కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 6/96 పేజీలు 3-6
  • జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి
  • మన రాజ్య పరిచర్య—1996
  • ఇలాంటి మరితర సమాచారం
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • మీ ‘బోధనాకళకు’ అవధానమివ్వండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1996
km 6/96 పేజీలు 3-6

జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి

1 సత్యాన్ని ఇతరులకు బోధించి, “నిత్యజీవమునకు నిర్ణయింపబడిన” వారిని శిష్యులనుగా చేయడం అనేది క్రైస్తవులందరికీ ఒక వాంఛనీయమైన గురి. (అపొ. 13:48; మత్త. 28:19, 20) దీన్ని సాధించడానికి యెహోవా సంస్థ మన చేతుల్లో ఒక అద్భుతమైన ఉపకరణాన్ని ఉంచింది. అది నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకం. దాని శీర్షిక గృహ బైబిలు పఠనాల గొప్ప అవసరతను ఉన్నతపరుస్తుంది. ఎందుకంటే నిత్యజీవం అద్వితీయ సత్యదేవుడైన యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడంపైనే ఆధారపడుతుంది.—యోహా. 17:3.

2 గృహ బైబిలు పఠనాలు నిర్వహించడంలో ఉపయోగించడానికి జ్ఞానము పుస్తకం ఇప్పుడు సొసైటీయొక్క ప్రధాన ప్రచురణ. దానిని ఉపయోగించి మనం సత్యాన్ని సులభంగా, స్పష్టంగా, సంక్షిప్తంగా బోధించగలము. బోధింపబడేవారి హృదయాలను చేరడానికి ఇది సహాయపడుతుంది. (లూకా. 24:32) నిజమే, నిర్వాహకుడు మంచి బోధనా మెలకువలను ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అందుకోసమే, ప్రభావవంతంగా ఉన్నట్లు రుజువైన బోధనా పద్ధతులను గూర్చిన సలహాలను, జ్ఞాపికలను అందించడానికి ఈ ఇన్‌సర్ట్‌ తయారుచేయబడింది. వివేచనతో, వ్యక్తిగత పరిస్థితులకు అనుగుణ్యంగా మీరు ఇక్కడ ఇవ్వబడిన కొన్నింటిని లేక అన్నింటినీ క్రమేణ అన్వయించుకోగలరు. ఈ ఇన్‌సర్ట్‌ను జాగ్రత్తగా భద్రపరచుకుని తరచుగా దీనిని చూడండి. శిష్యులను చేయడానికి జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగించడంలో మరింత ప్రభావవంతంగా ఉండేందుకు ఇందులోని వివిధ అంశాలు మీకు సహాయం చేయగలవు.

3 ప్రగతిశీల గృహ బైబిలు పఠనాన్ని నిర్వహించండి: సంభావ్య క్రైస్తవ శిష్యుడని, ఆత్మీయ సహోదరుడని లేక సహోదరి అని విద్యార్థి ఎడల నిష్కపటమైన వ్యక్తిగతమైన ఆసక్తిని ప్రదర్శించండి. ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా, ఉత్సాహంగా ఉండండి. శ్రద్ధగా వినేవారిగా ఉండడం ద్వారా అవతలి వ్యక్తిని గురించి మీరు తెలిసికోగలరు. ఆయనకు ఆత్మీయంగా ఎంత శ్రేష్ఠంగా సహాయపడగలరో వివేచించడానికి మీకు సహాయపడేందుకు ఆయన పుట్టుపూర్వోత్తరాల గురించి, జీవితంలోని పరిస్థితి గురించి తెలిసికోగలరు. విద్యార్థి కొరకు మిమ్మల్ని మీరు అర్పించుకోవడానికి సుముఖంగా ఉండండి.—1 థెస్స. 2:8.

4 ఒక్కసారి పఠనం స్థిరపర్చబడిన తరువాత, జ్ఞానము పుస్తకంలో నుండి అధ్యాయాలను సంఖ్యా క్రమంలో పఠించడం మంచిదని సిఫారసు చేయబడుతుంది. ఈ పుస్తకం బైబిలు అంశాలను అత్యంత తర్కబద్ధమైన క్రమంలో పెంపొందింపచేస్తుంది గనుక విద్యార్థి సత్యాన్ని అభివృద్ధికరంగా అవగాహన చేసుకోవడానికి ఇది అవకాశమిస్తుంది. పఠనం ఉల్లాసంగా, ముందుకు సాగేదిగా ఉండగలిగేలా దాన్ని సరళంగా, ఆసక్తిదాయకంగా ఉంచండి. (రోమా. 12:11) విద్యార్థి పరిస్థితులనుబట్టి, నేర్చుకునే సామర్థ్యాన్నిబట్టి, పఠనాన్ని తొందరపాటుతో ముగించకుండానే, ఒక గంట లేక అంతకు ఎక్కువ నిడివిగల ఒక్కో సందర్శనంలో ఒక అధ్యాయం చొప్పున, అనేక అధ్యాయాలు పూర్తి చేయడానికి మీకు వీలౌతుంది. బోధకుడు, విద్యార్థి, ఇద్దరూ ప్రతివారం నియమిత సమయంలో పఠనం జరుపుకోవడానికి నిర్ణయించుకుంటే విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆ విధంగా అనేకమంది విషయంలో, పుస్తకంలోని 19 అధ్యాయాలను దాదాపు ఆరు నెలలు లేదా అంతకు ఎక్కువ లేక తక్కువ కాలంలోనే పూర్తిచేయడం సాధ్యమవ్వవచ్చు.

5 ప్రతి సందర్శనాన్ని, సమాచారంపై ఆసక్తిని పురికొల్పే క్లుప్తమైన వ్యాఖ్యలతో ప్రారంభించండి. ప్రతి అధ్యాయం యొక్క శీర్షిక దాని మూలాంశమని మీరు గమనిస్తారు, దాన్ని నొక్కి చెప్పడం అవసరం. అధ్యాయం మూలాంశాన్ని ముఖ్యవిషయంగా ఉంచడానికి మీకు సహాయపడుతూ ప్రతి ఉపశీర్షిక ఒక ప్రధాన విషయాన్ని ప్రత్యేకపరుస్తుంది. ఎక్కువగా మాట్లాడకుండా ఉండేందుకు జాగ్రత్త పడండి. బదులుగా, విద్యార్థి అభిప్రాయాలను రాబట్టడానికి ప్రయత్నించండి. విద్యార్థికి అప్పటికే తెలిసినదాని ఆధారంగా, విషయంలోకి నడిపించే నిర్దిష్టమైన ప్రశ్నలను అడగడం తర్కించడానికి, సరైన ముగింపుకు రావడానికి ఆయనకు సహాయపడుతుంది. (మత్త. 17:24-26; లూకా 10:25-37; పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) పేజీ 51, పేరా 10 చూడండి.) జ్ఞానము పుస్తకంలోని ముద్రిత సమాచారాన్ని మాత్రమే పరిశీలించండి. అదనపు వివరాలు ప్రవేశపెట్టడం ప్రధాన విషయాల నుండి అవధానాన్ని మళ్లిస్తుంది లేక వాటిని అస్పష్టం చేసి, పఠనాన్ని పొడిగిస్తుంది. (యోహా. 16:12) పఠిస్తున్న విషయానికి సంబంధించని ఒక ప్రశ్న తలెత్తితే అనేక సందర్భాలలో మీరు దానికి సందర్శనాంతంలో జవాబివ్వవచ్చు. ఇలా చేయడం ఆ వారపు పాఠం వేరేదారి పట్టకుండా దానిని పూర్తి చేసేందుకు మీకు సహాయపడుతుంది. పఠనం జరిగే కొలది చివరికి విద్యార్థి వ్యక్తిగత ప్రశ్నలలో అనేక ప్రశ్నలకు జవాబివ్వబడుతుందని ఆయనకు వివరించండి.—పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం), పేజీ 94, పేరా 14 చూడండి.

6 ఒకవేళ విద్యార్థి త్రిత్వం, ప్రాణం యొక్క అమర్త్యత, నరకాగ్ని, లేక అటువంటి మరితర అబద్ధ సిద్ధాంతాలను దృఢంగా విశ్వసిస్తే, మరి జ్ఞానము పుస్తకంలో అందించబడినది ఆయనను సంతృప్తిపరచకపోతే, ఆ అంశాన్ని చర్చించే తర్కించుట (ఆంగ్లం) పుస్తకాన్ని లేక మరితర ప్రచురణను మీరు ఆయనకు ఇవ్వవచ్చు. ఆయన చదివినదాని గురించి ఆలోచించిన తరువాత మీరు ఆ అంశాన్ని ఆయనతో చర్చిస్తారని చెప్పండి.

7 యెహోవా నడిపింపు, ఆశీర్వాదముల కొరకు ప్రార్థిస్తూ పఠనాన్ని ప్రారంభించడం, ముగించడం ఆ సందర్భాన్ని ఘనపరిచి, ఒకరిని గౌరవపూర్వకమైన దృక్పథం కలిగివుండేలా చేసి, సత్య బోధకునిగా యెహోవా వైపు అవధానాన్ని మళ్లిస్తుంది. (యోహా. 6:45) ఒకవేళ విద్యార్థి ఇంకా పొగత్రాగుతుంటే, దానిని మానుకొమ్మని మీరు చివరికి పఠనం సమయంలో ఆయనను అడగవలసి ఉండవచ్చు.—అపొ. 24:16; యాకో. 4:3.

8 లేఖనాలతో, దృష్టాంతాలతో, పునఃసమీక్ష ప్రశ్నలతో ప్రభావవంతంగా బోధించండి: నిపుణతగల ఒక బోధకుడు అంతకు ముందు సమాచారాన్ని ఎన్నిసార్లు సిద్ధపడినప్పటికీ, ఆయన ఒక ప్రత్యేక విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పాఠాన్ని పునఃసమీక్షిస్తాడు. ఇలా చేయడం విద్యార్థి అడుగబోయే కొన్ని ప్రశ్నలను ముందే ఊహించడానికి సహాయం చేస్తుంది. ప్రభావవంతంగా బోధించడానికిగాను, అధ్యాయంలోని ప్రధాన విషయాల స్పష్టమైన అవగాహనను పొందండి. లేఖనాలు సమాచారానికి ఎలా వర్తిస్తాయన్నది చూడడానికి వాటిని తెరిచి చూసి, పఠనం జరుగుతున్నప్పుడు వేటిని చదవాలన్నది నిర్ణయించుకోండి. అధ్యాయం చివరనున్న దృష్టాంతాలను, పునఃసమీక్షా ప్రశ్నలను ఉపయోగిస్తూ మీరెలా బోధించగలరన్న దానిని గురించి ఆలోచించండి.

9 లేఖనాలను ప్రభావవంతంగా ఉపయోగించడం ద్వారా, విద్యార్థి తాను నిజంగా బైబిలును పఠిస్తున్నానని గుణగ్రహించడానికి మీరు సహాయం చేస్తారు. (అపొ. 17:11) జ్ఞానము పుస్తకంలో 14వ పేజీలోని “మీ బైబిలుతో బాగా పరిచయం కలిగివుండండి” అనే బాక్సును ఉపయోగిస్తూ, లేఖనాలను ఎలా కనుక్కోవాలో ఆయనకు నేర్పించండి. పాఠంలోని ఎత్తివ్రాయబడిన లేఖనాలను ఎలా గుర్తించాలో ఆయనకు చూపించండి. సమయం అనుమతించే కొలది ఎత్తివ్రాయబడని ఉల్లేఖిత లేఖనాలను తెరిచి చదవండి. పేరాలో చెప్పబడినదాన్ని అవి ఎలా సమర్థిస్తాయి లేక స్పష్టం చేస్తాయి అనేదాని గురించి విద్యార్థిని వ్యాఖ్యానించనివ్వండి. పాఠం యొక్క ముఖ్య విషయాలకుగల కారణాలను గుణగ్రహించేలా లేఖనాలలోని ప్రధాన భాగాలను నొక్కి తెల్పండి. (నెహె. 8:8) బోధకుడు, సాధారణంగా పుస్తకం అందించే వాటికన్నా ఎక్కువ లేఖనాలను చొప్పించాల్సిన అవసరం లేదు. బైబిలు పుస్తకాల పేర్లను, క్రమాన్ని తెలుసుకోవడం యొక్క విలువపై వ్యాఖ్యానించండి. విద్యార్థి జూన్‌ 15, 1991 కావలికోట (ఆంగ్లం), 27-30 పేజీలను చదవడం సహాయకరంగా ఉండవచ్చు. సముచితమైనప్పుడు, నూతన లోక అనువాదమును (ఆంగ్లం) ఉపయోగించడాన్ని ప్రోత్సహించండి. మార్జినల్‌ రిఫరెన్స్‌లు, బైబిలు పదాల అనుక్రమణిక వంటి దాని వివిధ విశేషతలను ఎలా ఉపయోగించవచ్చో మీరు క్రమంగా చూపించవచ్చు.

10 దృష్టాంతాలు ఒకరి ఆలోచనా సరళిని ఉత్తేజపర్చి, క్రొత్త తలంపులను గ్రహించడాన్ని సులభతరం చేస్తాయని దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నిర్దేశక పుస్తకములోని 34వ పాఠ్యభాగం వివరిస్తుంది. అవి భావోద్రేక సంయోగంతో వివేకవంతమైన అభ్యర్థనను జోడిస్తాయి, అందువలన సాధారణంగా సామాన్యమైన, వాస్తవమైన మాటలకు తరచూ సాధ్యం కాని వర్తమానం మనస్సుకు శక్తివంతంగా అందించబడుతుంది. (మత్త. 13:34) జ్ఞానము పుస్తకంలో సులభమైనవే అయినప్పటికీ శక్తివంతమైనవైన అనేక బోధనా చిత్రాలు ఉన్నాయి. ఉదాహరణకు, 17వ అధ్యాయంలో ఉపయోగించబడిన ఒక చిత్రం యెహోవా క్రైస్తవ సంఘం ద్వారా ఆత్మీయ భావంలో ఆహారం, వస్త్రాలు, ఆశ్రయం ఎలా సమకూరుస్తాడన్నదాని ఎడల మెప్పుదలను పెంపొందింపజేస్తుంది. భావావేశాలను రేకెత్తించడానికి జ్ఞానము పుస్తకంలోని అందమైన చిత్రాల దృష్టాంతాలను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. 185వ పేజీలోని “ఆనందభరితమైన పునరుత్థానం” అనే ఉపశీర్షిక క్రింద ఉన్న 18వ పేరాయొక్క ప్రభావం, విద్యార్థి మరలా వెనక్కి త్రిప్పి 86వ పేజీలోని చిత్రాన్ని చూడడం ద్వారా బలపరచబడుతుంది. దేవుని రాజ్యం క్రింద పునరుత్థానం ఒక వాస్తవం అని తలంచేందుకు ఆయనను ఇది కదిలించగలదు.

