ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది
1 బైబిలు విలువలను గూర్చిన అభిప్రాయాలు అనేకమైనవి మరియు భిన్నమైనవి. అయినప్పటికీ, మానవ జాతిని కలవరపరచే సమస్యలకు జవాబులు మరియు జీవితంలో మన వ్యక్తిగత విధానానికి ఆశ్రయించదగిన నడిపింపు దాని పుటల్లో ఉన్నాయని మనం ఒప్పించబడ్డాము. (సామె. 3:5, 6) దాని ఉపదేశంలోని సలహా అసమానమైనది. అది ఉపదేశించే నైతిక ప్రమాణాలను మించినవి మరేవీ లేవు. దాని వర్తమానం “హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించ”గల శక్తి గలది. (హెబ్రీ 4:12) దానిని జాగ్రత్తగా పరిశోధించవలసిన అవసరం ఉందని చూడడానికి మనం ఇతరులకు ఎలా సహాయపడగలం? బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) లేదా 192 పేజీల ఏదైన పాత పుస్తకంతో పాటు నూతన లోక అనువాదమును ప్రతిపాదించేటప్పుడు ఈ క్రింది కొన్ని సలహాలను పాటించడానికి మీరు ప్రయత్నించాలని కోరుకోవచ్చు.
2 తమ ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడాన్ని గూర్చి అనేక మంది ప్రజలు వ్యాకులపడతారు గనుక, బహుశ ఈ విధంగా చెప్పడం వారి శ్రద్ధనాకర్షించవచ్చు:
◼ “ఈ మధ్య నేను మాట్లాడిన చాలా మంది ప్రజలు తమ ఆర్థిక ఋణాలను తీర్చే విషయాన్ని గూర్చి బాధపడ్డారు. అనేకులు వస్తుసంపద అన్వేషణలో పడ్డారు, అదేమో ఒత్తిడిని కలిగిస్తుంది. అలాంటి విషయాల్లో మనకు సలహా ఎక్కడనుండి లభిస్తుంది? [జవాబు చెప్పనివ్వండి.] అనవసరమైన సమస్యలను తప్పించుకోవడానికి సహాయపడే ఆచరణాత్మక సలహాను బైబిలు ప్రతిపాదిస్తుందని నేను కనుగొన్నాను. నేను మీకొక ఉదాహరణ చూపిస్తాను.” బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా? (ఆంగ్లం) అనే పుస్తకంలోని 163వ పేజీని తీసి 3వ పేరాలో ఎత్తివ్రాయబడిన 1 తిమోతి 6:9, 10 చదవండి. 4వ పేరా మీద తరువాయి వ్యాఖ్యానాలను చేయండి, తరువాత పుస్తకాన్ని ప్రతిపాదించండి.
3 బైబిలు—దేవుని వాక్యమా లేక మానవునిదా?” అనే పుస్తకాన్ని లేక 192 పేజీల పుస్తకాల్లో ఏదైన ఒక దానిని ప్రతిపాదించేటప్పుడు మీరు పాటించగల ఓ సలహా:
◼ “వార్తాపత్రిక చదివిన ప్రతిసారి లేక వార్తలను విన్నప్పుడెల్లా, మనలను వ్యాకులపరచే దుఃఖకరమైన మరో సమస్య గురించి మనం వింటాం. [ఇటీవలి వార్తల్లో నివేదించబడిన ఒక దుర్ఘటనను పేర్కొనండి.] ఇలాంటి సమస్యలను మనమెలా ఎదుర్కోవచ్చు? [జవాబు చెప్పనివ్వండి.] వ్రాయబడిన అన్ని వర్తమానాల్లోకెల్లా అతి శ్రేష్ఠమైనదొకటి బైబిలులో ఉందని, ‘దాని పుటల్లో మానవునికి తెలిసిన సమస్యలన్నింటికీ జవాబులన్నీ ఉన్నాయి’ అని ప్రఖ్యాతిగాంచిన ఓ వ్యక్తి చెప్పాడు. ఆయన చెప్పిన మాటలు బైబిలు చెబుతున్నదానిని గుర్తుకు తెస్తున్నాయి. [2 తిమోతి 3:16, 17 చదవండి.] మనం బైబిలును ఎందుకు నమ్మగలమో మీకు చూపించనివ్వండి.” మీరు బైబిలును ఎందుకు నమ్మగలరు అనే కరపత్రంలోని కొన్ని ఉన్నతాంశాలను చూపించి, ఒక ప్రత్యేక విషయాన్ని గూర్చిన బైబిలు బోధలను తెలిపే 192 పేజీల పాత పుస్తకాల్లో ఏదైన ఒకదాన్ని ప్రతిపాదించండి. ఈ ఆధునిక లోకంలో కూడా బైబిలు సలహా ఆచరణయోగ్యమన్నది ఎంతో గమనార్హమని చర్చించడానికి మీరు తిరిగి వస్తారని చెప్పండి.
4 మీ ప్రాంతంలో మత విశ్వాసులు కాని ప్రజలున్నట్లయితే, మీరు ఈ విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “నేడు చాలామంది ప్రజలు పరిశుద్ధ గ్రంథాలు పరస్పర విరుద్ధమైనవని మిథ్య తప్ప మరేమీ కావని దృష్టిస్తారు. మతం పేరు మీద ఎన్నో చెడు విషయాలు జరగడం వారు చూశారు గనుక, మత నాయకులను వారిక ఏ మాత్రం నమ్మలేరు. నిజానికి, దేవుడు మనకేమైన మార్గనిర్దేశకాన్ని ఇచ్చాడా అని చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మీ అభిప్రాయమేమిటి?” జవాబు చెప్పనివ్వండి. గృహస్థుని ప్రతిస్పందనను బట్టి, 192 పేజీల పాత పుస్తకాల్లోని ఏదైన ఒక దాని నుండి గృహస్థుడు అభ్యంతరపడే విషయాన్ని లేదా ఆయన అభిప్రాయాన్ని చర్చించే భాగాన్ని తీసి, ఒకటో రెండో అంశాలను చర్చించండి. ఉదాహరణకు, నిన్ను సంతోషపరచు సువార్త అనే పుస్తకంలోని 12వ అధ్యాయాన్ని ఉపయోగించే అవకాశం మీకుండవచ్చు.
5 మన సర్వోన్నత ఉపదేశకుని చిత్తాన్ని గూర్చిన జ్ఞానాన్ని పొందాలని కోరుకునే అందరికీ అది అందుబాటులో ఉండే విధంగా ఉండేలా ఆయన నిశ్చయం చేశాడు. బైబిలు యొక్క నిజమైన విలువను గుణగ్రహించడానికి ఇతరులకు సహాయం చేయడం అనేది మనం వారికి చేయగలిగిన అతి శ్రేష్ఠమైన సహాయాల్లో ఒకటి; అది వారి జీవితాలను రక్షించగలదు.—సామె. 1:32, 33.