వేసవి కొరకైన మీ పథకాలేమిటి?
మనం వేసవిని గూర్చి ఆలోచించినప్పుడు, వేడిగా ఉండే వాతావరణాన్ని గూర్చి, బహుశ సేదదీర్చే సెలవుల కొరకైన పథకాలను గూర్చి, లేదా బంధువులతో స్నేహితులతో కలిసి చేసే ఆహ్లాదకరమైన పర్యటనను గూర్చి మనం ఆలోచిస్తాము. మీ వేసవికాల పథకాలను వేసుకునేటప్పుడు రాజ్యాసక్తులను మొదట ఉంచేందుకు మీకు సహాయపడగల కొన్ని జ్ఞాపికలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:
◼ మీరు సెలవుల్లో వెళ్తున్నట్లయితే, ఆ స్థానిక సంఘ కూటాలకు హాజరై, పరిచర్యలో భాగం వహించేందుకు పథకం వేసుకోండి. మీరు తప్పకుండా ప్రాంతీయ పరిచర్య రిపోర్టులను ఇవ్వండి; అవసరమైతే, మీ సంఘ కార్యదర్శికి పోస్టు చేసి పంపండి.
◼ సత్యంలో లేని బంధువులను సందర్శించడం ఫలవంతమైన కొంత అనియత సాక్ష్యం ఇచ్చేందుకు మీకు అవకాశాన్ని ఇవ్వవచ్చు. మీ బైబిలును, కావలసినంత సాహిత్యాన్ని తప్పక తీసుకెళ్ళండి.
◼ తమ సేవా ప్రాంతాన్ని పూర్తి చేసేందుకు సహాయమవసరమైన పొరుగు సంఘానికి సహాయం చేయడాన్ని గూర్చి మీరు ఆలోచించారా? మీ ప్రాంతంలో ఉన్న అవసరాలను గూర్చిన సమాచారాన్ని పొందేందుకు పెద్దలతో లేదా ప్రాంతీయ కాపరితో మాట్లాడండి.
◼ యౌవనస్థులు తమ సేవా కార్యక్రమాన్ని విస్తృతపరచుకునేందుకు పాఠశాల సెలవులు మంచి అవకాశాన్నిస్తాయి. యౌవనస్థులారా, మీరు సహాయ పయినీర్లుగా పేరు నమోదు చేసుకోగలరా?
◼ వాతావరణం పొడిగా ఉండి, పగటి గంటలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ప్రజలు ఇండ్లలో ఉండే సమయాల్లో మరింతగా సాయంకాల సాక్ష్యం ఇవ్వడం ద్వారా సేవలో శ్రేష్ఠమైన ఫలితాలను పొందగలరని మీరు కనుగొనవచ్చు.
◼ సంఘ కార్యక్రమాలను బాగా సంస్థీకరించి ఉంచేందుకు పెద్దలు అప్రమత్తంగా ఉంటూ, బాధ్యతలు అప్పజెప్పబడినవారు సెలవులకు వెళ్తున్నట్లయితే, వాటిని చూసేందుకు వేరే ఎవరినైనా ఏర్పాటు చేయాలి.
“శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు” అని జ్ఞాపకముంచుకోండి. (సామె. 21:5) మీ వేసవి కాల దైవపరిపాలనా అవకాశాలన్నింటినీ బాగా ఉపయోగించుకునేందుకు పథకం వేసుకోండి.