దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడం
1 వేలకొలది యెహోవాసాక్షులకు సువార్త ప్రచారకులుగా శిక్షణనిచ్చేందుకు దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఓ సాధనంగా పనిచేసింది. మొట్టమొదటిసారిగా మనం పాఠశాలలో పాల్గొన్నప్పుడు ఎంత అధైర్యపడ్డామో ఎంత అయోగ్యులమని భావించామో మనలో చాలా మందికి జ్ఞాపకముంటుంది, మరి ఇప్పుడు దేవుని వాక్యాన్ని గూర్చి మాట్లాడేవారిగా బోధించేవారిగా మన ఆత్మీయ అభివృద్ధిలో దాని భాగాన్ని మనం కృతజ్ఞతతో గుణగ్రహిస్తున్నాము. (అపొస్తలుల కార్యములు 4:13 పోల్చండి.) ఈ అద్భుతమైన పాఠశాలలో మీరు పేరు నమోదు చేయించుకున్నారా?
2 ఎవరెవరు పేరు నమోదు చేయించుకోగలరు? మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలోని 73వ పేజీ ఇలా జవాబు చెబుతుంది: “సంఘంతో చురుకుగా సహవాసం కల్గియున్న వారందరికి, క్రైస్తవ సూత్రాలు మీరకుండ జీవితాలను గడుపుచూ క్రొత్తగా కూటములకు హాజరౌతున్నవారు కూడ ప్రసంగము లిచ్చుటకు ఇందులో చేరవచ్చును.” అర్హతగల వారంతా—స్త్రీలూ పురుషులు పిల్లలూ పాఠశాల పైవిచారణకర్తను సమీపించి పేరు నమోదు చేయించుకోగలరేమో కనుక్కోండని మేము ఆహ్వానిస్తున్నాము.
3 1997 పాఠశాల కార్యక్రమం: 1997 దైవపరిపాలనా పాఠశాల కార్యక్రమంలో వైవిధ్యంగల బైబిలు బోధలు ఉంటాయి. మనకున్న మాట్లాడే సామర్థ్యాన్ని, బోధనా సామర్థ్యాన్ని అభివృద్ధిపర్చుకోవడం మాత్రమే కాకుండా, ప్రతివారం ఈ పాఠ్య ప్రణాళికలో ఉన్న అనేక ఆత్మీయ నిధులనుండి మనం నేర్చుకోవచ్చు. (సామె. 9:9) మనం వారపు బైబిలు పఠనం ఉన్న ఈ పాఠశాలకు సిద్ధపడి క్రమంగా హాజరైనట్లైతే, ఆ కార్యక్రమం నుండి గొప్ప ప్రయోజనాన్ని పొందుతాము.
4 గత సంవత్సరాలకంటే 1997లోని 2వ నియామకానికి ఉన్న బైబిలును చదివే భాగం చాలా చిన్నది. ఈ నియామకానికి సిద్ధపడేటప్పుడు, విద్యార్థి తాను చదివే సమయాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత తనకిచ్చిన ఐదు నిమిషాల్లో ఎంత సమయాన్ని ఉపోద్ఘాతానికీ ముగింపుకూ ఉపయోగించవచ్చో నిర్ణయించుకోవచ్చు. అలా చేయడంవల్ల ఆ విద్యార్థి తన సమయాన్ని పూర్తిగా వినియోగించుకునేలా చేసి, చదివే సామర్థ్యాన్ని మరియు ధారాళంగా మాట్లాడగల తన కళనూ వృద్ధి చేసుకోగలడు.—1 తిమో. 4:13.
5 ఇక 3వ నియామకానికి అనియతసాక్ష్యపు రంగం కూడా చేర్చడం జరిగింది, మరి ఇది జ్ఞానము పుస్తకం నుండి ఇవ్వబడుతుంది. కనుక, ఓ సహోదరి ఓ పునర్దర్శనాన్ని గృహ బైబిలు పఠనాన్ని లేక అనియత సాక్ష్యాన్ని ఈ నియామకానికి రంగంగా ఎన్నుకోవచ్చు. అయితే ప్రభావవంతమైన బోధకే అధిక ప్రాధాన్యతనివ్వాలికానీ రంగంపైకాదన్నది మాత్రం నిజం.
6 ఉపదేశ ప్రసంగం, బైబిలు ఉన్నతాంశాలు, లేక విద్యార్థి నియామకాలు వీటిలో దేనినైనా ఇచ్చే అధిక్యత మీకుంటే, మీ భాగాన్ని బాగా సిద్ధపడి రిహార్సల్ చేసుకోవడం ద్వారా, నమ్మకంతోను ఉత్సాహంగాను అందించడం ద్వారా, సమయం మీరకుండా ఉండడం ద్వారా, పాఠశాల పైవిచారణకర్త ఇచ్చే సలహాలను విని వాటిని అన్వయించడం వంటివన్నీ చేయడం ద్వారా మీ నియామకాన్ని ఎల్లప్పుడూ నమ్మకంగా చేయడానికి ప్రయత్నించడం ద్వారా మీరు దైవపరిపాలనా పాఠశాలకు మెప్పుదలను చూపించగలరు. ఆ విధంగా పాఠశాలలో మీరు చేరడం మీకూ హాజరైనవారికీ ఓ ఆశీర్వాదంగా ఉండగలదు.