11 బైబిలు విద్యార్థులు ప్రతి పాఠంతో ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఈ కారణం వలన, ప్రతి అధ్యాయం చివరనున్న “మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి” అనే బాక్సులోని పునఃసమీక్ష ప్రశ్నలను అడగడం మర్చిపోకండి. పఠించినదానిలో నుండి కేవలం సరైన జవాబు చెబితే చాలని బోధకుడు అనుకోకూడదు. ఈ ప్రశ్నలలో అనేకం హృదయం నుండి వ్యక్తిగత ప్రతిస్పందనను వెలికి తీయడానికి రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, 31వ పేజీ చూడండి, అక్కడ విద్యార్థి ఇలా ప్రశ్నించబడ్డాడు: “యెహోవా దేవుని ఏ లక్షణాలు ప్రాముఖ్యంగా మీకు నచ్చాయి?”—2 కొరిం. 13:5.

12 పఠనం కొరకు సిద్ధపడడానికి విద్యార్థులకు శిక్షణనివ్వండి: పాఠాన్ని ముందే చదివి, జవాబులకు గుర్తులు పెట్టి, వాటిని తన స్వంత మాటల్లో ఎలా వ్యక్తం చేయాలి అని ఆలోచించే విద్యార్థి త్వరితగతిన ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాడు. మీరు మీ ఉదాహరణా ప్రోత్సాహాల ద్వారా పఠనానికి సిద్ధపడేందుకు ఆయనకు శిక్షణనివ్వవచ్చు. మూల పదాలు, పదసముదాయాలు హైలైట్‌ చేయబడి లేక వాటి క్రింద గీతలు పెట్టబడి ఉన్న మీ పుస్తకాన్ని ఆయనకు చూపించండి. ముద్రిత ప్రశ్నలకు సూటియైన జవాబులను ఎలా కనుక్కోవాలో వివరించండి. ఒక అధ్యాయాన్ని కలిసి సిద్ధపడడం విద్యార్థికి సహాయకరంగా ఉండవచ్చు. తన స్వంత మాటలలో తన అభిప్రాయాలను వ్యక్తం చేయమని ఆయనను ప్రోత్సహించండి. అప్పుడు మాత్రమే, ఆయన సమాచారాన్ని అర్థం చేసుకున్నాడో లేదో స్పష్టమౌతుంది. ఆయన ఒకవేళ తన జవాబును పుస్తకం నుండి చదివితే, ఆ విషయాన్ని తన స్వంత మాటల్లో వేరొకరికి ఎలా వివరిస్తారని అడగడం ద్వారా మీరు ఆయన ఆలోచనను రేకెత్తించవచ్చు.

13 పఠనం జరుగుతుండగా, ఎత్తివ్రాయబడని లేఖనాలన్నింటినీ చదవడానికి సమయముండదు గనుక, తన వారపు సిద్ధపాటులో భాగంగా వాటిని చూడమని విద్యార్థిని ప్రోత్సహించండి. తన పాఠాల కొరకు ఆయన చేస్తున్న కృషినిబట్టి ఆయనను మెచ్చుకోండి. (2 పేతు. 1:5; బైబిలు పఠనంలో బోధకుడు, విద్యార్థి ఇద్దరూ ఎక్కువ నేర్చుకోవడానికి ఏమి చేయవచ్చనే దానిపై అదనపు సూచనల కొరకు ఆగస్టు 15, 1993 కావలికోట 13-14 పేజీలు చూడండి.) ఈ విధంగా, విద్యార్థి సంఘ కూటాలకు సిద్ధపడడానికి, వాటిలో అర్థవంతమైన వ్యాఖ్యానాలను చేయడానికి శిక్షణ పొందుతాడు. జ్ఞానము పుస్తకంలో తన వ్యక్తిగత బైబిలు పఠనం పూర్తి అయిన తరువాత, సత్యమందు పురోభివృద్ధి చెందడంలో కొనసాగడానికి సిద్ధపడేలా చేసే మంచి వ్యక్తిగత పఠన అలవాట్లను ఎలా పెంపొందించుకోవాలన్నది ఆయన నేర్చుకుంటాడు.—1 తిమో. 4:15; 1 పేతు. 2:2.

14 విద్యార్థులను యెహోవా సంస్థవైపు నడిపించండి: విద్యార్థిని యెహోవా సంస్థవైపు నడిపించడం శిష్యులను చేసే వ్యక్తి బాధ్యత. ఒకవేళ విద్యార్థి సంస్థను గుర్తించి, మెప్పుదల కనుపరచి, దానిలో భాగమవ్వాల్సిన అవసరతను తెలుసుకుంటే ఆయన ఆత్మీయ పరిణతికి త్వరగా ఎదుగుతాడు. ఆయన దేవుని ప్రజలతో సహవసించడంలో ఆహ్లాదాన్ని పొందాలని, రాజ్యమందిరంలో మనతో పాటు ఉండడానికి ఆయన ఎదురు చూడాలని మనము కోరుకుంటాము. అక్కడ ఆయన క్రైస్తవ సంఘం అందించే ఆత్మీయ, భావోద్రేక మద్దతును పొందగలడు.—1 తిమో. 3:15.

