర్చి అలాగే తన ప్రజలతో యెహోవా వ్యవహారాలను గూర్చిన జ్ఞానాన్ని పొందాము.
2 మనలో అనేకులకు, ఈ ప్రచురణను చదవడంవల్ల, ముందు పరిశీలించిన విషయాలపై మన మనస్సును నూతనపర్చడమేకాకుండ, తన శత్రువులందరిపై యెహోవా విజయోత్సాహ దినానికి నడిపించే యిటీవలి అభివృద్ధులను గూర్చిన ఆత్మీయ దృక్పథాన్ని కూడా పదునుపెడ్తుంది. గత రెండు, మూడు సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా మన వరుసలో చేరిన వేలాదిమంది, సంఘ పుస్తక పఠనంలో ప్రకటన ముగింపు పుస్తకాన్ని మూడవ సారి పరిశీలించడం ద్వారా తప్పక ప్రయోజనం పొందుతారు. అనుకోకుండా, ఈ సమయంలో ప్రకటన ముగింపు పుస్తకాన్ని పఠించడం ద్వారా ఒకే సమాచారాన్ని, ఒకే సమయంలో, ప్రపంచంలోని అనేక భాగాల్లో మన సహోదరులు పఠిస్తున్నట్లుగానే మనమూ పఠిస్తున్నాము.
3 ప్రతి వారము కూడా బాగా సిద్ధపడేందుకు, హాజరయ్యేందుకు, అంతేకాకుండా అర్థవంతమైన రీతిలో భాగం వహించేందుకు నిశ్చయించుకోండి. ప్రకటన పుస్తకంలో రాయబడిన ప్రవచనాల వెలుగులో, ప్రపంచ సంఘటనలు సంభవిస్తున్న భావాన్ని మీరు స్పష్టంగా గ్రహించినట్లైతే మీకు గొప్ప ప్రతిఫలాలూ ఆశీర్వాదాలూ దక్కుతాయి. తప్పకుండా, అలాంటి సమాచారాన్ని గూర్చి మనం శ్రద్ధగా చదవాలి, ఎందుకంటే మునుపెన్నటికంటే కూడా అది యిప్పుడు మరింత సమయోచితమైనది. మన కాలాన్ని గూర్చిన ఉప్పొంగింపజేసే ప్రవచనాన్ని చదివి, విని, ధ్యానిస్తుండగా, వాగ్దానం చేయబడిన ఆనందాన్ని మనం అనుభవిద్దుము గాక!