‘కచ్చితమైన జ్ఞానంలో అభివృద్ధిపొందుతూ ఉండండి’
దేవుని గూర్చిన కచ్చితమైన జ్ఞానం నిత్యజీవానికి నడుపుతుంది. (యోహా. 17:3) యెహోవాను గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని పెంచుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలి. (కొలొ. 1:9, 10) ఏప్రిల్ 29 మొదలుకొని సంఘ పుస్తక పఠనంలో నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని మనం పఠిస్తాము. దేవుని వాక్యాన్ని గూర్చిన మన స్వంత అవగాహన అభివృద్ధి కావడమే కాక, ఇతరులకు దానిని బోధించేందుకు మనం బాగా సిద్ధపడినవారము కూడా అవుతాము. మీరు ముందుగా సిద్ధపడి, ప్రతి వారం హాజరై, పాల్గొని, ఆ సమాచారాన్ని పరిచర్యలో ఉపయోగిస్తే, మీకూ మీ కుటుంబానికి ఆశీర్వాదం లభిస్తుంది.