15 తన చిత్తాన్ని నెరవేర్చడానికి యెహోవా నేడు ఉపయోగిస్తున్న ఏకైక దృశ్య సంస్థ గురించి వ్యక్తులకు తెలియజేయడానికి యెహోవాసాక్షులు ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనే బ్రోషూరు ఉత్పత్తి చేయబడింది. ఒకసారి పఠనం స్థాపించబడిన తరువాత, విద్యార్థికి ఒక ప్రతిని ఎందుకు అందించకూడదు? మొట్టమొదటి నుండి విద్యార్థిని కూటాలకు ఆహ్వానిస్తూ ఉండండి. అవి ఎలా జరుగుతాయో వివరించండి. త్వరలో ఇవ్వబడే బహిరంగ ప్రసంగం శీర్షికను మీరు ఆయనకు చెప్పవచ్చు లేక కావలికోట పఠనంలో చర్చించబడే శీర్షికను ఆయనకు చూపించండి. బహుశ ఒక క్రొత్త స్థలానికి మొదటిసారి వెళ్లడంలో ఆయనకు ఉండే ఏదైనా వ్యాకులతను తీసివేయడం కొరకు కూటాలు జరగనప్పుడు రాజ్యమందిరాన్ని చూపించడానికి ఆయనను తీసుకెళ్లవచ్చు. కూటాలకు మీరు రవాణా ఏర్పాటు చేయగలగవచ్చు. ఆయన హాజరైనప్పుడు తాను ఆదరించబడుతున్నట్లు భావించేలా చూడండి. (మత్త. 7:12) పెద్దలతో సహా, ఇతర సాక్షులకు ఆయనను పరిచయం చేయండి. ఆయన సంఘాన్ని తన ఆత్మీయ కుటుంబంగా దృష్టించడం మొదలుబెడతాడని ఆశిద్దాం. (మత్త. 12:49, 50; మార్కు 10:29, 30) ప్రతివారం ఒక కూటానికి హాజరయ్యేలా మీరు ఆయనకు ఒక గురిని పెట్టవచ్చు, క్రమంగా ఆ గురిని పెంచవచ్చు.—హెబ్రీ. 10:24, 25.

16 జ్ఞానము పుస్తకంలో గృహ బైబిలు పఠనం కొనసాగుతుండగా, కూటాల్లో సంఘంతో క్రమంగా సహవసించాల్సిన అవసరతను ఉన్నతపరిచే భాగాలను నొక్కి చెప్పండి. ప్రత్యేకంగా 52, 115, 137-9, 159 పేజీలను, అలాగే 17వ అధ్యాయాన్ని గమనించండి. యెహోవా సంస్థ ఎడల మీకు గల లోతైన మెప్పుదల భావాలను వ్యక్తం చేయండి. (మత్త. 24:45-47) స్థానిక సంఘం గురించి, కూటాలవద్ద మీరు నేర్చుకునేదాని గురించి అనుకూలంగా మాట్లాడండి. (కీర్త. 84:10; 133:1-3) యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ అనే వీడియోతో మొదలుపెట్టి సొసైటీ వీడియోలన్నింటిని విద్యార్థి చూడగలిగితే మంచిది. సంస్థవైపు ఆసక్తిని ఎలా మళ్లించాలనేదాని గురించి మరిన్ని ఆలోచనల కొరకు నవంబరు 1, 1984 కావలికోట (ఆంగ్లం), 14-18 పేజీలు, ఏప్రిల్‌ 1993 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌ చూడండి.

17 ఇతరులకు సాక్ష్యమివ్వమని విద్యార్థులను ప్రోత్సహించండి: ప్రజలతో మనం పఠించడానికి గల లక్ష్యం వారిని యెహోవాకు సాక్ష్యమిచ్చే శిష్యులనుగా చేయడమే. (యెష. 43:10-12) బైబిలు నుండి తాను నేర్చుకునేదాని గురించి ఇతరులతో మాట్లాడేలా బోధకుడు విద్యార్థిని ప్రోత్సహించాలని దానర్థం. కేవలం ఇలా అడగడం ద్వారా ఆ పనిని చేయవచ్చు: “ఈ సత్యాన్ని మీ కుటుంబానికి ఎలా వివరిస్తారు?” లేక “ఒక స్నేహితునికి దీనిని రుజువు చేయడానికి మీరు ఏ లేఖనాన్ని ఉపయోగిస్తారు?” జ్ఞానము పుస్తకంలో సాక్ష్యపు పనిని ప్రోత్సహించిన 22, 93-5, 105-6 పేజీలలోను అలాగే 18వ అధ్యాయంలోనుగల కీలక అంశాలను నొక్కి తెల్పండి. తగిన సమయంలో, ఇతరులకు అనియతంగా సాక్ష్యమివ్వడంలో ఉపయోగించడానికి విద్యార్థికి కొన్ని కరపత్రాలు ఇవ్వవచ్చు. తన పఠనంలో తన కుటుంబ సభ్యులను కూర్చోమని ఆహ్వానించమని ఆయనకు సూచించండి. తాము కూడా పఠించాలని ఇష్టపడే స్నేహితులు ఆయనకు ఉన్నారా? ఆసక్తి గలవారికి మిమ్మల్ని పరిచయం చేయమని అడగండి.

18 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలకు, సేవా కూటానికి హాజరవ్వడం ద్వారా, భావి శిష్యుడు సువార్త ప్రచారకునిగా తనకు సహాయపడే అదనపు శిక్షణను, ప్రేరేపణను పొందగలడు. పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవాలని గాని, బాప్తిస్మం పొందని ప్రచారకునిగా కావాలని గానీ ఆయన ఆసక్తిని వ్యక్తం చేస్తే, మన పరిచర్య పుస్తకంలోని 98, 99 పేజీలలో ఉన్న సూత్రాలు వర్తిస్తాయి. ఆయన జీవితంలోని ఒక విషయం అర్హత పొందడం నుండి ఆయనను నివారిస్తే, ఆ విషయంపై చర్చించే సహాయకరమైన సమాచారం కొరకు మీరు సొసైటీ ప్రచురణలను వెదకి, ఆయనతో ఆ సమాచారాన్ని పంచుకోవచ్చు. ఉదాహరణకు, ఒక విద్యార్థికి పొగాకు లేక ఇతర మాదక ద్రవ్యాల అలవాటును మానుకోవడానికి కష్టంగా ఉండవచ్చు. అటువంటి హానికరమైన అలవాట్ల నుండి క్రైస్తవులు ఎందుకు దూరంగా ఉండాలన్న దానికి తర్కించుట (ఆంగ్లం) పుస్తకం బలమైన లేఖనాధార కారణాలను చూపిస్తుంది, అంతేగాక 112వ పేజీలో ఇతరులు వాటిని మానుకోవడానికి సహాయపడడంలో విజయవంతమైనదని నిరూపించబడిన పద్ధతిని అది చూపిస్తుంది. సహాయం కొరకు యెహోవాపై ఆధారపడడాన్ని ఎక్కువ చేసుకోమని ఆయనకు బోధిస్తూ ఆ విషయం గురించి ఆయనతో కలిసి ప్రార్థించండి.—యాకో. 4:8.

19 బహిరంగ పరిచర్యలో పాల్గొనడానికి ఒకరు అర్హులా కాదాయని నిర్ధారించడానికి అనుసరించవలసిన విధానం జనవరి 15, 1996 కావలికోట నందలి 16వ పేజీ, 6పేరాలో ఇవ్వబడింది. విద్యార్థి అర్హుడైనప్పుడు, ప్రాంతీయ పరిచర్యలో తన మొదటి దినానికి ఆయనను సిద్ధం చేయడానికి ఒక అభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం సహాయకరంగా ఉండవచ్చు. ఒక అనుకూల పద్ధతిలో, మీ ప్రాంతంలో సర్వసాధారణమైన ప్రజల ప్రతిస్పందనలను, ఆక్షేపణలను చర్చించండి. ఒకవేళ సాధ్యమైతే మొదట ఇంటింటి పనితో ప్రారంభించండి, తరువాత క్రమేణ పరిచర్యలోని ఇతర విశేషతలలో ఆయనకు శిక్షణనివ్వండి. ఒకవేళ మీరు మీ అందింపును చిన్నగా, సరళంగా ఉంచితే, అది ఆయన అనుకరించడానికి సులభంగా ఉంటుంది. ఆయన మీ స్ఫూర్తిని తెలుసుకొని దానిని ప్రతిబింబించేలా పనిలో ఉత్సాహాన్ని చూపిస్తూ పురోభివృద్ధికరంగా, ప్రోత్సాహకరంగా ఉండండి. (అపొ. 18:25) సువార్తను క్రమంగా, మిక్కిలి శ్రద్ధతో ప్రచురించేవాడవ్వాలన్నదే క్రొత్త శిష్యుని గురి అయ్యుండాలి. బహుశ మీరు సేవ కొరకు ఒక ఆచరణయోగ్యమైన పట్టిక వేసుకునేందుకు ఆయనకు సహాయపడవచ్చు. ఇతరులకు సాక్ష్యమిచ్చే తన సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు, ఈ క్రింది కావలికోటల సంచికలను చదువమని మీరు సూచించవచ్చు: ఆగస్టు 15, 1984 (ఆంగ్లం) 15-25 పేజీలు; జూలై 15, 1988 (ఆంగ్లం) 9-20 పేజీలు; జనవరి 15, 1991 (ఆంగ్లం) 15-20 పేజీలు; జనవరి 1, 1994 20-5 పేజీలు.

