కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/97 పేజీ 3
  • ఇంటర్‌నెట్‌లో సువార్త

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఇంటర్‌నెట్‌లో సువార్త
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇంటర్‌నెట్‌ సర్వీసులు, సమాచార వనరులు
    తేజరిల్లు!—1997
  • ఇంటర్‌నెట్‌ ఉపయోగించడంలో రాగల ప్రమాదాల విషయమై అప్రమత్తులుగా ఉండండి!
    మన రాజ్య పరిచర్య—1999
  • భూవ్యాప్తంగా అందుబాటులోవున్న ఇంటర్నెట్‌ను జ్ఞానయుక్తంగా ఎలా ఉపయోగించుకోవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • వారికి సహాయపడే మార్గం
    మన రాజ్య పరిచర్య—2004
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 11/97 పేజీ 3

ఇంటర్‌నెట్‌లో సువార్త

మన సాంకేతిక యుగంలో, కొంతమంది సమాచారాన్ని ఇంటర్‌నెట్‌తో సహా ఎలక్ట్రానిక్‌ మూలాల నుండి తెలుసుకుంటారు. కనుక, యెహోవాసాక్షుల నమ్మకాలు మరియు కార్యశీలతలను గూర్చిన కచ్చితమైన కొంత సమాచారాన్ని ఇంటర్‌నెట్‌లో సొసైటీ ఉంచింది.

మన ఇంటర్‌నెట్‌ వెబ్‌ సైట్‌కు http://www.watchtower.org అనే అడ్రస్‌ ఉంది, అందులో ఇంగ్లీష్‌, చైనీస్‌ (సరళమైన), రష్యన్‌, స్పానిష్‌, అలాగే మరితర భాషల్లోని ఎంపిక చేయబడిన కరపత్రాలూ, బ్రోషూర్‌లూ, కావలికోట, మరియు తేజరిల్లు! పత్రికల్లోని శీర్షికలూ ఉన్నాయి. ఈ వెబ్‌ సైట్‌లో ఉన్న ప్రచురణలు సంఘాల ద్వారా లభ్యమౌతున్నవే. అవి పరిచర్యలో ఉపయోగించబడుతున్నవే. మన వెబ్‌ సైట్‌ ఉద్దేశం క్రొత్త ప్రచరణలను విడుదల చేయడం కాదు గానీ, ఎలక్ట్రానిక్‌ ఫార్మట్‌లో ప్రజలకు సమాచారాన్ని లభ్యం చేయాలన్నదే. యెహోవాసాక్షులను గురించీ, మన క్రియాశీలతలను గురించీ, మన నమ్మకాలను గురించీ మరొకరు ఇంటర్‌నెట్‌ పేజీలను తయారు చేయవలసిన అవసరం లేదు. మన అధికారిక సైట్‌ మన గురించి తెలుసుకోవాలని కోరుకునే ఎవరికైనా సరే కచ్చితమైన సమాచారాన్నిస్తుంది.

మన సైట్‌లో ఎలక్ట్రానిక్‌ సందేశాలను పంపే ఏర్పాటు (E-mail) లేకపోయినప్పటికీ, భూగోళవ్యాప్తంగా ఉన్న మన బ్రాంచ్‌ల పోస్టల్‌ అడ్రస్‌ల పట్టిక అందులో ఇవ్వబడింది. అలా, మరింత సమాచారం పొందేందుకు, లేదా స్థానిక యెహోవాసాక్షుల నుండి వ్యక్తిగత సహాయాన్ని పొందేందుకు ప్రజలు ఉత్తరం వ్రాయగల్గుతారు. ఈ ఫార్మట్‌ నుండి బైబిలు సత్యాన్ని నేర్చుకోనారంభించేందుకు సుముఖత చూపేదెవరైనా సరే వారికి పై ఇంటర్‌నెట్‌ అడ్రస్‌ను తెలిపే విషయంలో నిస్సంకోచంగా ఉండండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి