రాత్రింబవళ్లు పరిశుద్ధ సేవను చెల్లించండి
1 మనకు ఓ అసాధారణమైన ఆధిక్యత ఇవ్వబడింది. అది యెహోవాకు సాక్షులంగా ఉండడమే. మునుపెన్నడూ చేపట్టబడని అతి గొప్ప రాజ్య ప్రచార పనిని చేసేందుకు యెహోవా ఉపయోగించే సువార్తికుల ప్రపంచవ్యాప్త సంస్థలో మనం ఓ భాగం! (మార్కు 13:10) మన కాలానికున్న అత్యవసరత దృష్ట్యా, ఈ పనిలో మనం వీలున్నంతమట్టుకూ పూర్తిగా పాల్గొంటున్నామా?
2 చివరికి మన ప్రకటన పనికి ఎందరు ప్రతిస్పందిస్తారో మనకు తెలియదు. వారు “గొప్పసమూహము” అయ్యుంటారనే అభయాన్ని యెహోవా మనకిస్తున్నాడు. వారందరూ “రాత్రింబవళ్లు ఆయన ఆలయములో ఆయనకు” తమ “పరిశుద్ధ సేవను చెల్లించడం” వల్ల గుర్తించబడుతారు. (ప్రక. 7:9, 15, NW) ఇప్పటికే దేవుని సేవలో ఉండి తీరిక లేకుండా ఉన్న ఐదు లక్షలమంది సాక్షులు కేవలం ఆసక్తిగల శ్రోతలూ కాదు లేక కేవలం కూటాలకు హాజరయ్యేవారూ కాదు. వాళ్ళు సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రచురించే పనివారు!
3 ప్రతిదినమూ యెహోవాను స్తుతించేందుకు అవకాశాలున్నాయి, అది అటు ప్రాంతీయ సేవలోకావచ్చు ఇటు అనియత సాక్ష్యంలో కావచ్చు. ప్రతి రోజూ కేవలం ఒక వ్యక్తితో సత్యాన్ని పంచుకునేందుకు మనలో ప్రతి ఒక్కరం చొరవ తీసుకున్నా అది ఎంతటి గొప్ప సాక్ష్యమవ్వగలదో ఆలోచించండి. యెహోవా ఎడల మనకున్న మెప్పుదల ఆయన్ను గూర్చి మనం ఉత్సాహంతో మాట్లాడేందుకు మనలను పురికొల్పాలి.—కీర్త. 92:1, 2.
4 ఇతరులు పరిశుద్ధ సేవను చెల్లించేందుకు సహాయపడండి: అభివృద్ధిపర్చడం ద్వారా యెహోవా మనలను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. (హగ్గ. 2:7) గత సంవత్సరం ఇండియాలో ప్రతి నెల సుమారు 13,105 గృహ బైబిలు పఠనాలు నిర్వహించబడ్డాయి. ఈ ప్రజలతో మనం పఠించడంలోని మన లక్ష్యం వారు యేసు శిష్యులయ్యేందుకు సహాయపడడం. (మత్త. 28:19, 20) అనేకులు కూటాలకు క్రమంగా హాజరవ్వడం ద్వారా అప్పటికే మంచి అభివృద్ధిని సాధించారు. తాము నేర్చుకున్న “దేవుని గొప్ప కార్యములను” గురించి తమ పరిచయస్థులతో వారు మాట్లాడడం ప్రారంభించారు. (అపొ. 2:11) ఇప్పుడు బహిరంగ పరిచర్యలో పాల్గొనేందుకు వారు ఆహ్వానించబడగలరా?
5 మనతో ప్రాంతీయ సేవలో పాల్గొనగల క్రొత్తవారిని ఆహ్వానించేందుకు ఏప్రిల్ నెలలో మనం ప్రత్యేకమైన ప్రయత్నాన్ని చేయాలి. మీ విద్యార్థి అలాంటి కోరికను వ్యక్తం చేశాడా? చేసినట్లయితే అతను లేఖనాధార అర్హతలను కల్గివున్నాడా? (మన పరిచర్య పుస్తకంలో 97-9 చూడండి.) ఆ విద్యార్థి ప్రాంతీయ సేవలో భాగం వహించాలని ఇష్టపడినప్పుడు, అతని భవిష్యత్ కార్యాలను గూర్చి సంఘాధ్యక్షునితో చర్చించండి, ఆయన ఈ విషయాన్ని పరిశీలించేందుకు ఇద్దరు పెద్దలను ఏర్పాటు చేస్తాడు. బాప్తిస్మం తీసుకోని ప్రచారకునిగా అంగీకరించబడేందుకు విద్యార్థి అర్హతను పొందినట్లయితే, ప్రాంతీయ సేవలో మీతో పాల్గొనేందుకు అతన్ని ఆహ్వానించండి. ఏప్రిల్నందు ప్రకటించడం ప్రారంభించేందుకు అర్హత గలవారికి సహాయాన్నందించడంలో సేవాధ్యక్షులూ పుస్తక పఠన నిర్వాహకులూ మెలకువగా ఉండాలి.
6 తమ పిల్లలు బాప్తిస్మం పొందని ప్రచారకులు అయ్యేందుకు అర్హతను కల్గివున్నారో లేదో తలిదండ్రులు పరిశీలించవచ్చు. (కీర్త. 148:12, 13) మీ బిడ్డ రాజ్య సేవలో పాల్గొనాలని ఇష్టపడుతున్నట్లయితే, మరి మంచి ప్రవర్తనగలవాడైతే, ఈ పరిస్థితిని చర్చించేందుకు సేవా కమిటీలోని పెద్దల్లో ఒకరిని మీరు సమీపించవచ్చు. మిమ్మల్నీ మీ బిడ్డను కలిసిన తర్వాత ఓ ప్రచారకునిగా ఎంచబడేందుకు మీ బిడ్డకు అర్హత ఉందా లేదా అని ఇద్దరు పెద్దలు నిశ్చయిస్తారు. పిల్లలు దేవుని స్తుతించడంలో మనతో చేరినప్పుడు ఆనందించేందుకు ప్రత్యేక కారణముంది!
7 మన పరిశుద్ధ సేవకు యెహోవా మాత్రమే అర్హుడు. (లూకా 4:8) ఆయనను “మెండుగా” స్తుతించడంలో మనకున్న అద్భుతమైన ఆధిక్యతను మనలో ప్రతి ఒక్కరమూ వినియోగించుకుందాము.—కీర్త. 109:30; 113:3.