20 సమర్పణ, బాప్తిస్మముల కొరకు విద్యార్థులను పురికొల్పండి: జ్ఞానము పుస్తకం పఠించడం ద్వారా దేవునికి సమర్పించుకోవడానికి, బాప్తిస్మానికి అర్హుడవ్వడానికి సరిపోయేంతగా నేర్చుకోవడానికి యథార్థహృదయం గల విద్యార్థికి సాధ్యమవ్వాలి. (అపొ. 8:27-39; 16:25-34 పోల్చండి.) అయితే, సమర్పించుకోవడానికి పురికొల్పబడే ముందు, ఆయన యెహోవా ఎడల భక్తిని అలవర్చుకోవడం అవసరం. (కీర్త. 73:25-28) పఠనమంతటిలో, యెహోవా లక్షణాల ఎడల మెప్పుదలను పెంపొందింపజేయడానికి అవకాశాల కొరకు చూడండి. దేవుని ఎడల మీకుగల మీ స్వంత లోతైన భావాలను వెలిబుచ్చండి. యెహోవాతో అనురాగపూరితమైన, వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకునే విషయాన్ని గురించి ఆలోచించేలా విద్యార్థికి సహాయపడండి. ఒకవేళ ఆయన నిజంగా దేవున్ని తెలుసుకుని, ప్రేమిస్తే, అప్పుడు ఆయన ఆయనకు విశ్వసనీయంగా సేవ చేస్తాడు, ఎందుకంటే దైవభక్తి, ఒక వ్యక్తిగా యెహోవాను గూర్చి మనమెలా భావిస్తామన్న దానితో సంబంధం కలిగి ఉంది.—1 తిమో. 4:7, 8; పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) 76వ పేజీ, 11వ పేరా చూడండి.

21 విద్యార్థి హృదయాన్ని చేరుకునేందుకు కృషి చేయండి. (కీర్త. 119:11; అపొ. 16:14; రోమా. 10:10) సత్యము తనను వ్యక్తిగతంగా ఎలా ప్రభావితం చేస్తుందన్నది చూసి, తాను నేర్చుకున్నదానితో తానేమి చేయాలనేది ఆయన నిర్ణయించుకోవడం అవసరము. (రోమా. 12:2) వారం తరువాత వారం ఆయనకు అందించబడుతున్న సత్యాన్ని ఆయన నిజంగా విశ్వసిస్తున్నాడా? (1 థెస్స. 2:13) అందుకొరకు, ఇటువంటి వివేచనాయుక్త అభిప్రాయ సేకరణ ప్రశ్నలు అడగడం ద్వారా విద్యార్థి అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చు: దీని గురించి మీరు ఎలా భావిస్తారు? దీన్ని మీరు మీ జీవితంలో ఎలా అన్వయించుకోగలరు? ఆయన వ్యాఖ్యానాల ద్వారా ఆయన హృదయాన్ని చేరడానికి మరింత సహాయం ఎక్కడ అవసరమో మీరు గ్రహించవచ్చు. (లూకా 8:15; పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం) 52వ పేజీ, 11వ పేరా చూడండి.) జ్ఞానము పుస్తకంలోని 172, 174 పేజీలలోని చిత్రాల క్యాప్షన్‌లు ఇలా అడుగుతున్నాయి: “మీరు ప్రార్థనలో దేవునికి సమర్పించుకున్నారా?” మరియు “బాప్తిస్మం పొందకుండా ఏది మిమ్మల్ని ఆటంకపరుస్తుంది?” ఇవి విద్యార్థిని చర్యగైకొనేలా ప్రభావవంతంగా పురికొల్పవచ్చు.

22 బాప్తిస్మం పొందని ప్రచారకుడు బాప్తిస్మం పొందాలని కోరుకుంటే అనుసరించవలసిన విధానం జనవరి 15, 1996 కావలికోట నందలి 17వ పేజీ, 9వ పేరాలో ఇవ్వబడింది. పెద్దలు ఆయనతో పునఃసమీక్ష చేసే, మన పరిచర్య పుస్తకం అనుబంధంలో ఉన్న “బాప్తిస్మము పొందగోరు వారి కొరకు ప్రశ్నావళి”లో ఉన్న ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఆ వ్యక్తిని సిద్ధం చేసే లక్ష్యంతో జ్ఞానము పుస్తకం వ్రాయబడింది. జ్ఞానము పుస్తకంలోని ముద్రిత ప్రశ్నలకు జవాబులను మీరు నొక్కి చెప్పినట్లయితే, విద్యార్థిని బాప్తిస్మం కొరకు తయారు చేయడంలో భాగంగా పెద్దలచే నిర్వహించబడే ప్రశ్నా కార్యక్రమాలకు ఆయన చక్కగా సిద్ధపడి ఉండాలి.

23 గృహ బైబిలు పఠనాన్ని ముగించిన వారికి సహాయం చేయండి: జ్ఞానము పుస్తకంలో ఒక వ్యక్తి పఠనాన్ని ముగించే సమయానికి, ఆయన నిజాయితీ, దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకుగల ఆసక్తి యొక్క లోతు స్పష్టమౌతాయని అపేక్షించబడుతుంది. (మత్త. 13:23) అందుకనే పుస్తకంలోని చివరి ఉపశీర్షిక “మీరేమి చేస్తారు?” అని అడుగుతుంది. దేవునితో తాను పెంపొందించుకొనిన సంబంధంపై, తాను నేర్చుకున్న జ్ఞానాన్ని అన్వయించుకోవలసిన అవసరతపై, యెహోవా కొరకైన తన ప్రేమను ప్రదర్శించడానికి త్వరగా చర్యగైకొనవలసిన అవసరతపై దృష్టిని సారించమని ముగింపు పేరాలు విద్యార్థిని విజ్ఞప్తి చేస్తున్నాయి. జ్ఞానము పుస్తకాన్ని ముగించిన వారితో అదనపు ప్రచురణలను పఠించే ఏర్పాటేమీ లేదు. దేవుని జ్ఞానానికి ప్రతిస్పందించడంలో తప్పిపోయిన విద్యార్థి ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలన్నది ఆయనకు దయాపూర్వకంగాను, స్పష్టంగాను వివరించండి. నిత్యజీవానికి నడిపించే చర్యలను తీసుకునేందుకు ఆయనకు మార్గాన్ని తెరిచి ఉంచుతూ మీరు ఆయనతో అప్పుడప్పుడు కలుస్తూ ఉండవచ్చు.—ప్రసం. 12:13.

24 సత్యాన్ని హత్తుకుని బాప్తిస్మం పొందిన ఒక క్రొత్త శిష్యుడు విశ్వాసంలో పూర్తిగా స్థిరపడడానికి తన జ్ఞానములోను, అవగాహనలోను ఎంతో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంటుంది. (కొలొ. 2:6, 7) మీరు జ్ఞానము పుస్తకాన్ని ముగించిన తరువాత ఆయన గృహ బైబిలు పఠనాన్ని కొనసాగించే బదులు, ఆత్మీయంగా పరిణతి చెందేందుకు ఆయనకు అవసరం ఉండే ఏదైనా వ్యక్తిగత సహాయం అందించడానికి మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోవచ్చు. (గల. 6:10; హెబ్రీ. 6:1, 2) ఆయన విషయమైతే, ప్రతిదినం బైబిలును చదవడం ద్వారా, ‘నమ్మకమైన దాసుని’ కావలికోటను, ఇతర ప్రచురణలను వ్యక్తిగతంగా పఠించడం ద్వారా, కూటాలకు సిద్ధపడి హాజరు కావడం ద్వారా, సత్యాన్ని తోటి విశ్వాసులతో చర్చించడం ద్వారా తన అవగాహనను పరిపూర్తి చేసుకోవచ్చు. (మత్త. 24:45-47; కీర్త. 1:2; అపొ. 2:41, 42; కొలొ. 1:9, 10) తన పరిచర్యను తుదముట్టించడానికి దైవపరిపాలనకు అనుగుణ్యంగా సంస్థీకరించబడడంలో ఆయన మన పరిచర్య పుస్తకాన్ని చదవడం, అందులో ఉన్నదాన్ని అన్వయించుకోవడం ఒక కీలకమైన పాత్రను వహిస్తాయి.—2 తిమో. 2:2; 4:5.

25 బోధనా కళను పెంపొందించుకోండి: ‘సమస్త జనులకు బోధించి వారిని శిష్యులనుగా చేయమని’ మనకు ఆజ్ఞాపించబడింది. (మత్త. 28:19, 20) బోధనా కళ శిష్యులను చేసే పనితో అవిభాజ్యంగా జతచేయబడి ఉంది గనుక, బోధకులుగా మనం అభివృద్ధి చెందడానికి పాటుపడాలని కోరుకుంటాము. (1 తిమో. 4:16; 2 తిమో. 4:2) బోధనా కళను ఎలా పెంపొందించుకోవాలనేదాని గురించి మరిన్ని సలహాల కొరకు మీరు ఇవి చదవాలని కోరుకోవచ్చు: పాఠశాల నిర్దేశక పుస్తకములోని (ఆంగ్లం) 10వ, 15వ పాఠ్యభాగాలైన “బోధనా కళను పెంపొందించుకొనుట,” “మీ శ్రోతల హృదయాలను చేరుకోవడం”; అంతర్దృష్టి (ఆంగ్లం) 2వ సంపుటిలో “బోధకుడు, బోధించడం”; కావలికోట శీర్షికలైన “అగ్ని-నిరోధక వస్తుసామాగ్రితో నిర్మించడం,” “మీరు బోధిస్తున్నప్పుడు, హృదయాన్ని చేరండి” ఆగస్టు 1, 1984 (ఆంగ్లం); “మీరు లేఖనాలనుండి ప్రభావవంతంగా తర్కిస్తారా?,” మార్చి 1, 1986 (ఆంగ్లం); “శిష్యులను చేయడంలో ఆనందాన్నెలా కనుగొనడం” ఫిబ్రవరి 15, 1996.

26 జ్ఞానము పుస్తకాన్ని ఉపయోగించి శిష్యులను చేయడానికి మీరు కృషి చేస్తుండగా, రాజ్య సువార్తతో మానవ హృదయాలను చేరడానికి మీరు చేసే ప్రయత్నాలను, ‘వృద్ధి కలుగజేసే వాడైన’ యెహోవా ఆశీర్వదించాలని ఎల్లప్పుడు ప్రార్థించండి. (1 కొరిం. 3:5-7) నిత్యజీవానికి నడిపించే జ్ఞానాన్ని ఇతరులు అర్థం చేసుకోవడానికి, గుణగ్రహించడానికి, దానికి అనుగుణ్యంగా చర్య తీసుకోవడానికి వారికి బోధించే ఆనందాన్ని మీరు అనుభవించుదురు గాక!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి