కూటాలు సత్కార్యములు చేయడానికి పురికొల్పుతాయి
1 మన ఆరాధనలోని రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, సంఘ కూటాలకు హాజరు కావడము, ప్రాంతీయ సేవలో పాల్గొనడము. ఈ రెండింటికీ దగ్గరి సంబంధం ఉంది. ఒకటి మరోదాన్ని ప్రభావితం చేస్తుంది. క్రైస్తవ కూటాలు సత్కార్యములు చేయడానికి పురికొల్పుతాయి, ఈ సత్కార్యాల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠమైనది రాజ్య ప్రకటన చేస్తూ శిష్యుల్ని చేసే పని. (హెబ్రీ. 10:24, 25) మనం కూటాలకు హాజరు కావడం మానుకున్నట్లైతే, మనం త్వరలోనే ప్రకటించడం మానుకుంటాము, ఎందుకంటే ప్రకటించడానికి మనకు పురికొల్పు దొరకదు మరి.
2 వారం వారం జరిగే కూటాల్లో, ప్రకటించేలా మనల్ని ప్రేరేపించడానికి రూపొందించబడిన ఆత్మీయ ఉపదేశాన్ని మనం పొందుతాము. అక్కడ కాలాల అత్యవసరత మనకు తరచూ నొక్కి చెప్పబడుతుంది, దీంతో మనం ఇతరులకు బైబిలు యొక్క జీవదాయక సందేశాన్ని అందిస్తాము. ప్రకటనాపనిలో కొనసాగడానికి మనం ప్రోత్సాహపర్చబడి, బలపర్చబడుతున్నాము. (మత్త. 24:13, 14) కూటాల్లో వ్యాఖ్యానించే అవకాశాల నుండి ప్రయోజనం పొందుతుండడం ద్వారా, మనం మన విశ్వాసాన్ని ఇతరుల ముందు వ్యక్తం చేయడానికి మరింత అలవాటుపడతాము. (హెబ్రీ. 10:23) దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో పేరు నమోదు చేయించుకోవడం ద్వారా, మనం మరింత ప్రభావవంతమైన పరిచారకులుగా ఉండేందుకూ, మన బోధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకూ శిక్షణను పొందుతాము.—2 తిమో. 4:2.
3 సేవా కూటాలు ప్రకటించడానికి మనకు ఎలా పురికొల్పునిస్తాయి: మన రాజ్య పరిచర్యలోని సమాచారాన్ని సమయానికి ముందే చూడమని మనమందరం పురికొల్పబడుతున్నాము. అప్పుడు సేవా కూటానికి హాజరై, ప్లాట్‌ఫారమ్‌పై ప్రదర్శించబడిన ప్రదర్శనలను చూసినప్పుడు, ఆ సమాచారం మన మనస్సుల్లో నాటుకుపోతుంది. ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు, మనం మన రాజ్య పరిచర్యను గురించి ఆలోచిస్తూ, ప్రదర్శించబడిన అందింపులను గుర్తుకు తెచ్చుకోగలము, తద్వారా మరింత ప్రభావవంతమైన సాక్ష్యాన్ని ఇవ్వగలము. చాలామంది ప్రచారకుల అనుభవం ఇదే అయి ఉంది.
4 సేవా కూటాల్లో చెప్పబడినదానికి అనుగుణ్యంగా కొంతమంది పరిచర్యలో ఇతరులతోపాటు భాగంవహించడానికి ఏర్పాట్లను చేసుకుంటారు. ప్రచారకులకు ఫీల్డ్ పాయింట్లు ఇంకా వారి మనస్సుల్లో తాజాగా ఉంటాయి, అంతేగాక కూటాలు ప్రతివారం ప్రకటనాపనిలో భాగం కలిగివుండమని ప్రోత్సహించాయి గనుక ఆ పాయింట్లను ఉపయోగించి చూడడానికి ప్రయత్నిస్తారు.
5 మన క్రైస్తవ కూటాలకు ప్రత్యామ్నాయమేమీ లేదు, అక్కడ మనం తోటి ఆరాధకులతో సమకూడుతాము, సత్కార్యములు చేయడానికి పురికొల్పబడతాము. మన పరిచర్య వర్ధిల్లాలంటే మనం క్రమంగా సంఘ కూటాలకు హాజరవ్వాలి. మనం “సమాజముగా కూడుట మానక,” యెహోవా చేసిన ఈ అద్భుతమైన ఏర్పాటుపట్ల మెప్పుదలను ప్రదర్శించుదాము.—హెబ్రీ. 10:25.