మీరు ఎలాంటి ఆత్మను కనబరుస్తారు?
1 పౌలు ఫిలిప్పీ సంఘానికి యీ ఉపదేశాన్నిస్తూ తన లేఖను ముగించాడు: “ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక.” (ఫిలి. 4:23) సువార్తను ప్రకటించడంలోని వారి నిజమైన ఆసక్తిని, అలాగే ఒకరిపై ఒకరికి గల ఆప్యాయత, ప్రేమతోకూడిన పరిగణనలను బట్టి వారిని మెచ్చుకున్నాడు.—ఫిలి. 1:3-5; 4:15, 16.
2 మన సంఘంలో కూడ అదే ఆత్మను ప్రతిబింబింపజేయాలనేదే మన అభిలాష అయివుండాలి. అందరూ ఆసక్తిని, దయను, ఆతిథ్యాన్ని కనబరిస్తే, అది ఆత్మఫలమని పరిశీలకులకు రుజువవుతుంది. అనుకూలమైన, ప్రేమపూర్వకమైన ఆత్మ ఐకమత్యాన్ని, ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తుంది. (1 కొరింథి. 1:10) ప్రతికూలమైన ఆత్మ అధైర్యాన్ని, నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.—ప్రక. 3:15, 16.
3 పెద్దలు నాయకత్వం తీసుకుంటారు: పెద్దలు తమలోను, సంఘమంతటిలోను శ్రేష్ఠమైన, అనుకూలమైన ఆత్మను కాపాడే బాధ్యతను కలిగి ఉన్నారు. ఎందుకని? ఎందుకనగా వారి మనోదృక్పథము, ప్రవర్తన సంఘాన్ని ప్రభావితం చేయగలవు. మనలను ఆప్యాయతతో కూడిన నవ్వుతో, దయతోకూడిన మాటలతో పలకరించే, పరిచర్యలో ఆసక్తిగా ఉండే, వ్యక్తిగతంగానైనా, లేదా స్టేజీ మీదనుండైనా అనుకూలమైన, పురికొల్పే తమ ఉపదేశాలనిచ్చే పెద్దలు సంఘంలో ఉండడాన్ని మనం ప్రశంసిస్తాము.—హెబ్రీ. 13:7.
4 తప్పకుండా, సంఘాన్ని స్నేహపూర్వకంగాను, ఆతిథ్యమిచ్చేదిగాను, విశేషాసక్తిగలదిగాను, ఆత్మీయ-మనస్సుగలదిగాను రూపుదిద్దడానికి మనమందరం మన వంతు చేయాలి. వ్యక్తిపరంగా, యితరులతోగల మన సహవాసంలో మనం ఆప్యాయతను, ప్రేమను కనబరచగలము. (1 కొరింథి. 16:14) వయస్సు, జాతి, చదువు, ఆర్థిక హోదా వంటి తేడా మనలో ఉండకూడదు. (ఎఫెసీయులు 2:21 పోల్చండి.) మన నిరీక్షణనుబట్టి, సంతోషం గల ఆత్మను, ఉదారమైన ఆతిథ్యాన్ని, పరిచర్యలో ఆసక్తిని మనం ప్రతిబింబించగలము.—రోమా. 12:13; కొలొ. 3:22, 23.
5 కొత్తవాళ్ళతో సహా మనతో సహవసించేవారందరు ఆహ్వానించబడ్డారని, సహోదరత్వపు ప్రేమను, శ్రద్ధను అనుభవించారని భావించగలగాలి. మన పరిచర్య ద్వారా, శ్రేష్ఠమైన క్రైస్తవ లక్షణాలను కనబరచడం ద్వారా “సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారమును” అయ్యున్నదని మనం నిరూపించవచ్చు. (1 తిమో. 3:15) మన హృదయాలను, మానసిక బలమును కాపాడే “దేవుని సమాధానము” వలన మనం కూడా ఆత్మీయ భద్రతను అనుభవించగలము. (ఫిలి. 4:6, 7) యేసుక్రీస్తు ద్వారా యెహోవా కృపా బాహుళ్యమును మనమందరమూ అనుభవించడాన్ని నిశ్చయపరచే ఆత్మను కనబరచడానికి మనమందరం శ్రద్ధాపూర్వంగా ప్రయత్నం చేయుదము గాక.—2 తిమో. 4:22.